అభిప్రాయాలు చెప్పాల్సిందే!


Sun,January 12, 2014 12:51 AM

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగా మాట అన్నదానికి అంత విలువ ఉండేది. ఒక్కసారి ఒక మాట చెబితే ఆ మాట మీద చివరిదాకా నిలిచేవారు. రాతలు లేని కాలంలో అంతా మాటల మీదే, మాట మీద నమ్మకాలతోనే కాలం గడిచిపోయింది. ఆనాడు ఒక పంచాయితీ చేస్తే ఆనాటి పంచాయితీ పెద్దలు ఏమాట చెబుతారో దానికి కట్టుబడే ఆ మాట తీర్పుకు కట్టుబడే ఉండేవారు.మాటకు అంత గొప్పతనమున్నది. మాటంటే నాలుకలాగా ఎటంటే అటు తిప్పి అవసరాలు తీర్చుకునేది కాదు మరి!
రాత వచ్చిన తర్వాత మాట పోయింది. దొరలు బలవంతంగా రాయించుకోవటం మొదలైన తర్వాత దానికి కూడా అంటే రాత కూడా ప్రామాణికత పోయింది. దొంగ కాగితాలు రాయటం దొంగ సంతకాలు పెట్టే సంస్కృతి ఆరంభమైంది. అదే మాదిరిగా ప్రభుత్వం కూడా ప్రజలకు వాగ్ధానాలు చేస్తుంది. నేను ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీతో రాత్రి 12 గంటల వరకు సంభాషణలు జరిగాయి. చీఫ్ సెక్రటరీ ‘పై’ మాతో మాట్లాడారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి ఎన్జీవో, ఉపాధ్యాయుల సంయుక్త సమ్మెను విరమించాం. తెల్లవారి అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీసింది ప్రభుత్వం. ఎన్జీవోలకు మధ్య సంభాషణలు జరిగాయి. దానికి సంబంధించి వివరణ ఇవ్వవలసిందని ప్రతిపక్షం కోరింది. అవి ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తొలిరోజులు.1959 ఫిబ్రవరిలో ఈ చర్చ జరిగింది. అప్పుడు ప్రభుత్వం అన్న మాటేమిటంటే అసలు సంప్రదింపులే జరగలేదని చెప్పింది. ఉద్యోగులు ప్రభుత్వం మాటలు నమ్ముతారు కానీ యూనియన్ నాయకుల మాటలు నమ్మరు కదా! అప్పుడు మాకర్థమైంది.

సంప్రదింపుల తర్వాత వాగ్దానాలను రాతపూర్వకంగానే తీసుకోవాలి గానీ మాటలతోకాదని తెలుసుకున్నాం. అప్పటి నుంచి చేసిన వాగ్దానాలను రాతపూర్వకంగా మొదలుపెట్టాం. రాసి న వాగ్దానాలు కూడా అమలు కాకపోవటం చూశాం. జీవోలను మాత్రమే హైకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చును కానీ వాగ్దానాలను సవాల్ చేయలేము. రాతపూర్వకంగా ఇచ్చి న హామీలపై జీవోలు ఇవ్వాలన్న పోరాటం మొదలైంది. ఆ జీవోలు కూడా అమలు కానప్పుడు హైకోర్టుకు వెళ్లటం జరిగింది. చివరకు హైకోర్టుల్లో అత్యధిక భాగం కేసులు అమలు కాని జీవోల కేసులున్నాయి. దీంతో అనేక చిక్కులు వచ్చాయి. జీవోలో లేని విషయాలను, పదాలను కూడా సృష్టించి, తమకు అనుకూల భాష్యాలు చెప్పి ప్రజా సంపదను దోచుకోవటం చూశాం. దానివల్లనే ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు సస్పెండు కావటాలు, చివరకు జైలుకు పోవటాలు కూడా చూశాం. అసెంబ్లీలో మంత్రులు ఇచ్చిన వాగ్దానాలను రికార్డు చేస్తారు. వారి వాగ్దానాలే ప్రమాణం. అవి పాటించకుంటే ప్రివిలేజ్ వెూషన్స్‌ను పెడతారు. అసెంబ్లీలో వాగ్దానాలు చేసినా అవి అమలుకాని వాటిని ఎన్నింటినో చూశాం. తీరా బాసరలో ఐఐటి నెలకొల్పాలని అసెంబ్లీ ఏకక్షిగీవంగా తీర్మానం చేశారు. ఇది ఒకసారి కాదు రెండుసార్లు తీర్మానం చేశారు. రాసిన సిరా ఆరకముందే చేసిన తీర్మానాలను ఉల్లంఘించటం చూశాం. ప్రజాస్వామికంలో ఏదైనా జరగవచ్చుననే దశకు మన పాలకులు ప్రజలను మానసికంగా సిద్ధం చేశారు.

ఇప్పుడు రాష్ట్రపతి సూచనలపై రాష్ట్ర విభజన బిల్లును చర్చించే ముందు సమైక్యాంవూధకు తీర్మానం చేస్తేనే చర్చను ఆరంభించాలని కొందరు రాజకీయ నాయకులంటున్నారు. వాగ్దానాలను భంగం చేయటం, తీర్మానాలను అమలు చేయకపోవటం మన రాష్ట్ర పాలకుల శైలిగా మారింది. ప్రస్తుతం మన రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న చర్చల తీరు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యంగా మార్చుతుంది. ఇప్పుడు తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకోవటం అన్యాయం. అసెంబ్లీ తీర్మానాలకు విలువ లేకుండా పోయింది. అమలుకాని తీర్మానాల కోసం సభా సమయం వృథా చేయటం ఎందుకు? అందుకే మా వూళ్లల్లో నోటి మాటకు కట్టుబడి ఉండాలన్న విలువలను నేర్పేందుకే హరిశ్చంవూదుని కథ, నాతికేశుడి కథ చెప్పేవారు. విలువలు పాటించని ఈ కాలంలో, నోటి మాటలను ఉల్లంఘించిన ఘనులు తిరిగి సమైక్య తీర్మానం చేయాలనటం కాలయాపనకే ఉపయోగపడుతుంది. రాష్ట్రపతి అందరి అభివూపాయం అడిగారు. ఎవరి అభివూపాయాలను వారు తెలియ చేయటమే మంచిది. ఎవరి అభివూపాయాలు వారు చెప్పకపోతే కేంద్రం, పార్లమెంటు రాజ్యాంగం ప్రకారం తన పని తాను చేసుకు పోతుంది. డొంక తిరుగుళ్లు ఎందుకు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి.
-చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త

223

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles