అన్నివర్గాలు శిరసెత్తుకోవాలంటే...


Wed,January 1, 2014 12:52 AM

ఇతర దేశాల పాలకులకు, మన పాలకులకు ఉన్న తేడా ఏమిటి? మన వాళ్లు ఎన్నికలకు ముందే సంక్షేమ కార్యవూకమాల ప్రకటనలు చేస్తారు. పాలకులు సంక్షేమ కార్యవూకమాలు, ప్రతిపక్షాలు వాగ్దానాలు ముందుపెట్టి ఎన్నికల బరిలోకి దూకుతారు. ఇది ఒక పవివూతమైన ప్రక్రియ. జవాబుదారీతనానికి నిదర్శనమైన ప్రక్రియ. దీని వలన బడ్జెట్‌లో ప్రధానమైన భాగం సంక్షేమ కార్యవూకమాలకు పోతే ఎన్నికైన ప్రభుత్వానికి అభివృద్ధి చేసేందుకు పలు సమస్యలను ఎదుర్కుంటుంది. సంక్షేమ కార్యవూకమాలు ముఖ్యమే, దాంతోపాటు అభివృద్ది కూడా ముఖ్యమైనదే.

ఈ రెండు జరగాలంటే ఏం చేయాలంటే.. ఈ రెంటి నుంచి పాలక ప్రతిపక్షాలు ముఖం చాటేసుకుంటున్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి పలు కీలక రంగాలను ప్రైవేట్ రంగానికి ఇవ్వమని అడుగుతారు. ప్రజలకు నిత్య అవసరాల వస్తువులను ప్రైవేటీకరణ చేస్తే మార్కెట్ రాజ్యమేలుతుంది. ఇదే మన దేశంలో జరిగింది.ప్రభుత్వం వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టింది. పథకం మంచిదే. కానీ ఆ స్కీమ్ ఫలితం సామాన్యునికి వాతపెట్టే దశవచ్చేసింది. ఆ స్కీమ్ అమలులో ఏ రోగాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందో ఉదహరించారు. సర్జరీ అవసరమైన రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేటట్లు చేశారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉండటం వలన నిత్యం జీవితంలో ఉండే వైద్యానికి ప్రమాదం ఏర్పడింది. గ్రామీణ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూలపడ్డాయి.

సామాన్యునికి మలేరియా, కడుపునొప్పి, టైఫాయిడ్, చిన్న పిల్లలకు వచ్చే పలురకాల జబ్బులు, విషజ్వరాలు వస్తే ప్రైవేట్ వైద్యశాలలకు పరుగులు తీయవలసి వస్తున్నది. ప్రైవేటు డాక్టర్లకు మందులషాపు వారికి లింకులుంటాయి. మందుల చిట్టా ఎంత బారుగా రాస్తే అంత మంచి డాక్టరన్న చందంగా మారింది. ఆ మందుల అమ్మకాలలో డాక్టర్లకు షేర్లుంటాయి. ఈ స్కీమ్‌తో పట్టణాల్లో వున్న కార్పోరేట్ దవాఖానాలకు లాభమయ్యింది. చిన్న చిన్న పట్టణాలల్లోని ప్రైవేట్ డాక్టర్లకు మందుల షాపులకు లాభాలు పండుతున్నాయి. ప్రభుత్వం చిన్న సహాయం చేసినట్లు చూపించి పేద వర్గాలపైన వాతలు పెడుతున్నది. అదే మాదిరిగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ స్కీమ్‌కూడా.. పేద విద్యార్థులకు సహాయం చేసినట్లుగా కనిపిస్తున్నప్పటికినీ ఆ ఫీజులన్నీ ప్రైవేట్ యాజమాన్యాల జేబుల్లోకి పోతున్నాయి. విద్యాశాఖకు కేటాయించే డబ్బే తక్కువ కాబట్టి ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇచ్చారు.


నిత్య జీవితంలో ముఖ్యమైన ప్రాథమిక విద్యను గాలికి వదిలేశారు. దీనివల్ల పేదవర్గాలు ప్రభుత్వ స్కూళ్లను వదిలి ప్రైవేట్‌స్కూల్స్‌కు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. ఆచరణలో ప్రైవేట్‌యాజమాన్యాలకు లాభం తెచ్చే పనులు పాలకులే చేస్తున్నారు. ఈ విధానాలను ఎవరైనా విమర్శిస్తే ప్రభుత్వ పథకాల పట్టిక తెస్తారు. రేపు ఏర్పడబోయే తెలంగాణలో ఈ పాత మురికి పద్ధతులకు స్వస్తి చెబితేనే సామాన్యులకు మేలు జరుగుతుంది. నిత్యజీవితంలో అవసరమైన అతికీలక విషయాలపై దృష్టి పెట్టాలి. కనీసపు అవసరాలకు ప్రభుత్వం ఉపయోగించిన తర్వాత సంక్షేమ కార్యవూకమాలకు సమయం కేటాయించాలి. వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే సామాన్యుడి అవసరాలు తీరుతాయి. దాంతోపాటు ప్రైవేట్ యాజమాన్యాలపై నియంవూతణ ఉంటుంది. సామాన్యుని కనీస అవసరాలకు కోతపెట్టి ప్రైవేట్ యాజమాన్యాలకు సాయం చేసేందుకు సంక్షేమ కార్యవూకమాలను రూపొందిస్తే సంపద కొన్ని వర్గాలకే పరిమితమవుతుంది. దీనివల్లనే సమాజంలో అసమానతలు పెరుగుతాయి. మన రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఈ బడ్జెట్ వల్ల పేదలు లాభం పొందేది అతి తక్కువ. గ్రామీణ ప్రాంతాలకు కనీస సదుపాయాలు కల్పిస్తూ బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. సమాజంలో అన్ని వర్గాలు శిరసెత్తుకొని నిలబడే విధంగా మన ఆర్థిక వ్యవస్థ రూపొందించబడాలి.
(రచయిత ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

175

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles