ఐక్యదేమన ఆయుధం


Sat,October 6, 2012 03:07 PM

Chukka-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaమా తెలంగాణ సాయుధ పోరాటానికి నేడు నడుస్తున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారూప్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆ పోరాట కాలంలో మా ఊరి దొర దున్నపోతు చనిపోయింది. మూడోనాడు దొర దున్నపోతు చనిపోయిన విషయం మాకు తెలిసింది. అది కూడా వాసన తో తెలిసింది. దొరకు కోపమొచ్చి మా ఊరు ఎల్లయ్యను పిలిపించి, నీకు వాసన రావటం లేదా? దున్నపోతు చచ్చి మూడు రోజులైంది? దీన్ని తీసేయ్యవా? అన్నాడు. దొర నాకెందుకు తెలవదు. దున్న చచ్చిన విషయం నాకు మూడు రోజుల క్రితమే తెలుసు. సంఘపోల్లు దొర ఇంటికి పోవద్దు అని చెప్పిండ్రు. అందుకే నేను దున్న చచ్చినా నీ ఇంటికి రాలేదన్నాడు. దున్నపోతు నాది, చచ్చింది నా కొట్టంలో, ఇది నా ఇంటికి సంబంధించిన విషయం. దీనికి సంఘపోల్లకు సంబంధం ఏమి ఉందని దొర ఎల్లయ్యతో అన్నాడు.

నాడు మా పోరడు తెలిసో తెలవకో ఒక రాయి తీసుకుని మీ మామిడిచెట్టు మీద విసిరా డు. ఆ రాయి దెబ్బకు కాయ రాలిపడింది. ఎన్నో పక్షులు వచ్చి ఆ మామిడికాయలు తినిపోతున్నా, టెంకలు కిందపడ్డా ఏమీ చేయలేకపోతిరి. కానీ మా పోరడు ఆ కాయను రాల్చినందుకు వాణ్ణి చెట్టుకు కట్టేసి మీ బెత్తంతో కొడుతుంటే, నాడు ఊరంతా గొడ్డళ్లు తీసుకుని మా పిల్లగాణ్ణి వదిలిపెట్టమన్నారు. లేకపోతే ఆ మామిడి చెట్లన్నీ నరికేస్తామని సంఘపోళ్లు హెచ్చరిక చేయడంతో నా పిల్లగాడి ప్రాణం దక్కింది. అదే దొరా! నాకు ఆ సంఘపోల్లకున్న సంబంధమన్నాడు. వాళ్ల మాట వినకపోతే మంచిదా? దొరా!? నువ్వే చెప్పు అన్నాడు. నాడు ఒకని కోసం సంఘం, సంఘం కోసం ఒకడు అన్న ఐక్యత ఉండేది. నేడు కూడా అదే పరిస్థితి తెలంగాణలో నాకు కనిపించింది. సింగరేణి కాలరీస్‌లో ఉన్న కార్మికులు సమ్మె చేయటం వల్ల విద్యు త్ ఆగిపోయే స్థితి వచ్చింది. ఊళ్లన్నీ చీకట్లతో నిండిపోతున్నాయి.

ఇదెక్కడి న్యాయమని అందరూ మొత్తుకుంటున్నారు. సింగరేణి కాలనీల బొగ్గు మాకొక వరం. ఎక్కడెక్కడో ఉండి తిండిలేకుండా చస్తుంటే మాకు బొగ్గు గనులు దొరికాయి. దాన్ని నల్లబంగారం అనుకున్నాం. ఈ బొగ్గే మాకు అన్నం. సర్వస్వం అనుకున్నాం. మా ప్రాంతంలో అంతగా చదువులేదు. కాయకష్టం చేసి బతికేవాళ్లం. చేసుకునేందుకు చెలకలు లేకపోతే ఆకలితో మలమల మాడు తూ చస్తూ ఉన్న ఉన్న ఆ కాలంలో మాకీ బొగ్గు బావులు బువ్వపెట్టాయి. మాకే కాదు, మా పిల్లలకు కూడా బువ్వపెట్టాయి. పెంచి పెద్ద చేసిది ఈ బొగ్గుబావులే. మా పిల్లలకు మంచి చదువులు చెప్పించినా, ఇంజనీర్లు అయ్యేవాళ్లు కదా! అందరి మాదిరిగా మా పిల్లలు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారుకదా! మా దగ్గర డబ్బు లేకపోయే, పరిక్షిశమలు రాకపోయే. దున్నుకుందామంటే పొలం లేకపోయే, కనీసం బొగ్గు మీద బతుకుదామంటే ఓపెన్‌కాస్ట్ అని పెడితిరి. నూట అరవై సంవత్సరాలు బతకవలసిన జీవనోపాధిని మీ అవసరాల కోసం ఇరవై సంవత్సరాలకే పరిమితం చేశారు కదా!

మాకు ఈ ప్రజానీకానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరూ సమ్మె చేస్తుంటే మేం మౌనంగా ఎలా కూర్చోమంటారు. అందరితో సహా మేము కూడా సింగరేణిలో పనిమానేశాం. మూడు రోజులు చీకటైతే మీరు భరించలేరే. మా శ్రమతో ముప్ఫై సంవత్సరాల నుంచి ఇతర ప్రాంతాల జీవితాలను నిర్మిస్తున్నామే. ఎవరైనా మా జీవితం ఏమిటి?ఎంతమంది చనిపోతున్నారు? ఓపెన్‌కాస్ట్ చేయవద్దని ఎంత మొత్తుకున్నా కానీ మమ్ములను పట్టించుకోలేదే? కొద్దిరోజుల్లో ఈ ప్రాంతమంతా ఓపెన్‌కాస్ట్‌లతో ఈ నేలంతా విధ్వంసం కాబోతున్నదని లక్షలాది మంది కార్మికులు గొంతెత్తి నినదించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక మా జీవితాన్ని బాగు చేసుకునేందుకు, మా పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని బొగ్గుబావుల్లో పెల్ల కదలకుండా బంద్ చేశాం. ఇప్పుడైనా అందరితో కలిసి పోరాటం చేస్తే మాకూ, మా పిల్లల జీవితాలు బాగుపడతాయని పోరు బరిలోకి దూకాం. మాకు పోయేదేముంది? కాకపోతే గీకపోతే ఓ నెలో, రెండు నెలలో జీతమే కదా పోయేది! ఈ పోరాటం గెలిస్తే మాకు, మా పిల్లల జీవితాల్లో వెలుగులేకదా!!

మీరు మూడు రోజుల చీకటి గురించి బాధపడుతున్నారు. మా జీవితాలన్నీ చీకటైన తీరు గురించి మేం మాట్లాడుతున్నాం. సమ్మె విఫలమైతే మళ్లీ మాకు చీక సమ్మెను విఫలం చేయటానికై పోలీసులు బలవూపయోగం చేస్తున్నారు. ఎవరి కోసం సింగరేణి వెన్నుపై తుపాకీ మోపుతున్నారు. లాఠీలతో, తూటాలతో, అక్రమ అరెస్టులతో, పనిచేసే కార్మికులను బెదిరించి సింగరేణిలో బొగ్గుబావులు నడిపించాలని చూస్తున్నారు. ఆయుధాలతో అదరగొట్టవచ్చును, బెదరగొట్టవచ్చును కానీ వాటితో పనిచేయించలేరు. ఇది ఎందుకోసం ప్రభుత్వం చేస్తున్నదో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. నలుగురితో కలిసి చేస్తేనే పండుగ. అదే మాదిరిగా ఈ సకల జనుల సమ్మె మా ముందున్న జీవితాలకు భవిష్యత్తు బాటగా నిలుస్తుంది. అందుకే సకల జనుల సమ్మె ఏ ఒక్కరిదో కాదు. మొత్తం ఈ నేలకు చెందిన నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా చూడాలి. సర్వజనుల సమ్మెను రాజకీయం చేయడానికి ఎవరు ప్రయత్నించినా వారు రాజకీయంగా దెబ్బతినడం ఖాయం. సకల జనుల సమ్మెను ప్రజల ఆకాంక్షల మేరకు విజయవంతం చేయడం అందరి బాధ్యత.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles