ఇది శ్రమజీవుల సంస్కృతి


Thu,October 17, 2013 12:29 AM

దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది బం డారు దత్తావూతేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’కి వెళ్లాను. ఈ అలయ్ బలయ్ అన్న పదం నేటి కొత్త తరానికి చాలా కొత్తపదం. నేను అలయ్ బలయ్‌కు వెళ్లే ఉద్దేశ్యం వేరే అన్నది అందరికీ తెలియదు. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఒక సభ కు అతిథిగా వెళ్లటానికి సంబంధించినట్టిది కాదు. మా ఇద్దరి మధ్య సం బంధం గురుశిష్యల సంబంధం. ప్రతి పండుగలో జరిగే సంప్రదాయా లు, ఆ ప్రాంతపు నాగరికత పైననే ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నాగరికత, తెలంగాణ పది జిల్లాలలో వున్న నాగరికత ఒకటి కాదు. హైదరాబాద్‌లో 40శాతం మంది ముస్లింలుంటారు. అంతేకాకుండా ఆనాడు ముస్లింల వారసత్వం రాజకుటుంబాలకు సంబంధించినది.


ఆ ప్రభావం మిగతా ప్రజల మీద పడుతుంది. ఇస్లాం మతంలో పండుగలు వ్యక్తుల వరకే పరిమితం కాదు. ఆ పండుగలన్నీ సామాజికీకరణ చెందినవి. ఒక రోజు ఇంట్లో పండుగ చేసుకొని తెల్లవారి స్నేహితులు బంధువులను కలుస్తారు. ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఒకరి భుజం ఒకరికి తాకిచ్చకునే విధంగా తాకితే అలాయ్ బలాయ్ అని అర్థం. తెలంగాణవూపాంతంలో ఆగస్టు సెప్టెంబర్‌లో వర్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతాయి. దసరా అన్నింటికన్నా పెద్ద పండుగగా జరుపుకుంటారు. హైదరాబాద్‌లో ఉండేవారు తమకు కూడా అలాయ్ బలాయ్ ఉంటుందని దసరా తెల్లారి బం ధువులు, స్నేహితులతో కలిసి ఆ పండుగను సమాజంలో గడుపుతారు. హైదరాబాద్ నాగరికతలో ఇదొక గొప్ప సాంప్రదాయం. హార్వర్డ్‌లో వున్న పాల్‌పెర్రి లాటిన్ అమెరికా దేశాలనుంచి వచ్చినవాడు. లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలు పక్కపక్కన వున్నప్పటికీ, బ్రెజిల్‌కు అమెరికా చివరి రాష్ట్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వున్నా కానీ ఈ రెండింటి నాగరికతలు వేరువేరుగా ఉంటాయి. నాగరికత సమాజంలోనే గర్భితమై ఉంటుంది.కానీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆ ప్రాంత నాగరికత అస్తిత్వాన్ని గౌరవిస్తారు. ఎవరైనా ఒక ప్రాంత అస్తిత్వాన్ని హేళన చేస్తే ఛిద్రమైపోతారు. కారణం ఏమిటంటే నాగరికత, సంస్కృతి అన్నది వారసత్వంగా వచ్చేవి. స్కూల్లో నేర్చుకునే సాంప్రదాయాలు, వర్తమానంలో నేర్చుకునే సాంప్రదాయాలు బైటనుంచి వచ్చాయి. ఒకటి వారసత్వంగా వచ్చింది. ఇంకొకటి తెచ్చిపెట్టుకున్న సంస్కృతి. వారసత్వంలో వచ్చినదానిపై ఎన్నో శక్తులు ప్రభావితం చేస్తాయి. అలయ్ బలయ్ దసరా తెల్లారి జరుపుకునేది. మా దత్తావూతేయ ఈ పండుగ విశిష్టతను మారిన పరిస్థితుల్లో అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పాలనే దీనిని ప్రతి ఏడాది అలయ్ బలయ్‌గా ఏర్పాటు చేస్తాడు. ఈ కార్యవూకమాన్ని పార్టీలకు అతీతంగా జరిపే సాంప్రదాయాన్ని తీసుకువచ్చాడు. కొన్నేళ్ల నుంచి ఈ కార్యవూకమంలో పండితుల నుంచి పామరుల వరకు పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నా రు. ఈ కార్యవూకమంలో ఆనాటి సమాజం అలవాట్లు, ఆలోచనా విధానాలు, సంస్కృతి, వేషభాషలు, నాగరికతలు అన్నీ ఈ అలయ్ బలయ్‌లో అద్దంలా కనిపిస్తుంటాయ్.


ఈ సంస్కృతిలో ఆనాటి ప్రజల జీవన విధానాన్ని చూడవచ్చు.ఇక్కడ డప్పులు, డోల్లు కనిపిస్తాయి. ఇక్కడ భరతనాట్యాలు కనిపించవు. గజ్జెల సవ్వళ్లతో జానపద ముఖ చిత్రం కనిపిస్తుంది. కళాత్మకల మీద సృష్టించబడ్డ సంగీతం కనిపించదు. జన జీవితం నుంచి వచ్చిన పల్లెపాటలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిని శ్రామికుల సంస్కృతి అంటారు. శ్రామికులు ఏది ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తి వస్తువులే ఆ ఉత్పత్తి సాధనాలతోనే ముడి పడే శ్రమ సంస్కృతిని, నాగరికతను నిర్మించుకుంటారు. ఆ శ్రమతత్వమే జన సంస్కృతిగా ఉంటుంది. వీరి ఆలోచనా విధానం కూడా ఆ ప్రాంత వాసుల్ని ప్రభావితం చేస్తుంది. నాగరికత స్వతహాగా అభివృద్ధిని తీసుకురాదు. మనుషుల చలనానికి నాగరికత డైనమిజంగా పనిచేస్తుంది. ఒక దేశం ప్రజలను ఉత్తేజపరుచుటం కోసం వారి నాగరికతను ప్రదర్శిస్తారు. సమూహాల కన్నా సంస్కృతే వారి కళల ద్వారా వారిని ప్రభావితం చేస్తుంది.


నేడు ప్రతి నాగరికతకు గొప్ప చరిత్ర ఉంటుంది అందుకే ఈ గడ్డలో పుట్టినవాణ్ణి కాబట్టి ఈ అలయ్ బలయ్ కార్యవూకమంలో పాల్గొనాలనే ఉత్సాహంతో అక్కడికి వెళ్లాను. ఇతరులు కూడా దీని విశిష్టతను అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. దత్తావూతేయ, అలయ్ బలయ్ చేస్తే తెలంగాణ నాగరికతను పునశ్చరణ చేసినట్లుగా నాకనిపించింది. తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిష్టించినందులకు అభినందిస్తున్నాను.
ఇందులోని పౌరాణిక, ఆధ్యాత్మిక అంశాలతో నాకు సంబంధం లేదు. ఈ అలయ్ బలయ్‌లో తెలంగాణ ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రదర్శించినందులకు, ఆ సంస్కృతి కొనసాగింపును మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. శ్రమజీవుల సంస్కృతి అద్దం పట్టిన అలయ్ బలయ్‌కి అభినందనలు.

-చుక్కా రామయ్య

188

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర