బోరుమంటున్న భాగ్యనగరం


Sat,October 6, 2012 03:07 PM

బెంగుళూరుకు వెళ్తుంటే నా పక్క సీట్లో ఉన్న ఒక ప్రయాణికునితో సంభాషణ మొదలైంది. తాను బెంగుళూరులో ఉంటానని, కానీ ‘మాది పాత హైదరాబాద్ రాష్ట్రం’ అని చెప్పాడు. ‘మీరు కర్ణాటకలో ఉండడం వల్ల ఏమైనా వివక్షను ఎదుర్కొంటున్నారా’? అని అడిగాను. ‘మేము అక్కడి ప్రజల్లో కలిసిపోయాం సార్’ అని చెప్పాడు. మా దురదృష్టం ఏమిటంటే మీ మూడు జిల్లాలకు ఏ ఇబ్బందీ లేదు.మా పది జిల్లాల్లో 60 ఏళ్లయినా ఎంత దుమారం రేగుతుందో, ఎన్ని దెబ్బలు తింటున్నామో, ఎన్ని చావులను చూస్తున్నామో, ఎన్ని పోలీసు అఘాయిత్యాలకు గురౌతున్నామో కదా? మాలో ఏమైనా లోపం ఉందా అని ఆ ప్రయాణికుణ్ణి అడిగాను.

గుల్బర్గా, రాయచూర్, బీదర్‌లు ఇవి జిల్లా కేంద్రాలు. హైదరాబాద్ ఆంధ్రవూపదేశ్‌కే రాష్ట్ర కేంద్రమయ్యింది. కాబట్టే మీకు ఈ గతి అని ఆ ప్రయాణికుడు ఒక్కమాటలో చెప్పాడు. కనీసం రాష్ట్ర రాజధాని నగరం అవ్వటం వల్ల మేము బతకగలుగుతున్నాం కానీ లేకుంటే మా జిల్లాలు ఎన్నడో ఎడారులై పోయేవి కదా అన్నా ను. అది వాస్తవమే కావచ్చును. కానీ హైదరాబాద్ రాజధాని అవ్వటం వల్ల మార్కె ట్ శక్తుల ప్రభావం మీమీద ఎక్కువ ఉన్నదని అన్నాడు. బెంగుళూరు కంటే ఎక్కువనా! అన్నాను. అవును అన్నాడు. ‘పాత హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం స్వతహా గా ఒక భూస్వామి. రంగాడ్డి జిల్లాలో, నల్లగొండ, మెదక్ పరిసర జిల్లాల్లో సర్కారీ భూములు ఎక్కువగా ఉన్నాయి. అదే మీకు శాపంగా మారింది’ అన్నాడు. సర్కారీ భూములు ఎక్కడైతే ఉంటాయో పాలకులు దానిమీద దృష్టి పెడతారు.

అధికారం ఎప్పుడైనా దాని మీద కన్నేయ వచ్చును. అందుకే హైదరాబాద్ మల్టీ నేషనల్ కంపెనీలకు మాత్రమే కేంద్రం కాదు, అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా కేంద్రమైపోయింది. అంటే భూముల ధరలొస్తే ఇక్కడి వాళ్లకే లాభం అవుతుండొచ్చుకదా అన్నాను. నేను ఇంజనీర్‌ను, అది కూడా నేను నీటిపారుదల శాఖలో పనిచేశానన్నాడు. భూమికి ధర రావాలంటే మీడియా పాత్ర చాలా ఉంటుందన్నాడు. సైన్స్ సిటీ వస్తుందని, ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి, కొత్తగా లక్షలదాది ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రచారం చేయాలి. దాని వల్ల భూమికి ధర పెరుగుతుంది. ప్రభుత్వ భూమే కాబట్టి తన ఇష్టం ఉన్న వారికి దానం చేసుకుంటారు. చిన్న చితకా రైతులు తమ కొడుకులు చదవటం వల్ల మెదక్ జిల్లాలో ఒక ఎకరమో, రెండకరాలో కొనుకున్నారు. ఈ సైన్స్ సిటీలు పలు రకాల మీడియాలో ప్రచారాల వల్ల ఆ భూముల ధరలకు రెక్కలొచ్చి విపరీతంగా పెరిగా యి. రెండు వేలకు కొన్నవాడు పది వేలకు అమ్ముడుపోతుందంటే ఎంత ఉబ్బిపోతారో ఆలోచించండి.

స్థానిక ఒక్క రైతులు ఆశతో భూములన్నీ అమ్ముకున్నారు. ఆ బక్క రైతులు తమ భూములను తక్కువ ధరకు అమ్ముకున్న రోజు నుంచి మీడి యా ప్రచారం వల్ల ఎకరం లక్షల్లోకిపోయింది. ఆ భూములమ్మిన డబ్బు వ్యాపారానికి ఎంత దోహదపడ్డదో తెలిసిపోతుంది. ఒకవైపున ఈ భూములను ప్రభుత్వం దానం చేయడం, రెండో వైపున రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్‌ను రంగాడ్డి జిల్లాలను భూ కామాందుల చేతుల్లోకి నెట్టింది. ఆధునిక హంగులు గల ఫ్యాక్టరీలు, కంప్యూటర్‌ల నెట్‌వర్క్‌లు, రకరకాల హబ్బులు, పబ్బులు, బహుళజాతి కంపెనీల స్వేచ్ఛా మార్కెట్లూ వెలిశాయి. బీడు భూముల్లో కొత్త వ్యాపార హంగులు జిగేల్‌మని మెరిశాయి. హైదరాబాద్ సిటీ విస్తారమైపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 60 గ్రామాలను కలిపారు. హైదరాబాద్ విస్తరణను చూపి యూనియన్ టెరిటరీగా మార్చే అవకాశం ఉంటుందని అందుకే బీజాలు వేశారు.

మార్కెట్ రాజకీయాలు ఈ నేలకు చీడపురుగులైపోయాయి. మార్కెట్ వలన ఏ స్థానికుడు బాగుపడలేదు. కొద్దో గొప్పో బాగుపడ్డానని చెప్పినా అది తక్కువ ధరకే అమ్ముకున్నాడు. బ్యాంకుల్లో నిల్వపెట్టిందానికన్నా భూమ్మీద పెట్టడమే మంచిదని సంపన్నులు, పెట్టుబడీదారులు ఆలోచిస్తారు. అందుకు డబ్బును వెచ్చిస్తారు. కాబట్టే హైదరాబాద్ నగరం మార్కెట్ శక్తులకు లోబడింది. ఈనాడు తెలంగాణ అగ్నిజ్వాలల వెనుక ఉన్నది అదేనని ఆ ప్రయాణికుడు చెప్పాడు. హైదరాబాద్ ఆంధ్రవూపదేశ్ పటంలో భాగం కాదు, అది తెలంగాణలో భాగంగా లేదు. మార్కెట్ శక్తుల చేతుల్లో బందీ అయింది. పెట్టుబడీదారి చేతుల్లో అత్యంత దారుణంగా బందీ అయిన నగరం హైదరాబాద్. ఈ సమస్య ప్రపంచ పెట్టుబడీదారి వ్యవస్థతో ముడిపడిపోయి ఉన్నదయ్యా అని ప్రయాణికుడు పలు రకాల విశ్లేషణలతో చెప్పాడు.

బెంగుళూరు బహుళజాతి కంపెనీలకు కేంద్రమన్నది వాస్తవమే. కానీ హైదరాబాద్ నగరం భూస్వామి, పెట్టుబడీదారి, గ్లోబల్ మార్కెట్‌కు ముగ్గురికీ కేంద్రంగా మారింది. బెంగుళూరుకు ఉపాధి కేంద్రమైతే, హైదరాబాద్ ఆర్థిక మార్కెట్‌కు కేంద్రంగా మారింది. ఈ సమస్య ప్రపంచ సమస్య. అందుకే హైదరాబాద్ సమస్య జటిలంగా మారింది. పోరాటం చేసేవారు బక్కచిక్కిన ఆకలి పేగుల వారు. ఈ పోరాటాలను అణగదొక్కేవారు ప్రపంచ యుద్ధాలను, ప్రపంచ ఆర్థిక, రాజకీయాలను నియంవూతించేవాడు. కాబట్టి బెంగుళూరుకు, హైదరాబాద్‌కు ఎక్కడ పోలిక చెప్పండని ఆ ప్రయాణికుడన్నాడు. బెంగుళూరు స్టేట్ క్యాపిటల్, హైదరాబాద్ మల్టీపర్పస్ క్యాపిటల్. అంటూ ఆ ప్రయాణికుడు చెబుతున్న మాటలతో రైలు అత్యంత వేగంగా దూసుకుపోతుంది. ఈ మాటలు మాట్లాడి ఆ ప్రయాణీకుడు నిద్రలోకి పోయాడు. కానీ నాకు మాత్రం నిద్రపట్టకుండా చేశాడు. ఆలోచనల సుడిగుండంలోకి నెట్టాడు. ఇంకా ఎన్నెన్ని గండాలను దాటుకుంటూ గమ్యం ఎలా చేరాలో నన్న ఆందోళన నాలో మొదలైంది. పెనం మీద ఉన్న మనిషిని పొయ్యిలోకి నెట్టినట్లయ్యింది నా పరిస్థితి.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర