కాళోజీ స్ఫూర్తిని పంచుదాం


Thu,September 12, 2013 01:03 AM

వరంగల్‌లో 9వ తేదీన 5 గంటలకు కాళోజీ శతజయంతి సభ ప్రారంభమైంది. ఉపన్యాసకుల మాటలు, సభికుల చప్పట్లతో రెండు గంటలు కాళోజీకి నివాళులు అర్పించారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణంకన్నా వర్తమానపు రాజకీయాలతోనే ఆ సభ కేంద్రీకృతమైంది. హైద్రాబాద్ లేనటువంటి తెలంగాణ తలలేని మొండెం అని అందరూ అనుకుంటుంటే జస్టిస్ సుదర్శన్‌డ్డి సున్నితమైన, రాజ్యాంగపరమైన అంశాలను లేవనెత్తారు. కాళోజీ శతజయంతి సభను ఆలోచింపచేశారు. సుదర్శన్‌డ్డి ఉపన్యాసంతో 60ఏళ్లు పైబడిన వాళ్లను కూడా మండించినట్లయ్యింది. అందరూ సభ నుంచి ఎటోళ్లు అటు వెళ్లారు. నన్ను మా సారంగపాణి తదితర రిటైర్డ్ లెక్చరర్లు అంతా కలిసి తెల్లారి ఉదయం 9గంటలకు వరంగల్‌లోని గోపాలస్వామి గుడి దగ్గర గల సి.వి.రామన్ జూనియర్ కాలేజీకి తీసుకు ఆ రోజే తెలంగాణ రచయితల వేదిక లక్షలాదిమంది విద్యార్థుల చేత కాళోజీ శతజయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేయించే కార్యవూకమం చేపట్టింది. ఈ ప్రతిజ్ఞా కార్యవూకమంలో వేలాదిమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లక్షలాదిమంది పిల్లలు పాల్గొనటం విశేషం. వరంగల్‌లో జరిగిన లిటిల్ ఫ్లవర్ కాలేజీకి ఈ ప్రతిజ్ఞ చేయించేందుకు నన్ను మా సారంగపాణి తదితర అధ్యాపక మిత్రులు తీసుకు వందలమంది విద్యార్థులు అక్కడ జమ అయ్యారు.

ఆ పిల్లలను చూసి పులకరించిపోయాను. పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించాను. అందరూ ఏకస్వరంతో ఆ ప్రతిజ్ఞ చదివారు. ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత నేను పిల్లలను అడిగాను. ‘కాళోజీ’ ఎవరని అడిగాను. మా వూరివాడే వరంగల్ వాసే అని పిల్లలు అన్నారు. అతని గొప్పతనం ఏమిది? ఎందుకతనిని జ్ఞాపకం చేసుకుంటామని అడిగాను. మనం కాళోజీ భావనను రంగరించుకుంటే రాబోయే 100 సంవత్సరాలకు కావల్సిన సమాజ నిర్మాణ మానవ సైన్యాన్ని తయారు చేస్తుంది. అమెరికాలో ఒక ప్రైమరీ స్కూలుకు పోయాను. ఆ గోడపై మూడు ఫొటోలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఆ స్కూల్ పిల్లల ఫొటోలే ఉన్నాయి. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు ఒబామ ఫొటో కనిపించలేదు. ఆ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థి సంఘం ఫోటోలని అక్కడి స్కూల్ ప్రిన్సిపల్ చెప్పాడు. ఆ విద్యార్థులను పిలిచి నాకు పరిచయం చేశారు. ప్రాథమిక తరగతి నుంచే తమను ఎన్నుకునే నాయకుణ్ణి గౌరవించే తత్వం కలిగేందుకు ఆ విద్యార్థి సంఘం నాయకుల ఫొటోలు పెట్టామన్నారు. ప్రతిరోజు 500 మంది విద్యార్థులకు ఆ విద్యార్థి సంఘం నాయకులు మార్నింగ్ అసెంబ్లీలో సెల్యూట్ చేస్తారు. చిన్నప్పటి నుంచే ఆ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు అలవడతాయి. చిన్నప్ప టి నుంచే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, జవాబుదారీతనం అలవడతాయి. నేను ఆ స్కూలంతా తిరిగాను. విద్యార్థి ప్రతినిధులను గౌరవించటం, ఆ ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించటం, వారిలో విరబూస్తున్న నాయకత్వ లక్షణాలను ఆ స్కూల్లో చూడగలిగాను. ఆ స్కూల్ ప్రాశస్థ్యాన్ని కాపాడుకునేందుకు ఆ పిల్లలు పనిచేయటం నన్ను అలోచింపజేసింది. ఈ పిల్లలు పెద్ద పెరిగాక తన దేశం గురించి ఎంతగా ఆలోచిస్తారో కదా అని నేను ఆలోచనల్లో మునిగాను.

పిల్లల్లో దేశానికి రాష్ట్రానికి, తన వూరుకు సంబంధించిన ఆలోచనలను నాటాలి. ఆ ఆలోచనలు నేడు క్రమంగా మనదగ్గర కనుమరుగవుతున్నాయోనన్న అనుమానం కలుగుతుంది. ఇపుడంతా యువత ఆలోచనను మార్కెట్ ప్రపంచం క్రమంగా తన దేశం నుంచి తన మట్టి నుంచి మనిషిని దూరం చేస్తున్నది. నేడు మనదేశంలో మార్కె ట్ సంస్కృతి విష ప్రభావం పిల్లలపై బాగా పనిచేస్తున్నది. ఇలాంటి సమయంలో తెలంగాణలో సొంత రాష్ట్రం కోసం ఉరవళ్లు పరవళ్లు తొక్కే ఉద్యమం నడుస్తున్నది. ఈసందర్భంలోనే కాళోజీ నారాయణరావు శతజయంతి సభలు జరగటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. కాళోజీ శతజయంతి సందర్భంగా ఆయనను కొనియాడుతూ ఆ స్ఫూర్తిని పొందటం సమాజానికి ఎంతో అవసరమైనది. ఇదే సందర్భంలో కాళోజీని తరగతి గదిలో పిల్లల మధ్యకు తీసుకువచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కవిత్వాన్ని ఆయన ధైర్యాన్ని తెలియజేయాలి. చిన్న చిన్న సమస్యలు వస్తే తట్టుకోలేక ఆందోళన చెందుతున్న ఈ తరానికి ధైర్యం నింపి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు కాళోజీ లాంటి వ్యక్తిత్వాలను పిల్లలకు పదేపదే చెప్పాలి. కాళోజీ అంటే విప్లవమని అర్థంకాదు. ఒక మంచి పౌరునికి ఉండవలసిన ప్రజాస్వామిక లక్షణాలన్నీ కాళోజీ అనుభవాల నుంచి పిల్లలకు చెప్పాలి. తెలంగాణ రచయితల వేదిక తయారు చేసిన ఆ ప్రతిజ్ఞను చదువుతుంటే నాకు కొత్త ఆశలు కలిగాయి. కాళోజీని కొత్తతరంలోకి ఎక్కించటం ఎలాగు ఎట్లా ఆయనను ఈ ఇంగ్లిషు మీడియం చదువులకు పరిచయం చేయాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో ఆ పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించటమే కాకుండా, కాళోజీ వ్యక్తిత్వాన్ని నూరిపోసే అవకాశం చిక్కింది. తెలంగా ణ 10 జిల్లాలో వున్న ఉపాధ్యాయులంతా ఈ ప్రతిజ్ఞా కార్యవూకమంలో పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు.

ఈ ఏడాదిపొడుగునా కాళోజీ శత జయంతి సభలను ఘనంగా నిర్వహించుకుంటూ పిల్లలను అందులో ప్రధాన భాగస్వాముల్ని చేయాలి. మా తరానికి, మా తర్వాత తరానికి కాళోజీ బాగా తెలుసు. మా ఉపాధ్యాయుల సమస్యలపై ఆయన గళమెత్తిన యోధుడు. పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేసినవాడు. ఈ పిల్లలే రేపటి నవ సమాజ నిర్మాతలు.కాళోజీ స్ఫూర్తిని ఈ తరానికి అందించగలిగితే అసెంబ్లీ, శాసనమండలిలో కి విలువలున్న మనుషులు వెళ్లగలుగుతారు. ఇదేమి రాజ్యం? ఇదేమి పాలన? ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించగలిగిన వ్యక్తులు తయారైతేనే ఈ సామాజిక వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. అందుకోసం కాళోజీని పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు తెలియచేయాలి. ఆయన ఎందుకోసం కవిత్వం రాశారో, ఆ కవిత్వంలో ఉన్న సారం ఏమి టో పిల్లలకు విప్పి చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యాపారమయం చేస్తు న్న సంద ర్భం నుంచి దాన్ని బైట పడెయ్యాలంటే ఇపుడు ఒక్కడు కాదు వందల వేల మంది కాళోజీలు కావాలి. అందుకోసం ఉపాధ్యాయులే ఈ తరాన్ని తీర్చిదిద్దాలి. పెట్టుబడి చెదపట్టి పోతున్న వ్యవస్థను కాపాడగలిగింది ప్రగతిశీల శక్తు లు మాత్రమే. ఆ సామాజిక స్పృహను పండించటానికి మహనీయుల స్ఫూర్తి ఎంతో అవసరం. ఆ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.

-చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త

156

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

country oven

Featured Articles