అభివృద్ధికి ముగ్గులు పోద్దాంరండి


Sat,August 17, 2013 02:05 AM

సాయుధ పోరాట కాలంలో భూస్వాములు తెలంగాణలో ఉండే ప్రజలను రకరకాలుగా హింసించారు. అందుకే భూములు దున్నిన వారు ఇక్కడ భూమికి యజమాని కాలేకపోయా డు. తెలంగాణలో కొందరినే ఆస్తి భూమి వరించింది. కొందరు భూస్వాములు కాగా ఎక్కువమంది కూలీలుగానే మిగిలారు. కొంతమంది ప్రతి సంవత్సరం భూమి నుంచి భేదఖల్ చేసేసి టెండెన్సీ నుంచి తొలగించేవారు. ఏ పహాణి చూసినా కానీ వూర్లో ఇద్దరుముగ్గురికన్నా ఎక్కువ పట్టేదార్లు లేకపోయేది. ప్రజలను బానిసలుగా చూసేవారు. మాట్లాడాలంటే చెప్పులు విడిచి మాట్లాడాలి. మోకాలి వరకు బట్టలుపైకి తీసుకుని చేతులు జోడించి మాట్లాడాలి. దొరవారి ఇంట్ల పెళ్లయితే తన ఇంట్లో పెళ్లి చేసుకోవాలి. దొరవారింట్లో ఏడుపులుంటే వూరంతా ఏడ్వాలి. దొర నవ్వితే వూరంతా నవ్వాలి. దొర అన్యాయాలను మౌనంగా భరించాలి. చివరకది తమ కర్మ అనుకోవాలి. వందల సంవత్సరాలు బానిసత్వాన్ని భరిస్తూ ఎంతోమంది బలయ్యారు. బందగీ కోర్టులో గెలిచినా దాని సాఫల్యం చూసుకోకముందే ప్రాణమిడిచాడు. కత్తిపోట్లకు గురయ్యాడు. ఎంతోమంది జైలు పాలయ్యారు. చివరకు విసిగివేసారి ప్రజలు తుపాకీ సమాధానమని అనుకున్నారు. దొర తుపాకీ అయితే అందుకు సమాధానం తుపాకే అని ప్రజలు అనుకుని నిలబడ్డారు. సాయుధ పోరాట మే శరణ్యమన్నారు. దొర తుపాకీ పట్టుకుంటే ఏ చరిత్ర ఖండించలేదు.కానీ ప్రజలు తుపాకీ పట్టుకుంటే అది సాయుధ పోరాటమయ్యింది. ఉన్నవాడు, సంపన్నుడు హింస చేయటం వారి హక్కు అనుకుంటారు. ప్రజలు ఆ హింసను ఎదుర్కొనటానికి ప్రయత్నంచేస్తే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది. అదేమాదిరిగా తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాలు అన్యాయం జరుగుతుంటే ఎవరూ మాట్లాడకపోతిరికదా, రెండురాష్ట్రాలను కలిపినప్పుడు ఎక్కడ మంచి సాంప్రదాయం ఉంటే దాన్ని స్వీకరించటం ఇంటిక్షిగేషన్ అంటారు. ఒక ప్రాంతపు వ్యవస్థను సం స్కృతిని మరొక ప్రాంతంపై రుద్దుతుంటే పెద్దమనుషులంతా మౌనంగా కూర్చున్నారు. వారి భూములను అన్యాక్షికాంతం చేస్తుంటే దానికి రియల్‌ఎస్టేట్ బిజినెస్ అనే ముద్దుపేరు పెట్టా రు. ఈ నేల మీద ప్రజలు మాట్లాడే భాషను అవమానపరుస్తూ హేళన చేస్తిరి. తెలుగుభాష, తెలుగు సాంప్రదాయాలు అణగవూదొక్కబడుతున్న కాలంలో తెలుగు భాషను కడుపులో పెట్టుకుని పెంచి పోషించిన మనుషులనే తెలుగు భాషా వ్యతిరేకులని చిత్రించారు.

ఆ మహనీయుల త్యాగాలను ఒక్కమాటైనా అనలేదు కదా! బయ్యారం నుంచి ఇనుప ఖనిజాన్ని లారీల్లో వేసుకుని ఇతర దేశాలకు తరలించి వ్యాపారం చేసుకపోతుంటే ఒక్క ఛానల్ కూడా మాట్లాడలేదు కదా! అవును ఇది సహజమైనదేనన్నారు. బలవంతులు బలహీనుణ్ణి తొక్కివేయటం సహజం అన్నారు. కానీ సహనానికి కూడా హద్దూపద్దులుంటాయి.ఈ అన్యాయాన్ని భరించలేం.ఒక కేక వేస్తే తుంటరి పిల్లవాణిగా చిత్రించారు. నక్సలైట్లని, అరాచకవాదుల, భాషరానివారని 60 సంవత్సరాలు ఎన్నెన్నో అవమానాలు, హింసలూ భరిస్తున్నా ఎవరూ పట్టించుకున్నారు? బలహీనునికి ఒక్కటే ఆయుధం. అదే పోరాటమనే అంకుశం. ఆ ఆయుధం ప్రజల త్యాగాలతో పదునెక్కినది. ఆనాడు ఈ ప్రజల మొర వాస్తవమని అంటే చాలు ప్రపంచమంతా కూడా హోరెత్తిపోయారే! ప్రతిష్టాత్మకమైన పత్రికలన్నీ కూడా బలహీనుడికి న్యాయం జరిగితే ఎందుకు న్యాయమని ప్రశ్నిస్తున్నాయి. చరిత్ర గతిని మార్చితే ఊరుకుంటారా?

ప్రపంచమంతా ఒక్కటై బలహీనుణ్ణి, పీడితుణ్ణి శాశ్వతంగా ఎదగకుండా చేయటమే న్యా యమని చెప్పుకుంటూ వస్తుంది. బలవంతుని ప్రయోజనం దెబ్బతీస్తే ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంది. బలవంతుని కాలుకు ముల్లు తాకినా ప్రపంచం తలకిందులయ్యేంత గొడవ చేస్తున్నారు కదా! చాలామంది పత్రికలంటే నిష్ఫక్షపాతమైనవని అనుకుంటారు. అది నాలుగో కన్ను అని పుస్తకాల్లో చెప్పారు. ప్రజాస్వామ్య స్తంభమన్నారు కదా! వేయిమంది కన్నులు మూసినా జాతీయ పత్రికలకు, జాతీయ ఛానళ్లకు కనపడలేదా! ఎన్ని పత్రికలు సంపాదకీయాలు రాశాయి? ఎంతోమంది యాకూబ్‌డ్డులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతోమంది పోరాడి ఈనేలపై ఎన్‌కౌంటర్లకు గురయ్యారు. ఆనాడు ఎవరికి కూడా ఇది కనపడలేదు. ఘనత వహించిన పత్రికలూ పట్టించుకోలేదు.60 ఏళ్ల తర్వాత ఒక వూరట ప్రయత్నం జరిగే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనగానే హడలు కొట్టిస్తున్నారే. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకూ దద్దరిల్లేటట్లు చేస్తున్నారు కదా. సంపన్నునికి కాలికి ముల్లు ఇరిగితే ప్రపంచం అంతా కదిలిపోతుంది. పీడిత ప్రజానీకం చావు బతుకుల్లో దినదినగండంగా 60 సంవత్సరాలు తనుకులాడినా అది షరామామూలే అంటారు. అది దరివూదుని ఆరాటంగా చిత్రీకరిస్తున్నారు. సంపన్నుడు సంపన్నుడిగానే ఉంటారు. బలహీనుని కేకలే తిరుగుబాటుగా ఎగుస్తాయి.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వక్రీకరించే ప్రయతం చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక ప్రాంతం అస్తిత్వాన్ని, ఆ ప్రజల బాధల గాథలను అర్థం చేసుకోకపోతే ఆ నేల నుంచి విప్లవాగ్నులు ప్రజ్వరిల్లుతాయి. తెలంగాణ సమాజం మహోన్నత త్యాగాలతో నిలబడింది. ఈ నేలపై అన్ని అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. ఆనాటి వీరతెలంగాణ సాయుధ పోరాటాన్ని నా కళ్లతో చూశాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ పల్లెలు అంతే ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ పల్లెలు పూర్తిగా మారాలి. తెలంగాణ స్వయం సమృద్ధితో ఎదగాలి. తెలంగాణ పునర్ నిర్మాణం యువతరం చేతుల మీదే జరగాలి. ఈ నేల విముక్తి కోసం త్యాగాలు చేసిన వారి వారసులే తెలంగాణ అభివృద్ధి రూపురేఖలను గీయగలరు. తెలంగాణ విద్యా వైద్య రంగాలను తీర్చిదిద్ది, ఈ రెండు రంగాలను ప్రజల పరం చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు నిరంతర పోరాటాలతో అలసిపోయి ఉన్నారు. ఆ ప్రజల ఆకాంక్షలకు అండగా నిలబడటమే వారి త్యాగాలను గౌరవించినట్లవుతుంది. స్వయం సమృద్ధితో ఎదగటానికి, స్వతంవూతంగా నిలవటానికి ఈ నేల మీద నుంచి అభివృద్ధికి ముగ్గులు పోద్దాం పదండి.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు

97

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

country oven

Featured Articles