అక్షరాల పొదుగు


Fri,August 2, 2013 01:11 AM


చరివూతకు మొదటి ముసాయిదా పత్రికలే. ‘జర్నలిజం యీ జ్ ఫస్ట్ డ్రాప్ట్ ఆఫ్ ది హిస్టరీ’ అన్నారు. పత్రికలకున్న గొప్పతనమది. పత్రికలు కేవలం సమాచారాన్నందించే సాధనమే కాదు. సత్యాలను బయటపెట్టి సత్యాన్వేషణను కొనసాగించే నిరంతర అన్వేషి పత్రిక. పత్రికలు సత్యాలను ప్రచారంచేసే భోధకులేకాదు, జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ప్రజల చేతికందిం చే వర్తమాన చరిత్రఅద్దం జర్నలిజం. నేను అమెరికా వాషింగ్టన్‌లో ‘న్యూజియం’ అనే మ్యూజియంను చూశాను. వాషింగ్టన్‌లో అది ఆరంతస్ధుల భవనంలో నెలకొల్పారు. అందులో వందేళ్ళ పత్రికలకున్న చరివూతను ఆ న్యూజియం తెలియజేస్తుంది. దానిలో వందేళ్ళకు సంబంధించిన పత్రికలు, జర్నలిస్టులు, అత్యంత ప్రతిభావంతంగా రాసి న చరిత్ర, మరచిపోలేని సత్యాల అన్వేషణ అందులో చూశాను. ఆ న్యూజియం అర్ధమేమిటంటే ‘ప్రజలకు నిజమైన యదార్ధం తెలియనివ్వండి’ అన్న మహత్తర సందేశాన్ని ఆ పత్రికల ప్రదర్శనశాల తెలియజేస్తుంది. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే వాళ్లే తమను తాము కాపాడుకుంటారు. ఆ న్యూజియంలో పోర్.డి.(4డి) పిక్చర్ చూశాను. అందులో చూపించిన ఒక డాక్యుమెంట్ నన్ను కదిలించివేసింది. నేనే కాదు ఆ డాక్యుమెంట్ ఎవరు చూసినా ఆలోచనల్లో మునిగిపోతారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఒక సమాచారం అందింది. అమెరికాలోని ఒక పిచ్చాసుపవూతిలో అవినీతి జరుగుతుందని రిపోర్ట్ వచ్చింది. ఆ విషయంపై నిజానిజాలు ప్రపంచానికి తెలియచేసేందుకు ఒక పత్రికా విలేకరి ఆసుపవూతిలో పిచ్చిదానిగా చేరుతుంది. పత్రికా విలేకరియైన ఆ అమ్మాయిని పిచ్చాసుపవూతిలో అనేకసార్లు కొడతారు. బేడీలు వేస్తారు. ఆ విలేకరి మూడునెలలు వాటినన్నింటిని భరించి అక్కడ జరుగుతున్న అవకతవకలను, అవినీతిని పత్రికలకు రిపోర్టు చేస్తుంది. ఆ వార్తను చదివి సమాజం ఆలోచిస్తుంది. ఆ సత్యాన్వేషణలో రాసిన రాతలకు సమాజం స్తంభిస్తుంది. ఆ డాక్యుమెంట్ చూసిన తరువాత పత్రికలో రాసేరాతలు అనుభవించకుండా రాయకూడదని తెలుస్తుంది.ఏ విషయాన్నయినా విని రాయకూడదు. చూసి రాయండి. రాసే వార్తకు క్రెడిట్‌బులిటి రావాలంటే ఒక విషయాన్ని పరామర్శించి విశ్లేషించి రాయాలి. చాలా సందర్భాల్లో రిపోర్టింగ్ కష్టతరంగా వుంటుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో పత్రికా రచన కత్తిమీద సాములాంటిది. ఉన్నది ఉన్నట్లుగా రాయాలి.యుద్ధ గాయాలనుంచి వార్తలు రాయాలి. ఎంతో సాహసంతో దేనినైనా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు వుంటేనే ఆ యుద్ధ వార్తల రచనలు చేయాలి. అదే పత్రికకు పునాది అవుతుంది. ఒక వార్తను విశ్లేషించేటప్పుడు భిన్న కోణాలుండవచ్చును. కాని నిజాయితీ మాత్రం ఇసుమంతకూడా జారకూడదు. రాసే వార్త నిప్పులాంటి నిజంగా వుండాలి. ఆ యుద్ధ వార్తలకు సంబంధించి డాక్యుమెంట్ కూడా 4డిలో చూపారు. ఇది అందరిని ఆకర్షిస్తుంది.

ఆ‘న్యూజియం’లో అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నల్లజాతి హక్కులపై తొలి సంతకం చేసిన అబ్రహంలింకన్ చనిపోయిననాడు, అనాటి పత్రికలు ఏ విధంగా రిపోర్ట్ చేశాయి? ఆయన హత్యను వివిధ పత్రికలు ఏ రకంగా రిపోర్టు చేశాయో దానిని ప్రదర్శించారు. మహాత్మాగాంధీ, హత్యను ఏపవూతిక ఏ విధంగా, రిపోర్టు చేసిందో జాన్‌ఎఫ్ కెనడీ కూడా హత్యకు గరైనారు. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనను 1963లో హత్య చేశారు. ఆ సందర్భంగా ఆయన హత్యను పత్రికలు ఎలా రిపోర్టు చేశాయి, హత్య జరిగిననాటి సందర్భంపభావం, ప్రజలకు పత్రికలు తెలియజేశాయి. హత్య జరిగిన సందర్భాన్ని పత్రికలు ఎలా విశ్లేషించాయి. వీటన్నింటిని పరిశీలిస్తే ఆ పత్రికల విశ్లేషణతో ఆనాటి కాలాన్ని, ఆనాటి సమాజాన్ని అప్పటి సామాజిక ఉద్యమాలను, పత్రికల చొరవను, సత్యాలను, ఆవిష్కరించిన తీరును అర్థం చేసుకోవచ్చు.‘ఫ్రీ ప్రెస్’ కావాలి. ‘ఫ్రీ స్పీచ్’ వుండాలి. ‘ఫ్రీ స్పిరిట్’ కావాలి. పత్రికలు స్వేచ్ఛగా రాసుకొనే అవకాశం కల్పించాలి. పత్రికా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్యం అవిటిదవుతుంది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుండాలి. మాట్లాడే హక్కును కాలరాస్తే ప్రజాస్వామ్యం చూపులేనిదవుతుంది. స్వతంవూతంగా ఆలోచించుకొని అడుగులు వేయగలగాలి. తన సృజనాత్మక శక్తిని స్వేచ్ఛగా ప్రకటించగలగాలి. అవే ప్రజాస్వామ్యానికి ప్రతీకలు. ఈ మూడింటి కోసం ఎవరు ప్రాణాపూైతే ఇస్తారో మానవ చరివూతలో చిరస్థాయిగా నిలిచిపోతారు. సత్యాలు ఎంత ప్రధాన మో వాటి విశ్లేషణ కూడా ముఖ్యమైనది. జర్నలిజం శోధనజేసి నిజాన్ని ప్రపంచానికి అందిస్తుంది. సమాచారం ఎంత ప్రధానమో, దాని విశ్లేషణా అంతే ప్రధానం. అదే విలేకరి అవగాహనను స్పష్టం చేస్తుంది. ఇలాంటి పరిశోధనాత్మక పత్రికా రచనే సమాజానికి దశ దిశ నిర్దేశిస్తుంది. సమాజ మూలాలను విశ్లేషణ చేస్తుంది. పత్రికారచన చేసే విలేకరి సామాజిక పరిశోధకునిగా నిలుస్తాడు. జర్నలిజం రాతలు ఎవరికో కూలి కోసం రాసేవి కావు. వ్యవస్థ కు కంకణ బద్ధులై ఎందరో విలేకరులు త్యాగాలు చేసి వార్తలు రాశారు. వాస్తవాలతోపాటు నిజ చిత్రాలు అవసరం. పత్రికా రచయితలు ఎంత గొప్పవారో, ఫోటో గ్రాఫర్లు కూడా అంతే గొప్పవారని మరువరాదు. ఎన్నో ఉదంతాల్లో ప్రాణ త్యాగాలు చేసిన ఫోటో గ్రాఫర్ల చరివూతను, చరిత్ర మరిచిపోలేని అద్వితీయ ఛాయా చిత్రాలను ఆ న్యూజియంలో చూశాను.

పత్రికా విలేకర్లు, ఫోటోగ్రాఫర్లు, రాసిన వార్తలు, పలు సంఘటనలకు సంబంధించిన ఫోటోలను సంపాదించారు. ఈ ఫోటోలు ఉదంతాలను తెలియజేసేవి మాత్రమే కాదు. అవి వాటి త్యాగాలను తెలియజేస్తాయి. వందల ఏండ్లలో జరిగిన సంఘటనలు, కీలక మలుపులు, పలురకాల ఉదంతాలు ఉన్నాయి. బడి పిల్లలను కాపాడుకొనుటకు ఒక టీచరు పడిన తపన, ఆందోళన, ఆ టీచరును కాల్చివేసిన టెర్రరిస్టుల దృశ్యాలను ప్రదర్శించారు. స్వాతంవూతోద్యమ ప్రజా ఉద్యమ ఫోటోలు ఉంచారు. ఒలంపిక్ గేమ్స్ ఫోటోలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో మహిళల హక్కుల కోసం ‘పొలికేక’పోరాటం చేసిన మొదటి మహిళ లిల్లీ ఫోటో పెట్టారు. అమెరికాలో నార్త్, సౌత్‌కు జరిగిన యుద్ధంలో బానిసలకు జరిగిన పోరాటం చూపించారు. వందేళ్ళలో జరిగిన సంఘటనలను సమగ్ర సమాచారంతో, వార్తలతో ఆ న్యూజియంలో చూడవచ్చు. పత్రికల ద్వారా యిచ్చే సమాచారం, విశ్లేషణ, సత్యాలతో కూడుకొని ఉంటే ప్రజలలో ఎంతో వివేచన కలుగుతుంది. అలాంటి సత్యాలతో కూడుకున్న వార్తలే ఒక్కోసారి బాంబుల్లాగ పేలుతుంది. చరివూతలో వార్తలను నియంవూతించుటకు ఆధిపత్యశక్తులు ఎన్ని ప్రయత్నాలు చేశాయో, ఆ పత్రిక స్వేచ్ఛను కాపాడుకోవడంలోనూ అంతే పోరాటం జరిగింది. వార్తను తప్పుగా ప్రకటించకూడదు. రాసే వార్త నుంచి వచ్చిన భావాలతో ఒక జ్ఞాన చర్చ జరగాలి. ఆ భావాలే రాబోయే తరాలకు సామాజిక ఉద్యమానికి పునాది అవుతాయి. అవి కొత్త చరివూతకు ద్వారాలు తెరుస్తాయి. అందుకే పత్రికా విలేకర్లు రాసే అక్షరాలు ఆయుధాలౌతాయి. సమాజ ప్రగతికి నిచ్చెనమెట్లౌతాయి.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త. మాజీశాసన మండల సభ్యులు

420

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles