పెరిగిన పని గంటలు


Fri,June 7, 2013 11:58 PM


కాలిఫోర్నియాలో సిలికానాంవూధవాసులు నన్ను ఒక సమావేశానికి పిలిచారు. ఆ సభకు నేను, మంత్రులు పితాని సత్యనారాయ ణ, పొన్నాల లక్షయ్య హాజరయ్యాం. అందులో మా పాత విద్యార్థులు అనేకమంది కలిశారు. వీరు పదేళ్లు గా అక్కడే వున్నారు. మా విద్యార్థుల తమ పిల్లలను తీసుకువచ్చి రామయ్య టీచర్ అనివారికి నన్ను పరిచయం చేశారు. ఈ పదేళ్లలో మీకేమైనా ప్రమోషన్లు దొరికాయా అని అడిగాను. ఇప్పుడు ఉద్యోగం నిలబెట్టుకోవటమే చాలా కష్టమవుతుందన్నారు. ఇంతకుముందు ఉదయం 9 గంటలకు వెళ్లి సాయంత్రం 5 గంటలు కాగానే తిరిగి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఐటీ టెక్నాలజీ వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి అయ్యింది. మా ఉద్యోగం 24/7 అన్నారు. అంటే ఏమిటని అన్నాను. ఇది 24 గంటల ఉద్యోగం, ఏడు రోజుల ఉద్యోగం అని చెప్పారు. మన దగగ్గర 10 నుంచి 4 గంటల దాక కదా అన్నాడు. ఇది ప్రైవేట్ ఉద్యోగం, పైగా మేము ఇమ్మిక్షిగేట్స్ (వలసవచ్చిన వాళ్ళం) అని చెప్పారు. ఒక టీమ్‌లో ఒకవ్యక్తి ఇండి యా, మరోవ్యక్తి జపానీస్, మూడో మనిషి ఫ్రాన్స్‌లో ఉంటారు. వాళ్లు ఎప్పుడంటే అప్పుడు సలహాలు అడుగుతూ ఉంటారు.

మాకు రాత్రి సమయమైతే అవతలివారిది పగలు సమయం అవుతుంది వారి ఆఫీసు సమయాల్లో ఫోన్లు చేస్తారు. దానికి మేం అటెండ్ కావాలి. ఆ సమస్యకు పరిష్కారం చెప్పాలి. ఏ టైమ్‌లో, ఏ దేశం నుంచి కాల్ వస్తుందో తెలియదు.అందువల్ల ఇప్పుడు మా ఉద్యోగం 24 గంటలు డ్యూటీలో ఉన్నట్లుగానే అయిపోయింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు మరింత బలపడుతున్నారు. సామాజిక ఉద్యమాలు ఈ కాలంలో కనుమరుగవుతున్నాయి. వారు ఎక్కడ లేబర్ చౌకగా ఉంటే ఆ దేశంలో తమ కంపెనీలను ప్రారంభిస్తారు. గతంలో ఆ దేశం వాళ్లు ఈ దేశానికి వచ్చేది. ఇపుడు వాళ్లు రాకుండా అవుట్ సోర్సింగ్ చేయవద్దని, వీసా ఇవ్వటం లేదు. కాబట్టి ఈ దేశంలోనే బ్రాంచి పెట్టుకుంటున్నారు. వారికి ఏదైనా సమస్యరాగానే ఫోన్ చేసి దాని పరిష్కారం ఏమిటని అడుగుతున్నారు. వాళ్లకు అందుబాటులో ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఒకనాడు చికాగోలో 8గంటలు పని దినం కోసం మహత్తర ఉద్యమం వచ్చింది.అది ప్రపంచ ఉద్యమాలకు ఊతమయ్యింది. చాలామంది చనిపోయారు.అదే ‘మే డే’గా మారింది.


ప్రపంచంలో అన్ని దేశాల్లో 8 గంటల పనివిధానం అమలులోకి వచ్చిం ది. టెక్నాలజీ పెరగటం వలన వ్యాపారం ప్రపంచమంతా విస్తరించింది. అదేవిధంగా దానితోపాటు పనిగంటలు కూడా విస్తరించాయి. ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా అంతగా లేవు. ఒక ఫ్యాక్టరీలోనే కలిసి నిత్యం పనిచేస్తూ ఉంటే సంఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇపుడు ఒక ఆఫీసు లో పనిచేయాల్సిన అవసరమే లేదు. ఒక రూమ్‌లో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. టెలికాన్ఫన్స్‌లు, విజువల్ టీమ్స్‌లో పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాపారులంతా ఏకమయ్యారు. ఒక దగ్గరకు వచ్చారు. కానీ ఈ ప్రపంచంలో పనిచేసే కార్మికులంతా ఒక వేదిక మీదకు వచ్చే అవకాశం లేకుండాపోయింది. సామాజిక ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు ఒక దగ్గర కేంద్రీకృతమయ్యే అవకాశం లేదు. క్యా పిటల్ ఏకీకృతమవుతున్నది. కానీ కార్మికు ల్లో ఐక్యత లేకుండా విడివిడిగా విడిపోయే పరిస్థితి వచ్చింది. ఉత్పత్తి పెరుగుతున్నది. మీరు కూడా టెలికాన్ఫన్స్‌ల ద్వా రా ట్రేడ్ యూనియన్ మూవ్‌మెంట్ చేసుకోవచ్చు కదా అన్నాను. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఆదేశం వరకే పరిమితంగా ఉంటాయి. ప్రతి దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమా లు మమేకంగా ఉన్నాయి. కొన్ని పెట్టుబడిదారీ దేశాల్లో పాలకుల మొగ్గంతా క్యాపిటలిస్టుల వైపే ఉన్నది. ప్రతి పాలకుడు తన దేశ జీడీపీ పెంచుకోవాల న్న లక్ష్యం ఉంటుంది. పాలకుల మొగ్గు అంతా పారివూశామికవేత్తల వైపుకు వెళ్లింది. కనీసం ఈ దేశంలో వున్న ఆఫీసులో పనిచేసే వారైనా ప్రొటెస్ట్ చేయవచ్చు కదా? అని మా విద్యార్థులతో అన్నాను. మమ్ములను ఉద్యోగం నుంచి తొలగిస్తే అడిగే వారే ఇక్కడ ఉండరు. దానికితోడు మేం అప్పుచేసి ఇల్లు, కారు కొన్నాం. అప్పుచేసి పప్పుకూడు తింటున్నాం కదా. అందుకే ఉద్యోగం నుంచి వెళితే ఆకలి బాధ భరించవచ్చు. కానీ అప్పుల బాధ భరించలేం కదా సార్ అన్నారు. అందుకే ఇపుడు ప్రమోషన్ల కాలం పోయింది. ఉన్న ఉద్యోగం కాపాడుకునే స్థితి వచ్చింది. ఒక ఉద్యోగిని తొలగిస్తే 10 మంది క్యూలో నిల్చుంటున్నారు అని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని అంటున్నారు కదా అన్నాను. ఇదంతా పై పై ప్రచారం మాత్రమేనని మా పిల్లలు చెప్పారు. మార్కెట్ వ్యవస్థ వంకర ఆర్థిక వలయం. దీనిలో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించగల శక్తి ఉంది. ఈ ఆర్థిక అవకతవకల వలయంలో మేం చిక్కుకున్నాం అన్నారు. ఇంత ఇబ్బంది ఉంటే తిరిగి మనదేశం తిరిగి రావ చ్చు కదా అన్నాను. వచ్చి ఏం చేయమంటారు సార్ అన్నారు.


నా బిడ్డ అమెరికాలో వున్నారనే భ్రమన్న తల్లిదంవూడులకు ఉన్నది. మా పిల్లలు కష్టపడుతున్నారని ఆశపడతారు. అప్పులు చేసి అమెరికా పంపిస్తా రు. ఇక్కడికొచ్చి ఏ హోటల్‌లోనో, ఏ గ్యాస్ కంపనీలోనో 5, 6 గంటలకు రెండు మూడు డాలర్లకు పనిచేస్తూ ఎంతో కష్టం మీద ఈ ఉద్యోగాలు దొరికాయి. దీనివలన మనదేశంలో కుటుంబాలకు గౌరవమన్నా దక్కింది. టెక్నాలజీ పెరగటం వలన సంపన్నవర్గం బలపడుతున్నది కానీ సామాన్యులకు దాని ప్రతిఫలాలు రావటం లేదు. అందుకే ఉన్నవానికి లేనివానికి మధ్య మరింత అగాధం పెరుగుతున్నది. ఉత్పత్తి అయిన సంపద అంతా రెండు మూడు శాతంగా ఉన్న పెట్టుబడిదారీ వర్గం చేతుల్లోకి వెళుతున్నది. మిగతావారంతా మా మాదిరిగానే మధ్యతరగతిగా ఉంటున్నారు. సర్వీస్ సెక్టార్ పైననే కేంద్రీకరించే కన్నా, మన వనరులతో మన సంపదను పెంచుకుం మన దేశంలో ఉద్యోగాలు వస్తాయ్. అందుకే చైనావాళ్లు ఉత్పత్తి రంగంపైన ఎక్కువ దృష్టిని పెట్టారు. ఆ దేశస్తులు అమెరికాకు వచ్చినా చదువు పూర్తి కాగానే తిరిగి వెళ్లిపోతారు. నేర్చుకున్న నైపుణ్యంతో తమ దేశం సంపదను పెంచుకుంటున్నారు. జపాన్ కూడా సంపదను ఉత్పత్తిని వృద్ధి చేసుకుంటున్నది. మనం మాత్రం సర్వీస్‌సెక్టార్‌లోనే ఉండిపోతున్నాం. వచ్చే కాలాల్లో సర్వీస్ సెక్టార్ స్థితి మరింతగా దిగజారిపోయే అవకాశం కనిపిస్తున్నది. అమెరికాకు వచ్చి శ్రీమంతులమై పోయామని అనుకోకండి. మన చేతికి క్రెడిట్ కార్డిచ్చి మనలను చాకిరి చేయించుకోవటానికి ఒక వ్యవస్థను అమెరికా సృష్టించింది. దానిలో భాగంగా మేం అప్పుచేయాలి. ఆ అప్పును తీర్చుకోవాలి. కరీబియన్ ద్వీపాల మాదిరిగానే మనమంతా అమెరికాలో వలసకూలీలుగా మారిపోయాం. మన చదువు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేధో సంపత్తమైన కూలీలను తయారుచేసి పంపటంగా మారింది. దీని నుంచి బైటపడాలంటే మన చదువుతో, మన వనరులతో సంపదలను సృష్టించే దశకు ఎదగాలి. జపాన్, చైనా మాదిరిగా మన ఆధునిక భారతం స్వయం సంపన్నం కావాలి. అన్ని రంగాల్లో నైపుణ్యం పెంచుతూ సంపద ను పెంచేలా కృషిచేయాలి. కానీ ఆ సంపదను నియంవూతించే అధికారమూ ఆ దేశ పాలకులకే ఉండాలి. అప్పుడే మనం గౌరవంగా బతకగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం ఆర్థిక పటుత్వంతో నిలువగలుగుతాంపపంచ పటంలో భారత్ సగౌరవంగా నిలవగలుగుతాం. మేధో సంపత్తిలో అగ్ర స్థానంలో ఉన్న మనం, సంపద సృష్టిలో కూడా అగ్రభాగాన నిలవాలి.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, మాజీ శాసనమండలి సభ్యులు
(అమెరికా నుంచి)

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర