గ్లోబల్ కల్చర్ అంటే?


Fri,May 31, 2013 09:57 PM


ఒక సమాజంలో వున్నప్పుడు ఆ సమాజం గొప్పతనం కనిపించదు. ఆ సమాజం నుంచి బైటకు వచ్చి ఇతర సమాజాలను చూసినప్పుడు మన సమాజం విశిష్టత తెలిసి వస్తుంది. అదే నాకు ఈనాడు అమెరికా సమాజం చూసినప్పుడు కనిపిస్తున్నది. అమెరికా నుంచి ఇండియా ను చూస్తుంటే నేను పెరిగిన సమాజం ఎంత గొప్పదో తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం, విద్య ఒక సమాజాభివృద్ధికి ఎంత తోడ్పడుతుందో, సమాజాల విచ్ఛిన్నతకు, పతనానికి కూడా అదే కారణమతున్నది. అమెరికా పత్రికల్లో ఒక వార్త చదివాక నాకు భయమేసింది. అమెరికాలో ఓ హైస్కూల్లో చదువుకున్న పిల్లవాడు బాంబులు తయారు చేయబోతున్నాడన్న అభియోగంతో కేసు నమోదు చేశారు. రెండు రోజుల నుంచి అమెరికా సెనేట్‌లో తుపాకుల లైసెన్సులపై చర్చ జరుగుతున్నది. చిన్న పిల్లల చేతులకు తుపాకులు వస్తే ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూశాం. పసిపాపలు తుపాకి గుళ్లకు గురయ్యారు. అమెరికా సమాజంలో పసితనంలోనే నేరం చేసే ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? అదే నన్ను బాధిస్తున్నది.అమెరికా సమాజంలో వివిధ రకాల అంతరాలు, వివిధ జాతులు గల సమ్మేళన సమాజం. ఈ సమాజంలో హిందువులు, ముస్లింలు, జాస్, స్పానిష్, జపనీస్, చైనీస్,అమెరికన్స్ తదితర ప్రపంచ దేశాల వాళ్లు, వివిధజాతులు, తెగలు పలు మతాల వాళ్లున్నారు. ఎక్కడో ఒక వర్గంపై మరో వర్గం, ఒకమతంపై మరో మతం దాడులు చేశారని ఇంట్లో చర్చలు జరుగుతుంటాయి. ఛానళ్ల కళ్ల ద్వారా ఆ సంఘటనలను, నెత్తుటి మరకలను చూస్తారు. పిల్లల పసి హృదయాలలో తెలియకుండా ఆ సంఘటనలు చూసినప్పుడు కసి పెరుగుతుంది. ఆ కసి తీర్చుకునేందుకు విభిన్నంగా ఆలోచిస్తాడు. ఆ ఆలోచనల పతాక స్థాయి పసి మనసులను కలచివేసిన సంఘటనలతో స్కూల్‌కు వెళ్లి తుపాకితో తరగతి గదినే కాల్చుతాడు. ఇలాంటి విషయాలను చర్చించేటప్పుడు ఇంటిలో, కుటుంబాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇలాంటి సంఘటనలు ఛానల్స్‌లో చూపించేటప్పుడు సంయమనం పాటించాలి. అసలు చిన్నపిల్లలకు మత మంటల ఘర్షణలు తెలియకుండా చూడా లి. ఒకవేళ తెలిసినా కానీ ఇలాంటి మానవ వికృత మతమంటలు తిరిగి పునరావృతం కాకుండా తరగతి గదుల నుంచి బోధనలు చేయాలి. ఉపాధ్యాయుడు, అక్కడి ప్రభుత్వం ఈ దుస్సంఘటనలకు అడ్డుకట్టలు వేయాలి. లేకుంటే బైట జరిగే అరాచకాలు స్కూల్లో జరుగుతాయి. మత సహనం, మానవత్వంలేక గ్లోబల్ సమాజం వసుధైక కుటుంబం ఏర్పడటానికి కావాల్సిన కల్చర్‌ను చెప్పకుండా పిల్లల చేతులకు తుపాకులు అందుబాటులోకి తెచ్చి పెడితే ఏమవుతుందో కళ్లారా చూస్తున్నాం.మనదేశంలో చిన్న పిల్లలకు తుపాకి దొరకటం కష్టం. దొరికినా కానీ ఇతరులను చంపాలన్న భావనే రాదు. టెక్నాలజీ వలన దారుణమైన అధునాతన ఆయుధాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పెట్టుబడిదారీ సమాజంలో ఆయుధాల వ్యాపారం పెద్దది, బలమైనది. ఆయుధాలు మార్కెట్‌లోకి వచ్చే ముందు అందుకు కావలసిన సంస్కారం సమా జం ఇవ్వకపోతే చిన్న పిల్లలకు చంపడమనేది ఒక ఆటగా మారుతుం ది. అలాగే అమెరికా సమాజంలో విడాకులు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. పిల్లలకు తల్లి ఉంటే తండ్రి ఉండకపోవటం, తండ్రి ఉంటే తల్లి లేకపోవటం, కుటుంబంలో సఖ్యత లేకపోవటం లాంటి పరిణామాలు కూడా పిల్లల్లో పసితనంలో కసి పెంచుతుంది. ఒకడికి తల్లివూపేమ ఉండి మరొకరికి తల్లి ప్రేమ లేకుంటే తనకున్న లోపాన్ని ఉన్నవారిపై తీర్చుకుంటారు. కుటుంబంలో సఖ్యత లేకపోవడం కూడా చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

మనదేశంలో విడాకులను చిన్న చూపుగా చూస్తారు. మన సమా జం వీటిని పెంచి పెద్ద చేయదు. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనదేశంలో కూడా విడాకులు ఎక్కువవుతున్నాయి. దీని ప్రభావం చిన్న పిల్లల మీద ఏరూపంలో పడుతుందో అమెరికాలో స్పష్టంగా చూస్తున్నాను. ఫ్యామిలీ కాంపోజిషన్ చిన్నాభిన్నమైతే బలి అయ్యేది చిన్నపిల్లలే. పాఠశాలకు, పేరెంట్స్‌కున్న సంబంధం మెరుగుగా ఉండి కూడా, అది కుటుంబ కాంపోజిషన్స్ మారితే దీని ప్రభావం స్కూల్స్ పై తీవ్రంగా పడుతుంది. కాబట్టే మన పెద్దలు వివాహ వ్యవస్థకు ఎం తో ప్రాధాన్యం ఇచ్చారు. వివాహం పవివూతమైన బంధమని చెప్పారు. ఇది ఛాందసభావం కాదు. సమాజ నిర్మాణంలో భార్యాభర్తల సంబంధాలే స్కూళ్ల మీద ప్రభావం చూపిస్తాయి. దీనికితోడు ప్రమాదకరమైన ఆయుధాలు మార్కెట్‌లో దొరికితే క్షణికోవూదేకంతో తెలిసీతెలియని పిల్లలు ఏం చేస్తారో అమెరికాలాంటి అభివృద్ధిచెందిన సమాజాల్లో చూస్తున్నాం. పాత భావాలను పోషించటమే నా ఉద్దేశ్యం కాదు. కానీ సమాజ నిర్మాణంలో ఇమిడి వున్నటువంటి ధర్మ సూత్రాలను పాటిస్తేనే టెక్నాలజీ యొక్క ప్రయోజనం సమాజానికి ఇవ్వగలుగుతాం. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్రమాదకరమైన ఆయుధాలు కూడా వస్తూ వుంటాయి. వాటిపైన నియంవూతణ చేసే ప్రయత్నాలు కూడా అవసరం. కూరగాయలు దొరికినట్లు మార్కెట్‌లో తుపాకులు కూడా దొరికితే ఉద్రేకాలు కదిలిపోయి చిన్నపిల్లలపై ప్రభావం చూపటంతో దారుణ ఫలితాలను చూస్తూ ఉన్నాం. పాఠశాలలు, విద్యాలయాల ప్రాంగణాలలో తుపాకులు పేలటం శాంతిభవూదతల సమస్య కాదు. ఇదొక సామాజిక సమస్య. అది రాజకీయ సమస్య. అభివృద్ధి చెందుతున్న దే శాలకు తమ వెనుకబాటుతనాన్ని తొలగించటం కోసం టెక్నాలజీ అవసరమే, అయితే మనం ఏ టెక్నాలజీని స్వీకరించాలి? మానవ వినాశనానికి, మారణోమాలకు కారణభూతమై న ఆయుధాలను ఉ త్పత్తి చేయకూడదనే భావనను చిన్నతనంనుంచి వారి మనసు ల్లో నాటాలి. ఇది ‘లా అండ్ ఆర్డర్’ సమస్యకాదు. కుటుంబ వ్యవస్థ నుం చి మానవీయ విలువల్ని నాటాలి. విద్యాలయాల్లో వీటికి బీజాలు వేయాలి. గ్లోబల్ కల్చర్ అంటే అందరినీ ప్రేమించ డం, గౌరవించడం నేర్పాలి. మనం అభివృద్ధి అనే పేరుతో దేన్ని ఉపేక్షిస్తున్నామో అదే మనకు ఉరితా డు కాబోతున్నది. ఇవేవో చిన్న సంఘటనలని ఉపేక్షించవద్దు. ఆదిలోనే తుంచివేయాలి. లేకపోతే అది మనల్ని మనుషులుగా మిగలనీయదు.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు
(అమెరికా నుంచి)

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర