మీది మాది ఒకటే చరిత్ర


Sat,October 6, 2012 03:06 PM

Ramaiah-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaనేను చదువుకునే కాలంలో ఆఫ్రికా చీకటి ఖండమని పాఠం చెప్పేవారు. నాకర్థంకాక అక్కడ సూర్యుడు ఉదయించడేమో, కాంతి అక్కడ ఉండదేమో అనుకునేవాణ్ణి. కానీ ఈ పదం వెనుక పెట్టుబడిదారీ సమాజం కుట్ర ఎంత ఉంటుందో అర్థం చేసుకోలేకపోయాను. ఒక ప్రాంతాన్ని దోచుకోవాలంటే ఆ ప్రాంత ప్రజలు అజ్ఞానులని ప్రచారం చేయాలి. అదే కాకపోతే అక్కడున్న ఆఫ్రికా ఖండం మనుషులు అజ్ఞానులైతే అమెరికాను వారి మానవ సంపద ఇంత అభివృద్ధి చేసేదికాదు. చాలా కాలం వరకు నీగ్రోలని తక్కువగా చూశారు. నల్లజాతి వాళ్లని గేలి చేశారు. కానీ రూట్స్ నవల (ఏడు తరాలు) వచ్చిన తర్వాత ఆ నీగ్రోలకున్న గొప్ప చరిత్ర, గొప్ప సాహిత్యం ప్రపంచానికి తెలిసింది. దీనిపై అమెరికాలోని నీగ్రోలే పరిశీలించారు. పరిశోధించారు. ఇప్పుడు వారిని ఎవరూ నీగ్రోలనరు. ఆఫ్రికో-అమెరికన్ అని పిలుస్తారు. ఎవరి సంకెళ్లు వాళ్లే తెంచుకుంటారన్నట్లు ఆ నీగ్రోలే తమ పేరును కూడా మార్చుకున్నారు. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ సంపద కూడా ఉంటుంది. ఆ సంపదను దోచుకోవడం కోసం ఎన్నో యూరోపియన్ జాతులు వచ్చి ఆఫ్రికా దేశాలను కొల్లగొట్టాయి.

యూరప్ నాగరికతకు మూలం ఆఫ్రికా ఖనిజాలు, ఆఫ్రికా బంగారం. ఆ ఆఫ్రికా చీకట్ల ను చీల్చుకుని పుట్టిన వాడే మండేలా. ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ నుంచే పోరు పుట్టుకు వస్తుం ది. అక్కడ నుంచే త్యాగాలు విరబూస్తాయి. ఆ పోలికలే నా తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న పోరాటాల్లో కనిపిస్తున్నది. నాలుగు వేల మంది రక్తతర్పణ చేసిన ఈ తెలంగాణ నేలే ప్రపంచాని కి దున్నేవానిదే భూమి అన్న నినాదాన్ని అందించింది. తెలంగాణలో అందరికన్నా పెద్ద భూస్వామి జన్నాడ్డి ప్రతాపడ్డి. అతనిది మానుకోట. మానుకోటంటే అది చెట్ల కోట. మానుకోటంటే అడవులతో పచ్చగా నిండిపోయిన సకల సంపదలతో తులతూగుతున్న వనకోట అది.వరంగల్ జిల్లాలోని మానుకోట అడవితో, సిరిసంపదలతో తులతూగింది. ఎవరైనా తెలిసో తెలియకో ఒక చెట్టును కొట్టేస్తే వాళ్లను అదే చెట్టుకు కట్టేసి కొట్టేవారు. అక్కడ దొర గడీలు... పూచికపుల్లను కూడా వారి ఆజ్ఞ లేకుండా ఎవరినీ ముట్టనిచ్చేవారు కారు. ప్రజలు భయపడి పోయ్యిలోకి కట్టెపుల్లలు కూడా ఎక్కడో దూరంగా పోయి తెచ్చుకునేవారు. ఆ భూమంతా దొరవారిదే. దొర కౌలుకిస్తే శ్రమచేసే అవకాశం ఉండేది. పెండకైనా, పొయిల కట్టెలకైనా దొర మీదనే ఆధారపడాలి. అది నాటి మా తెలంగాణ జీవితం. భూస్వామి తన ప్రాంతంలో వేరే పట్టేదారుంటే భరించలేడు. తను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడు. తాను తినడు, ఇంకొకడిని తిననివ్వడు. ఈ భూమికి యజమానిగా బతకటమే దొర కాంక్ష. తన భూమిని చూసుకుని తానెంత గొప్పవాడో అంచనా వేసుకునేవారు. నైజాం రాజు 17 జిల్లాలను చూసుకుని సంతోషపడేది. జన్నాడ్డి ప్రతాపడ్డి తన భూమిని చూసుకుని విర్రవీగేది.

ఇది ఫ్యూడల్ సంస్కృతి. ‘అహం’ అనే భావంతోనే బతుకుతారు. ఆ దొరగడీల ఆహానికి, అహంకారానికి బలైన వాళ్లం మేమే. దానిపై తిరుగుబాటు చేసింది మేమే. అక్కడ మండేలాలు పుడితే ఇక్కడ సర్వదేవర రామనాథంలు పుట్టారు. తెలంగాణ ప్రాంతం వెనుకపడిన ప్రాంతమని ప్రచారం చేశారు. ఇక్కడ వనరులు లేక కాదు, సంపద లేక కాదు, ఒక ఫ్యూడల్ వ్యవస్థ కింద బతకటం వల్ల ఇక్కడి ప్రజలు కుంగిపోయారు. ఇతర ప్రాంతాల మాదిరిగా నాగరికతకు నోచుకోలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజా ఉద్యమాల వెలుగుల వల్ల, సాయుధ పోరాటం వల్ల భూస్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడారు. ఈ సంపదకు కాపలాదారైన ప్రజలు దాన్ని అనుభవించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిపాలన వచ్చింది. ఉదాహరణకు బయ్యారం ఒకటి. బయ్యారం ఒక గుట్ట. ఆ గుట్టే ఆనా డుమా సాయుధ పోరుకు శరణిచ్చింది. ఆ రాయిని ఆ ప్రాంతాన్ని ఒక పెద్దాయన తన బంధువుకి దానం చేశాడు. బయ్యారాన్ని తొలిచివేయటమే అతని పని. ఆ రాళ్లన్నిటిని ప్రపంచ మార్కెట్‌కు పంపించారు. ఆ తరలింపునకు అడ్డుపడ్డ వారిని చితకబాదారు. అంటే అధికారం, పారిక్షిశామికవేత్తలు ఇద్దరు కలిస్తే ఏమౌతుందో నేను బయ్యారంలో చూశాను. నోట్లో బండపెట్టి కొడుతుంటే మనిషి గతి ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలను చూస్తే తెలుస్తుంది.

మా బయ్యారం ప్రజల రాళ్లు అన్నీ తరలిపోయాయి. ఇప్పుడు మేం బయిటి ప్రపంచానికి చెప్పుకోగలిగాం. ఆ ఆధిపత్య పరిపాలన అంతమయ్యాకే చెప్పగలిగాం. తెలంగాణ ప్రాంతంలో వనరులు లేక కాదు, వనరులను క్యాపిటల్‌గా మార్చుకునే శక్తిలేదు. రాళ్లలో ఇనుమును తీసుకునే పరిజ్ఞానం తెలుసుకునే విద్య ఉన్నప్పటికినీ ‘పెట్టుబడి’ మా దగ్గర లేదు. ఈ రాళ్ల తరలింపు జరుగుతుంటే అడ్డుకునే బలం కూడా మాకు లేకుండాపోయింది. బయిటి ప్రపంచానికి మేం వెనుకపడినవాళ్లం. కానీ ఎందులో వెనుకబడిన ట్లు? మా వనరులను, బయ్యారం రాళ్లను ఉపయోగించుకుని ఒక ఇనుము పరిక్షిశమను ఈ ప్రాంతంలో పెట్టుకోలేకపోయాము.
యూరప్‌లో ఉండే తెల్లవారు ఆఫ్రికాలోని సంపదలను క్యాపిటల్‌గా మార్చారు. తెలంగాణలో ఉన్న సంపదలను క్యాపిటల్‌గా ఎవరు మార్చుకోలిగారు? తెలంగాణ ప్రాంతంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ దాన్ని క్యాపిటల్‌గా మార్చే శక్తి ఫ్యూడల్ వ్యవస్థలో లేకుండాపోయింది. సాయుధ పోరాటం వల్ల భూస్వామ్య వ్యవస్థను పారవూదోలాం కానీ క్యాపిటల్ వ్యవస్థను సృష్టిస్తుంటే ఆపలేకపోయాం. అందుకోసమే మానుకోట తన చరివూతను తానే సృష్టించుకుంది. మానుకోట ఘటన, ఆ దృశ్యాల వెనుక చరివూతను పరిశీలించాలి, పరిశోధించాలి.

ఈ మాదిరిగా ఒక్కొక్క గ్రామంలో సంపదను బేరాలు పెట్టడమే ఈ అసంతృప్తికి కారణం కాదా? రంగాడ్డి జిల్లాలో భూమిని వేలం పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో చెట్లను వేలం వేశారు. మహబూబ్‌నగర్ మనుషులను కూలీలుగా మార్చారు. సింగరేణి బొగ్గును మహా వ్యాపారం చేశారు. అక్కడి ప్రజల నోట్లో ఓపెన్‌కాస్ట్ పేరుతో దుమ్ముకొడుతున్నారు. చరివూతను తిరగరాయడానికి కాలమే తనకు తాను పరీక్ష పెట్టుకుంటుంది. అసహనంతో ఉన్నవారు, శక్తిలేనివారు, వెనుకబడిన బహుజనం తన మూలుగులతో తన చరివూతను తానే రాసుకునే సందర్భం ఇది.ఈ యుగంలో వనరులుం సరిపోదు. దాన్ని క్యాపిటల్‌గా మార్చుకునే పోరాటం కూడా ఎంతో అవసరం. ఆఫ్రికా తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి. మీది మాది ఒకే చరిత్ర. ఇది ప్రపంచంలో ఉండే శ్రమ జీవుల చరిత్ర. ఆఫ్రికా లో ఉన్నది నల్లవాళ్ల చరిత్ర. ఇక్కడ అస్పృశ్యుల చరిత్ర. అణచివేయబడ్డ బహుజనుల చరిత్ర.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర