నిలు పోరాట రూపం


Wed,May 8, 2013 10:04 AM

ప్రతిమనిషికి ఒకేతల్లి. కానీ తీర్చిదిద్దేది ఆ మనిషిని వేయిమంది కాదు. మా బి.ఎన్. తీర్చిదిద్దింది లక్షలాదిమందిని. భీమిడ్డి నర్సింహాడ్డి ఒక భూస్వా మ్య కుటుంబంలో పుట్టినవాడు. ఆ వ్యవస్థ ముఖం మీదతన్ని ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లి వారి కష్టాలలో పాలుపంచుకుని ఆ గుడిసెగూడెల మధ్య తిరిగి వారి కంచంలో గంజిని తాగాడు. తెలంగాణ ప్రజల కష్టాలను, సుఖాలను అనుభవాలను నరనరానికి ఎక్కించుకున్న మనిషి కాబట్టే ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేశారు. ఆయన కష్టాలు చూసి కవిత్వం రాయలేదు. కష్టాలను చూసి తుపాకిని బట్టాడు. ఆ ఎక్కుపెట్టిన తుపాకి ఎవరినో చంపటానికి కాదు. చంపబడుతున్న మనుషులను కాపడటానికే ఆయ న గన్నయి పేలాడు. చంపేవానికి శత్రువుకు ఒకటే గురి. గుండు ఎక్కడి నుంచి వస్తదోతెలియదు.

ఎవరిమీ ద పడుతందో తెలియదు. కానీ మా బిఎన్‌కు వేల కళ్లు ఉన్నాయి. బి.ఎన్.ఎక్కడవున్నా ప్రజలను తన కనుపాప తీరుగా చూసుకునేవాడు. తను బాధప డి, తను మేల్కొని ప్రజలకు అండగా నిలిచాడు. పాలకుర్తిలో విసునూరు రాంచంద్రాడ్డి గుండాలు చుట్టు మూగి ఎవడు వచ్చి ఐలమ్మను ఆదుకుంటారో సవాల్ విసిరితే ఆ ఆజానుబాహుడైన వ్యక్తి అడుగులు వేసుకుంటూ కొదమ సింహాలా వస్తుంటే వెనుజులా వీరుడు చావెజ్‌లాగా, అర్జెంటైనా నుంచి క్యూబా నుంచి కదలివస్తున్న చెగువేరాలాగా తెలంగాణ క్యాస్ట్రోలాగా కనిపించాడు. మొత్తం జనగామ తాలూకాను జల్లెడపట్టాడు. ఎక్కడికి వెళ్లినా నడిచే వేళ్లేవాడు. ఆయన కాళ్లకు ఎక్కడ కాల్వలున్నాయో ఎక్కడ ముళ్లున్నాయో, ఎక్కడ బాట ఉందో, ఎక్కడ కంకరాయి ఉందో బాగా తెలిసిన వ్యక్తి. తన కళ్లను కాళ్లలో పెట్టాడు. కాబట్టే కొనకళ్ల నుంచి సూర్యాపేట, నక్రేకల్ వరకు ఆ ప్రాంత ప్రజలు బాగుపడాలంటే బయ్యారం వాగు కట్టండని నినాదం ఇచ్చాడు. ఆనాటి కార్యకర్తలకు ఇంజనీర్లు కావల్సిన అవసరం లేదు. వారి అనుభవాలే పెద్ద పెద్ద కట్టడాల నిర్మాణాలకు అందుకు సంబంధించిన భావజాలాన్ని అందించాయి. ఎంతో అంకితం భావం ఉంటే గానీ ట్రిగ్గర్‌పై వేలు పెట్టలేరు.

ప్రజల జీవన విధానం బాగుచేయటానికి అంతే నిర్మాణాత్మకమైన ఆలోచన కూడా ఇవ్వగలుగుతాడు. తన ప్రజలపై ఈగవాలితే భరించలేడు. తన కీర్తికన్నా తన ప్రజల యోగక్షేమాలే ప్రధానం. అందుకై దేన్నయినా వదులుకోగలుగుతాడు. కీర్తి కోసమై పాకులాడే కాలంలో వచ్చిన కీర్తిని, వచ్చిన పలుకుబడిని తన ప్రజల కోసమై తీసి విసిరివేయగలుగుతాడు. అది కర్మయోధులే సంభ వం. బి.ఎన్.చనిపోయి ఏళ్లు గడువవచ్చును. ఆయన త్యాగం, జీవన విధానం, అలుపెరగని ఆయన పోరాటం, అచిరకాలం ఈ ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలవటమే కాదు. ప్రతి మనిషి గుండెలో బిఎన్ త్యాగాన్ని విగ్రహం చేసుకుని దాచుకుంటారు.

తెలంగాణ గడ్డమీద ఎందరో యోధులు తమ నెత్తురును ధారపోసి దున్నేవానికే భూమి అన్న నినాదాన్ని ప్రపంచానికి అందించారు. చదువుకోని నిరక్షరాస్యులు జరిపి న మహత్తర పోరాటం వీరతెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ మట్టిలోనే ఒక పోరాట విద్యుత్తు వుంది. అందుకే సమరశీల పోరాటాలకు సమరశంం తెలంగాణ. ఆనాటి వీరతెలంగాణ సాయుధపోరాటయోధుడు భీమిడ్డి నర్సింహాడ్డి భవిష్యత్ పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. రాజ్యం ఎంత బలమైనదైనా ధైర్యంగా ప్రజలను సమీకరించి నిలబడి పోరాడితే విజయం ప్రజా సైన్యానిదేనని చాటిచెప్పాడు.

ఉద్యమంలో అనేక రకాల ఆటుపోటులు వస్తాయి. వాటిని ఎలా అధిగమించాలో బిఎన్ అనుభవాలను చూసి భవిష్యత్ ఉద్యమాలు అడుగులు వేయవచ్చును. నాడు దొర గడీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ సమాజానికి వ్యతిరేకంగా బిఎన్ పోరాడాడు. ఇప్పుడు ఆయన స్ఫూర్తితో ఆధునిక మార్కెట్ సమాజంతో పోరాడాలి. మార్కెట్ సమాజంతో పోరాడాలంటే చాలా క్లిష్టమైనది. నాడు బిఎన్ గుట్టలను, పర్వతాలను అడ్డుపెట్టుకుని ఖాసింరజ్వీ సైన్యంపై తుపాకి ఎక్కుపెట్టాడు. ఆనాడు బిఎన్‌కు శత్రువు స్పష్టంగా కనిపించాడు. ఇప్పుడు మార్కెట్ సమాజంలో శత్రువు ఏరూపంలో వున్నారో, ఏ రకంగా ప్రజా జీవితాన్ని ధ్వంసం చేస్తుందో గమనించటమే చాలా కష్టమైనది. అలాగే మనిషి నరనరాల్లోకి మార్కెట్ రక్తం ఎక్కిన తర్వాత మార్కెట్ నుంచి మనిషిని వేరుచేసి ప్రజాపోరాటాలు నిర్మించటమే బిఎన్‌కు నిజమైన నివాళి అవుతుంది.

కళ్లెదుట ప్రజల బాధలను చూశాక వారి కోసం వారి ప్కే నిలబడాలి. అదే బిఎన్ నేర్పిన పాఠం. నేడు అదే తెలంగాణ నేల అనేక సమస్యలతో తల్లడిల్లుతోంది. మళ్లీ ఈ ఆధునిక కాలంలో తెలంగాణ సమస్యలను పరిష్కరించటానికి బిఎన్ లాగా ఈనాటి యువత ధైర్యాన్ని ధరించి నిలబడగలగాలి. తెలంగాణ చరివూతలో భీమిడ్డి ఒక ధైర్య దీప స్తంభం. ప్రజా ఉద్యమాలకు ఆయన నమూనాలందించాడు. ఆయనను మననం చేసుకోవటం అంటే భవిష్యత్ ఉద్యమాలకు తెరతీయటమే. తెలంగాణ విముక్తి కోసం జరిగే పోరాటాలలో ఆయన ఊరేగింపులుగా, ప్రజా ఉద్యమాలుగా, కదం తొక్కుతున్న యువతగా, విముక్తి కేకగా వినిపిస్తుంటాడు. నిలు పోరాటంగా కనిపిస్తుంటాడు. నీకు మరొకసారి జోహార్లు.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర