స్థానిక వనరులపై స్థానికత ముద్రలు


Tue,April 23, 2013 12:01 AM


స్థానిక వనరులపై స్థానికులే హక్కుండాలి. బొగ్గు, ఇను ము జాతీయ సంపదలైనప్పటికీ ఆ సంపదను తరతరాలుగా కాపాడుతున్న ఆ మట్టిమీద మనుషులకు కూడా అందులో ఏదో ఒక రూపంలో భాగస్వామ్యం ఉండాలి. ఆ సహజ సంపదల గుట్టలను తమ గుండెల్లో పెట్టి కాపాడిన సంతతికి దానిపై కనీస హక్కు లేకపోవటం విచారకరమే. సాంకేతికంగా బొగ్గు, ఇనుము జాతీయ సందదలైన వారికి అక్కడే అందుకు సంబంధించిన పరివూశమలను నెలకొల్పితే ఆ ప్రాంతాలు అభివృద్ధితో దేదీప్యమానంగా వెలుగొందుతాయి. అలాగే ఇప్పటి వరకు ఏ చేతుతో ఆ సంపదలను కాపాడారో ఆ చేతులే ఉత్పత్తి శక్తులుగా మారతాయి. ఏ సమాజమైనా కోరుకోవలసింది డా అదే. ఒకనాడు ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్నది తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంగా ఈ నేలపై మార్మోగింది. సరిగ్గా ఐదారు దశాబ్దాల తర్వాత ‘బయ్యా రం ఉక్కు తెలంగాణ హక్కు’ అన్నది తెలంగాణ ఆత్మగౌరవ నినాదంగా దూసుకొస్తుంది. బయ్యారంలో ఉక్కుకర్మాగారాన్ని నెలకొల్పమనటం న్యాయబద్ధమైనదా? కాదా? అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నను చుట్టుకునే అస్తిత్వ ఉద్యమం ఎగుస్తుంది. బలవంతంగా ఈ ప్రాంతం నుంచి ఆ సంపదను తరలించుకుపోతే ఊరుకోమని తెలంగాణ ఉద్యమం కోటి గొంతులతో నినదిస్తుంది. ఇది ఈ ప్రాంత ప్రజ ల ఆత్మగౌరవమే కాకుండా ఈ నేల ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశం. ఇప్పుడు దీన్ని రాజకీయం చేస్తున్నదెవరు? బయ్యారం ఉక్కు నినాదాన్ని ఎన్నికల కోసం మలుస్తున్నదెవరు? బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న నినాదాన్ని విచ్ఛిన్నకర నినాదమని ప్రచారం చేస్తున్నదెవరు? బయ్యారంలో పరివూశమ నెలకొల్పమంటే అది జాతీయ సంపదని ముఖ్యమంత్రి మాట్లాడటం ఎంత వరకు సబబు? ఒకనాడు వీర తెలంగాణ సాయుధ పోరాటానికి బయ్యారం అడవులు ఆశ్రయాన్నిచ్చాయి. అదే అడవులు యిపడు జాతిసంపదగా మారి రాష్ట్ర సుభిక్షానికి దోహదం చేస్తున్నాయి.ఆ నేలలోని సంపదను యిప్పటి వరకు కాపాడిన చేతులు ఈ సంపదపై తమకు హక్కు కావాలని స్వేచ్ఛా గొంతుతో నినదిస్తున్నాయి. యిపడు బయ్యారం అడవి మైదాన ఉద్యమంగా మారింది. యిపడు బయ్యారం ప్రాంతం అసెంబ్లీ పోడియం దగ్గర నినాదమై మార్మోగుతుంది. ఇప్పు డు బయ్యారం ఉక్కు రాష్ట్ర రాజకీయ ఎజెండాపై కీలకంగా నిలిచింది. బయ్యారం ఉక్కును సాధించుకోవటానికి తెలంగాణకు మిగిలింది పోరాటమొక్కటే.

బయ్యారం ఖనిజాలపై మరొక్కసారి దుమారం రేగుతున్నది. దీన్నొక రాజకీయ సమస్యగాచేసి ఒకరి జాతీయతను ఇంకొకరు స్థానికత అంటూ ప్రశ్నించుకునే స్థాయికి తీసుకువచ్చారు. కిరణ్‌కుమార్‌డ్డి టిఆర్‌ఎస్ దేశభక్తిని ప్రశ్నిస్తున్నాడు. విశాఖకు బయ్యారం ఖనిజాలను కేటాయిస్తే తప్పేమిటని, ఈ రెండు ప్రదేశాలు ఒకే తెలుగునేలపై ఉన్నాయి కదా, ఒక ప్రాంతం ఖనిజాలను అదే రాష్ట్రంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి పంపించటం సమంజమని, ఇది జాతీయ సంపదయని సమర్థించుకుంటున్నా రు. ఆ సమర్థతను బలపరుస్తూ కొన్ని రాజకీయ పార్టీలు కూడా సున్న పు, బొగ్గు, మిగతా ముడిపదార్థాలను సమూర్చుకుంటే కదా ఉక్కు ఫ్యాక్టరీ సమర్థవంతంగా ఉత్పత్తి చేయగలుగుతుందనే వాదన కూడా ముందుకు తీసుకవస్తున్నారు. ఇలా వాదనలను ముందుకు తెచ్చి తాము చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. అదే నిజమైతే భిలాయి ఉక్కు ఫ్యాక్టరీకి ఈ సహజ సంపదను తరలించవచ్చుకదా! ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదం ఎందుకు తీసుకువచ్చారు? దేశంలో ప్రతి ప్రగతిని రాజకీయ కోణంలో చూడటం ఒక పరిపాటి అయ్యింది. దాని తో రాజకీయరంగు పూసి విద్వేషాలను రెచ్చగొడితేనే ఎన్నికల ఓట్ల డబ్బా లు నిండుతాయని చూస్తున్నారు. అదే నిజమైతే ఇది బయ్యారం ఉక్కు ఫాక్టరీ నిర్మాణం ఒక రాజకీయ సమస్య కాదు. ఇదొక ఆర్థిక సమస్య. ఇతర దేశాల్లోనూ ఖనిజాల సంపద దేశంలో ఒక ప్రదేశంలోనే ఉండదు. వివిధ ప్రాంతాల్లో ఉంటుంది. ఉక్కు ఫాక్టరీలను మాత్రం వికేంవూదీకరణ చేస్తారు. దానివల్ల అన్ని ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగటమే కాకుండా ప్రజ ల అభివృద్ధిని తమ ప్రాంతాలలో చూసుకోగలుగుతారు. దానితో పారివూశామికీకరణ ప్రజాస్వామికీకరణ అవుతుంది.
బయ్యారంలో ఖనిజసంపద ఈ రోజు ఏర్పడింది కాదు. సాయుధ పోరాట కాలంలో అనేక రాత్రులు, పగళ్లు ఆ బయ్యారం అడవిలోని గుట్టలపైననే గడిపాం. ఆ బయ్యారం గుట్టల దగ్గర నుంచి తెచ్చుకున్నరాళ్లు ఇప్పటికీ మా ఇళ్లల్లో ఉన్నాయి. బయ్యారం గుట్టను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి దానం చేసింది? ఆ రాళ్లను ఈ ప్రాంతం నుంచి తొలుచుకుపోతుంటే ప్రజలు ఆ లారీలకు అడ్డుపడటం లేదా? చైతన్యంతో తిరగబడుతున్న ఆ ప్రజలపై లాఠీల వర్షం కురిపంచలేదా? ఈ ప్రజల సొమ్మును ప్రైవేట్‌పరం చేయటం అది రాజకీయ పాపమని తెలియదా? బయ్యారం ఖనిజాలపై ప్రజా పోరాటాలు వచ్చాయి. తమ కు అవసరమైతే అది ప్రైవేట్ సొమ్ము, తమకు దక్కకపోతే పబ్లిక్ సొమ్ము. అనటం ఆనవాయితీ అయ్యింది. దీన్నే రాజకీయమంటారు.

మానుకోటలో జరిగినటువంటి సంఘటన ఒక వ్యక్తిపై దాడికాదు, దాని వెనుక ఆర్థిక పోరాటం ఉంది. దీన్నెందుకు దాచిపెట్టారు. ప్రజలకు ఏ వ్యక్తులపై ఏ రకమైన ద్వేషం ఉండదు. తమ సంపద తమే కావాలని కోరటం తప్పేమీ కాదు. ఇతరుల సంపదను అక్కడి ప్రజలకు కాకుండా చేయటాన్ని అప్రజాస్వామికమంటారు. చైనాలో చిన్న చిన్న స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టారు. 20వ శతాబ్దం మాదిరిగా నేడు చిన్నతరహా స్టీల్ ఫ్యాక్టరీలతో టెక్నాలజీని రూపొందిస్తున్నారు. దానికి కారణం ప్రజల సంపదను వికేంవూదీకరించాలి. జ్ఞానం వికేంవూదీకరణ జరిగితే సంపద అవుతుంది. అలాగే ఆర్థిక వ్యవస్థ వికేంవూదీకరించబడుతుంది. అందుకే బాసరలో ఐఐటి పెట్టమని కోరాం. ఎక్కడ ప్రకృతి వనరులుంటాయో ఆ ప్రదేశాలలో సాంకేతిక విద్యాలయాలు ఏర్పరచితే దాని నుంచి వచ్చిన విద్యార్థులు ఆ వనరులను ఆ ప్రజలకు దత్తత చేస్తారు. స్టాన్‌ఫర్డ్ నెలకొల్పటం వల్ల అమెరికా పడమటితీరం ఎంత ఆర్థిక ప్రగతికి కారణభూతమైందో చూడండి. లాటిన్ అమెరికన్ దేశాలు చిన్న చిన్నవి. ఎక్కడ సాంకేతిక విద్యాలయాలు పెడితే ఆ వనరులు ప్రజలకు ఉపయోగపడతాయో చూసుకున్నారు. బ్రెజిల్‌లో షుగర్ ఉత్పత్తి అయితే 150 కిలోమీటర్లలో వున్న అమెరికా దాన్ని దోచుకుంటుంటే వచ్చిన ప్రభుత్వాలు రష్యాకు చక్కర పంపి పెట్రోల్ దిగుమతి చేసుకున్నారు. క్యూబా ప్రపంచానికి డాక్టర్లనిచ్చి తన మానవత్వాన్ని చాటుకుంది కానీ ఆటంబాంబులను అందించి కాదు. పెద్ద దేశాలు ప్రపంచాన్ని పరిపాలిస్తే 20వ శతాబ్దం చివరికి వచ్చేసరికి చిన్న దేశాలు తమకున్న వనరులతో చిన్నదేశాలను సస్యశ్యామలం చేసుకున్నారు. జ్ఞానం వికేంవూదీకరించబడితే ఆర్థిక వ్యవస్థ వికేంవూదీకరించబడుతుంది. అన్ని విశ్వవిద్యాలయాల ను, రీసెర్చ్ కేంద్రాలను హైద్రాబాద్‌లో పెట్టుకు ని వికేంవూదీకరణ జరగాలంటే జరగదు. అన్ని ప్రాంతాలలో సాంకేతిక విద్యాలయా లు పెడితే చిన్నతరహా స్టీలు ఫ్యాక్టరీలు ూడా వచ్చే వి. కానీ అంత దూరదృష్టి ఉన్న రాజకీయ నాయకత్వం లేకపోవటం దురదృష్టకరం. రాజకీయ సుస్థిరత కావాలంటే ఆర్థిక వ్యవస్థ వికేంవూదీకరించబడాలి. చేసిన తపలను సమర్థించుకొనటానికై ఇతరులను జాతీయవాదులుకాదని, దేశభక్తులు కాదని వెక్కిరించటం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటంతో ప్రపంచానికే దున్నేవానిదే భూమి అన్న నినాదాన్ని అందించారు. దేశం కోసం త్యాగం చేయటం ఈ తెలంగాణ మట్టిలోనే ఉన్న ది. ఈనేల మీద ప్రజలకు ఎవ్వరూ దేశభక్తి పాఠాలు నేర్పవలసిన అవసరంలేదు. స్వాతంవూత్యమంటే కొందరు పెట్టుబడిదారులను పీఠాలపై కూర్చోపెట్టటం కాదు. భూస్వాములను నిలబెట్టటం కాదు. ఆర్థిక దోపిడీని తొలగించటం. ఆర్థిక దోపిడీని నివారించటం రాజకీయ స్వేచ్ఛకు పునాది అవుతుంది. సమనత్వానికి పునాది అవుతుంది. భూస్వామ్య వ్యవస్థను తమ రాజకీయ చతురతతో పునః ప్రతిష్ఠ చేసే పెట్టుబడిదారీ వ్యవస్థకు కోటలు కట్టటం, ఇదే నా దేశభక్తి? ఏ ప్రాంతపు సొమ్ము ఆ ప్రాంత ప్రజల పరంకావాలని పోరాటం చేస్తే వారిని విద్రోహులుగా చిత్రించటం, ప్రశ్నించిన వారిని ఖతం చేయటం, కాల్చివేయటం ఎంత వరకు సమంజసం? ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో ఉన్న గిరిజనులు దేశవూదోహులు, టెర్రరిస్టులు కాదు. వారు తరతరాల జాతి సంపదను కాపాడిన దేశభక్తులు. ఎవరు దేశభక్తులో చరిత్రే నిర్ణయిస్తుంది.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

Published: Wed,January 1, 2014 12:52 AM

అన్నివర్గాలు శిరసెత్తుకోవాలంటే...

ఇతర దేశాల పాలకులకు, మన పాలకులకు ఉన్న తేడా ఏమిటి? మన వాళ్లు ఎన్నికలకు ముందే సంక్షేమ కార్యవూకమాల ప్రకటనలు చేస్తారు. పాలకులు సంక్షేమ

Published: Thu,October 17, 2013 12:29 AM

ఇది శ్రమజీవుల సంస్కృతి

దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది బం డారు దత్తావూతేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’కి వెళ్లాను. ఈ అలయ్ బలయ్ అన్న పదం నేటి కొత్త తరానికి చాల

Published: Fri,September 27, 2013 12:27 AM

మనకు తెలియని మన సంస్కృతి

కొత్తగూడెం వెళ్లినప్పుడు సింగరేణి కార్మికుడు నన్ను బొగ్గుబావిలోకి తీసికెళ్లాడు.అప్పుడు నాకు ఆ బొగ్గుగని కార్మికుల జీవితం అర్థమైంది

Published: Thu,September 12, 2013 01:03 AM

కాళోజీ స్ఫూర్తిని పంచుదాం

వరంగల్‌లో 9వ తేదీన 5 గంటలకు కాళోజీ శతజయంతి సభ ప్రారంభమైంది. ఉపన్యాసకుల మాటలు, సభికుల చప్పట్లతో రెండు గంటలు కాళోజీకి నివాళులు అర్పి

Published: Wed,September 4, 2013 11:01 PM

యూటీ వాదన వెనుక..

హైద్రాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయాలని అడగటానికి కారణం ఏమిటి? విద్యా, వైద్య అవకాశాలు హైద్రాబాద్‌లోనే ఉన్నాయని, అవి అందరికీ అందుబా

Published: Mon,August 26, 2013 12:02 AM

ఆలోచనల కూడలి

జనంలో ఉంటేనే, వాకింగ్ చేస్తేనే ఆలోచనలు పుడతాయి. వాకింగ్ చేయని రోజు ఏదో కోల్పోయినట్లుంటుంది.అమెరికా,చైనా, సింగపూర్, నార్వే ఎక్కడకు

Published: Sat,August 17, 2013 02:05 AM

అభివృద్ధికి ముగ్గులు పోద్దాంరండి

సాయుధ పోరాట కాలంలో భూస్వాములు తెలంగాణలో ఉండే ప్రజలను రకరకాలుగా హింసించారు. అందుకే భూములు దున్నిన వారు ఇక్కడ భూమికి యజమాని కాలేకపోయ

Published: Fri,August 2, 2013 01:11 AM

అక్షరాల పొదుగు

చరివూతకు మొదటి ముసాయిదా పత్రికలే. ‘జర్నలిజం యీ జ్ ఫస్ట్ డ్రాప్ట్ ఆఫ్ ది హిస్టరీ’ అన్నారు. పత్రికలకున్న గొప్పతనమది. పత్రికలు కేవల

Published: Fri,June 7, 2013 11:58 PM

పెరిగిన పని గంటలు

కాలిఫోర్నియాలో సిలికానాంవూధవాసులు నన్ను ఒక సమావేశానికి పిలిచారు. ఆ సభకు నేను, మంత్రులు పితాని సత్యనారాయ ణ, పొన్నాల లక్షయ్య హాజరయ

Published: Fri,May 31, 2013 09:57 PM

గ్లోబల్ కల్చర్ అంటే?

ఒక సమాజంలో వున్నప్పుడు ఆ సమాజం గొప్పతనం కనిపించదు. ఆ సమాజం నుంచి బైటకు వచ్చి ఇతర సమాజాలను చూసినప్పుడు మన సమాజం విశిష్టత తెలిసి వ

Published: Thu,May 9, 2013 11:59 PM

పీవీ విగ్రహం మాటేమిటి?

పీవీ నరసింహారావు చరివూతలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిన విశిష్ట వ్యక్తి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజావూపతినిధి

Published: Wed,May 8, 2013 10:04 AM

నిలు పోరాట రూపం

ప్రతిమనిషికి ఒకేతల్లి. కానీ తీర్చిదిద్దేది ఆ మనిషిని వేయిమంది కాదు. మా బి.ఎన్. తీర్చిదిద్దింది లక్షలాదిమందిని. భీమిడ్డి నర్సింహాడ్

Published: Thu,April 18, 2013 12:17 AM

‘ఆర్థిక’తోపాటు ‘సాంస్కృతిక’ పోరు

ఒక వయసులో పిల్లలు తల్లిదంవూడులు చెప్పినట్లుగా చదువు కోసం చదువుతారు. ఒక వయసులో ఉద్యోగం కోసం చదువుతారు. కొందరు సమకాలీన సమా జం కోసం చ

Published: Sat,April 13, 2013 01:47 AM

తెగని జ్ఞాపకాల సంకెళ్లు

కాలచక్రం చాలా వేగంగా తిరుగుతున్నది. నా శరీరంలో సగం, నా జీవిత భాగస్వామి లక్ష్మీభాయి చనిపోయి ఇప్పటికి రెండేళ్లు గడిచిపోయింది. మూడవ

Published: Thu,March 14, 2013 01:33 AM

ఇదీ భావి తెలంగాణ!

ప్రతి సంవత్సరం స్కూల్స్ వార్షికోత్సవాలు చేసుకుంటాయి. అది మార్కెట్ కోసమా? వినోదం కోసమా? లేక విద్యా ప్రమాణాలు పెంచటానికా? పిల్లల్లో

Published: Wed,December 12, 2012 10:37 PM

ఏదీ నా తెలంగాణ చరిత్ర

నా దేశంలో సివిరామన్, బోస్, రామానుజమ్ లాంటి పరిశోధకులు జనించినా ఎందుకు ఇక్కడ పరిశోధన ఇంత అందఃపాతాళంలోకి వెళ్లిందనే ఆలోచన ఉండ టం తప్

Published: Thu,November 15, 2012 12:19 AM

అనితర సాధ్యం కాళోజీ మార్గం

‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించ

Published: Sun,October 21, 2012 03:10 AM

విలువల సంపద విఠల్‌డ్డి

తరాలు గడిచిపోతున్నాయి. తరాలతోపాటుగా విలువలు కూడా కనుమరుగవుతున్నాయి. గత తరం అందించిన త్యాగాలు, విలువలతో కొత్త తరాలు వికసిస్తాయి. గత

Published: Wed,October 10, 2012 05:26 PM

ఉద్యమం: ముందడుగు, వెనుకడుగు

ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే కొం దరు విద్యార్థులు నన్ను కలిసి ‘తెలంగాణ ఇంకెప్పుడొస్తుంది సార్. మంది బలిదానా

Published: Sat,October 6, 2012 02:48 PM

చరిత్రగతి మార్చిన అధ్యాపకులు

మనదేశం భినత్వంలో ఏకత్వానికి ఎంత ప్రతీకనో, వైవిధ్యాలకు కూడ అంతే ప్రతీక. ఒక్కొక్క ప్రదేశం ప్రజల త్యాగాలతో పునీతమైన ప్రాంతాలుగా వాసిక

Published: Sat,October 6, 2012 02:49 PM

నడక నాకు పాఠం

ఏవూరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాకింగ్ చేయటం దినచర్యలో భాగం. ఏది మరిచినా వాకింగ్‌ను విడవను. ఇది శరీరం ఆరోగ్యం కోసమే కాదు. నా ఆలోచనల

Published: Sat,October 6, 2012 02:50 PM

సామాజిక దృక్పథం లోపిస్తే ప్రమాదమే?

అందరూ ఆలోచిస్తారు. కొందరు ఏ విషయమైనా ఆలోచిస్తారు. కొందరికి ఆలోచన రాకపోతే ఇతరులు చేసిన సలహాలను, పనులను స్వీకరిస్తారు. కొద్దిమంది మ

Published: Sat,October 6, 2012 02:50 PM

ఎంసెట్ లక్ష్యం ఏమిటీ?

ఇంటర్మీడియట్ ఇంఫ్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ గురించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘ఇంప్రూవ్‌మెంట్’ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి

Published: Sat,October 6, 2012 02:51 PM

ఉపాధ్యాయ ఉద్యమ దివిటీ

కొన్ని సంఘాలు, సంస్థలు కాల ప్రవాహంలో ఏటవాలుగా ప్రవహిస్తున్న నీళ్లలాగా వచ్చేవి కావు. ఏదో అవసరం కోసం ఏర్పడి ఆ పనుల అవసరం తీరాక అంతార

Published: Sat,October 6, 2012 02:51 PM

ఏదీ ఆ దేవరుప్పల చైతన్యం..?

ఈ మధ్య వారం రోజులు వాకింగ్‌కు పోలేదు. ఉస్మానియా క్యాంపస్‌లో వాకింగ్‌లో రోజు కలిసే మిత్రులు పలకరించారు. వారం రోజులుగా మీరు కన్పించక

Published: Sat,October 6, 2012 02:52 PM

ఆదివాసీల సందుక మేడారం మ్యూజియం

మేడారంలో జరుగుతున్నది ఒక జాతర కాదు. ఒక వినోద కార్యక్షికమం అంతకన్నా కాదు. సాహసానికి ప్రతీకగా నిలిచిన నేల అది. ఆధిపత్యంపై ఆదివాసీల

Published: Sat,October 6, 2012 02:52 PM

ముమ్మాటికీ సామాజిక ఉద్యమమే

ఉద్యమం పదునెక్కుతున్నప్పుడల్లా ఆ నేల దద్దరిల్లుతుంది. చివరకు ఆ వృక్షం వేర్లు కూడా బయటకొస్తాయి. అదే తెలంగాణలో జరుగుతున్నది. ఇది ఒ

Published: Sat,October 6, 2012 02:53 PM

మార్కెట్ వ్యవస్థ తెచ్చిన మార్పు

వరంగల్ రోడ్లపైన మట్టిలో నా కాళ్లు పునీతమయ్యాయి. చదువుకునే రోజుల్లో 65 ఏళ్ల క్రితం వరంగల్ నుంచి హన్మకొండ వరకు నడిచి పోయేవాణ్ణి. ఈన

Published: Sat,October 6, 2012 03:08 PM

పల్లెను పార్లమెంటును కలిపిన రైలు

నేను మా మిత్రుడు జూలూరి గౌరీశంకర్ ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి హన్మకొండ దాకా వెళ్ళాం. దారిపొడుగుతా జనం ఉన్నార

Published: Sat,October 6, 2012 03:08 PM

ప్రజాస్వామ్యమే పరిశోధన

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పు

Published: Sat,October 6, 2012 03:07 PM

ఐక్యదేమన ఆయుధం

మా తెలంగాణ సాయుధ పోరాటానికి నేడు నడుస్తున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారూప్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆ పోరాట కాలంలో మా ఊరి దొర ద

Published: Sat,October 6, 2012 03:07 PM

బోరుమంటున్న భాగ్యనగరం

బెంగుళూరుకు వెళ్తుంటే నా పక్క సీట్లో ఉన్న ఒక ప్రయాణికునితో సంభాషణ మొదలైంది. తాను బెంగుళూరులో ఉంటానని, కానీ ‘మాది పాత హైదరాబాద్ రాష

Published: Sat,October 6, 2012 03:07 PM

ప్రశ్నలకు బహుమానం చిత్రహింసలా?

ఈనాటి చదువు స్వరూప స్వభావమే రాబోయే 30 ఏళ్ల కాలాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణలో చాలా కాలం వరకు పాఠశాలలు లేవు. స్కూళ్లు

Published: Sat,October 6, 2012 03:06 PM

మీది మాది ఒకటే చరిత్ర

నేను చదువుకునే కాలంలో ఆఫ్రికా చీకటి ఖండమని పాఠం చెప్పేవారు. నాకర్థంకాక అక్కడ సూర్యుడు ఉదయించడేమో, కాంతి అక్కడ ఉండదేమో అనుకునేవాణ్ణ

Published: Sat,October 6, 2012 03:06 PM

ఉద్యమానికి ప్రేరకుడు ఉపాధ్యాయుడే

1956-60 మధ్య జరిగిన పరిణామాలే ఉపాధ్యాయుల అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ అసంతృప్తి అగ్గే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పాదులు వేస

Published: Sat,October 6, 2012 02:58 PM

స్పూర్తి శిఖరం

-డాక్టర్ చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ (ఇవ్వాళ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి) తెలంగాణ ఉద్యమ చరివూతలో డిసెంబర్9 ఒక చారివూతక దినం. దశా

Published: Sat,October 6, 2012 02:57 PM

మాట మారిస్తే దోషిగా నిలబెడతరు

ప్రణబ్ ముఖర్జీ తనను కలిసిన సీమాంధ్ర బృందాన్ని సంతృప్తి పరచ డానికి అలాంటి వ్యాఖ్యలు చేశారా?లేక ప్రస్తుత కాంగ్రెస్ స్వరం ప్రకారమే ఆయ

Published: Sat,October 6, 2012 02:57 PM

ఉద్యమ తీవ్రత కోసమే రాజీనామాలు

తెలంగాణ ఉద్యమం ఎన్నో మలుపులు తీసుకుంటున్నది. జయశంకర్ మరణం స్ఫూర్తితో ఈ ఉద్యమానికి కొత్త దారి దొరికింది. ప్రజలు ఉవ్వెత్తున అలల్లాగా

Published: Sat,October 6, 2012 02:53 PM

ఆ మెట్లు ఆలోచనల ఆకురాళ్లు

ఆర్ట్స్ కళాశాల మెట్లకు గొప్ప చరిత్ర ఉంది. ఆ మెట్లపై నడుచుకుంటూ ప్రగతిశీల భావాలతో పిడికిళ్లు బిగించిన విద్యార్థులు ఏ రంగంలోనైనా