‘ఆర్థిక’తోపాటు ‘సాంస్కృతిక’ పోరు


Thu,April 18, 2013 12:17 AM

ఒక వయసులో పిల్లలు తల్లిదంవూడులు చెప్పినట్లుగా చదువు కోసం చదువుతారు. ఒక వయసులో ఉద్యోగం కోసం చదువుతారు. కొందరు సమకాలీన సమా జం కోసం చదువుతారు. కొద్దిమంది మాత్రం వచ్చే తరం కోసం చదువుతారు. అలాంటి వాళ్లనే యోగులంటాం. ఆ కోవకు చెందిన యోగుల్లో ఒకరు జయధీర్ తిరుమలరావు. అతను నిరంతర అధ్యయనశీలి. అతనికి వయసుతో సంబంధంలేదు. నేటి ప్రజా సాహిత్యాన్ని తన పరిశోధనలతో పరిపుష్ఠంచేసి గొప్ప పరిశోధకుడుగా పేరు తెచ్చుకున్నాడు. పదవి విరమణ చేసిన తర్వాత అతనికి ఈ సమాజమే ఒక పరిశోధనా కేంద్రమైంది. అందుకే ఆదిలాబాద్ వెళ్తాడు. కరీంనగర్‌లో కోటిలింగాలను చూసి పరితపిస్తాడు. నిన్నమొన్ననే రామప్పకు వెళ్ళాడు.శిధిలమవుతున్న కళాఖండాలను చూసి ఏదో చెయ్యాలని ఆరాటపడ్డాడు. ఈ రకంగా చూస్తే ఆయన ఒక ‘సంచార పరిశోధనా కేంద్రం’. అలాంటి విశిష్ట వ్యక్తులతో మానవత్వం ఉన్న మనుషుపూవరు అనుబంధాన్ని వదులుకోరు. ఆ సంబంధమే నన్ను మిత్రులతో కలిసి రెండు వందల కిలోమీటర్ల దూరం గల రామప్పకు వెళ్ళేలా చేసింది. గతంలో రామప్పకు చాలాసార్లు వెళ్ళాను. ఇప్పు డు జయధీర్‌తో వెళ్ళాను. కాని ఈసారి పర్యటన నాకు కొత్త పాఠాన్ని నేర్పింది. కొత్త అనుభవాన్ని అందించింది.

రామప్పను చూస్తుంటే భారతీయ జీవన విధానం మూలాలు కనబడతాయి. ఇక్కడి ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిలో కొంతభాగాన్ని తమ భవిష్యత్తు కోసమో లేక తమ సమాజ భవిష్యత్తు కోసమో భద్రపరుస్తారు. ఈ అలవాటును నేను అమెరికాలో చూడలేదు. పెట్టుబడిదారి సమాజంలో వ్యవస్థే ప్రతివాణ్ణి రుణక్షిగస్థున్ని చేస్తుంది. మనం డబ్బు దాచుకొని ఇల్లు కడతాం. అక్కడ ఇల్లు కట్టడానికి అప్పులిస్తారు. అప్పు తీర్చడానికి జీవితాంతం బానిసలుగా జీవించాలి. ఇది ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం. తెలంగాణలో ఆనాడు భూస్వాములు గ్రామాల్లో ఏ రైతులు పంటలు బాగా పండించేవారో..వారికే అప్పులిచ్చేవారు.

దాదాపు అదే పద్ధతి క్రెడిట్ కార్డు పేరుతో అమెరికాలో సాగుతున్నది. కాబట్టి అమెరికాకు తన సంస్కృతి సాలెగూడులా వ్యాపింపజేసే లక్షణం ఉంది. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకృత విధానాలు, పాలకవర్గాల పక్షపాత వైఖరుల మూలంగా ఈనాడు రాష్ట్రంలో, దేశంలో ఏదయితే ‘అభివృద్ధి’ పేరుతో కార్యవూకమాలను నిర్వహిస్తున్నారో అవి ఇక్కడి ప్రజల చరివూతను, నాగరికతను, సంస్కృతి ని ధ్వంసం చేస్తున్నాయి. ఆ విధ్వంసంలో భాగమే తెలంగాణలోని అడవులు, చెరువులు, గుట్టలు.చివరకు మన జాతి సంస్కృతి ఆనవాళ్ళయిన శిల్ప సంపదకు ముప్పు ఏర్పడ్డది. అందులో భాగమే రామప్పకు ఏర్పడిన ముప్పు. గుత్తేదార్ల ప్రయోజనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలున్నా వాటిని ‘వ్యసాయాభివృద్ధికి’ తరలించాలని అక్కడ బ్లాస్టింగ్ నిర్వహించడంతో రామప్ప, పాలంపేట తదితర పరిసరాల గ్రామా ల్లో ఇండ్లు బీటలు వారాయి. అదే సందర్భంలో రామప్ప దేవాలయ ఉనికికే ముప్పు ఏర్పడింది. ఈ దశలో స్థానికులు, ప్రజా సంఘాలు, మేధావులు, స్పందిస్తే ప్రస్తుతానికి సొరంగం పనులను విరమించుకున్నారు.

‘ఓపెన్ కాస్ట్’ పేరుతో మరో రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తుందంటున్నారు. అక్కడి స్థానికులు వరంగల్ జిల్లాలో ఎన్నో చారివూతాత్మక పోరాటాల్ని చేశారు. ఇక్కడ నుంచే భూ పోరాటాలు వచ్చాయి. యూనివర్సిటీ స్థాపనల కోసం పోరాటాలు జరిగాయి. చివరకు ఇక్కడ సంస్కృతి కాపాడుకోవడం కోసం కూడా పోరాటాలు చేయాల్సి వచ్చింది. అదే రామప్ప చరిత్ర కట్టడం, పరిరక్షణ ఉద్యమం, ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలు చేసిన తెలంగాణ ఇవాళ తన చారివూతక, సాంస్కృతిక సంపత్తిని కాపాడుకోవడం కోసం కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. కాబట్టే ఇది ‘కల్చరల్ ఫైట్’ అని గుర్తుంచుకోవాలి.

పెట్టుబడిదారి సమాజం తనకు అవసరమైన రీతిలో తన చరివూతను, నాగరికతను, సంస్కృతిని రూపొందించుకుంటుంది. దర్శనశాలలు, గ్రంథాలయాలు అన్నవి ఈ సమాజానికి మూలస్తంభాలు. కాని భారతదేశంలో ఒక శిల్పికో, కళాకారునికో మా త్రం వాటిని చెక్కడం, గీయడం అన్నవి వారి దినచర్య. రైతు ఏవిధంగానైతే తను పండించిన ధాన్యంలో, మంచి ధాన్యాన్ని భవిష్యత్తు విత్తనంగా ఎలా భద్రపరుస్తాడో, అలాగే ఒక శిల్పి తన సృష్టించిన కళాఖండాలలో అద్భుతమైన దానిని భగవంతుని పేర భవిష్యత్తు తరాలకు అందిస్తాడు. ఇది అనాదిగా ఇక్కడొస్తున్న సంప్రదాయం. కాబట్టి మన దగ్గర ఎంతో అద్భుతమైన శిల్ప సంపద ఉంది. ఆ సంపదలోనే అతని అధ్యయనం,అవగాహన, పరిశీలన, దృక్ఫథం గోచరిస్తాయి.

కళ ద్వారా నాటి సమాజాన్ని ప్రతిబింబింప జేయడమేగాదు. ఆ వారసత్వాన్ని భవిష్యత్తరాలు కాపాడాలని కాంక్షిస్తాడు. కాకతీయులు అనగానే సంప్రదాయ మతాభిమానులు అనుకుంటారు. కాని రామప్ప దేవాలయంపై చెక్కిన శిల్పాలను చూస్తుంటే స్థానిక గిరిజన సంస్కృతి ని వాళ్లు అందులో అడుగడుగునా ప్రతిబింపచేశారు. రాజులైనా ప్రజా సంస్కృతిని వారెలా కాపాడారో, గౌరవించారో ప్రస్తుత పాలకులు వారిని చూసి నేర్చుకోవాలి. మన ముత్తాతలు ఉన్నది గుడిసె కావచ్చును, పెంకుటిల్లు కావచ్చును. దానిని మనం కాపాడుకోవాలని ఉంటుంది.ఎందుకు? అనుభవించడానికి కాదు.మన తాత ముత్తాతలకు మనపై గల ప్రేమకు అదొక ఆనవాలుగా నిలుస్తుంది. అలాగే మన చరిత్ర సంస్కృతులకు చిహ్నాలైన కళాఖండాలను కాపాడుకోవడం మన కనీస బాధ్యతగా గుర్తించాలి. రామప్ప దేవాలయాన్ని చూస్తుంటే అందులోని కళాఖండాలలో మతసామరస్యం ఉట్టిపడుతుంది. గిరిజనులు ఆటపాట అందులో ఉన్నాయి. అన్నింటికి మించి అద్భుతమైన ఇంజనీరింగ్ సాంకేతికత కనబడతుంది.

ఇవన్నీ ఆనాటి తరాని కి మనపై ఉన్న ప్రేమాభిమానాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. దీనినే మనం శ్రామిక సంస్కృతి అంటాం. శ్రామిక సంస్కృతి మహోన్నతమైనది ఉత్పత్తిదారుడు సృష్టించిన దాన్నే పెట్టుబడి సంస్కృతి దాన్ని మార్కెట్‌గా మార్చేస్తుంది. అలా శ్రామిక సంస్కృతి మనకు విడిచిపెట్టిన విలువైన సంపదే రామప్ప కళాఖండాలు.

వాటిని పరిరక్షించాలని చూస్తున్న జయధీర్ తిరుమలరావు గొప్ప పరిశోధకుడు మాత్రమే కాదు. దూరదృష్టి గల, నిబద్ధత, నిమగ్నత గల అధ్యయనశీలి. మనలో అణిగి మణిగి ఉన్న సామాజిక చైతన్యాన్ని మరొక్కసారి రగుల్కొలిపిన మహర్షి. జయధీర్ తిరుమలరావు లాంటి పరిశోధకుల్ని యూనివర్సిటీ సృష్టించాలి. గొప్ప ఆచార్యు లు ఉండబట్టే నలంద, తక్షశిల, బెనారస్ విశ్వవిద్యాలయాలు చరివూతలో నిలిచిపోయాయి. మరి తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఈ బాధ్యతను గుర్తిస్తాయా? లేక తెలంగాణ పరిశోధనలు తంగేడు పూలలాగా మిగలాల్సిందేనా. ఆలోచించమని మనవి.

తన సంపదలో కొంతభాగం వెనుకవేసుకోవటం భారతీయులకు అలవాటు. ఇలా తమ సంపదలో కొంతభాగం సంస్కృతి కోసం, తాము నమ్మే దేవతలకు ఖర్చు చేస్తా డు. ఇది ఈ వ్యవస్థకున్న లక్షణాలను తెలియచేస్తుంది. క్యాపిటలిస్ట్ కల్చర్, ప్రాలి కల్చర్ ఈ రెండూ వేర్వేరు. రామప్ప దేవాలయం మాత్రమే కాదు. ఆ రాతిగోడల మీద గిరిజన కోయ, గోండు సంస్కృతిని పాఠ్యాంశంలా నెలకొల్పారు. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆనాడే రాతికట్టడంతో నిర్మించబడింది. దీనివల్ల గిరిజన సంస్కృతి ఎంత గొప్పదో తెలియచేస్తుంది. రామప్ప దేవాలయం పక్కన అతి పెద్ద చెరువు ఒకటి నిర్మించబడింది.
దేవాదుల సొరంగ నిర్మాణం కోసం చేస్తున్న పేలుళ్ల వల్ల పాలంపేటలో ఇళ్లు కదిలిపోయాయి. నెర్రలు బాస్తున్నాయి. దీంతో 800 ఏళ్ల చరిత్ర ఉన్న రామప్ప దేవాలయానికి ముప్పు వాటిల్లుతుంది. దీనికితోడు దాని చుట్టుపక్కల ఓపెన్‌కాస్టింగ్ మొద లు పెడతున్నారు. ఈనేల మీద భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు ఎగిశాయి. ఇప్పుడు తెలంగాణలో చారివూతక సంపదలను కాపాడుకోవటం కోసం జయధీర్ తిరుమలరావు నేతృత్వంలో ఒక సాంస్కృతిక పోరాటం మొదలయ్యింది. ఈ పోరాటాలు విజయం సాధిస్తే సామాజిక రంగాలు విలువలతో వెల్లివిరుస్తాయి. కేవలం ఆర్థిక పోరాటాలే కాదు సాంస్కృతిక సంపద పరిరక్షణ ఉద్యమాలు కూడా సమాంతరంగా జరగాల్సిన సమయం ఇది. అది గుర్తించవలసిన బాధ్యత అందరిదీ.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు
(రామప్పకు 800 సంవత్సరాలు నిండిన సందర్భంగా, ‘వరల్డ్ హెరి డే ’
సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఎనిమిది శతాబ్దాల రామప్ప పుస్తకావిష్కరణ)

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

Published: Wed,January 1, 2014 12:52 AM

అన్నివర్గాలు శిరసెత్తుకోవాలంటే...

ఇతర దేశాల పాలకులకు, మన పాలకులకు ఉన్న తేడా ఏమిటి? మన వాళ్లు ఎన్నికలకు ముందే సంక్షేమ కార్యవూకమాల ప్రకటనలు చేస్తారు. పాలకులు సంక్షేమ

Published: Thu,October 17, 2013 12:29 AM

ఇది శ్రమజీవుల సంస్కృతి

దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది బం డారు దత్తావూతేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’కి వెళ్లాను. ఈ అలయ్ బలయ్ అన్న పదం నేటి కొత్త తరానికి చాల

Published: Fri,September 27, 2013 12:27 AM

మనకు తెలియని మన సంస్కృతి

కొత్తగూడెం వెళ్లినప్పుడు సింగరేణి కార్మికుడు నన్ను బొగ్గుబావిలోకి తీసికెళ్లాడు.అప్పుడు నాకు ఆ బొగ్గుగని కార్మికుల జీవితం అర్థమైంది

Published: Thu,September 12, 2013 01:03 AM

కాళోజీ స్ఫూర్తిని పంచుదాం

వరంగల్‌లో 9వ తేదీన 5 గంటలకు కాళోజీ శతజయంతి సభ ప్రారంభమైంది. ఉపన్యాసకుల మాటలు, సభికుల చప్పట్లతో రెండు గంటలు కాళోజీకి నివాళులు అర్పి

Published: Wed,September 4, 2013 11:01 PM

యూటీ వాదన వెనుక..

హైద్రాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయాలని అడగటానికి కారణం ఏమిటి? విద్యా, వైద్య అవకాశాలు హైద్రాబాద్‌లోనే ఉన్నాయని, అవి అందరికీ అందుబా

Published: Mon,August 26, 2013 12:02 AM

ఆలోచనల కూడలి

జనంలో ఉంటేనే, వాకింగ్ చేస్తేనే ఆలోచనలు పుడతాయి. వాకింగ్ చేయని రోజు ఏదో కోల్పోయినట్లుంటుంది.అమెరికా,చైనా, సింగపూర్, నార్వే ఎక్కడకు

Published: Sat,August 17, 2013 02:05 AM

అభివృద్ధికి ముగ్గులు పోద్దాంరండి

సాయుధ పోరాట కాలంలో భూస్వాములు తెలంగాణలో ఉండే ప్రజలను రకరకాలుగా హింసించారు. అందుకే భూములు దున్నిన వారు ఇక్కడ భూమికి యజమాని కాలేకపోయ

Published: Fri,August 2, 2013 01:11 AM

అక్షరాల పొదుగు

చరివూతకు మొదటి ముసాయిదా పత్రికలే. ‘జర్నలిజం యీ జ్ ఫస్ట్ డ్రాప్ట్ ఆఫ్ ది హిస్టరీ’ అన్నారు. పత్రికలకున్న గొప్పతనమది. పత్రికలు కేవల

Published: Fri,June 7, 2013 11:58 PM

పెరిగిన పని గంటలు

కాలిఫోర్నియాలో సిలికానాంవూధవాసులు నన్ను ఒక సమావేశానికి పిలిచారు. ఆ సభకు నేను, మంత్రులు పితాని సత్యనారాయ ణ, పొన్నాల లక్షయ్య హాజరయ

Published: Fri,May 31, 2013 09:57 PM

గ్లోబల్ కల్చర్ అంటే?

ఒక సమాజంలో వున్నప్పుడు ఆ సమాజం గొప్పతనం కనిపించదు. ఆ సమాజం నుంచి బైటకు వచ్చి ఇతర సమాజాలను చూసినప్పుడు మన సమాజం విశిష్టత తెలిసి వ

Published: Thu,May 9, 2013 11:59 PM

పీవీ విగ్రహం మాటేమిటి?

పీవీ నరసింహారావు చరివూతలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిన విశిష్ట వ్యక్తి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజావూపతినిధి

Published: Wed,May 8, 2013 10:04 AM

నిలు పోరాట రూపం

ప్రతిమనిషికి ఒకేతల్లి. కానీ తీర్చిదిద్దేది ఆ మనిషిని వేయిమంది కాదు. మా బి.ఎన్. తీర్చిదిద్దింది లక్షలాదిమందిని. భీమిడ్డి నర్సింహాడ్

Published: Tue,April 23, 2013 12:01 AM

స్థానిక వనరులపై స్థానికత ముద్రలు

స్థానిక వనరులపై స్థానికులే హక్కుండాలి. బొగ్గు, ఇను ము జాతీయ సంపదలైనప్పటికీ ఆ సంపదను తరతరాలుగా కాపాడుతున్న ఆ మట్టిమీద మనుషులకు కూ

Published: Sat,April 13, 2013 01:47 AM

తెగని జ్ఞాపకాల సంకెళ్లు

కాలచక్రం చాలా వేగంగా తిరుగుతున్నది. నా శరీరంలో సగం, నా జీవిత భాగస్వామి లక్ష్మీభాయి చనిపోయి ఇప్పటికి రెండేళ్లు గడిచిపోయింది. మూడవ

Published: Thu,March 14, 2013 01:33 AM

ఇదీ భావి తెలంగాణ!

ప్రతి సంవత్సరం స్కూల్స్ వార్షికోత్సవాలు చేసుకుంటాయి. అది మార్కెట్ కోసమా? వినోదం కోసమా? లేక విద్యా ప్రమాణాలు పెంచటానికా? పిల్లల్లో

Published: Wed,December 12, 2012 10:37 PM

ఏదీ నా తెలంగాణ చరిత్ర

నా దేశంలో సివిరామన్, బోస్, రామానుజమ్ లాంటి పరిశోధకులు జనించినా ఎందుకు ఇక్కడ పరిశోధన ఇంత అందఃపాతాళంలోకి వెళ్లిందనే ఆలోచన ఉండ టం తప్

Published: Thu,November 15, 2012 12:19 AM

అనితర సాధ్యం కాళోజీ మార్గం

‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించ

Published: Sun,October 21, 2012 03:10 AM

విలువల సంపద విఠల్‌డ్డి

తరాలు గడిచిపోతున్నాయి. తరాలతోపాటుగా విలువలు కూడా కనుమరుగవుతున్నాయి. గత తరం అందించిన త్యాగాలు, విలువలతో కొత్త తరాలు వికసిస్తాయి. గత

Published: Wed,October 10, 2012 05:26 PM

ఉద్యమం: ముందడుగు, వెనుకడుగు

ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే కొం దరు విద్యార్థులు నన్ను కలిసి ‘తెలంగాణ ఇంకెప్పుడొస్తుంది సార్. మంది బలిదానా

Published: Sat,October 6, 2012 02:48 PM

చరిత్రగతి మార్చిన అధ్యాపకులు

మనదేశం భినత్వంలో ఏకత్వానికి ఎంత ప్రతీకనో, వైవిధ్యాలకు కూడ అంతే ప్రతీక. ఒక్కొక్క ప్రదేశం ప్రజల త్యాగాలతో పునీతమైన ప్రాంతాలుగా వాసిక

Published: Sat,October 6, 2012 02:49 PM

నడక నాకు పాఠం

ఏవూరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాకింగ్ చేయటం దినచర్యలో భాగం. ఏది మరిచినా వాకింగ్‌ను విడవను. ఇది శరీరం ఆరోగ్యం కోసమే కాదు. నా ఆలోచనల

Published: Sat,October 6, 2012 02:50 PM

సామాజిక దృక్పథం లోపిస్తే ప్రమాదమే?

అందరూ ఆలోచిస్తారు. కొందరు ఏ విషయమైనా ఆలోచిస్తారు. కొందరికి ఆలోచన రాకపోతే ఇతరులు చేసిన సలహాలను, పనులను స్వీకరిస్తారు. కొద్దిమంది మ

Published: Sat,October 6, 2012 02:50 PM

ఎంసెట్ లక్ష్యం ఏమిటీ?

ఇంటర్మీడియట్ ఇంఫ్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ గురించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘ఇంప్రూవ్‌మెంట్’ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి

Published: Sat,October 6, 2012 02:51 PM

ఉపాధ్యాయ ఉద్యమ దివిటీ

కొన్ని సంఘాలు, సంస్థలు కాల ప్రవాహంలో ఏటవాలుగా ప్రవహిస్తున్న నీళ్లలాగా వచ్చేవి కావు. ఏదో అవసరం కోసం ఏర్పడి ఆ పనుల అవసరం తీరాక అంతార

Published: Sat,October 6, 2012 02:51 PM

ఏదీ ఆ దేవరుప్పల చైతన్యం..?

ఈ మధ్య వారం రోజులు వాకింగ్‌కు పోలేదు. ఉస్మానియా క్యాంపస్‌లో వాకింగ్‌లో రోజు కలిసే మిత్రులు పలకరించారు. వారం రోజులుగా మీరు కన్పించక

Published: Sat,October 6, 2012 02:52 PM

ఆదివాసీల సందుక మేడారం మ్యూజియం

మేడారంలో జరుగుతున్నది ఒక జాతర కాదు. ఒక వినోద కార్యక్షికమం అంతకన్నా కాదు. సాహసానికి ప్రతీకగా నిలిచిన నేల అది. ఆధిపత్యంపై ఆదివాసీల

Published: Sat,October 6, 2012 02:52 PM

ముమ్మాటికీ సామాజిక ఉద్యమమే

ఉద్యమం పదునెక్కుతున్నప్పుడల్లా ఆ నేల దద్దరిల్లుతుంది. చివరకు ఆ వృక్షం వేర్లు కూడా బయటకొస్తాయి. అదే తెలంగాణలో జరుగుతున్నది. ఇది ఒ

Published: Sat,October 6, 2012 02:53 PM

మార్కెట్ వ్యవస్థ తెచ్చిన మార్పు

వరంగల్ రోడ్లపైన మట్టిలో నా కాళ్లు పునీతమయ్యాయి. చదువుకునే రోజుల్లో 65 ఏళ్ల క్రితం వరంగల్ నుంచి హన్మకొండ వరకు నడిచి పోయేవాణ్ణి. ఈన

Published: Sat,October 6, 2012 03:08 PM

పల్లెను పార్లమెంటును కలిపిన రైలు

నేను మా మిత్రుడు జూలూరి గౌరీశంకర్ ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి హన్మకొండ దాకా వెళ్ళాం. దారిపొడుగుతా జనం ఉన్నార

Published: Sat,October 6, 2012 03:08 PM

ప్రజాస్వామ్యమే పరిశోధన

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పు

Published: Sat,October 6, 2012 03:07 PM

ఐక్యదేమన ఆయుధం

మా తెలంగాణ సాయుధ పోరాటానికి నేడు నడుస్తున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారూప్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆ పోరాట కాలంలో మా ఊరి దొర ద

Published: Sat,October 6, 2012 03:07 PM

బోరుమంటున్న భాగ్యనగరం

బెంగుళూరుకు వెళ్తుంటే నా పక్క సీట్లో ఉన్న ఒక ప్రయాణికునితో సంభాషణ మొదలైంది. తాను బెంగుళూరులో ఉంటానని, కానీ ‘మాది పాత హైదరాబాద్ రాష

Published: Sat,October 6, 2012 03:07 PM

ప్రశ్నలకు బహుమానం చిత్రహింసలా?

ఈనాటి చదువు స్వరూప స్వభావమే రాబోయే 30 ఏళ్ల కాలాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణలో చాలా కాలం వరకు పాఠశాలలు లేవు. స్కూళ్లు

Published: Sat,October 6, 2012 03:06 PM

మీది మాది ఒకటే చరిత్ర

నేను చదువుకునే కాలంలో ఆఫ్రికా చీకటి ఖండమని పాఠం చెప్పేవారు. నాకర్థంకాక అక్కడ సూర్యుడు ఉదయించడేమో, కాంతి అక్కడ ఉండదేమో అనుకునేవాణ్ణ

Published: Sat,October 6, 2012 03:06 PM

ఉద్యమానికి ప్రేరకుడు ఉపాధ్యాయుడే

1956-60 మధ్య జరిగిన పరిణామాలే ఉపాధ్యాయుల అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ అసంతృప్తి అగ్గే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పాదులు వేస

Published: Sat,October 6, 2012 02:58 PM

స్పూర్తి శిఖరం

-డాక్టర్ చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ (ఇవ్వాళ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి) తెలంగాణ ఉద్యమ చరివూతలో డిసెంబర్9 ఒక చారివూతక దినం. దశా

Published: Sat,October 6, 2012 02:57 PM

మాట మారిస్తే దోషిగా నిలబెడతరు

ప్రణబ్ ముఖర్జీ తనను కలిసిన సీమాంధ్ర బృందాన్ని సంతృప్తి పరచ డానికి అలాంటి వ్యాఖ్యలు చేశారా?లేక ప్రస్తుత కాంగ్రెస్ స్వరం ప్రకారమే ఆయ

Published: Sat,October 6, 2012 02:57 PM

ఉద్యమ తీవ్రత కోసమే రాజీనామాలు

తెలంగాణ ఉద్యమం ఎన్నో మలుపులు తీసుకుంటున్నది. జయశంకర్ మరణం స్ఫూర్తితో ఈ ఉద్యమానికి కొత్త దారి దొరికింది. ప్రజలు ఉవ్వెత్తున అలల్లాగా

Published: Sat,October 6, 2012 02:53 PM

ఆ మెట్లు ఆలోచనల ఆకురాళ్లు

ఆర్ట్స్ కళాశాల మెట్లకు గొప్ప చరిత్ర ఉంది. ఆ మెట్లపై నడుచుకుంటూ ప్రగతిశీల భావాలతో పిడికిళ్లు బిగించిన విద్యార్థులు ఏ రంగంలోనైనా