తెగని జ్ఞాపకాల సంకెళ్లు


Sat,April 13, 2013 01:47 AM

కాలచక్రం చాలా వేగంగా తిరుగుతున్నది. నా శరీరంలో సగం, నా జీవిత భాగస్వామి లక్ష్మీభాయి చనిపోయి ఇప్పటికి రెండేళ్లు గడిచిపోయింది. మూడవ సంవత్సరం వచ్చేస్తుంది.ఈ రెం డు సంవత్సరాలు ఆమెను మరిచిపోవటానికి శాయశక్తులా ప్రయత్నం చేశాను.శరీరం సహకరించకపోయినా, సమాజంలోని నలుగురితో కలిసి తిరిగాను.నేను నలుగురిలో ఉంటే అందరిలో ఒక్కడి నైపోతాను. అప్పుడు నువ్వు గుర్తుకురావని ఈ పనికి ఉపవూకమించాను. ప్రజా సమస్యలే నన్ను ఆవరిస్తాయని, నీ జ్ఞాపకాలు నన్ను బాధపెట్టవని నిత్యం అనుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఆ క్రమంలోనే తెలంగాణ ఎర్రసెలకలను చూడగలిగాను. ఆక్రమంలోనే తెలంగాణ పల్లెల్లో కన్నీళ్లు ఎలా గుడ్లల్లో ఇంకిపోతున్నాయో ప్రత్యక్షంగా చూశాను. ఈనేల మీద ఇంత నెత్తురు ధారపోసినా బతుకులు మారని తెలంగాణ పల్లెల్ని చూశాను. గ్రామంలో చితికిపోయిన చేతివృత్తులను, ఛిద్రమైన ఆ కుటుంబాలను కళ్లా రా చూశాను. తెలంగాణ సమస్య లోతులను ఎందరి గుండెల్లోనో చూడగలిగాను. వాళ్ల కష్టాల లోతుల్ని గమనించగలిగాను. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని కళ్లారా చూశాను.

తెలంగాణ తల్లి ప్రత్యేకత ఏమిటంటే తన కష్టాన్ని బైటకు కనపడనీయకుండా తనలోనే దాచుకుంది. పోరాడే మనుషులకు తన కన్నీటి ధారలను చూపించింది. తన బిడ్డల ఆకలి బాధలను తెలియజేసింది. తనను ఆదరించని వాని ముందు తన శోకాన్ని వినిపించలేదు. ఈ నేలను ఆక్రమించి, తన ప్రజలపై ఆధిపత్యాన్ని చెలాయించే శక్తులకు తెలంగాణ తల్లి ఒక అపర భద్రకాళిగా కనిపించింది. దయ ఉన్నవాని ముందు దీనంగా ఉండాలి కానీ కర్కోటకులకు అపరకాళీమాతగానే దర్శనమివ్వాలి.అందుకే తెలంగాణ తల్లి గాంభీర్యంగా కనిపిస్తుంది. ఎవరి దయను అర్జించలేదు. తన పిల్లలు పోరా టం చేస్తారనే నమ్మకం ఉన్నది కాబట్టే ఆత్మవిశ్వాసంతో ప్రపంచం ముందు నిలుచుంది. తన పిల్లలు కనిపించినపడు మాత్రం తనలో ఉండే ఆవేదనను వెళ్లగక్కేది. కాబట్టే ఢిల్లీ నుంచే వచ్చే మనుషులకైనా లేక ప్రపంచం నుంచి వచ్చే వారికైనా తెలంగాణ అనేది ఒక సమస్యేకాదని, సమస్యేలేదనే విధం గా చూపించగలిగావు.

అవును ఏ తల్లికైతే తన పిల్లలపై పోరాడే నమ్మకం ముంటుందో, తన దుఃఖాన్ని ఇతరుల ముందుకక్కదు. కాబట్టే నీ నిజ స్వ రూపం చూస్తున్నపడు నా ఇంటిని మర్చిపోయాను. ప్రజల మధ్య ఉన్నప్పుడు నేను ఒంటరివాణ్ణి అయిపోయాననే భావన ఉండదు. తెలంగాణ తల్లి ఈ మట్టి బిడ్డలందర్ని తనలో ఇముడ్చుకున్నట్లు నన్ను కూడా ఓదార్చింది. నన్ను కూడా అక్కున చేర్చుకుంది. నాబాధను విన్నది. ఇంకా తగ్గని నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నది. అందుకే ఆమె భావనలకు నన్నొక ఉహాతీత ఇంజనీరును చేసింది. కొత్త నిర్మాణానికి పునాదులు కావాలన్న చైతన్యాన్ని ఈ మట్టే నాలో రగిలించింది.ఎంతోమంది పోరాడే యోధుల మధ్య న ఉన్నాను కాబట్టే ట్యాంక్‌బండ్‌పైన మిలియన్ మార్చ్‌లో భాగం కాగలిగాను. ఎగుస్తున్న ప్రజా ఉద్యమాల్లో ఒక కార్యకర్తగా నిలువగలిగాను. ఆ స్మృతులను మననం చేసుకుంటూ నొనొక్కణ్ణిగానే తన్నుకులాడాను.

సామూహికమైన స్ఫూర్తిని ఎవరికైనా ఉద్యమమే అందిస్తుంది.ఈ మధ్య లో నేను శాసనమండలి సభ్యునిగా కొంతకాలం పనిచేశాను. నాలోని ఆవేదనను కౌన్సిల్‌లో చెప్పే అవకాశం దొరికింది. ఇంటికొచ్చినప్పుడు మాత్రమే ఒంటరినయ్యాను. ఇంటిలో గోడలు, తలుపులు ఉన్నా కానీ అది ఇల్లుగా నా కనిపించలేదు. ఇంటికొస్తే నే నాకు ఆందోళనగా ఉండేది.గత స్మృతులు నన్ను వెంటాడుతూ వుండేవి.అందుకే ఇంటికి రాగానే సమూహమనే నీటి నుంచి బయటపడ్డ చేపపిల్లలా కొట్టుకునేవాణ్ణి. మళ్లీ పొద్దుపొడిచాక నాలోని కొన ఊపిరిని సమాజమనే నీటిలో కలిపాకే నేనొనక చేపపిల్లలా మళ్లీ ఈదుకుంటూ వెళ్లేవాణ్ణి. నా జీవిత భాగస్వామి బతికున్నప్పుడు ఒకనాడు తనను కూర్చోపెట్టుకుని నేను మొదలు చనిపోతే నువ్వు ఎట్ల ఉండాలో అని ఆమె కు హితబోధ చేశాను. ఎవరికి లొంగిపోవద్దు అన్నాను. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడవద్దు అన్నా ను. ఎక్కడ ఉన్నా గౌరవంగా బతకాలని చెప్పాను. తాను నా కన్నా చిన్నదానివి కాబట్టి నేనే నీకన్నా ముందు చనిపోతానని అనుకున్నాను. కాబట్టే నేను ఆవిధంగా ఆమెతో మాట్లాడాను. కాని నా ఆ ఉప దేశాలన్నీ తిరిగి ఈనాడు నాకే వర్తిస్తాయని ఏ మాత్రం వూహించలేదు. ఆ మాటలే నన్ను వెంటాడతాయని కలలో కూడా అనుకోలేదు.

దంపతుల్లో ఒకరు పోతే రెండోవాళ్లు ఎలా ఉండాలో నా జీవిత భాగస్వామి నానోటి నుంచే పలికించింది. ఇప్పటి వరకు మౌనంగా అదే పాటిస్తూ వచ్చాను. కానీ వెనుతిరిగే అవసరం లేదు. శరీరం సహకరించటం లేదు. ఇంట్లో ఎట్లా ఉండాల్నో? ఎట్లా ఉండగలుగుతానో? అనే భయం రోజురోజుకూ పెరుగుతుంది. అందుకే నీజ్ఞాపకాల ఈ గూడును విడిచి ఎక్కడికైనా పోదామనే అనిపిస్తుంది. అవే ఆలోచనలు నాలో సుళ్లు తిరుగుతున్నాయి. కానీ ఎక్కడికి పోతాను? ఎక్కడకు పోయినా, కొడుకులు, బిడ్డల దగ్గరకు ఆకాశ రెక్కలు కట్టుకుని అమెరికాకు ఎగిరిపోయినా అక్కడ నా జనం మాత్రం ఉండరు కదా! ఎవరితో నాగోడు చెప్పుకోను? ఎవరితో నా ఇంటి గోడును విప్పిచెప్పాలి? వినేవారికి ఆ అనుభవం ఉంటేనే నా భాష అర్థమౌతుంది. నా ఆర్తి తెలుస్తుంది. పిచ్చుకలు కట్టుకున్న గూడు గురించి చూసేవాళ్లకు ఏమి తెలుస్తుంది? వాళ్లు పిచ్చుక గూడు అందాన్నే చూస్తారు.

నేనిప్పుడు కొద్దిరోజులు నా కొడుకులు, బిడ్డల దగ్గరకు ఎగిరిపోదామనుకుంటున్నాను. అమెరికాలో ఉండే వారికి నా అనుభవాలు రుచికరంగా ఎందుకుంటాయి? వారికి ఈ ప్రజలు ఏం తెలుస్తారు? జనభాష అమెరిక న్ మార్కెట్ వీధులకు ఏంఅర్థమౌతాయి? మా పిల్లలైనా అక్కడ వాళ్లు మార్కెట్ సంస్కృతిలో పెరిగారు. నేను దొరల పీడనలో పెరిగాను. వారు ‘హలో హలో’ అనుకుంటూ తిరుగుతున్నారు. నేను ‘బాంచన్ దొరా’ అని తిరిగినవాణ్ణి. ఈ మార్కెట్ సం స్కృతికి తెలంగాణ ప్రజల గోడు ఎలా అర్థమౌతుంది? అది ఆ వ్య వ స్థకు అర్థం కాదు? వీళ్ళు బలహీను లు కాబట్టి దోచుకోవటానికి అర్హులే అనే భావనే కలుగుతుంది. సుఖాన్ని ఇతరులకు చెప్పవచ్చుకానీ దుఃఖా న్ని మాత్రం చెప్పకూడదు. ఎవరి కన్నీళ్లు వాళ్లే తుడుచుకోవాలి. ఎవరో వచ్చి కన్నీళ్లు తుడుస్తారనుకోవమే అసలు తప్పు.

ఏ అధికారి వచ్చో నిన్ను పాల తో అభిషేకంచేస్తామనుకోవటమే మరిం త తప్పు. ప్రపంచంలో ఇప్పటి వర కు ఎవరి సంకెళ్లు వాళ్లే తెంచుకున్నా రు. మా సంకెళ్లు తెం పమని ఎవర్ని ఎవరు ప్రార్థించరు. ఇది చరివూతకు చరిత్ర చెప్పే పాఠం. నా జీవితంలో ఆ సంకెళ్ల ను తెంచుకోలేకపోతే వచ్చే మా తరమే తెంపుతుంది కానీ పరాయివాళ్లు తెంచుతారనే ఆశ నాకు లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమౌతుంది. ఇదివరకు నీ పిల్లలు త్యాగాలు చేసి ఏ సంకెళ్లయితే తెంచారో తిరిగి మళ్లీ ఆ సంకెళ్లు తొడిగే ప్రయత్నాలను మాత్రం నిరోధించే తరం ఉందని మాత్రం నాకు నమ్మకం కలుగుతుంది. నీ జ్ఞాపకం నన్ను కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. కానీ వెనక వైపు మాత్రం చూడనివ్వటం లేదు. వెనక వైపుకు చూస్తే నీ జ్ఞాపకాలు నన్ను తికమకపెడతాయి. ముందుకు చూస్తే మాత్రమే ధైర్యమిస్తాయి. గతాన్ని నెమరేసుకుంటే కన్నీరు ప్రవహిస్తుంది. పోరాట యోధులను మననం చేసుకుంటే ఆనందం పరవళ్లు తొక్కుతుంది.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

country oven

Featured Articles