ఇదీ భావి తెలంగాణ!


Thu,March 14, 2013 01:33 AM

Chukka-Ramaiahప్రతి సంవత్సరం స్కూల్స్ వార్షికోత్సవాలు చేసుకుంటాయి. అది మార్కెట్ కోసమా? వినోదం కోసమా? లేక విద్యా ప్రమాణాలు పెంచటానికా? పిల్లల్లో సృజన శీలత కల్గించటానికా? లేదా దేనికైనా కావచ్చును. ఏ కొత్త విషయాన్నైనా కనుక్కోవటం కోసమై ఎక్కడికైనా వెళ్లే అలవాటు ఉంది. కరీంనగర్‌లో స్కూలు వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లాను. అక్కడ విద్యార్థుల వార్షికోత్సవ సందర్భంలో సమాజానికి స్కూలుకు మధ్య కొత్త వంతెనలు నిర్మించారు. 1950-2000 సంవత్సరాల వరకు కరీంనగర్ జిల్లా ఎలా ఉండేది? అక్కడ ప్రజల జీవన విధా నం ఏ విధంగా ఉండేది? ఏ పనిముట్లు ఉపయోగించేవారు. ఉత్పత్తి సాధనాలు ఏమిటి? వీటన్నిటికి సంబంధించి రెండు మూడు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయం, చేనేత పరివూశమ, విద్యా వైద్యరంగం పరిస్థితులపై ఈ స్టాల్స్ ఏర్పా టు చేశారు.

వీటిని పరిశీలిస్తుంటే పిల్లలు తమ తాతలు ఏ పల్లికిలో కూర్చొని పెళ్లి చేసుకున్నారో? తన అమ్మమ్మలు ఏ ఇసుపూరాళ్లను ఉపయోగించారో? ఏ రోకళ్లను దంపుళ్లకు ఉపయోగించారో? ఎలాంటి పాత్రల్లో వంటలు వండారో? వడ్డనలు చేశారో? ఏ చరిత్ర పుటలలో లేనటువంటి విషయాన్ని ఆ పిల్లలు పరిశోధనచేసి ఆ వస్తువులను తీసుకువచ్చి చూపిస్తున్నప్పుడు నాకు ఆశ్చ ర్యం కాలేదు కానీ ఆ పిల్లలు చేసిన అధ్యయనంతో ఈ గడ్డపై విద్యార్థి ఎంత అభిమానం పెంచుకున్నాడో చూసి నా కంటి నిండా నీరొచ్చింది. నాకు తెలిసినవి కాబట్టి తొందరగా నడిచే ప్రయత్నం చేస్తున్నాను.

చూడు తాతా! మా అమ్మమ్మ లు తిన్న బియ్యమివి? గోదావరి తీరంలో ఉన్న కరీంనగర్ జిల్లాలో అవి సారవంతమైన భూములు. కానీ ప్రజలు మాత్రం ఆ దొడ్డన్నమే తిన్నారు. పండించిన పంటనంతా కూడా దొరల గడీలకు మోయటమే చేశారు. వారి శ్రమ ఫలితమంతా దొరగరిసెలను నింపింది. ఆ విద్యార్థి ఆ వడ్లను ఈ బియ్యాన్ని చూపించి తన తాతా ముత్తాతల ఆహార పరిస్థితిని వివరించాడు. భూస్వామ్య వ్యవస్థలో పంటలు పండుతాయి. అదేవిధంగా దరిద్రం కూడా తాండవిస్తుంది. ఈ పరిస్థితి ఇపుడు మారింది కదా? అని ఆ విద్యార్థినడిగాను.

వెంటనే ఆ విద్యార్థి నన్ను పక్క స్టాల్‌కు తీసుకపోయి 50 ఏళ్ల క్రితం మా పరిసరాలు ఇవి? మా గుట్టలు, మా అడవులు, మా సంపదలివి? ఇప్పటి పరిసరాలివి? ఈ పరిసరాల్లో నా నేలలో ఉన్న, నా అటవీ సంపద అంతా ఎక్కడికి పోయింది తాతా? అన్నాడు. 500 గుట్టలు, దట్టమైన అడవులు మాయమై పోయాయి. మా తాతలు పంటను భూస్వాములకిచ్చారు. మేం మా సంపదను ప్రపంచానికి కిస్తున్నాం. తేడా అంతే కదా! మారిన మార్పు ఇదే కదా? ఇదే ఆధునికత తెచ్చిన మార్పు ఇదేనా? అపుడు మమ్ముల్ని అనాగరికులం అన్నారు. ఇపు డు నాగరికులు అయ్యాం. ఇదే తేడా? ఏం చదువుతున్నావని అడిగాను. 9వ తరగతి విద్యార్థినని చెప్పాడు. రెండడుగులు వేశాను. ఒక ఆడపిల్ల ఆనాడు మా తాతలు ఎట్లా బట్టలు నేసేవారో చూపించింది. కలనేతల చేతులపైన రంగు రంగుల ఇంద్రదనస్సుల మాదిరిగా పలురకాల రంగులతో నేసిన బట్టలను, మగ్గాలను చూపింది.

ఆ నేత చీరలను, కోరంట్ల దుస్తులను నెత్తిన పెట్టుకుని వూరూరా తిరిగి అమ్మే నేతగాళ్లను చూపించారు.ఇవన్నీ నాకు తెలుసమ్మా? అని అన్నాను. ఆ అమ్మాయి ఇంగ్లీషులో నన్ను అడిగింది. నీకన్నీ తెలిస్తే నువ్వేం చేస్తున్నావు అని ఆ విద్యార్థి తిరిగి అడిగింది. ఇవన్నీ మాయమైపోయాయి. ఇపుడు బట్టల మిల్లులు వచ్చాయి. హ్యాండ్లూమ్స్ వచ్చాయి. మొదట్లో హ్యాడ్లూమ్స్ మిల్లులు కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా వచ్చాయి. కానీ ఈ బట్టలు కొనేనాధుడు ఎక్కడున్నారని ఆ విద్యార్థి చెప్పింది. దొడ్డన్నం తినేది దొడ్డు బట్ట కట్టేది. సన్నబియ్యం వచ్చాక ఈ దొడ్డు బట్ట ఎవరు కడతారు?

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఒకప్పుడు సిరులు పండిస్తూ కనబడ్డ మరమగ్గాలు నేడు వారి ఆకలి చావులుగా మారాయి. నేత బట్టలు అమ్ముడు పోవటం లేదు. టెక్నాలజీ పెరిగింది. కానీ డిమాండ్ లేదు. ఇంక రెండడుగులు వేశాను. చదువు స్టాల్ దగ్గరకు పోయాను. ఆ రోజుల్లో అక్షరాభ్యాసం చేస్తుంటే ఎంత వైభవంగా హోమాలు చేసేవారు. అప్పుడు అక్షరం నేర్చుకునేవారు మాత్రం భూస్వాములు, ఆ వర్గం వారు ఉన్నారు. కానీ దాని పక్కస్టాల్‌లో మన స్కూళ్ల పరిస్థితి చూపారు. బోర్డులు, బెంచీలు, చాక్‌పీసులు, పిల్లలు చూపారు. ఇది కూడా నేను చూసినవే కదా! అన్నాను. ఏం చూసినవు తాతా? మాకు విరిగిన బెంచీలు, విరిగిన కుర్చీలు, కిందకు చూస్తే చెత్త పేరుకు పోయింది. వూడ్చే నాథుడు లేరు. పంతుళ్లు, పిల్లలున్నారు కానీ వూడ్చని గదులున్నాయి. చెట్ల కింద బువ్వ వండుకుని తిన్నట్లుగా ఉందని చెప్పింది. 50 ఏళ్ల లోపల జరిగిన మార్పులను స్టాల్స్‌గా పిల్లలు నెలకొల్పారు. ఈ స్టాల్స్‌ను ‘ఆకృతి’ అన్న పేరుతో నిర్వహించారు. ఇక నేను వెళతాను అన్నాను.

మరో మూడు స్టాల్స్ చూడాలని పట్టుపట్టారు. 2050లో ఎలా ఉండాలనుకుంటున్నారో తమ కలలను చూపారు. మాకు అడవి ఉన్నది. అడవి సంపదను ఎట్లా వినియోగిస్తామో తన భావనను చూపిం ది. గోదావరి తీరం ఉన్నది. ఈ ప్రాజెక్టులతో మా జిల్లా ఎలా సస్యశ్యామలం కావాలి? మా వూర్లు ఎలా పచ్చగా ఉండాలి? జిల్లాలో కావల్సినన్ని బొగ్గు గనులున్నాయి. ఈ గనుల మధ్యన ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించుకుంటాం. కాగజ్‌నగరల్ పేపర్ ఫ్యాక్టరీని నవీకరించుకుంటాం. బీడీలకు పరిమితమైన ఆకు పరివూశమలకు కొత్త కొత్త ఔషధాలకు ఉపయోగించుకుంటాం. నిజామాబాద్ నుంచి పెద్దపల్లికి కలిపే రైలు మార్గాలను విస్తరించుకుంటాం. దీన్ని ముంబయ్ రైల్వే లైన్‌తో కలుపుకుంటాం.

కొత్త రోడ్ల నిర్మాణాలు జరుపుకుంటాం. ఇది మా మ్యాప్. 2050లో కరీంనగర్ ఎలా ఉండాలో ఊహాచివూతాలవి అని వారు చెప్పా రు. ఎన్ని రోజులు పాఠాలు చెపితే ఇంత భవిష్య దర్శనం చూసే విద్యార్థులు తయారవుతారు! నా పాఠాలు పోయిన సమాజానికి పనికి వచ్చేవే కానీ వచ్చే కాలానికి పనికి వచ్చేవి కావు. గతాన్ని ప్రస్తుతాన్ని పోల్చి ఒక సామాజిక దృక్పథం నాకు ఆ పిల్లలు చూపించారు. ఈ 3 స్టాల్స్ లోపల తమ కలలను చూపించా రు. తమ నేలపై ప్రేమను చూపించటమే కాదు, చూసే మనుషులలో కూడా ఆ భావనలు రగిలించగలిగారంటే అంచనా వేసుకోండి. నాలో భావ సంఘర్షణా రసాయనిక చర్య జరిగింది. ఇదే ఆకృతి అన్నారు. గతం భవిష్యత్‌కు స్ఫూర్తి. ఈ నా కంటి కలయికే ‘మా తెలంగాణ నాగరికత’. అందుకే తెలంగాణ ఉద్యమం.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర