ఉద్యమానికి ప్రేరకుడు ఉపాధ్యాయుడే


Sat,October 6, 2012 03:06 PM

1956-60 మధ్య జరిగిన పరిణామాలే ఉపాధ్యాయుల అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ అసంతృప్తి అగ్గే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పాదులు వేసిం ది. ఆనాడు స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ )ఒక్కటే ఉపాధ్యాయ సంఘం ఉండేది. పల్లెల నుంచి మహానగరం దాకా ఒకటే సంఘం. ఆనాడు సమస్య ఏమిటంటే..ఆనాడు ప్రైవేట్ బళ్లు లేవు. ఒకే యాజమాన్యం కింద ఉన్న సర్కారీ స్కూళ్లు మాత్రమే ఉండేవి. ఈనాడున్నన్ని యాజమాన్యాలు లేవు. ఉపాధ్యాయుడు ఊళ్లలో ఉండేవాడు. ఊరుతో ఆత్మీయ సంబంధం కలిగి ఉండేవాడు. పౌరజీవితానికి ఆనా డు గ్రామంలో ఉపాధ్యాయుడే కేంద్రంగా ఉండేవాడు. అతని మాటే ప్రజల మాట గా ఉండేది. ప్రతిరోజు ప్రజాభివూపాయం రూపొందేది. ఊర్లో రచ్చబండ చర్చలకు ఉపాధ్యాయుడే రూపంగా మారా డు. వ్యవస్థలో ఏ వ్యక్తి అయితే అన్యాయానికి గురౌతాడో, ఏ మనిషి అయితే ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా దెబ్బతింటాడో, ఆ మనిషే ఉద్యమం లో యాక్టివ్ వర్కర్‌గా మారతా డు. తెలంగాణ ఉపాధ్యాయుని జీతంపై, జీవితంపైన ఎప్పుడైతే దాడి జరిగిందో, దాంతో ఇక్కడ ఉపాధ్యాయుడే చురుకైన కార్యకర్త అయ్యాడు.

కాబట్టి ఆ ఉపాధ్యాయునిలో రగిలిన అసంతృప్తి గ్రామస్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మారింది. ఉపాధ్యాయుడు తన జీతం గురించిగాక తన నేలకు ఏం అన్యాయం జరిగిందో అధ్యయనం చేశాడు. ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్తగా మారా డు. ఆ సామాజిక ఉద్యమమే రాజకీయ ఉద్యమంగా మారింది. ఆనాడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థలేకున్నా, గ్రామాల్లో ఉపాధ్యాయునికి విస్తృత జనబాహుళ్యంతో సంబంధాలుండేవి. ఆయన చెప్పిన మాటకు ఊరు ఊరంతా కదిలింది. ఆనాటి పోరాటానికి ఉపాధ్యాయుడు ఆ రకంగా ప్రేరకుడై ఊపునిచ్చాడు.

ఆంధ్రలో స్కూళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ పాలనలో ఆంధ్రాలో స్కూళ్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ టీచర్ల జీతాలు తక్కువగా ఉండేవి. తెలంగాణలో స్కూళ్ల సంఖ్య తక్కువ. కానీ క్వాలిటీ గల టీచర్లు ఉండేవారు. ఇక్కడ జీతాలు ఎక్కువగా ఉండేవి.ఆ రోజుల్లో ట్రైనీ గ్రాడ్యుయేట్‌కు ఆంధ్రాలో 85 నుంచి 175 రూపాయల స్కేలు ఉండేది. అదే తెలంగాణలో 154 నుంచి 275 స్కేలు ఉండేది. ఇక్కడ మెట్రిక్ చదివి ఎస్‌జీబీటీ ప్రాథమిక పాఠశాలలో ఉంటే 80 నుంచి 130 రూపాయ ల స్కేలుంటే, అదే ఆంధ్రాలో 45 నుంచి 90 రూపాయలు స్కేలు మాత్రమే ఉండే ది. ఆంధ్రాలో ఏ జిల్లాకు ఆజిల్లా బోర్డులుండేవి. అక్కడ మున్సిపల్ స్కూల్స్ ఉండే వి. జిల్లా బోర్డు స్కూళ్లుండేవి. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ఒక్కటే యాజమాన్యం కింద స్కూళ్లుండేవి. ఆంధ్రావాళ్లు దానిని ఇక్కడి ఈ వ్యవస్థపైన రుద్దే ప్రయత్నం చేశారు. అదే తెలంగాణ ఉపాధ్యాయ లోకంలో ఘర్షణకు కారణమైంది.

ఆనాడున్న ముఖ్యమంత్రి బ్రహ్మానందడ్డి ‘ఆంధ్రా కొనసాగుతున్న రాష్ట్రం. హైదరాబాద్ విచ్ఛిన్నమైన రాష్ట్రమని’ అన్నాడు. ఇది తెలంగాణ ప్రజలను గాయపర్చింది. ఉపాధ్యాయుణ్ణి గాయపరిచిన మంటే.. అదే పాలకులను తట్టుకోలేని మంటల్లోకి నెట్టింది. కానిస్టేబుల్ పోలేని ప్రదేశాలకు కూడా ఆనాడు ఉపాధ్యాయుడు పోగలిగాడు. అందుకే ఆనాడు తెలంగాణ పల్లె పల్లెలో రగిలిన ఉద్యమాగ్నికి ఉపాధ్యాయుడే సంకేతం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది. ఉపాధ్యాయులు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయగలుగుతారు. సమాజంలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని అమూలాక్షిగంగా ఉపాధ్యాయుడు అధ్యయనం చేసి కొత్త తరానికి బోధిస్తాడు. ఉద్యమాలు ఎగుస్తున్నప్పుడు ఆ ఉద్యమానికున్న ప్రాధాన్యాన్ని, తమ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరిగిందన్న దాన్ని విశ్లేషించి చూపుతాడు.

మొదట తన నేలకున్న గొప్పదనాన్ని వెలికి తీయాలి. దీనికి చారివూతక నేపథ్యాన్ని చూపాలి. ఒక వర్గాన్ని నేలమట్టం చేయాలంటే ‘ఆధిపత్య వర్గం ఎదుటి వర్గానికి చరివూత లేదని చెబుతుంది. మిమ్మల్ని బాగుచేయడానికే తాము వచ్చామని’ ఆధిపత్య వర్గం చెబుతుంది. ‘మీకు వ్యవసాయం రాదు. మీరు మాట్లాడేది తెలుగే కాదు. మీకు నాగరికత లేద’ని చూపిస్తాడు. అదే పోరాట బరిలో ఉన్న వాళ్లు వాళ్ల పూర్వీకులు చేసిన త్యాగాన్ని సింహావలోకనం చేసి చూపుతారు. తన పూర్వీకుల నాగరికతను తవ్వి చూపిస్తారు. ఈ నేపథ్యాలను వెలికి తీసి ఉపాధ్యాయుడు వర్తమానానికి, ప్రస్తుత ఉద్యమానికి స్ఫూర్తి కలిగిస్తాడు. ఇప్పటివరకు విద్యార్థులు, ఎన్జీవోలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సామాన్యుని జీవిత అవసరాల ను ఆధారం చేసుకొని నీళ్ల విషయంలో, వ్యవసాయ క్షేత్రంలో ఏ విధమైన అన్యా యం జరిగింది? విద్యుత్ రంగంలో, వైద్య, విద్యారంగాలలో ఏ విధంగా అన్యా యం జరిగిందో ఈ తరానికి పూసగుచ్చినట్లు ఉపాధ్యాయులు చెప్పాలి.

ఆ పనిలో ఇప్పటికే చాలా వరకు పరిణతి సాధించారు.
ఏ ఉద్యమంలోనైనా త్యాగధనులు యువకులే. ఉపాధి అవకాశాలు ఏరకంగా ఉండవల్సి ఉంది? భవిష్యత్ తెలంగాణ ఏ రకంగా ఉండాలి? ఉద్యమంలో త్యాగం దారులేస్తున్న యువతరానికి ముందు దారి ఎలా చూపగలగాలి? సంపన్నుల చేతు ల్లో ఉద్యమాలుంటే విజ్ఞప్తులు, సభల్లో ఉపన్యాసాలు చేయటం ఎక్కువగా కనిపిస్తుంది. ఆచరణ ఎక్కువగా ఉండదు. సామాన్యుని సమస్యలపై , వెట్టిచాకిరి, లేవీ, కౌలుదారీ విధానం తదితర ప్రజా సమస్యలపై ఎప్పుడైతే భువనగిరి ఆంధ్ర మహాసభ ఆచరణ రూపం తీసుకుందో అక్కడ ఉద్యమ స్వరూపమే మారిపోయింది. ఉపన్యాసాలుపోయి ఆచరణ వచ్చింది. ఆచరణ వచ్చినప్పుడు త్యాగం కావాలి. ఆ త్యాగం చేసే శక్తులు ముందుకు వచ్చాయి.

ఆ భూమి, భుక్తి, విముక్తి ఉద్యమం పదునెక్కింది. ఇప్పుడే పాలకులు నిర్బంధం పెడతారు. ఆ ఒత్తిడికి ప్రతిస్పందనగా ప్రజాఉద్యమం ఎగుస్తుంది. అదే అన్ని వర్గాలను ఉద్యమంలోకి తీసుకువచ్చి మహా ప్రజా ఉద్యమంగా రూపుదాల్చుతుం ది. ఆ రోజుల్లోపల కార్యక్షికమ రూపాలు బాగా ఉన్నాయి. ఎదుటివాడు హింసను చేస్తే దాన్ని వ్యతిరేకించడానికి ప్రతిహింస జరుగుతుంది. అదే ఉద్యమాన్ని మరింతగా ప్రజా పోరుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి ఉద్యమశక్తులు, నవశక్తులు, యువశక్తులను ఉపాధ్యాయుడు తీర్చి దిద్దగలుగుతాడు. దాన్ని అణచటం కోసమై పోలీసులు వస్తారు. పోలీసులు రాకుండా కందకాలు తవ్వటం లాంటివి ఆనాడు తెలంగాణ పోరులో జరిగింది. ఉద్యమాన్ని వ్యాపింపచేయాలన్న పట్టుదల నాయకత్వానికుండాలి. ఆనాడు అరెస్ట్ కావటం గొప్పతనం కాదు.
అరెస్ట్ కాకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం గొప్పతనంగా చూశారు. ఆనాడు అజ్ఞాతంగా ఉండి ఉద్యమాన్ని రగిలించారు. తెలంగాణలో ఊరూరా ఏర్పడ్డ జేఏసీలకు ప్రోగ్రాం ఇవ్వాలి. కరెంట్ బిల్లు కట్టకపోవడం, బస్సు టికెట్లు తీసుకోకపోవటం లాంటి సహాయ నిరాకరణ ఉద్యమం బలంగా జరగాలి. సర్వజనుల సమ్మె అంటే గ్రామాలు ప్రభుత్వానికి ఏ మాత్రం సహరించకుండా తయారు కావాలి. ఉద్యమం ఎంత విస్తృతమైతే ప్రజా బాహుళ్యం అంత ఉత్సాహంగా సర్వజన సమ్మెలో పాల్గొనగలుగుతారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధమే పౌరసమాజం.

సర్వజన సమ్మె అంటే మొత్తం తెలంగాణ పౌరసమాజమంతా ప్రభుత్వానికి పూర్తి సహాయ నిరాకరణగా మారాలి. ఈ రెండింటి మధ్య సంబంధం తెగిపోవటమే సహాయనిరాకరణ ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేయటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. ప్రజల ముందు ఒకే ప్రోగ్రాం ఉండాలి. జనమంతా ఒకే గొంతుకతో ఒక్కటే నినాదం చేయాలి. అది చిన్న ప్రోగ్రాం అయినా బాధలేదు. అందరూ కలిసుండాలి. అనైక్యత పనికిరాదు. ఉద్యమాన్ని బలహీనపరుస్తుంది.కాబట్టి ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలి. అప్పుడే సర్వజన సమ్మె సకల జనుల సమ్మె అవుతుంది.

-చుక్కా రామయ్య
విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles