ఏదీ నా తెలంగాణ చరిత్ర


Wed,December 12, 2012 10:37 PM

నా దేశంలో సివిరామన్, బోస్, రామానుజమ్ లాంటి పరిశోధకులు జనించినా ఎందుకు ఇక్కడ పరిశోధన ఇంత అందఃపాతాళంలోకి వెళ్లిందనే ఆలోచన ఉండ టం తప్పేమీకాదు. కానీ ఇతర దేశాల్లో ఏ వసతులు ఉండటం వలన పరిశోధన పెరుగుతున్న ది? అందుకు కారణాలు ఏమిటి? రీసెర్చ్‌కు విద్యాలయాలు, విద్యే కార ణం కాదు. విద్యార్థికి స్కూలు వెలుపల అకడమిక్ వాతావరణం కలిగించటం ప్రధానం. అందుకే మ్యూజియంలు, లెబ్రరీలు, సమ్మర్ క్యాంప్‌లు వీటన్నిటికి మించి కల్చరల్ క్యాపిటల్‌ను తల్లిదంవూడులు అందిస్తారు. నేను అమెరికా వెళ్లినప్పుడల్లా ఇవన్నీ పరిశీలిస్తాను. ఒక వాషింగ్టన్‌లోనే ఐదారు మ్యూజియంలున్నాయి. తండోప తండాలు గా విద్యార్థులు వచ్చి చూస్తుంటారు. అదే మాదిరిగా ఒక మ్యూజియంలో అమెరికా వివిధ యుద్ధాల్లో ఉపయోగించిన ఆయుధాల ప్రదర్శన పెట్టారు.

ఒక ఫిరంగి దగ్గర ఇది వియత్నాం యుద్ధంలో ఉపయోగించినదని, మరో ఆయుధం కొరియాపై యుద్ధంలో వాడినదని, ఇరాక్ లో ఉపయోగించిన యుద్ధవిమానమని, ఇది అప్ఘస్తాన్‌పై ఎక్కుపెట్టిన జెట్ విమానమని చూపిస్తున్నారు. ఇది ఎందుకు చూపిస్తున్నారని ఒక అమెరికన్‌ను అడిగాను. ఇది జాతీయ గర్వం అన్నాడు. జాతి గొప్పగా చెప్పుకునే అంశంగా చెప్పారు. ఈజాతి ప్రపంచాన్ని పరిపాలించటానికై పుట్టిన జాతి అన్న అభివూపాయం అమెరికన్ జాతిలో కలిగిస్తున్నారు. ఇదే మాదిరిగా జర్మనీలో చేశారు. అప్పుడు నాకు నా దేశంలో కూడా మ్యూజియంలు ఇలా విద్యార్థులకు జాతి భక్తిని, దేశభక్తిని రగిలించవచ్చుకదా! అనిపించింది.

కొన్ని సంవత్సరాల నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ అడవులు పట్టుకుని తిరుగుతున్నాను.బౌద్ధ సన్యాసులను తీసుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఖానాపూర్‌కు నన్ను మల్లేపల్లి లక్ష్మయ్య తీసుకు బౌద్ధ సన్యాసులకు ఒక జిజ్ఞాస ఉంది. ఇతర దేశాలకు వెళ్ల టం, ఆ దేశంలో ఉండే చారివూతాత్మక స్థలాలను చూడటం, ఆ దేశం ఆలోచనా విధానాన్ని ఆకళింపు చేసుకోవటం చేస్తారు. ఇది వారి కార్యక్షికమంలో ఒక భాగం. అదే మాదిరిగా ఖానాపూర్ వెళ్లటం తటస్థించింది. అంతకంటే ముందు నిజామాబాద్, ఆదిలాబాద్ సరిహద్దున వేరపల్లి మండలం భావనకుర్తి కరీంనగర్ స్థలానికి తీసుకు గత సంవత్సరమే అక్కడికి వెళ్ళాను. 2500 సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరు నుంచి 32 మంది బౌద్ధగయకు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలో బౌద్ధవూపచారం చేశారు.

అది తెలిసి ఇప్పుడు నేరుగా బౌద్ధులే దాన్ని చూసేందుకు వచ్చారు. ఒక దేవాలయంలో బౌద్ధ పాదాలున్నాయి. ఆ పాదాలు జపాన్, లావోస్‌లో మ్యూజియంలలో ప్రదర్శిస్తారు. అలాంటి పాదాలే కరీంనగర్ జిల్లాలో ఉన్నాయని బౌద్ధ సన్యాసులు కనుక్కుని వచ్చారు. ఆ పాదాలను చూశాను. ఆ పాదాలను హిందూయిజంలోకి మార్చా రు. అందువల్ల ఆ పాదాలకే ప్రాచుర్యం లభించలేదు. ఆ పాదాలను బుద్ధుని పాదాలతో పోల్చా రు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు వెళ్లాం. ఆ వూర్లో బౌద్ధ స్మారకాలు ఎన్నో కట్టడాలు కనిపించాయి. ఆ వూరంతా మట్టిగోడలే. అవి ఇంత గట్టిగా ఎందుకన్నాయని అడిగాను. మట్టిలో ఇను ము కలిపారు.

అందువల్ల అది గట్టి కట్టడంగా మారింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి రోలు, ఇసుపూరాయిని చూశాను. చరివూతకారుడు జితేంవూదబాబు వచ్చారు. అక్కడవున్న ప్రతిరాయి వయసు ఎంతో చెప్పారు. మిగతారాళ్లకు ఈ రాళ్లకున్న తేడా ను చెప్పారు. నాడు ఎన్నో స్మారకాలున్నాయి. దీన్నిబట్టి ఆ ప్రాంత చరివూతను అంచనా వేశారు. ఆ గుడి నిర్మాణంలో ఇటుకలు, రాళ్లను పరిశీలించాం. ఒక రాయి పరీక్షిస్తే అందులో ఇనుప ఖనిజం ఉన్నది. ఆ రాయిలో ఇనుప ఖనిజం కలిసి ఉండటం వల్ల గుడి శక్తిమంతంగా ఉంది. దీనిపై ఈ ప్రాంతంలో పరిశోధనలు జరగాలన్న ఉద్దేశ్యంతో మ్యూజియం పెడితే విద్యార్థులకు తమ పాతతరం జీవన విధానం తెలుస్తుంది. ఇతర దేశాల్లో తమ సైనికశక్తితో తమ గొప్పతనాన్ని చాటుకుంటే తెలంగాణ ప్రజలు తమ తాతలు, ముత్తాతలు ఇతర దేశాలకు శాంతి సందేశం ఎలా ఇచ్చారో తెలుస్తుంది. బౌద్ధం, అహిం సా సిద్ధాంతాలను ప్రచారం చేయటం కోసమై ఎంత పాటుపడ్డారో అర్థం అవుతుంది. తెలంగాణ తన పాతతరం ప్రపంచశాంతికి ఏ విధంగా తోడ్పడిన నేలనోఆ మ్యూజియం తెలియచేస్తుంది.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర