అనితర సాధ్యం కాళోజీ మార్గం


Thu,November 15, 2012 12:19 AM

‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించిత్తు జంకలేదు. ఆ భగవంతునికి కూడా భయపడను కానీ కాళోజీ నారాయణరావు చూస్తే వణికిపోతాను’ అని పి.వి.నర్సింహారావు కాళోజీ సంస్మరణ సభలో అన్న మాటలు ఆయనను ప్రేమించే అందరికీ వర్తిస్తాయి. కాళోజీ పై ఉన్న గౌరవం, ప్రేమ ఎప్పటికీ చెరిగిపోనిది. నాకు కాళోజీ అంటే ఒక్కసారిగా భయం, భక్తి ఆవహిస్తాయి. తరగతి గదికి వెళ్లే ఉపాధ్యాయుడు ఈ రోజు పిల్లల నుంచి తానేమి నేర్చుకుంటానని భావిస్తారు. కాళోజీ నిరంతర అన్వేషి. కాళోజీ సాహిత్య మేధోమథనం, కాళోజీ తెలుగు సమాజ జీవనచిత్రం. మొత్తంగా ఆయన తెలంగాణ సమాజ ముఖచిత్రం. కాళోజీ పౌరహక్కుల ఉద్యమ పోరుకేక. కాళోజీ అన్యాయంపై తిరగబడ్డ గుండె ధైర్యం. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కాళోజీ నారాయణరావు అవార్డును ఆయన 10వ వర్ధంతి సందర్భంగా నాకివ్వటం నాకెంతో గర్వకారణంగా ఉంది.

ఇప్పటి వరకు నా జీవితంలో పొందిన అనేక పురస్కారాల కంటే కాళోజీ అవార్డు అందుకోవటం అన్నింటికన్నా ఉన్నతమైనదిగా భావిస్తాను. ఇప్పటి వరకు నా జీవితంలో అనేక సన్మానాలు పొందాను. కానీ కాళోజీ అవార్డు పురస్కారం నా జీవితానికి కొనసాగింపుగా చేస్తున్న సన్మానంగా భావిస్తాను. కాళోజీ మిత్రుల పేరుతో కాళోజీ ఫౌండేషన్ వారు ప్రకటించిన అవార్డును అందుకోవటం కంటే ఆనందం నాకింకొటిలేదు. ఎవస్టు శిఖరాన్ని ఎన్నిసార్లైనా అధిరోహించి రావచ్చును కానీ కాళోజీ స్థాయికి ఎదగటం మాత్రం కనాకష్టం. అందువల్ల ఈ అవార్డు తీసుకోవటం వల్ల కాళోజీ కావటానికి శాయశక్తులా కృషి చేయటమే చేయగలను. ఎందుకంటే కాళోజీ కావటం ఎవరికీ సాధ్యంకాదు కాబట్టి ఆ మార్గం లో కొన్ని అడుగులు వేసి నడిచేందుకు ప్రయత్నించటమే మనముందున్న కర్తవ్యం. నేను శాసనమండలిలో కాళోజీ నారాయణరావు ప్రాతిధ్యం వహించిన ఉపాధ్యాయ నియోజకవర్గం సీటులో ఆరేళ్ల్లు కూర్చున్నాను. నేను అనేకసార్లు శాసనమండలిలో సభ్యులందరికీ గర్వంగా చెప్పాను. నేను చుక్కా రామయ్యనే కానీ కాళోజీ వారసుణ్ణి అని చెప్పాను. ఆ వారసత్వంతోనే తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని గొంతెత్తి చెప్పగలిగాను. ఆ ధైర్యం, స్ఫూర్తి కాళోజీ అందించాడు.

తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని శాసనమండలిలో ధైర్యంగా బయటపెట్టగలిగినవాడు కాళోజీ నారాయణరావు. తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను కూల్చడానికి మహత్తర సాయుధ పోరాటమే జరిగింది. ఆంధ్ర మహాసభ చైతన్య దివిటీలను అందించింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించటానికి ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు ‘విశాలాంధ్ర’ సునాయాసన మార్గంగా భావించారు. విశాలాంధ్ర వస్తే ఫ్యూడల్ వ్యవస్థ పోతుందన్న భావనతో వాళ్లు ఒప్పుకున్నారు. మొత్తం ఆలోచనాపరులు అలాగే ఆలోచించారు. విశాలాంధ్ర వస్తే ఏం జరుగుతుందని ఆశించారు. అందుకు భిన్నంగా వాతావరణం మారింది. తెలంగాణలో పాతదొరలు పోయి ఆధునిక దొరలు ఆవిర్భవించారు. అందువల్లనే తెలంగాణ ఆగ్రహించింది. 1956 నుంచి మూడేళ్లలోనే మారిన పరిస్థితులు చూసిన ప్రజలు 1969 ఉద్యమ అగ్గి అయి భగ్గున మండారు. సమస్త తెలంగాణ ప్రజానీకం విశాలాంధ్ర జెండా వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎత్తుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయటం వల్లనే దీర్ఘయావూతగా రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతూ వచ్చింది.

తెలంగాణ నేల నుంచి పెండ్యాల రాఘవరావులాంటి ఉన్నతులు ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. భీమిడ్డి నర్సింహాడ్డి, మగ్ధూం, రావి నారాయణడ్డి, ఆరుట్ల రాంచంవూదాడ్డి, నర్రా రాఘవడ్డి, ఉప్పల మనుసూరులాంటి వాళ్లు శాసనసభ్యులుగా వచ్చారు. ఎమ్మెల్యేగా పనిచేసి కూడా చెప్పులు కుట్టుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ చరివూతలో ఉన్నతస్థానాలను అలంకరించిన ఉప్పల మనుసూరులాంటి మహానీయులు, ధర్మభిక్షం లాంటి ప్రజల మనుషులు పార్లమెంటు, శాసనసభ్యులుగా ఎంపికవుతూ వచ్చారు. ప్రజల హృదయాలను ఆవిష్కరించిన జననేతలే ఇక్కడ ప్రజావూపతినిధులుగా ఎన్నికవుతూ వచ్చారు తప్ప ఈ నేల నుంచి వ్యాపారవేత్తలను పార్లమెంటుకు పంపలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎంపీలను చూస్తుం కార్పొరేట్ రంగం నుంచి వస్తున్నారు.

ప్రజల హృదయాలలో ఉండగలిగినవారు చెప్పిన మాటకే సమాజమంతా కట్టుబడి ఉంటుంది. అందువల్లే కాళోజీ ఏ నినాదంతో పోరాడారో అదే నినాదంతో ఈ రోజు తెలంగాణ సమాజం కదిలివస్తుంది. ప్రజావూపతినిధి అంటే ప్రజల మనోభావాలను చెప్పగలగాలి. అన్యాయాలను ప్రతిఘటించినవాడు కాళోజీ. ప్రాంతాలకు అతీతంగా పోరాడగలిగిన ఉన్నతుడు కాళోజీ. మానవ హక్కుల కోసం గొంతు పెకిలించి పౌరహక్కుల నినాదమయ్యాడు. జన కవిత్వాన్ని పండించినవాడు. నిరంతరం ప్రజాఉద్యమాల్లో పాలు పంచుకున్నవాడు. అధికారాన్ని ధిక్కరించినవాడు. గొప్ప దేశభక్తడు అయిన మా అన్న రామేశ్వపూరావు భుజాల మీద పెరిగానని అందువల్లనే తాను అదృష్టవంతుణ్ణయ్యానని కాళోజీ చెప్పుకునేవాడు. కాళోజీకి కుటుంబ సంపదను, సామాజిక ఆలోచనల భావజాలాల్ని అందించిన అభ్యుదయ భావాల వనం రామేశ్వపూరావు.

ఇద్దరు అన్నదమ్ములు కాళోజీ రామేశ్వరావును, కాళోజీ నారాయణరావులను విడిగా చూడలేం. కాళోజీ ప్రతిష్ఠలో రామేశ్వరరావు కృషి ఉంది. నాకు చదువు చెప్పించిన న్యాయవాది తాండ్ర వెంకవూటామ నర్సయ్యకు కాళోజీ సోదరులు ఆప్తులు. ఆయన దగ్గరే కాళోజీ ప్రాక్టీసు చేశారు.
తమతో విభేదించే వారిని కూడా అక్కన చేర్చుకునే మనస్తత్త్వం తెలంగాణ ప్రజలకుంది. నాందేడ్‌కు చెందిన బి.టి. దేశ్‌పాండేను, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణారావును చెన్నూరు ఎమ్మెల్యేగా తెలంగాణ నేల ఆలింగనం చేసుకుంది. తెలంగాణ ప్రాంతం వారికి ప్రాంతీయ భేదాలు లేవు. ఇక్కడ ఇతర ప్రాంతాలవాళ్లు ఎంపీ లు, ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణవాళ్లను ఎవరినైనా ప్రజావూపతినిధులుగా ఎన్నుకున్నారా? తెలంగాణ ప్రజలకు ప్రాంతీయతత్త్వం ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు దుర్మార్గమైనవి. ఇది తెలంగాణపై మార్కెట్ సమాజం చేస్తున్న కుట్రలుగా భావించాలి. ప్రాంతీయతత్త్వంలేని విశ్వనరులు తెలంగాణ ప్రజలు.

ప్రపంచ తెలుగు మహాసభలను ఎందుకు బహిష్కరించాలంటే?
తెలంగాణే తెలుగు భాషను బతికించింది. తెలంగాణ ప్రజలు తెలుగు భాషను, తెలుగు సంస్కృతి రెండువందల సంవత్సరాలు తమ గుండెల్లో పెట్టుకుని కాపాడా రు. తెలుగుభాషంటే ప్రేమ, గౌరవం తెలంగాణ గుండె నిండా ఉంది. తెలుగుకు ప్రాచీన భాషా హోదా కోసం తెలుగునేలంతా తిరిగితే ఆనవాళ్ల ఎక్కడా దొరకలేదు. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్ల లభించటమే తెలుగుకు ప్రాచీన భాషాహోదా లభించడానికి కారణభూతమయ్యాయి. తల్లి శిశువును కాపాడినట్లు తెలుగు భాషను తెలంగాణ రక్షించింది. ఎన్నో దశలలో మనమంతా ఒక్క సూత్రానికి కట్టుబడ్డ తెలంగాణ ప్రజల్ని గేలిచేశారు. మా భాష ను, మా సంస్కృతి హేళన చేస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి. తిరగబడి తీరుతారు. అసలు ప్రాంతీయ విద్వేషాలను ఎవరు రెచ్చగొట్టారు? తెలుగు భాషను సంరక్షించి పోషించిన తెలంగాణను ద్వేషిస్తే, పలచనచేసి చూస్తే తెలంగాణ అస్తిత్వ ఉద్య మం పొడుస్తున్న పొద్దుగా పొడవదా మరి.

ఒక ప్రాంతం తెలంగాణ సంస్కృతి గేలిచేస్తుంటే ఇక్కడ మాత్రం దివాకర్ల వెంకటావధ శతజయంతి సభలు, గురజాడ అప్పారావు శత జయంతి సభలు జరుపుకున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు క్షోభిస్తుంటే, వేయిమంది దాకా ఆత్మబలిదానాలు చేసుకుని తమ ప్రాణాల్ని చెట్లకు వేలాడదీసి నినదిస్తుంటే రాష్ట్ర ప్రభు త్వం ప్రపంచ తెలుగు మహాసభలు ఎలా జరుపుతుంది? ప్రపంచ తెలుగు మహాసభల్ని అందుకే బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ మహాసభల్ని తెలంగాణ సమాజం బహిష్కరిస్తుంది. అధికారానికి లొంగిపోకుండా ధిక్కరించి నిలవమని చెప్పిన కాళోజీ స్ఫూర్తిగా ఈ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నాం.

ప్రపంచ మహాసభల పేరున తెలంగాణ ప్రజల గుండె గాయాలను మాన్పలేరు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు తెలంగాణలో జరుగుతున్న ఆత్మబలిదానాల గురిం చి ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరపటంలో అర్థం ఏమిటి? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తెలుగు భాష కోసం అక్కడి ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. మరి మన తెలుగుగడ్డ మీద వీళ్లు చేసింది. ఏమి టి? మన ప్రభుత్వం తెలుగు భాషను మార్కెట్ చేసింది. ఇపుడు ఈ తెలుగు మహాసభలను రాజకీయం చేస్తున్నారు. మనదంతా ఒకటే భాష అని భాషా కత్తిని ఉపయోగించి తెలంగాణ ఉద్యమాన్ని అణచటం కోసం తిరుపతిలో ప్రపంచ మహాసభలు జరుపుతారా? తెలుగు భాషాభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. అధికారం చేస్తు న్న కుట్రలకు వ్యతిరేకం. హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు పోలీసుల రక్షణలో చేయవలసిన గతి ఎందుకు ఏర్పడింది? చివరకు సదస్సు శాంతిభవూదతల సమస్యగా మారింది. హైదరాబాద్ నగరం మిలటరీతో నింపి జీవవైవిధ్య సదస్సు జరుపుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. జీవవైవిధ్య సదస్సులాగే పోలీసుల రక్షణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోండి.

ప్రపంచ మహాసభలలో చేసే సన్మానాలను తెలంగాణ ప్రజలు, కవులు, రచయితలు,క ళాకారులు తిరస్కరించి తీరుతారు. కాళోజీ పురస్కారాన్ని అందుకోవటం పద్మశ్రీ పురస్కారాలకంటే ఉన్నతమైనది. ఈ కాళోజీ పురస్కారం అందుకొంటున్న ఈ తరుణంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నాను. ప్రజల కోసం పనిచేసే మహత్తర ఉద్యమాల్లో మునుందు ముందుకు సాగటానికి ఓ కాళోజీ నువ్వు నాలోకి పరకాయ ప్రవేశం చేయమని వేడుకుంటున్నాను. నేను చాలా చిన్నవాణ్ణి. నాలో శక్తిని నింపమని కాళోజీని ప్రార్థిస్తున్నాను. కాళోజీ అవార్డు అందుకోవటం ద్వారా నేను ధైర్యాన్ని నింపుకుంటున్నాను.

మళ్లీ నేనెందుకు కౌన్సిల్‌కు పోనంటే?
శాసనమండలి అరణ్యరోదనగా మారింది. నేను ఎంపికైన ఆరేళ్ల నుంచి శాసనమండలిలో అజ్ఞాతవాసం చేసినట్లుంది. శాసనమండలి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా సమాజ కౌన్సిల్ ముందుకు వస్తున్నాను. కౌన్సిల్‌లో చైర్మన్ చక్రపాణి గంటకొట్టగానే కూర్చునేవాణ్ణి. ఆంధ్రమహాసభ నేర్పిన పాఠం, తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చిన శిక్షణ, జీవితాంతం క్రమశిక్షణ గల ఉపాధ్యాయునిగా జీవించటం వలన కౌన్సిల్‌లో చైర్మన్ బెల్‌కొట్టగానే వెంటనే కూర్చునేవాణ్ణి. నా మాటను, నా తెలంగా ణ ఉద్యమ మాటను శాసనమండలి వినేందుకు ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పం డి. అందుకే నేను ఆ డిసెంబర్ 9 తేదీనే అమెరికా నుంచి నా రాజీనామాను చైర్మన్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపాను. ఒక్కసారి రాజీనామా చేశానని ప్రకటించినవాణ్ణి తిరిగి మళ్ళీ పోటీకి దిగుతానా? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తిరిగి రాజకీయ పునరుజ్జీవిగా ప్రజల ముందుకు వస్తాను. అప్పటి దాకా శాసనమండలి వైపు చూడ ను. అట్లాని ప్రేక్షకుడిలా కూర్చోను. పాలకుర్తి సోమనాథుడు, బమ్మెర పోతనలు నడయాడిన పాలకుర్తి, గూడూరు నుంచి వచ్చిన వాడిగా, ఐలమ్మ సాక్షిగా, దొడ్డి కొమరయ్య చిందించిన రక్తతర్పణ సాక్షిగా దీర్ఘకాల తెలంగాణ పోరాట గాయాల గుండె ఘోషల సంతకంగా ప్రజల పక్షం వహించి నిలబడతాను.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

country oven

Featured Articles