విలువల సంపద విఠల్‌డ్డి


Sun,October 21, 2012 03:10 AM

తరాలు గడిచిపోతున్నాయి. తరాలతోపాటుగా విలువలు కూడా కనుమరుగవుతున్నాయి. గత తరం అందించిన త్యాగాలు, విలువలతో కొత్త తరాలు వికసిస్తాయి. గతంలో వున్న మహోన్నత విలువలే ఇప్పటి కాలం తనలో ఇమిడ్చుకొంటుంది. భీమిడ్డి నర్సింహాడ్డి మరణించినప్పుడు సూర్యాపేట సభలో వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అప్పటికప్పుడు ఆ సభలో కైకట్టి పాటపాడాడు. ‘తరమెల్లిపోతున్నదో... ఆ త్యాగాల స్వరమాగిపోతున్నదో..’అంటూ భీమిడ్డి త్యాగాన్ని కీర్తించాడు. ఆయన త్యాగాన్ని కీర్తించటమం మొత్తం తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసి న అమరులందరినీ కీర్తించటం. ఆ తరం సమాజమంతా సుఖశాంతులతో విలసిల్లాలని తమ ను తాము ఆత్మత్యాగం చేసుకున్నవారు. వ్యక్తిగతంగా తమకు ఏదో కావాలని ఆశించినవారు కాదు. సమాజహితాన్ని కోరుకుని కష్టాల బాటలో కదిలిపోయినవారు. అందుకే ఆ తరానికి చెందినవారు ఒక్కొక్కరుగా రాలిపోతుంటే ఆనాటి పోరాటాలు, తెలంగాణ మట్టిపై జరిగిన పెనుగులాటలన్నీ కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. నాటి పోరాటాలకు తొలి తరంగా నిలిచినవారంతా చేసిన పోరాటం అసాధారణమైంది. వాళ్లు భూమి, భుక్తి, విముక్తి కోసం రక్తతర్పణ లు చేశారు. దేశంలో భూసంస్కరణలు అమలు కావటానికి, దున్నేవానిదే భూమి అన్న పోరాటమే పునాది.

తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రాలిపోయాడు. ప్రపంచానికన్నా తన తెలంగాణ నేలే గొప్ప అనుకున్నాడు. తెలంగాణ ప్రజల మధ్యన ఉంటేనే ప్రపంచం మధ్యలో ఉన్నట్టుగా భావించి నిలబడ్డాడు. ఈ తరంవారు ఆయన ఎవరు అని అడుగుతారు. ఎమ్మెల్యే అంటే..ఇప్పటి ఎమ్మెల్యేలను చూసి ఆయన కూడా అందు లో ఒక ఎమ్మెల్యే అనుకుంటారు. ఎమ్మెల్యే అంటే నలుగురు గన్‌మెన్‌ల మధ్యలో తిరగడం అంతకన్నా కాదు. ఎమ్మెల్యే అంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రజాసేవకుడు. అందుకే ఎమ్మెల్యే కంటే ముందు ఆయన జీవితం, ప్రజలతో పెనవేసుకున్న తనం ముఖ్యం. ఆయన భూస్వామ్య కుటుంబంలోనే పుట్టాడు. కానీ ఆయన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. తన చదువుకున్నా ప్రజల కష్టాలు తొలగించటమే నిజమైన చదువు అనుకున్నాడు.అలా ప్రజల కోసం తపనపడ్డ వీరుల్లో విఠల్‌డ్డి ఒకరు. బడి మానుకుంటే మళ్లెప్పుడైనా చదువుకోవచ్చు. ప్రజల కష్టాలను తొలగించటం కోసమై తలడకపోతే తమ జీవితాన్నే వాయిదా వేసుకున్నట్టుగా నాటికాలంలో నాయకులు భావించారు.

ఆనాడు చదువంతా కూడా ప్రజల జీవితాల మార్పు కోసమే అనుకన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మార్క్సిజమే వజ్రాయుధమని న మ్మి అందుకోసం ఆతరం పోరాడింది. మార్క్సిజం చదువుకుంటే కలెక్టర్లము, పెద్ద పెద్ద ఉద్యోగులం కాబోమని మాకు తెలుసు. ప్రజా కంఠకులైన ప్రభువులకు ఏజెంట్లుగా మారేకన్నా ప్రజల కోసం జీవించటమే ఆతరం లక్యంగా మారింది. ఆనాడు రాజకీయాలం కాంట్రాక్టర్లకు ఏజెంట్లుగా మారటం కాదు. దొరల ఆగ్రహానికి సైతం సిద్ధపడి ప్రజల కోసం నిలబడ్డరు. అది కూడ హైదరాబాద్ పరిసరాల్లోని మెదక్ జిల్లాలో ఎక్కవమంది దొరలతో తలపడి ప్రజా చైతన్యాన్ని రగిలించారు. ఆనా డు మెదక్ జిల్లాలో కమ్యూనిస్టుగా పనిచేయటమంటే బోలివియాలో పని చేసినట్టుగానే భావించాలి. అలాంటి పోరాట ధార నుంచి వచ్చిన సాయుధ పోరా ట వీరుడు విఠల్‌డ్డి కన్నుమూశాడు. చెరువు కట్ట తెగిపోతే ప్రజలను ప్రోత్సహించి వారి పక్కనే నిలబడి తాను కూడా మట్టిమోసి ఆ చెరువుకట్ట గండి పూడ్చాడు. బడిని బహిష్కరించమని చెప్పి రోడ్డు మీదకు రావటం సులభమైన పని.

ఆ పిల్లల కోసం ఇల్ల్లిల్లూ తిరిగి నిధులు సమకూర్చడం, ఆరోజుల్లో హాస్టల్ నడిపించటం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన స్ఫూర్తితో హన్మకొండలో రాఘవరావు, సూర్యాపేటలో బొమ్మగాని ధరభిక్షం, నర్సాపూర్‌లో విఠల్‌డ్డి బడి పిల్లల చదువు కోసం హాస్టళ్లు నిర్వహించారు. పిల్లలను చదివించటానికి నడుంగట్టారు. ఆతరంలో ప్రజలకు మేలు చేయటమంటే చదువు అందుకు సాధనమని గుర్తించారు. గిరిజన విద్యార్థుల కోసం విఠల్‌డ్డి యాచన చేశారు. పర్మిషన్ కోసమైనా లాంటివాళ్ల సహకారం తీసుకోవటం నా కళ్లారా చూశాను. ఆప్రాంతంలో ఆనాటి గిరిజన విద్యార్థులకు ఆయన చేసిన సేవలు తెలుసును. గిరిజనులకు ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేశారు.

సంపన్నులకు సేవ చేస్తే పత్రికల్లో ప్రముఖంగా వస్తుంది. గిరిజనులకు, అట్టడుగు వర్గాలకు సేవ చేస్తే జనం నాలుకగా మారిపోతారు. విఠల్‌డ్డి ప్రజలకు సేవలు ఆందించి జన హృదయ కంఠహారంగా మారారు. చాలా నిక్కచ్చి మనిషి. శత్రు కూటమిపై ఎంత ధైర్యంతో విఠల్‌డ్డి దూసుకెళ్లాడో అదే తెగింపుతో స్వపక్షంలోని తప్పులను కూడా ఎత్తిచూపిన నికార్సయిన మనిషి. ఆలాంటి తెలంగాణ యోధుల జీవితాలను పుస్తకాలుగా తీసుకువస్తే అవి మహా ఉద్గ్రంథంగా మారుతాయి. త్యాగధనుల జీవితాలు నేటి సమాజానికి ఆణిముత్యాలుగా నిలుస్తాయి.

కనీసంగా బతికున్న నాలాంటి వాళ్లు కన్నీళ్లురాల్చి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. ఆనాటి కమ్యూనిస్టులు త్యాగధనులు. కమ్యూనిస్టు అంటే ఆనాడు తిట్టు పదం కాదు. ఆనాడు ఆ పదం ప్రజలకు జీవన వేదం. కమ్యూనిస్టులను ప్రజలు ప్రేమించారు. తమ గుండెల్లో దాచుకున్నారు. ఒక మంచి కమ్యూనిస్టుగా జీవితాంతం ఉండటం అందరివల్లా కాదు. చివరి దాకా విఠల్‌డ్డి కమ్యూనిస్టుగా బతికినందుకు ఆయనకు నా జోహార్లు.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర