ఉద్యమం: ముందడుగు, వెనుకడుగు


Wed,October 10, 2012 05:26 PM

ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే కొం దరు విద్యార్థులు నన్ను కలిసి ‘తెలంగాణ ఇంకెప్పుడొస్తుంది సార్. మంది బలిదానాలు చేసుకున్నారు. మిలియన్ మార్చ్‌లు జరిగాయి.. సకలజనుల సమ్మెను నిర్వహించాం. ఓయూ యుద్ధ క్యాంపుగా మారింది. ఇంకేమి జేయాలేసార్.’అంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వాకింగ్ మొదలుపెట్టాను.

భారత స్వాతంత్య్ర ఉద్యమంపై మార్కెట్ శక్తుల ప్రభావం లేదు. కానీ ఈ తెలంగాణ ఉద్యమంపై మార్కెట్ సమాజపు ప్రభావం తీవ్రంగా ఉన్నది.ఈ ఉద్యమానికి ప్రభుత్వంతోపాటుగా మార్కెట్ శక్తులు, వ్యా పా ర శక్తులు తీవ్రంగా అడ్డుపడుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక తెలంగా ణ నేలపైన అనేక చారివూతక పోరాటాలు జరిగాయి. ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిసిపడ్డప్పుడల్లా నాయకత్వమే పరీక్షకు గురైంది. తెలంగాణలో కొనసాగిన అనేక పోరాటాల దారుల్లో నాయకత్వం ముందుకు పోవ డం, అనేకసార్లు వెనక్కిపోవడం, ఒక్కొక్కసారి ఉపసంహరించుకోవడం జరిగింది. మళ్లీ కొంతకాలానికి ఆ ఉద్యమ ఉప్పు అందుకుని ఉరకలేయడం చూస్తూవస్తున్నాం. ఒకసారి వెనుకబడిన ఉద్యమం మళ్లొక్కసారి బలాన్ని పుంచుకొని మరో కొత్త ఉద్యమానికి పురుడుబోయడమే తెలంగాణ మట్టి నేర్పింది. తిలక్, లాలాలజపతిరాయ్ లాంటి దేశభక్తులు లాఠీదెబ్బలు తిన్నారు.అయినా ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు దానిని ఎలా నడిపించాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలని ఆచీ తూచీ అడుగులు వేశారు. దానికి కారణం ప్రాణనష్టం జరుగకుండా చూడాలన్నదే. గాంధీ ఉప్పు సత్యాక్షిగహం ఆరంభం చేసి పరిస్థితులను గమనించి తానే విరమించుకున్నాడు.క్విట్ ఇండియా నినాదాన్నిచ్చి ఆ తర్వాత విరమించుకోలే దా..? కారణం ఉద్యమం ఎటువైపు వెళ్లిపోతుందోనన్న ఆలోచన రాగానే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా దూరదృష్టితో ఆనాటి నాయకత్వం ఎత్తుగడల తో కూడిన విరమణాన్ని కొనసాగించింది. అణచివేత ఫలితంగా ఉద్య మం ఆగిపోతే ప్రజలు నిరాశకు గురవుతారు. ఇలాంటి సందర్భంలోనే నాయకత్వానికి అగ్ని పరీక్ష. ఈ పరీక్షా కాలంలో నాయకత్వం కేవలం లక్ష్య సాధనను మాత్రమే చూడకుండా తాము అనుకున్న పంథాలో ఉద్యమం కొనసాగుతుందా..? లేదా..? చూడాలి.

ఇతర దేశాల్లోని ఉద్యమాలకు మన నేలలో ఉద్యమాలకు తేడా ఉన్న ది. రాజకీయ పోరాటాల కన్న ఆర్థిక పోరాటం మరింత జఠిలమైంది. అది దీర్ఘకాలం కొనసాగుతుంది. తెలంగాణలో సాయుధ పోరాటం భూమి కోసం జరిగింది. సుదీర్ఘకాలం వూపజలు పోరాటం చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని.తెలంగాణ ఉద్యమం అస్తిత్వ ఉద్యమం. స్వ రా్రష్ట్ర ఉద్యమం. తన వనరులను కాపాడుకోవడం కోసం జరుగుతున్న పెనుగులాట. అభివృద్ధి పేరుతో తెలంగాణలో విధ్వంసం జరుగుతోంది. మానవ వనరుల విధ్వంసం యధేచ్చగా సాగుతున్నది. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమి కైంకర్యం చెందింది. వెట్టి చాకిరి వ్యతిరేక ఉద్యమాన్ని నా కళ్లారా చూశాను. అందులో పాల్గొన్నాను. ఆనాడు భూమి కోసం జరిగిన నినాదం లక్షలాది ఎకరాలను పంచడం ఎంత విజయ మో, అదేవిధంగా నాలుగువేల మంది ఈ నేలపై నేలరాలడం కూడా అంతే గుండెల్ని పిండేసే విషయం.ఆనాడు నిజాం రాష్ట్రాన్ని విలీనం చేసుకునే పేరుతో దిగిన కేంద్ర బలగాలు తెలంగాణను దుగ్గుదుగ్గు చేశాయి. ఆనాటి హోంమంత్రి పటేల్ కనీసం చర్చలకు కూడా పిలువకుండా మిలట్రి యాక్షన్ కొనసాగించాడు. వేలాది మంది కమ్యూనిష్టులు నేలకొరిగారు. మళ్లీ 60యేళ్ల తర్వాత తెలంగాణ మార్చ్ జరుగుతుంటే కేంద్రం,రాష్ట్రం కలిసి 40 వేలమంది పోలీసులు, కేంద్ర బలగాలతో హైదరాబాద్ నగరాన్ని నింపివేశాయి.అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణలో మారిందేందో అర్ధం కాని పరిస్థితి. మారనిది మాత్రం ఒకటే-తెలంగాణలో ప్రజా ఉద్యమం ఎగిస్తే దాన్ని అణచడానికి కేంద్ర , రాష్ట్ర బలగాలు కవాతు తొక్కడం.

21వ శతాబ్దంలో ఎగుస్తున్న ఉద్యమాలు మార్కెట్ సంస్కృతిని చీల్చుకుని ముందుకు సాగాలి. దీనికితోడు పాలకుల స్వభావం అర్ధం చేసుకోవాలి. ఇతరదేశాల్లో ఉద్యమాలు ఎందుకు ఎగిశాయన్న విషయంపై అధ్యయనం చేస్తారు. అందుకు కారణాలను వెతుక్కుని మూలాలను పరిష్కరించేందుకు సమాయత్తమవుతారు.అదే వాల్‌స్ట్రీట్ ఉద్యమంలో చూ శాం. లాటిన్ అమెరికన్ దేశాల్లో ఆ రకమైన పరిస్థితిని చూస్తున్నాం. కానీ మన పాలకులకు ఆ వారసత్వం లేదు. బ్రిటీష్ వారసత్వం వల్ల పాలనాయంవూతాంగం,పాలకులు, సమస్యల పరిష్కారానికి నడుం కట్టరు. అం దుకు తాజా ఉదాహరణ తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమం గురించి మాట్లాడటమంటే కేంద్రం సున్నితమైన సమస్య అని దాటవేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కేంద్రమే చూడాలని చేతులుదులుపేసుకుంటుంది. ప్రజల పాలన అంటే మన నాయకులు ఎన్నికలు, అసెంబ్లీలు, పార్లమెంట్‌లు అనుకుంటున్నారు. ప్రజా ఉద్యమాలను ఎలా చూడాలో మన పాలకులకు తెలియదు. ఎగిసే ప్రతీ ఉద్యమం ప్రభుత్వాలకు ఒక పరీక్ష. ఉద్యమాల్లో ఫలితాలను ఆలోచించకూడదు. ప్రతీ ఉద్యమం రాబోయే ఉద్యమానికి బాట వేస్తుంది. తెలంగాణ మార్చ్ మరిం త లోతైన ఉద్యమానికి దారిని వేస్తుంది.

తక్కువ హింసతో ఉద్యమ ఫలితాలను ఎ క్కువగా పండించేందుకు నాయకులు కృషి చేయాలి. ఉద్యమాల్లో హింసకు తావు లేకుండా చూడాలి. అందుకే ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఒక విశాలమైన ప్లాట్‌ఫాం కావాలి. అందరు అందులో కలవాలి. ఇదీ తెలంగాణ ఉద్య మం ముందున్న ప్రశ్న. మూడు తరాల ఉద్యమాలను గమనించాను. నా కళ్ల ముందే పిల్లలు రాలిపోవడం తట్టుకోలేకపోతున్నాను. పాలకులు ఇప్పటికైనా ఆలోచించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నడుం కడితే అందరికి మంచిది.

చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

country oven

Featured Articles