స్పూర్తి శిఖరం


Sat,October 6, 2012 02:58 PM

-డాక్టర్ చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ
(ఇవ్వాళ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి)Jaya-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ఉద్యమ చరివూతలో డిసెంబర్9 ఒక చారివూతక దినం. దశాబ్దాల కొద్దీ ఎడతెగకుండా అకుంఠిత దీక్షతో అచంచల విశ్వాసంతో ఎదుర్కొంటున్న ఆర్థిక , సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటంలో రాటుదేలారు. అందువల్ల వారి అలోచనా ధోరణి సునిశితం అవడమేకాకుండా హిరోయిక్‌గా మారారు. తెలంగాణ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏవిధంగా దోపిడీ కి, వివక్షకు గురవుతున్నదో ఆచార్య జయశంకర్ తన రచనల ద్వారా , ఉపన్యాసాల ద్వారా సాక్ష్యాధారాలను సేకరించి టీఆర్‌ఎస్ కు ‘మందుగుండులాంటి సమాచార సామాక్షిగిని అందించి ప్రభుత్వాన్ని వణికించేట్లు చేశారు.

సమస్యను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నం గా బలవూపయోగంతో ప్రజాపోరును అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యం తరఫున ఎంత బలవూపయోగం ఉంటుందో, అంతకంటే బలంగా సామాజిక ఉద్యమం పెరుగుతుంది. ఇది చారివూతక సత్యం. అంతేకాదు ప్రభుత్వ దమననీతి, అణిచివేత చర్యలకు మరింత అసంతృప్తి జ్వాలలు రేగాయి.

గతంలో వైయస్ అధికారంలోకి రావడంకోసం తన రాజకీయ అవసరాలను తీర్చుకోవడానికి వేసిన ఎత్తుగడల్లో భాగంగా తెలంగాణ ఉద్యమం అతనికి ఊతకపూర గా ఉపయోగపడింది. ఏరుదాటి తెప్ప తగలేసినట్లు వైయస్ అధికారంలోకి రాగానే చేసిన వాగ్దానాలకు తిలోదకా లిచ్చి తెలంగాణ ఉద్యమానికి ముంత పొగపెట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని ఉధృ తం చేయడంలో భాగంగా చేపట్టిన ధర్నా లు, బంద్‌లు, రాస్తారోకోలు వంటివే కాకుండా చివరకు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోవడంతో పరిస్థితి పతాక స్థాయికి చేరుకుంది. దానికి తోడు మారుమూల గ్రామాల్లో, తండాల్లో, గల్లీగల్లీలో తెలంగాణ ఉద్యమసెగ వ్యాపించింది. రెండోవైపు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు రగిలించిన చైతన్య జ్వాలలు తెలంగాణ విద్యాసంస్థలన్నింటినీ జ్వలింపచేశాయి. అదేసమయంలో ఎన్జీవోలు రంగంలోకి దిగారు. విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.

విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు మూకుమ్మడిగా ఉద్యమంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ దశలో మొదట్నుంచి తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిల్చిన ప్రొఫెసర్ జయశంకర్‌ను సంప్రదించి ప్రభుత్వం తరపున చిదంబరం చేసిన ప్రకటనలోని రెండు వాక్యాలు జయశంకర్ ఉద్యమ నిబద్ధతకు, మేధస్సుకు నిదర్శనంగా నిలుస్తాయి. అందులో ‘The centre on wednesday night announced that process of forming of the state of telangana would be intiated at appropriated resolution on move in the Andhra pradesh Assembly’.ఇది ఆయన అవిక్షిశాంత పోరాటానికి దక్కిన అధికారపూర్వక విజయపత్రం. అతని నిబద్ధత, నిమగ్నత సాధించిన ఈ విజయపత్రం ఊహకందని విధంగా చరివూతలో ఒక విజయచిహ్నంగా నిలిచింది. అందుకే ప్రజలు అతన్ని సిద్ధాంతకర్త అన్నారు. దీనికి ప్రణాళిక వేసింది జయశంకర్ .సాధించింది కేసీఆర్ .ఇదొక స్ఫూర్తి శిఖరం.

దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల ముఖాల్లోని ఆనందరేఖల్ని చూసి అసూయ పడ్డ కొన్ని రాజకీయశక్తులు ప్రకటన చేసినప్పటి నుంచి డిసెంబర్ 23 వరకు ఈ విజయ శిఖరాన్ని ఎలాకుల్చాలా అని ప్రణాళికలు వేశాయి.చాప కింద నీరులా ఆ ప్రకటన ఉనికికే ముప్పు తెచ్చారు. అందులో భాగమే డిసెంబర్ 23 న చిదంబరం చేసిన నయవంచన ప్రకటన. అందులో At a meeting of all political parties convened by the chief Minister of Andhra pradesh on December7, 2009, a consensus emerged on the question of formation of a separate state of Telangana. A statement was made on behalf of the central Government on December9, 2009 on receipt of minutes of the meeting.However, after the statement, the situation in Andhra pradesh has altered.A large number of political parties are divided on issue. There is need to hold wide ranging consultations with all political parties and groups in the state. Government of india will take steps to involve all concerned in the process ఒక్కొక్క వాక్యం తెలంగాణ సాధించిన ఉద్యమ శిఖరంపై పేల్చినటువంటి తూటా. ఈ విధంగా జయశంకర్, కేసీఆర్ నిర్మించిన ఈ శిఖరంపై ఎన్ని తూటాలు పడ్డాయో చూడండి! అంతేకాదు. ఈ భావనను భూస్థాపితం చేయడానికై నిష్ణాతులైన మనుషులని చెప్పి కాలయాపన చేయడానికి నియమించిన కమిషనే శ్రీకృష్ణ కమిటీ. అయితే తెలంగాణ ప్రజలు దానికి కృష్ణార్పణం పలికారు.

ఇక్కడొక ముఖ్యవిషయాన్ని గమనించాలి. జయశంకర్ ఒక చిత్తశుద్ధి గల ఉపాధ్యాయుడే గానీ ఎత్తుగడలు వేసే రాజకీయనాయకుడు కాదు. అతనికి దుష్ట రాజకీయాలు, వెన్నుపోట్లు, కుటిల ప్రయత్నాలు తెలియవు. ఇతరులను నమ్మడమే ఆయన జీవన విధానం. పరిష్కరించాల్సిన ప్రభు త్వం సమస్యను పార్టీలకు పంచిపెట్టింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఆయా పార్టీలు తమవంతు ‘రాజకీయాన్ని’ చేశాయి. అవి ఏకముఖాన్ని వదిలి బహుముఖాలు అయ్యాయి. ఈ లొసుగులన్నింటినీ చాకచక్యంగా సిమెంటింగ్ చేయడంలో అరితేరిన మన బ్యూరోక్షికసీ తన హస్తలాఘవం చూపింది. ఉపశమనం వరకు ఆగి తర్వాత తమ స్థాయి స్థిరపడిందనుకొన్న సమయంలో ప్రజలపైకి ఒక్కొక్క అధ్యాయాన్ని వదిలారు. శ్రీకృష్ణ కమిషన్ ఒక నాటకం కదా! అందులో ఒక్కో సీన్ ఒక్కొక్క అధ్యాయం.

ఈరోజు జయశంకర్ జయంతి. అతను నిర్మించింది ఒక స్ఫూర్తి శిఖరం. డిసెంబర్ 23న చిదంబరం చేసిన ప్రకటన , శ్రీకృష్ణ కమిషన్ వ్యాఖ్యలు ఆ శిఖరం పై కొన్ని తూటాలను పేల్చి ఉండవచ్చు కానీ అందులోనుంచి ఎగిసిపడుతున్న ఒక్కొక్క ఆగ్నికణం ఒక్కొక్క జయశంకర్ అవుతున్నాడని మీకు మనవి చేయదలిచాను. మిత్రులారా! ఇది మనకు క్లిష్ట సమయం. అందుకే మనకు అప్రమత్తత అవసరం. ఈనాటి జయశంకర్ జన్మదినం మనందరికీ ఒక సంకల్పదినం. ఈ గడ్డలో పుట్టినవానిగా మనమంతా ఆయన ఆశయసాధనకు, ఆయన స్వప్నించిన తెలంగాణ సాధనకు పునరంకితం అవ్వడానికి శపథం చేద్దాం. అదే జయశంకర్ జయంతి మనకిచ్చే సందేశం.

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర