చరిత్రగతి మార్చిన అధ్యాపకులు


Sat,October 6, 2012 02:48 PM

మనదేశం భినత్వంలో ఏకత్వానికి ఎంత ప్రతీకనో, వైవిధ్యాలకు కూడ అంతే ప్రతీక. ఒక్కొక్క ప్రదేశం ప్రజల త్యాగాలతో పునీతమైన ప్రాంతాలుగా వాసికెక్కాయి. వారు ఆనాడు ఎంతో దీర్ఘదృష్టితో నాటిన మొక్కలు, నేడు మహావృక్షాలై జాతి కి నీడను, ఫలాలను అందిస్తున్న తీరు ఆనందం కలిగిస్తున్నది. జయశంకర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా అక్కడి వైస్‌చాన్సలర్‌తో మాట్లాడుతుంటే యూనివర్సిటీ సమస్యల్ని జయశంకర్ ఎలా పరిష్కరించాడో అర్థమవుతుంది. జయశంకర్ సంపన్నకటుంబంలో పుట్టినవాడు కాదు. అతడొక సాధారణ ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించాడు.బాధ్యతగల ఉపాధ్యాయుడిగా ఎదిగాడు. తరగతి గదిలో కూర్చున్న విద్యార్థుల భవిష్యత్తే ఆయన ఆలోచన. మరోవైపు తన ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలను, కన్నీళ్లను చూసి వాటి పరిష్కారం గురించి ఆలోచించాడు.

సమస్యను తీర్చే ఆర్థిక వనరులు అతనికి లేకపోయినా, స్థితిగతులను మా ర్చాలన్న సంకల్పం మాత్రం దృఢంగా ఉండేది. ఆదిలాబాదులో టీచర్‌గా ఉంటూ తన ప్రాంతంలో ఉన్నత విద్యా వనరులు లేవని కుమిలిపోకుండా వాటి సాధనకు ఏం చేయాలో ఆలోచించాడు. దీనికి పరిష్కారం ఆలోచిస్తూ ్త ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆనాడు మెట్రిక్యులేషన్ అర్హతతో ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు చాలామంది తమ విద్యాలయాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతూనే తాము ఎదిగారు. జయశంకర్ తన ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఉన్నత విద్య వ్యాప్తి అయితేనే ఆప్రాంత వనరులు ప్రజల వినియోగానికి రాగలుగుతాయని భావించి తమ ప్రాంతానికొక యూనివర్సిటీ కావాలని ప్రయత్నించాడు. అందుకు ఎందరినో సంప్రదించి దానినొక ఉద్యమంగా మలిచి పోరాటంతో సాధించిందే కాకతీయ విశ్వవిద్యాలయం.పోరాటం చేసి యూనివర్సిటీ సాధించుకున్న వ్యక్తే యూనివర్సిటీకి వైస్‌చాన్సలర్ అయినప్పుడు, ఆనాడు తాము ఏ కలలు కన్నాడో వాటి సాధనకు కార్యరూపం ఇచ్చాడు. నేటి వి.సి. తమ యూనివర్సిటీలో ఒక్కొక్క శాఖలో జరుగుతున్న పరిశోధన ప్రగతి గురించి చెబుతుంటే, విన్న నా ఒళ్లు పులకరించింది.

తెలంగాణ వనరులు లేక కాదు. ఆ వనరులను వినియోగంలోకి తెచ్చే టెక్నాలజీ లేదు. దాని కోసం జయశంకర్ తపనపడ్డాడు. ‘వరంగల్ ఆర్‌ఈసి తమ ప్రాంత విద్యార్థుల తప్పుదోవ పట్టించింద’ని గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రబుద్ధుని విమర్శకు ‘టీవీ’ చర్చలో నేను జవాబిచ్చాను.బాలగోపాల్ వరంగల్లుకు రాకుంటే ఒక రామానుజం అయ్యేవాడేమోకాని, ఇంత గొప్పమానవతావాది అయ్యేవాడు మాత్రం కాదని చెప్పాను. ఈనేల వారసత్వం అది. ఈనేపథ్యంలోనే నేను పన్నేండు ఏళ్లు గడిపిన సిద్ధిపేట గుర్తుకు వచ్చింది. అది జిల్లా కేంద్రం కాదు. కాని నాలుగు జిల్లాల కూడలి. అలాగే అది సస్యశ్యామలమైన పంటలతో, తులతూగే ప్రాంతమూ కాదు. ఒకవైపున మగ్గాలు మూతపడి ఆకలితో నకనకలాడుతూ, ఆత్మహత్యలతో ఉరిశాలగా మారిన సిరిసిల్ల. రెండోవైపున తుపాకీ గుళ్లకు బలైన బెరాన్‌పల్లి, చేర్యాల, ఆకునూరులు.

మూడోవైపున అభివృద్ధికి నోచుకోని కామాడ్డి, చివరకు మెతుకు కరువైన మెతుకసీమ. ఆ ప్రాంతంలో ఒక వైపు తన ఉద్యోగం చేసుకంటూ తన భార్యా పిల్లల్ని కాపాడుకోవాలా? లేక ప్రాంతం లో విద్యాసేద్యం చేయాలా? అన్న ఆలోచనలు వెంటాడుతుంటే రెండవ దానికే ప్రాధాన్యమిచ్చిన వ్యక్తి గురవాడ్డి. గురవాడ్డి సిటీ కాలేజీలో ఒక ప్రతిభావంతుడైన గణితశాస్త్ర అధ్యాపకుడు. రామవరం నుంచి సద్దిమూటగట్టుకొని హైదరాబాదుకొచ్చి చదువుకున్న వ్యక్తి.తన చైతన్యాన్ని తన ప్రాంతానికి పంచాలని ఉద్యో గానికి రాజీనామా చేశాడు. జనంలో తిరిగాడు. సిద్దిపేటలో కాలేజీ ఏర్పాటుకు ముందుండి దాని స్థాపనకు కారకుడయ్యాడు. బహుశా కాలేజీ లేకుంటే సిరిసిల్ల ప్రాంతం నుంచి ప్రజా ఉద్యమాలు ఎగిసేవి కావు. ఆయనస్ఫూర్తితోఎంతో మంది గురవాడ్డిలు వచ్చారు. ఇవాళసిద్ధిపేట చుట్టువూపక్కల చదువుకున్న వాళ్లలో చాలామంది ఒక వర్క్‌ఫోర్సుగా తయారయ్యారు.

వారికి ఆ చైతన్య ఇంధనాన్ని అందించింది సిద్ధిపేట కళాశాలయే. ఇలాఆలోచిస్తున్నా కొద్దీ సామాజిక స్పృహతో, సామాజిక పరివర్తనకు చదువే ఒక ఆయుధం అని తలపోసి కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నించిన మహాత్ముపూందరో ఉన్నారు.వాళ్లంతా చరివూతకెక్కని చరితార్థులు. ఇక్కడి భూములు సారవంతమైనవి కావు కాబట్టి ‘సర్‌ప్లస్’మనీ లేదు. చైతన్యాన్ని మాత్రం ధారపోశారు. దాన్నే వారిజీవితంగా మార్చుకున్నారు. సాధారణంగా ఆస్తులిచ్చిన వారిని దానకర్ణులంటాం. ఆస్తులు లేకపోయినా తమ కుటుంబాలు గడవడం కష్టమయినా సహించి సామాజిక కర్తవ్యంగా విద్యాచైతన్యాన్ని అందించిన వారిని ఏమంటారో చరివూతకారులు నిర్ధారించాలి.

ఇక్కడ వనరులు లేవని,బద్ధకస్తులని పక్షపాతంతో కొందరు చేస్తున్న విమర్శల్ని తిప్పిగొడుతూ ఈ ప్రాంత సర్వతోముఖ వికాసానికి పూనుకోవడమే వారికి తగిన నివాళి. ఒక ప్రాంతం అభివృద్ధికి అధ్యాపకులు ఎంత కృషి చేయగలరో దానికి ప్రతీకలుగా జయశంకర్, గురవాడ్డిలు మిగిలారు. అధ్యాపకులే ఆప్రాంత చరిత్ర గతి మార్చగలరని నిరూపించారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి ఇలాంటి అధ్యాపకులు ఎందరో కృషిచేశారు. జీతాలను, జీవితాలను లెక్కచేయకుండా కృషిచేసిన ఆ త్యాగధనుల కృషిని ఈ నేల ఎప్పటికీ మరిచిపోదు.

-చుక్కా రామయ్య
శాసనమండలి సభ్యులు
(జయశంకర్, గురవాడ్డి స్మృతిలో..)

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles