నడక నాకు పాఠం


Sat,October 6, 2012 02:49 PM

ఏవూరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాకింగ్ చేయటం దినచర్యలో భాగం. ఏది మరిచినా వాకింగ్‌ను విడవను. ఇది శరీరం ఆరోగ్యం కోసమే కాదు. నా ఆలోచనల ఆరోగ్యాని కి కూడా అదే అవసరం. వాకింగ్‌లో వివిధవర్గాల తో కలిసే అవకాశం దొరుకుతుంది. ప్రజానాడిని అవగాహన చేసుకునేందుకు కూడా వాకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. సమస్యలతో పరిచయం భావి కార్యక్షికమానికి రూపురేఖలు దిద్దుకోవటం వాకింగ్‌లోనే జరుగుతుంది. గత 5 సంవత్సరాలల్లో వివిధ ప్రదేశాల్లో వాకింగ్ చేయటం జరిగింది. దాంతో ఆయా ప్రాంతాల దేశాల సామాజిక వ్యవస్థలు కూడా అర్థమయ్యాయి. అమెరికాలో వాకింగ్ చేశాను. అక్కడ స్థలానికి కొరతలేదు. మనిషి కనపడకుండా కొన్నిమైళ్లు నడవవచ్చును. కానీ కనపడిన మనిషి మాత్రం ‘గుడ్‌మార్నింగ్’ అంటారు. నేను కావాలనే నమస్కారం అంటాను. చైనాలో వాకింగ్ కోసం ప్రత్యేకమైన పార్కులున్నాయి. కానీ వాకింగ్ చేసేటప్పుడు వాళ్లు చప్పట్లు కొడతారు. ఒక రకంగా భజన లాంటిదది. చప్పట్లు ఎందుకు కొడతారని అడిగాను. ఏదైనా భక్త సమాజ బృం దమా అని అడిగాను. బహుశా నా అజ్ఞానాన్ని చూ సి వారు నవ్వారు.

అరచేతిలో కణాలను రక్తంలో కణాలను ఉదయం యాక్టివ్ చేయాలి. నడిస్తే కండరాలు యాక్టివ్ అవుతాయి. చప్పట్లు కొడితే అరచేతిలోని సూక్ష్మకణాలు యాక్టివ్ అవుతాయి. అందుకే చప్పట్లు కొడతామన్నారు. ఇండియాలో నేను గత 5 సంవత్సరాలల్లో శాసనమండలి నియోజకవర్గం పరిధిలో మూడు జిల్లాల పరిధిలో వాకింగ్ చేశాను. ప్రజలలో ఆరోగ్య స్పృహఎక్కువగా వచ్చింది. 20సంవత్సరాల క్రితం మా వూరి లో నేను వాకింగ్ చేస్తుంటే మీదేవూరని అడిగారు. కొత్తమనిషి కనపడితే గ్రామాల్లో ఆరాతీస్తారు. అదే మాదిరిగా నన్ను ఆ ప్రశ్న అడిగారు. నాది గూడూరే ఈ వూరే అన్నాను. గూడూరు నీవూందుకవుతుందని అన్నారు. నాకు ఊళ్లో భూమి లేదు. నేను ఏ వూరిలో ఉద్యోగం చేస్తే అదే నా వూరు అనుకున్నాను. వేసవిలో కూడా నేను మా వూరికి రాకపోతే నన్ను పరాయిమనిషే అనుకున్నారు. నా పుట్టుపూర్వోత్తరాలు చెప్పి నేను ఆ వూరి వాణ్ణే అ చెప్పుకోవాల్సి వచ్చింది.

వాకింగ్ చేస్తుండటం వల్ల నాకు ఈ విషయం తెలిసింది. నా వూరిలో నేనే పరాయినయ్యానని నా మనస్సు చితుక్కుమన్నది. గత 10 సంవత్సరాల నుంచి మా వూరుకు వెళ్లటం వూరు ప్రజలతో సంబంధం పెట్టుకోవటం, ముఖ్యంగా చిన్నపిల్లలతో కలిసి తిరగటం నా కార్యక్షికమంగా మార్చుకున్నాను. ఈనాడు కూడా నేను వరంగల్‌లో చాలా రోజుల తర్వాత ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లోవాకింగ్ చేస్తునాను. వరంగల్ సామాజిక సాహిత్య రంగానికి ఎంత కేంద్రమో రాజకీయాలకు కూడా అంతే కేంద్రం. నలుగురు కలిస్తే చాలు. ప్రపంచ రాజకీయాల నుంచి స్థానిక రాజకీయాల వరకు ఆ రచ్చబండపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వ చర్చ పోలీసు నీడల్లో జరుగుతుంది. ప్రభుత్వ చర్చ అధికారుల ప్రాబల్యంతో జరుగుతుంది. కానీ రచ్చబండ స్వేచ్ఛగా యథేచ్ఛగా ప్రజల మధ్య జరుగుతుంటుంది. చర్చల్లో మినీ వరంగల్‌ను చూడగలుగుతాను. అలా చూస్తునప్పు డే కొత్తపేటలో జూనియర్ కాలేజీలో వసతి సౌకర్యాలు లేవని అందుకు మీరేం చేశారని ప్రతాపడ్డి అడిగారు. వరంగల్‌లో ప్రతి వారు కాళోజీలే. వారికి ప్రధానమంత్రి కనపడ్డా, జడ్పీటీసీ సభ్యుడు కనపడ్డా ఒకటే. ఎవరినైనా నిలదీసి అడుగుతారు. నాకు మార్నింగ్ వాక్‌లో ప్రతాపడ్డి కలిసి అడిగాడు. ఆయన చెప్పిన ఆ కొత్తపేటకు రెండుసార్లు వెళ్లాను.

అక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతి సౌకర్యం లేదని ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాశాను. అందులో ట్రైబల్‌శాఖ వారితో అనుమతి తీసుకోవలసి ఉందని జవాబిచ్చారు. ట్రైబల్ శాఖ వారికి రెండు మూడుసార్లు నాకున్న పరిచయాలతో విజ్ఞప్తి చేశాను. కానీ మన పాలనా యంత్రాంగానికి చర్య తీసుకోవటం అలవాటు లేదు. సమస్యలు పరిష్కరించే దానికన్నా సమస్యలను నానపెట్టటమే చేస్తున్న పని. సమస్యను పరిష్కరిస్తే బహుశా తమ దగ్గరకు రారనో, తమ అవసరాన్ని ప్రజలు గుర్తించరనో నాన పెడుతుంటారనుకంటా! అదే జరిగింది. దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ ప్రతాపడ్డికి చెప్పాను. నాకు చరిత్ర అవసరం లేదు. ఇప్పుడేం చేస్తావో చెప్పమని అడిగాడు. అక్కడి స్థానిక ఎమెల్యేలతో చెప్తానన్నాను, ఇప్పుడే చెప్పమని సెల్ నా చేతిలో పెట్టాడు. ఇది వరంగల్ ప్రజల మనస్తత్వం. వాకింగ్ చేయటం వలన ప్రజావూపతిధులకు ప్రజల నాడి తెలుస్తుంది. ఆ సమస్యల తీవ్రత అందుకు పరిష్కారం చూపే వరకు వదలరు. అందుకే చాలామంది ఇంటిలో మిషన్ పెట్టుకునే వాకింగ్ చేస్తుంటారనుకంటా!

నా వాకింగ్ మూడు చుట్లు అయిపోయిన తర్వాత 50 మంది ఒక దిక్కున కూర్చు నన్ను పట్టుకొని వెళ్లి ప్రతిఅంశంపై ప్రశ్నించటం మొదలుపెట్టారు. అది సీబీఐ ఎంక్వయిరీ నుంచి ఏసీబీ ఎంక్వయిరీ వరకు నా అభివూపాయాన్ని అడిగారు. అంతేకాదు జగన్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి? దగ్గర నుంచి అనేక విషయాలు అడిగారు. ప్రశ్నలు సంధించటం, ప్రజల కోసం నిలబడటం వరంగల్ ప్రజల నిబద్ధత. పరకాల ఎన్నికల కంటే రాష్ట్ర భవిష్యత్తే ప్రధానం. హజా రే ఉద్యమంపై చర్చ మొదలయ్యింది. ప్రధానమైన కీలక అంశాలపై చర్చ జరిగింది. లంచగొండితనం పైన ఉద్యమం ప్రారంభమైతే అది ఎందుకు నీరుగార్చబడింది? దానిపైనా అభివూపాయం అడిగారు. అవినీతి మూలాలకు వెళ్లకుండా సమస్యలపై ఉద్యమాలు చేస్తే అవి కరిగిపోతాయన్నాను. కేంద్ర ప్రభుత్వం, కేంద్రం నాయకత్వంపై చర్చమొదలు పెట్టారు. దాని నుంచి గ్లోబల్ రాజకీయాలకు వచ్చారు. ఇరాన్‌పై అమెరి కా చేస్తున్న ప్రచారం వరకు చర్చను మళ్లించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలో కంటే ప్రజాకోర్టులో నిలబడి మాట్లాడటం ఎంత కఠినమైనదో అర్థమయింది. వరంగల్ ప్రజలు తలలూపే మనుషులు కాదు.

ప్రజావూపతినిధిగా వరంగల్‌లోనే కావాలనిపించింది. ఎందుకంటే? ఇక్కడ ప్రశ్నిస్తారు. తలలూపరు. ప్రశ్నించే విద్యార్థే ఉపాధ్యాయుణ్ణి చెక్కుతాడు. ప్రశ్నించే ఓటరే ప్రజల ప్రతినిధిని తీర్చిదిద్దుతాడు. వరంగల్‌లో వాకింగ్ నాకొక పాఠం, వరంగల్ నాకే కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పాఠం చెప్పగల స్థోమత గలది. కాళోజీ చనిపోతూ ఎంతమంది కాళోజీలను వదిలిపోయాడో నాకు ఆచరణలో అర్థమయ్యింది. అందుకే కాళోజీకి మరణం లేదు.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు


35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles