ఎంసెట్ లక్ష్యం ఏమిటీ?


Sat,October 6, 2012 02:50 PM

ఇంటర్మీడియట్ ఇంఫ్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ గురించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘ఇంప్రూవ్‌మెంట్’ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి? ఈ మార్కులను ఎంసెట్ ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్న విషయంపై వాదోపవాదాలు జరుగుతు న్నాయి. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై తమ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని తల్లిదంవూడులు ఆందోళన చెందుతుండగా, ఇంజనీరింగ్ కాలేజీలు మరో విధమైన టెన్షన్‌తో గడుపుతున్నాయి. ఏది ఎటుపోయినా తమ కాలేజీల్లోని సీట్లు నిండుతాయో లేదోనన్న కలవరంలో ఇంజనీరింగ్ కాలేజీలు కొట్టుమిట్టాడు తున్నాయి. ప్రభుత్వమే ఏనిర్ణయం తీసుకుంటే తల్లిదంవూడులు తమకు అనుకూలంగా ఉంటారోన ని యోచించి చివరికి వారికి అనుకూల నిర్ణయమే తీసుకున్నది. ఇలా ఎవరికి వారు తమ కోణం నుంచి, తమకు అనుకూలమైన ఫలితం రావాలని కోరుకున్నారు. ఇందులో తప్పులేదు.ఈ సందర్భంగా ఎంసెట్ ఎందుకు నిర్వహిస్తున్నారు? దీని అవసరం ఏమిటి? అని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఎంసెట్ లక్ష్యం ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు నింపడం కాదు. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ కోర్సు చేసేందుకు కావలసిన విద్యాపరమైన సన్నద్ధత ఉందా లేదా? అని పరిశీలించడమే ఎంసెట్ లక్ష్యం.

అయితే ప్రభుత్వం దీనిని విస్మరించి సాధ్యమైనంత వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయడమే ‘కర్తవ్యంగా’ పనిచేస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో మొత్తం సిలబస్‌పై విద్యార్థి అవగాహనను పరిశీలించడం సాధ్యం కాదు. ఇంటర్ పరీక్షల్లో ఛాయిస్ ఉండటమే కారణం. మొత్తం సిలబస్‌లో 60 శాతం సబ్జెక్టుపై మాత్రమే విద్యార్థి అవగాహనను పరిశీలిస్తున్నారు. అందువల్ల ఎంసెట్ లో మొత్తం సిలబస్‌పై అవగాహనను పరిశీలించి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదివేందుకు విద్యార్థి ఏ మేరకు సన్నద్ధంగా ఉన్నాడో చూడాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ అకడమిక్ పరీక్ష. ఎంసెట్ పోటీపరీక్ష. అకడమిక్ పరీక్షల్లో పరిశీలించే అంశాలు వేరు. ఎంసెట్ పోటీ పరీక్షల్లో పరిశీలించే అంశాలు వేరు. ఉదాహరణకు మేథమేటిక్స్‌లో ఇంటర్‌లో ఒక సమస్యకు సరైన సమాధానం వస్తే చాలు. కానీ ఇంజనీరింగ్‌కు వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్‌కు ప్రోడక్టు (ఆన్సర్) మాత్రమే కాదు, అది చేసే విధానం పాసెస్) కూడా ముఖ్యమే. అలాగే ఇంటర్‌లో ఒక కాన్పెప్ట్‌పై ఆధారపడి ప్రశ్న రూపొందుతుంది.

అయితే ఇంజనీరింగ్‌లో రెండు, మూడు కాన్సెప్ట్‌లను కలిపి ఒక సమస్యకు పరిష్కారం అన్వేషించాల్సి ఉంటుంది. అందుకే ఈ నైపుణ్యాల ను ఎంసెట్ ద్వారా విద్యార్థిలో ఉన్నాయా? లేదాని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ మాత్రం పరిశీలన జరుగకుండా విద్యార్థులను ఎంపిక చేస్తే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యి కూర్చుంటున్నారు. ఎంసెట్‌ను ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు నింపే వాహకంగా చూడకుండా ఒక ‘ఆప్టిట్యూడ్ టెసు’్ట తరహాలో చూడాల్సి ఉన్నది.
మన ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా వచ్చే విద్యార్థు లు భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేయాలని ఆశపడటం లేదు. ఐఐటిలో చదివే విద్యార్థులు ఆలోచనల్లో నవ్యపంథాలో వెళ్ళాలని భావిస్తున్నందున ఐఐటి,జెఇఇ పరీక్ష కూడా అందుకు తగ్గట్టు ఉంటుంది. ఆ పోటీ పరీక్షలోని ప్రశ్నలకు జవాబులు కనుగొనాలంటే విద్యా ర్థి నూతన పంథాలో ఆలోచించాల్సి ఉంటుంది. కానీ మన ‘ఎంసెట్’లో అలాంటి ప్రశ్నలు ఉండాలని ఆశించడం లేదు. అలాగే మన ఇంజనీరింగ్ కాలేజీలు పరిశోధనలయాలుగా మారాలని భావించడం లేదు.

కనీ సం సాంకేతికంగా మెయింటెనెన్స్ చేసే నిపుణుల నైనా ఇంజనీరింగ్ కాలేజీలు అందివ్వాలని భావించడంలో తప్పులేదు. కనీసం ఈ ప్రయత్నమైనా నెరవేరాలంటే ఎంసెట్ ద్వారా ఎంపికయ్యే విద్యార్థులను అటువంటి లక్షణాలున్నవారిని ఎంపిక చేయాలి. ఎంసెట్ విద్యార్ధుల జ్ఞాపకశక్తి (మెమరీ)ని పరీక్షించే టెస్టుగా మిగలరాదు. ఎంసెట్‌లో చాలవరకు విద్యార్ధి జ్ఞానాన్ని ఒకే కోణం నుంచి పరీక్షిస్తున్నారు. అయితే అభ్యర్థి తార్కిక, విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించేలా ఎంసెట్ పరీక్ష ఉండాలి. ఇలా జరుగకపోవడం వల్లనే ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్ధులు ఫస్ట్, సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్ స్థాయిలో గణిత, భౌతిక శాస్త్రాలలో సూత్రాలు తెలుసుకుంటే చాలు. అయితే ఇంజనీరింగ్‌లో వాటి అనువర్తన (అప్లికేషన్) చేయాల్సి ఉంటుంది. మరి ఎంసెట్ రాసే విద్యార్ధులకు ఆ కోణం ఉందా లేదాని పరిశీలించకుండా సీట్లు నింపితే భవిష్యత్తులో వైఫల్యాలే ఎదురవుతాయి.

మన దేశంలో తప్ప ఇతర ఏ దేశాల్లోనూ ఉన్నత విద్యావకాశాలు అందుకునేందుకు ఎంట్రెన్సు లు లేవు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థి ప్రతిభ ఆధారంగానే పై చదువులకు సీట్లు ఇస్తుంటారు. ఇందుకు టీచర్‌నే విశ్వాసంలోకి తీసుకుంటారు. అయితే మనం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశాం. బోధనా అంశాలు, పద్ధతులు ప్రశ్నాపవూతాల రూపకల్పన, విద్యా విషయక సమస్యలు మొదలైన వాటితో టీచర్ జోక్యం లేకుండా చేసి చేతులు దులుపుకున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయం కనుగొన్నామా? అంటే అదీ లేదు. దానిని మార్కెట్ శక్తులకు అప్పగించేసి ఊపిరి పీల్చుకున్నాం. ఇందుకు ఎంసెట్ మంచి ఉదాహరణ. పోటీపరీక్షలో విద్యార్థులు ఎక్కువ మంది ఉండి ఇంజనీరింగ్ సీట్లు తక్కువ సంఖ్యలో ఉంటే పటిష్టమైన ప్రశ్నాపత్రం తయారుచేసి విద్యార్థులను వడపోసి, మంచి ఇంజనీర్లుగా తయారయ్యే లక్షణాలు, సామర్థ్యాలు గల వారినే ఎంపిక చేయవచ్చును.

కానీ మనమేం చేశాం? పోటీపడే విద్యార్థులకంటే ఎక్కువగా సీట్లు ఉండేలా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఎడాపెడా ఇచ్చేశాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి వాటిలో సీట్లు నింపే బాధ్యత ప్రభుత్వమే నెత్తిన ఎత్తుకుంది. ఇందుకు ఎంసెట్‌ను రానురాను సరళతరం చేసే పనిని విజయవంతంగా చేపట్టింది. ఎంసెట్ ప్రశ్నాపవూతాల రూపకల్పనకు ఒక క్వశ్చన్ బ్యాంక్ రూపొందించి అందులో నుంచే ప్రశ్నలు ఇస్తామంటోంది. ఇకేం విద్యార్ధుల చేత ఈ తరహా క్వశ్చన్ బ్యాంకులను ‘రుబ్బిం చి’ కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల వరద సృష్టించి వ్యాపారాన్ని మరింత పెంచుకుంటున్నాయి. ఈ బాధంతా మనం మంచి ఇంజనీర్లను తయారుచేయకపోతే మనకు వచ్చిన వాణిజ్య అవకాశాలను ఇతర దేశాలు తన్నుకుపోతాయనే.

స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం వాటా క్రమేపీ పెరుగుతోంది. దేశంలో ఉపాధి కల్పనకు కల్పవృక్షంగా సేవారంగం మారింది. ప్రపంచీకరణ తెస్తున్న అవకాశాలను సేవారంగం అందుకోవాలంటే సాంకేతిక యుగంలో మంచి ఇంజనీర్లను తయారు చేయాల్సి ఉన్నది. అందుకు ‘ఎంసె ట్’ ఎంట్రెన్స్ తొలిమెట్టు. కాబట్టి దీని ప్రక్షాళనకు నడుం బిగించాలి.

- చుక్కా రామయ్య
విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర