సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం


Thu,October 3, 2013 12:31 AM

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు.2009,సెప్టెంబరు 2న తన తండ్రి చనిపోయే నాటికి రాష్ర్ట అధికార యంత్రాంగంలోను, రాష్ర్ట కాంగ్రెస్ పార్టీలోను ఆధిపత్యా న్ని సాధించారు. తండ్రి శవం ఇంటికి రాకముందే వందకు పైగా శాసనసభ్యులతో సంతకాలు చేయించి రాష్ర్ట ముఖ్యమంత్రి అయ్యేందుకు కుట్ర పన్నారు. కాని కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆ కుట్రను గ్రహించి రోశయ్యను ముఖ్యమంవూతిని చేసింది. నాటినుంచి ఆంధ్రవూపదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్ చేయ్యనిది లేదు. అందులో భాగంగానే జైలునుంచి విడుదపూైన మరుక్షణం నుంచి సీఎం అయ్యేందుకు పావులు కదుపుతున్నాడు. ఈ క్రమంలో నే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉపయోగించుకొని రాబోయే ఎన్నికలు ఉమ్మ డి రాష్ర్టంలో జరిగేట్లు పథకం రచించి హైదరాబాద్ నగరంలో ‘సమైక్య శంఖారావం’ పేరుతో అల్లర్లు సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాడు. వచ్చే మే నెలలో ముఖ్యమంత్రి అయ్యేందుకు అడుగుదీసి అడుగు వేస్తున్నాడు.

ఉమ్మడి రాష్ట్రాన్ని దోచుకున్న జగన్, ఈ దోపిడీని కొనసాగించేందుకే గత 2009 డిసెంబర్ 10 తేదీనుంచి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును అడ్డుకుంటూ పార్లమెంటులో ప్ల కార్డులు ప్రదర్శించి డిసెంబర్ 23 ప్రకటన వచ్చేంతవరకు అన్ని విధాలుగా రాష్ర్ట ఏర్పాటును తన శక్తి మేరకు అడ్డుకున్నాడు. ఆరోజు నుంచి తెలంగాణ ప్రాంతంలో రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షను ప్రజల్లో లేదనిపించేందుకు ఓదార్పు యాత్ర పేరుతో తిరిగేందుకు ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ 2010, మే 27న మానుకోట సంఘటనతో తెలంగాణ ప్రజలు భగ్నం చేశారు. తెలంగాణ ప్రజలను రక్తపు ముంచైనా తెలంగాణ వాదం లేదనిపించాలని స్థానిక గుండాలతో కలిసి చేసిన ప్రయత్నాన్ని వీరతెలంగాణ ప్రజలు జగన్ గుండాలకు, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందు కు తీసుకుపోయి జగన్‌ను నల్గొండ జిల్లా ఆలేరు మండలం వంగపల్లి నుంచే వెనక్కి తరిమారు.

ఈ సంఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు యువకులు తీవ్రంగా గాయపడి శాశ్వత, పాక్షిక అంగ నేటికి కృంగిపో తూ ఉద్యమంలో ఉప్పెనలా కదులుతున్నారు. ఆ మానుకోట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని తమ రక్తంతో మరింత ఎరుపెక్కించి సమైక్యవాదులైన వెఎస్ విజయమ్మ, షర్మిల, చంద్రబాబు, నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిలను సిరిసిల్ల, మహబూబ్‌నగర్, పాలకుర్తి, రాయినిగూడెంలో తరిమికొట్టి తెలంగాణ వారసత్వాన్ని నిలబెట్టారు. ఈ పోరాట స్ఫూర్తితోనే మూడేళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి జూలై 30న మధ్యాహ్నం యుపిఎ సమన్వయ కమిటీలో హైదరాబాద్ రాజధానిగా 10జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తీర్మానం చేసింది. ఆ సాయింత్రం కాంగ్రెస్‌పార్టీ అత్యున్నత విధాన నిర్ణయక మండలి వర్కింగ్ కమిటీలో కూడా తీర్మానం చేసి రాష్ర్ట ఏర్పాటును ప్రకటించింది.

జూలై 30న కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై అనుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిసిన వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నాలుగు రోజులముందే తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామలు చేసి తమ తెలంగాణ వ్యతిరేక బుద్ధి ని చాటుకున్నారు. పరకాల ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రాంతంలో శాసనసభ స్థానాన్ని బొని కొట్టేందుకు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామని, ఈ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరొక అడుగు ముందుకేసి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. కానీ అమరుల కుటుంబాలు వారిచ్చే ఆ సొమ్మును ఆ నాయకుల మొఖం మీద కొట్టి వారి ఆర్థిక సహాయాన్ని తిరస్కరించారు. దీంతో పాటు పరకాల ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థిని ఓడించారు. నాటి నుంచి కేంద్రం జరిపిన తొమ్మిది పర్యాయాల చర్చలలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు విషయం తమ చేతుల్లో లేదని, కేంద్ర చేతిలో ఉందని, భారత రా జ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం రాష్ర్టం ఏర్పాటు చేయండి అన్నారు. కానీ.. ఇప్పుడు తెలంగాణ ప్రకటన రాగానే తమ అసలు రూపా న్ని ప్రదర్శిస్తూ సమైక్య రాగాన్ని అందుకున్నారు. ఈ ఊసర తత్వాన్ని గమనించిన ఆ పార్టీ తెలంగాణ నాయకులు ప్రజల అబీష్టంమేరకు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో వైఎస్ జగన్‌కు స్థానం లేకుండా చేశారు.

దీంతో దిక్కుతోచని వైఎస్‌ఆర్‌సీపీ అటు సీమాంవూధకు, ఇటు తెలంగాణ కు సమ న్యాయం చేయాలంటూ కొత్త నినాదం అందుకున్నారు. దీని ఆసరాతో మళ్లీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు షర్మిల రాయలసీమ పర్యటన చేశారు. ఈ పర్యటనలో హైదరాబాద్ నగరాన్ని పాకిస్థాన్‌తో పోల్చి తమ ఫ్యాక్షన్ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు. హైదరాబాద్‌లో తన భర్త బ్రదర్ అనిల్ నాయకత్వంలో మతం పేరుతో నిరుపేదల భూములు ఆక్రమించి ఇంద్ర భవనాలను నిర్మించుకున్న షర్మిల రోజుకోమాట, పూటకోపాట పాడుతున్నది. ఇది చూసి బెంబెపూత్తిన చంద్రబాబు మాంధ్ర అభివృద్ధికి 5లక్షల కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసి మళ్ళీ యుటర్న్ తీసుకొని షర్మిల లాగానే సమన్యాయం చేయలంటూ తిరిగారు. చంద్రబాబు కూడా తమ నినాదమే అందుకోవడంతో తాము సీమాంవూధలో వెనక బడుతామనే కారణంతో గతంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా ‘సమైక్యాంధ్ర’ కొనసాగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.

జగన్ ఆదేశాలతో సీమాంవూధలో నేడు సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ఉన్మాధం జరుగుతున్నది. దీంతో సీమాంవూధలోని మెజారిటీ ప్రజల అభివృద్ధి కుంటుపడింది. లాభాలు సాధిస్తున్న ఆర్టీసీ, సీమాంవూధలో నష్టాల్లో కూరుకుపోయి, అక్కడి ప్రైవేటు ఆపరేటర్లకు ప్రజల సొమ్ము దోచిపెట్టింది. 50 రోజులుగా సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు తమ సంస్థ మనుగడను పాతాళానికి తొక్కారు.ఎక్కిన కొమ్మనే నరుక్కుంటున్నారు. ఇంకొక వైపు ప్రైవేటు విద్యాసంస్థలను నడిపిస్తూ, పేద ప్రజల పిల్లలు చదివే పాఠశాలలను మాత్రం మూసివేయించారు.

వైఎస్ జగన్, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు సరసన చేరి వారిలాగానే ఎంతటి ఉన్మాదాన్నైనా సృష్టించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే సమైక్యాంధ్ర తీర్మానం చేద్దాం శాసనసభ ను సమావేశ పరచండంటూ రాష్ట్ర గవర్నరును కలిశా రు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుచేస్తే సీమాంవూధలోని ప్రాజెక్టులకు నీళ్ళు రావంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. అలాగే సెప్టెంబర్ 7న అశోక్‌బాబు చేసిన హైదరాబాద్ దండయావూతను తానుకూడా కొనసాగిస్తానని, అ క్టోబర్19న హైదరాబాద్‌లో ‘సమైక్య శంఖరావం’ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తున్నాడు. అందులో సమైక్య వాదులందరు పాల్గొనాలని పిలుపునిస్తున్నాడు. సభ పేరుతో హైదరబాద్‌లో తన తండ్రిలాగే మారణహోమం సృష్టించే ప్రయ త్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు ఏకమై ఈ దుర్మార్గమైన కుట్రను చేధించాలి. జగన్‌ను సీమాంవూధకు తరిమికొట్టాలి. ఒక మరో మానుకోట, ఒక మరో రాయినిగూడెం,పాలకుర్తి, మహబూబ్‌నగర్‌లను సృష్టించాలి. అప్పుడే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును, హైదరాబాద్ నగరాన్ని సాధించుకోగలుగుతాం.

-చిక్కుడు ప్రభాకర్

98

CHIKKUDU PRABHAKAR

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘