ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?


Mon,September 16, 2013 12:32 AM

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి సీమాంవూధలోని రాజకీయ పార్టీలు..,గత డిసెంబర్ 2009 తర్వాత ప్రవర్తించిన విధంగానే తెలంగా ణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలు పెట్టాయి. 2009 డిసెంబర్ 10 నుంచి కృత్రిమ ఉద్యమం సృష్టించి, డిసెంబర్ 23 నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకొనేలా చేసి గత మూడేళ్లుగా అనేక మంది చనిపోయేందుకు కారణమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుల ఆటలు సాగవని,సీమాంధ్ర ఉద్యోగులను రంగంలోకి దించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే సీమాంధ్ర ప్రాంతం ఎడారి అవుతుందని, హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు ఉద్యోగాలన్నీ సీమాంధ్ర ప్రాంతానికి దక్కవని, హైదరాబాద్‌ను అభివృద్ధి తమది కాకుండా పోతుందనే అబద్ధాల పునాదుల మీద సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ఈ కొనసాగింపే ‘సేవ్ ఆంధ్రవూపదేశ్’ సభ. ఈ పేరుతో సీమాంధ్ర ఉద్యోగుల ముసుగులో జరపతల పెట్టిన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల దాడి.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ రాజ్యాంగానికి అతీతంగా సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలమీదికి ఎగదోస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఈ దేశంలో 15 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రాల లో నీరుగాని, ఉద్యోగాలు కాని, ఆస్తులుగాని, అప్పులు గాని ఇంకా ఇతర వనరుల పంపిణీ రాజ్యాంగ చట్టాలకు లోబడి జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అతీతం కాదు. అందు లో భాగంగానే కేంద్ర క్యాబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు నోట్ రాగానే క్యాబినెట్ తీర్మానం చేసి, మంత్రివర్గ ఉపసంఘం (క్యాబినెట్ సబ్ కమిటీ లేదా మంత్రుల సంఘం) ఏర్పాటు చేసి చట్టాలకు లోబడి ఆంధ్రవూపదేశ్‌లో కూడా వనరుల పంపిణి జరుగుతుంది. ఇదంతా సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు, సీమాంధ్ర గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగస్తులకు స్పష్టంగా తెలుసు. ఇవన్నీ తెలిసినా ఎవరి కోసం ఈ సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారంటే.. కేవలం రెండు ప్రాంతాలను దోచుకుతిం టున్న పెట్టుబడిదారుల కొరకే. ఇందులో అమాయక ప్రజలు, సీమాంధ్ర ఉద్యోగులు పావులు మాత్రమే.

వాస్తవ విషయాలను మరుగుపర్చి రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేందుకు సీమాంధ్ర దోపిడీ దారులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగమే ‘సేవ్ ఆంధ్రవూపదేశ్’ హైదరాబాద్ సభ. ఉద్యోగస్తులకు ఈ విభజనతో ఎటువంటి అన్యాయం జరగదు.విభజన బిల్లులో ఉద్యోగస్తుల లెక్క, వారి మౌలిక అంశాలు స్పష్టంగా పొందుపరుచబడతాయి.ఉద్యోగులు తమ భయాలు, అనుమానాలేవో చెప్ప కుండా, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ చేయడం అప్రజాస్వామికం. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేర ఇంకో అడుగు ముందుకేసి తెలంగాణ విద్యార్థులు, మేధావులను ఆఖరికి జై తెలంగాణ అని నినదించిన కానిస్టేబుల్‌ను కూడా చితకబాది, సమైక్యాంవూధగా ఉంచకపోతే పీకలు తెగకోస్తామంటూ హెచ్చరించడం దుర్మార్గం కాక మరోటి కాదు.

తెలంగాణ పదాన్ని శాసనసభలో ఉచ్ఛరించవద్దని మాట్లాడిన చంద్రబాబు, తెలంగాణ ఏర్పడితే వీసా తీసుకెళ్ళాలని మాట్లాడిన రాజశేఖర్‌డ్డి వారసులకు, తెలంగాణ ప్రాంతాన్ని సకలం దోచుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు వారసులయ్యే ముందు తాము చేస్తున్న చారివూతక తప్పిదాన్ని గుర్తించాల్సిన అవసరం సీమాంధ్ర ఉద్యోగస్తులకు ఉన్నది. కాని పరుచూరి అశోక్ బాబులాంటి నాయకత్వం సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుంటే కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని కొయ్యగుపూరాల్లా మారవద్దని సీమాంధ్ర ఉద్యోగస్తులను మరొకసారి కోరుతున్నాం. నేడు తెలంగాణ ప్రాంతం కడుపుకాలి ఉన్నది. వేలాది మంది బిడ్డలను పోడగొట్టుకొని ఉన్నది. దశాబ్దాల పోరాట ఫలితంగా రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం వచ్చింది.
ఇటువంటి సమయంలో, ఈ ప్రాంతంలో సమైక్యాంధ్ర సభ పెట్టడానికి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, మీడియా ఏకమై చట్టాలను తుంగలో తొక్కి సభకు అనుమతిస్తే జరిగింది ఏమిటీ? భారత రాజ్యాంగంలోని అధికరణ- 3 ను మేము అమలు చేయనియ్యం అని హెచ్చరికలు చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ సభలో రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన 19 నిబంధనలను పాటించలేదు. ఉద్యోగస్తులు మాత్రమే ఈ సభలో పాల్గొనాలని, వారుకూడా దరఖాస్తులో పేరుకొనబడిన మూడువేలమంది మాత్రమే పాల్గొనాలని, సభవేదిక మీదికి ఉద్యోగస్తులు తప్ప ఎవరు పోవద్దని, పాల్గొనే ఉద్యోగస్తులందరు తమ ఉద్యోగనిర్ధారణ కార్డు అధికారులకు చూపెట్టి మాత్రమే లోపలికి పోవాలని, సమయం 2గంటల తర్వాత నుంచి 5 గంటల లోపల మాత్రమే సభను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఏ ఒక్క నిబంధనను కూడా పాటించలేదు. పాల్గొన్న వారిలో కేవలం 5నుంచి 10 వేలమంది మాత్రమే ఉద్యోగులు కాగా, మిగతా వారందరూ ఉద్యోగేతరులే. సభను నడిపించిన వారిలో కేవలం అశోక్‌బాబు, అతని 10 మంది మిత్రులు తప్ప మిగితా వందమంది ఉద్యోగేతరులే.

ఈ సభలో మాట్లాడిన వారంతా నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతూ వాస్తవాలకు విరుద్ధంగా ఊహజనిత విషయాలనే పదేపదే వల్లించారు. ఇంకో వైపు ప్రజలను, విద్యార్థులను, ఉద్యమకారులను ఆఖరికి తెలంగాణ జర్నలిస్టులను కూడా వదలకుండా వారిమీద దాడులు చేస్తూ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నారు. మిలియన్ మార్చ్‌లు జరుపుతామంటూ హెచ్చరించారు. ఇంత జరుగుతుంటే ఇంకా ప్రజాస్వామిక విలువలకు అర్థం ఏమిటి? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు సీమాంధ్ర ఉద్యోగులకు ఎక్కడిది?.

తెలంగాణలో తమ బిడ్డలు చనిపోతే ప్రజలకు, విద్యార్థులకు కనీసం చనిపోయిన వారికి నివాళులు అర్పించేందుకు పదిమంది గుమిగూడి రెండు నిమిషాలు మౌనం పాటిస్తామంటే అవకాశం ఇవ్వలేదు సరికదా, వారిమీదికి బాష్ఫవాయువులు, లాఠీచార్జీ, రబ్బరు బుల్లెట్లు, ఇనుప పెల్లెట్లు, బుల్లెట్లు దించి ఎందరినో పొట్టన పెట్టుకున్నది ఈ ప్రభుత్వం. ఇలా ఎందరి మరణానికో కారణమైన ఈ పోలీసు వ్యవస్థ సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు బానిస వ్యవస్థ కాక ఇంక ఏమవుతుంది? సీమాంవూధ దుర హంకారులకు తాము రాజులమని, తమకు ఎదురులేరని రాజ్యాంగాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామని బహిరంగంగా ప్రపంచం ముందు తొడగొట్టి సవాలు చేస్తూంటే ఆధిపత్యం, అణచివేత ఎవరిది? విద్వేషం ఎవరిది? సీమాంధ్ర దురహంకారులదా? తెలంగాణ ప్రజలదా?

నీళ్ళు తెలంగాణ ప్రాంతానివి- పంటలు సీమాంవూధకు. నిధులు తెలంగాణ ప్రాంతానివి- సంపద సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులది. బొగ్గు తెలంగాణ ప్రాంతానిది- విద్యుత్ సీమాంధ్ర ప్రాంతానిది. ఉద్యోగాలు సర్వం సీమాంధ్ర ప్రాంతానికి చెందినవిగా దశాబ్దాల తరబడి కొనసాగడం వల్లనే తెలంగాణ ప్రాంత ప్రజలు అన్ని రకాల దోపిడీ, పీడనలకు గురై తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం నేటిది కాదు. నాలుగు దశాబ్దాల పోరాటం. ఈ పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయాన్ని సమైక్యాంధ్ర ముసుగులో తుంచి వేయలేరు. తెలంగాణ జనం సాటి మానవులుగా, తెలుగువారిగా సహనం పాటిస్తున్నారే తప్ప రోషం లేక కాదు. తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర మహోన్నతమైనది. ఈ తెలంగాణ ప్రజల పోరాటాలకు చరివూతలో సువర్ణ అక్షారాలతో కూడిన అంకాలున్నాయి. సమ్మక్క, సారక్కల నుంచి రామ్‌జీ గోండుల నుంచి, కోమరంభీం నుంచి దొడ్డి కొమరయ్య వరకు అప్రతిహతంగా అవిచ్చిన్నంగా సాగింది. రక్త తర్పణలతో అనన్య త్యాగాలు చేసింది. చరివూతలో మరో అంకంగా సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఉద్యోగస్తులు వారికి పావులుగా మారవద్దు. చారిత్రకంగా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ అనివార్యమైన సందర్బంలో ప్రాంతాలుగా విడిపోయి ప్రగతి పథంలో సాగా ల్సిన సమయం ఇదే. దీన్ని అర్థం చేసుకొని తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలి.

-చిక్కుడు ప్రభాకర్

164

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles