సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే


Mon,December 17, 2012 01:44 AM


ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట్లాడుతున్నారు. అదే విధంగా రాయలసీమకు వెళ్ళి ‘హంద్రీనీవా, సుజల స్రవంతి’ ప్రారంభోత్సవ సభలో రాయలసీమ గడ్డమీద పుట్టి పెరిగినందుకు హంద్రీనీవాను ప్రారంభోత్సవం చేసి ఈ గడ్డ రుణం తీర్చుకున్నానని అన్నారు. అలాగే కోస్తాంధ్ర ప్రాంతానికి పోయి ఎన్ని అవంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును కట్టితీరుతానని ప్రతిజ్ఞ చేశారు. కిరణ్ కుమార్‌డ్డితోపాటు ఉమ్మడి రాష్ర్టంలో ముఖ్యమంవూతులైన సీమాంధ్ర నాయకులు కేవలం తెలంగాణ ప్రాంత నీళ్ళు, నిధులు, భూములు దోచుకోవడమే తమ పరమావధిగా పనిచేశారు, చేస్తున్నారు. ఇంకో తెలంగాణ ప్రాంతం వారు ముఖ్యమంవూతులు అయ్యింది కొద్దికాలమే. ఆ కాలంలో కూడా తెలంగాణ ప్రాంత వనరుల దోపిడీని అడ్డుకోలేక పోవడంతోపాటు తమ స్వలాభమే ధ్యేయంగా పనిచేశారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. దీంతో ఈ ప్రాం త ప్రజలు బతకలే ని పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరీ వాటి ఉప నదులు తెలంగాణ ప్రాంతంలో పారుతూ జీవన నదులుగా వెలుగొందుతు న్నా తెలంగాణ ప్రజలకు ఒక్కపూట తిండి కూడా లేని పరిస్థితుల్లో పాలమూరు, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వలసపోయి జీవచ్ఛవాలుగా బతుకున్నారు. గుక్కెడు మంచినీళ్ళు దొరకక కృష్ణానది పరివాహాక ప్రాంతంలోని నల్గొండ జిల్లా ప్రజలు ‘ఫ్లోరైడ్ వ్యాధి’ తో తల్లడిల్లుతున్నారు. గోదావరి పరివాహాక ప్రాం తంలోని ఆదివాసీ ప్రజలు మంచినీళ్ళు దొరకక ప్రతి ఏటా వందలాదిగా ‘డయేరియా’ బారిన పడి చనిపోతున్నారు. దేశంలోని మెజారిటీ గ్రామాల్లో చెరువులు కుంటలు, కాలువల పారుదల భూములన్నీ అగ్రవర్ణాలకే చెందినవిగా చరివూతలో నమోదైనవి.

అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి వాటి ఉపనదుల పరివాహాక ప్రాంతంలోని నదుల ఒడ్డున సీమాంధ్ర భూస్వాములు లక్షలాది ఎకరాలను ఆక్రమించుకొని ఆరు దశాబ్దాలుగా ఆ నదుల నీటిని వాడుకుంటున్నారు. అసలే ప్రాజెక్టులు లేక, చెరువులు కుంటలు పూడికలు తీయక తెలంగాణ ప్రాంత నీటివనరులు పూర్తిగా అడుగంటిపోయిన తరుణంలో తెలంగాణ ప్రాంత రైతాంగం సాగునీటి కోసం నానాయాతనలు పడుతుండగా, నదుల ఒడ్డున వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న సీమాంధ్ర భూస్వాములు సకల సంపదలతో తులతూగుతున్నారు. రెండుపంటలు పండించుకుంటున్న కోస్తాంధ్ర ప్రాంతానికి మూడోపంటకు నీరీచ్చెందుకు దక్షిణ తెలంగాణలోని కృష్ణానది మీద పులిచింతల ప్రాజెక్టు, గోదావరి నదిమీద పోలవరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రాంత ఆదివాసులను ఆ ప్రాజెక్టులో ముంచి సీమాంవూధకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నం తెలంగాణ ప్రజలను కృంగ తీస్తున్నది. ఈనేపథ్యంలో మా రాష్ర్టం మాకు కావాలని అడిగినందుకు నాటి ముఖ్యమంత్రి బ్రహ్మనందడ్డి 370మంది తెలంగాణ బిడ్డలను కాల్చిచంపారు. కొద్దిమంది ఆయన మంత్రివర్గం నుంచి బయటకి వచ్చినా, మళ్ళీ తెలంగాణ వూపాంత ప్రజలను వీరు కూడా మోసగించారు. అధికారంలో కాంగ్రెస్, తెలుగుదేశం ఏపార్టీ ఉన్నా సీమాంధ్ర నుంచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంవూతులు తెలంగాణకు చెందిన సకల వనరులు దోచుకోవడం తెలంగాణ ప్రాంత ప్రజలను నట్టెట ముంచడం జరిగింది, జరుగుత్నుది. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలను అణచడమే ధ్యేయంగా ముందుకుపోతున్నారు.

నాగార్జునసాగర్‌ను నందికొండ ఎగువన ఏలేశ్వరం దగ్గర నిర్మించాలని ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి, సీమాంవూధకు చెందిన నీటిరంగ నిపుణుడు కె.ఎల్.రావు సహకారంతో సీమాంవూధకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమల కాలువల ద్వారా 70% కోస్తాంవూధకు ప్రయోజనం చేకూర్చేందుకు చేసిన కుట్ర ఫలితంగా దక్షిణ తెలంగాణ ఏడారిగా, కోస్తాంధ్ర ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది. ఇప్పటికీ కుడి కాలువ ద్వారా పారుతున్న నీటిని లిఫ్ట్‌ల ద్వారా కోస్తాంధ్ర రైతాంగం వినియోగించుకునేందుకు అవుతున్న భారం ప్రభుత్వమే భరిస్తుండగా, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలోని లిఫ్ట్‌ల భారం తెలంగాణ రైతాంగమే భరిస్తున్నదంటే ఈ సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణ పట్ల ఎంత వివక్షతో ఉన్నారో అర్థం అవుతున్నది. ఈప్రాజెక్టు రిపోర్టులో లేని కృష్ణా జిల్లాను ఈ ప్రాజెక్టు నీటి వాడకంలో చేర్చి ఖమ్మం జిల్లా రైతాంగం నోట్లో మట్టికొట్టారు. ఈ జిల్లాలో పారవలసిన రెండు లక్షల ఎకరాలకు నీరందివ్వకుండా కృష్ణా జిల్లా లోని ‘నూజివీడు ప్రాంతం’ వరకు లక్షా 60వేల ఎకరాలకు నీరందిస్తున్నారు.

ఆసియా ఖండానికే వన్నె తెచ్చిన నిజామ్ షుగర్ ఫ్యాక్టరీని కేవలం మూడుకోట్ల రూపాయలకే సీమాంవూధకు చెందిన గోకరాజు రంగరాజు అనే పెట్టుబడిదారునికి 49% వాటాను అప్పగించారు. ఆఫ్యాక్టరీ యాజమన్యంలో ఉన్న దాదాపు 1,000 ఎకరాల భూమిని ఆయనకు కట్టబెట్టడంతో పాటు దాదాపు 800 కోట్ల విలువ కల్గిన ఫ్యాక్టరీని అతనికి ధారదత్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ప్రజల రక్త మాంసలతో అభివృద్ధి చేసిన నిజాం సర్ఫేఖాస్ భూములను ఐ.ఎం,జి అనే సంస్థకు కట్టబెట్టారు. దాదాపు 22 రకాల కుంభకోణాలతో తెలంగాణ భూములను మింగేసిన సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు బినామిగా నేడు చంద్రబాబు ఉన్నారు. నామ నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలో అత్యంత విలువైన గ్రానైట్‌ను చంద్రబాబు హాయంలోనే వందలాది ఎకరాలు కొట్టివేసి అత్యంత సంపన్న వంతునిగా మారి నేడు చంద్రబాబుకు బినామిగా ఉన్నారు. కుకట్‌పల్లిలోని జెఎన్‌టియు ఎదురుగా ఉన్న విలు భూములను దాదాపు ఒక కిలోమీటరు రోడ్ ఫేస్‌లోని భూమిని దక్కించుకొని నేడు నీతి వచనాలు పలుకుతున్న నామ నాగేశ్వరరావు తెలంగాణ ప్రాంత వ్యతిరేకుల జాబితాలో చేరిపోయారు. ఒక దశాబ్దకాలంలోని చంద్రబాబు పాలనలో లక్షలాది కోట్ల రూపాయల సంపద సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఖాతాలోకి చేరి పోయింది.బోరింగుల ద్వారా తప్ప, కాలువల ద్వారా, చెరువుల ద్వారా, కుంటల ద్వారా సాగునీరు రాని తెలంగాణ ప్రాంత రైతాంగం విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని పోరాడినందుకు బషీర్‌బాగ్ చౌరస్తా సాక్షిగా పదుల సంఖ్యలో ఉద్యమకారులను కాల్చివేశారు. సొంత పార్టీకి చెందిన హన్మకొండ శాసనసభ్యులు దివంగత ప్రణయభాస్కర్ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు గురించి శాసనసభలో మాట్లాడినందుకు చంద్రబాబు చేత తీవ్ర బెదిరింపులకు గురయ్యా రు. తెలంగాణ ప్రాంత వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు 2009, డిసెంబర్ 10న తన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకుని తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును అడ్డుకున్నాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏరు దాటగానే తెప్ప తగలేసినట్లు రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలను వంచించారు. అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు. తెలంగాణ ప్రాంత సకల వనరులు తన కుటుంబానికి, సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. జలయజ్ఞం పేరుతో వేలాది కోట్ల రూపాయలు దిగమింగిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ప్రాంత నీటి వనరులను సీమాంవూధకు తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక్క పోతిడ్డిపాడు విస్తరణ ద్వారానే దాదాపు 110 టీఎంసీల నీరును రాయలసీమకు తరలించారు. తెలంగాణ ప్రాంతంలోని ఇచ్చంప ల్లి, లోయర్ పెనుగంగ, అప్పర్ పెనుగంగ, కాంతాలపల్లి లాంటి ప్రాజెక్టులకు మోక్షమే లేకుండాపోయింది. తూతూ మంత్రంగా మొదలుపెట్టిన దేవాదుల, ఎ.ఎం.ఆర్ ఫేజ్-2, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, భీమా (సంగం బండ), కల్వకుర్తి, ఆర్‌డీఎస్ లాంటి పథకాలు ‘ఎక్కడేసీన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు మీ కోసం వస్తున్నా నన్నా, షర్మిల నేనున్నానంటూ పాదయావూతలు చేసినా, కిరణ్‌కుమార్‌డ్డి ఇందిరమ్మ పేరుతో పల్లెబాట పట్టినా అన్నీ పదవి కోసం ఆరాటాలే తప్ప మరేమీ కాదు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలో భాగమైన రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకిస్తూ తన సీమాంధ్ర తత్వాన్ని ఒకరికి మించి మరొకరు చాటుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంలో అందరు ముఖ్యమంవూతుల లాగే కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా భాగమయ్యారు. అందుకే నాటి నీలం సంజీవరెడ్డి నుంచి నేటి కిరణ్ కుమార్‌రెడ్డి దాకా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నడిచినవారే. తెలంగాణ ప్రాంత వనరులను సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు దోచిపెట్టి, అందులో తమ వాటాను పొందిన వారే. వీరికి వ్యతిరేకంగా మడప తిప్పని పోరాటంతో తెలంగాణ సాధనకు నడుం కట్టాలి. తెలంగాణ ప్రజలు ‘ఎప్పటివరకు ఈ పోరాటం అంటే తెలంగాణ వచ్చేవరకు, తెలంగాణ వనరులపై సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల దోపిడీ ఆగేంతవరకు’ అంటూ తెలంగాణ సమస్త ప్రజానీకం పోరాడాలి.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘