ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి


Sat,December 8, 2012 12:17 AM

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం చేస్తున్నది. గోదావరి ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని 17,500 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ బొగ్గు నిల్వలను 31మార్చి 2007 వరకు దాదాపు 25లక్షల 95,000 మీటర్ల డ్రిల్లింగ్‌ను 1,29, 280 బోర్ ద్వారా అన్వేషణ పూర్తి చేసి 8968 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలను సింగరేణి కంపెనీ గుర్తించింది.12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 2016-17 వర కు ప్రతిఏటా దేశవ్యాప్తంగా 980మిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్ ఉండగా, 772.84 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసుకోగలమనే అంచనాతో ప్రభుత్వపైవేటు బొగ్గు కంపనీలు ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా 2016-17 నాటికి సింగరేణి కంపెని 65 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించేందుకు ఉత్తర తెలంగాణను బొందలగడ్డగా చేసైనా బొగ్గు తొవ్వే ప్రయత్నం చేస్తున్నది.

ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 3710.47మిలియ న్ మెట్రిక్ టన్నులు, కరీంనగర్ జిల్లాలో 2041.19, వరంగల్ జిల్లాలో 1171.92, ఖమ్మం జిల్లాలో 2954.10 మి.మె.ట.ల బొగ్గు నిల్వలు, ఫ్లోట్ (FLOAT) 1,000 కలిపి మొత్తంగా 9877. 68మి.మె.ట.గా గుర్తించింది. ఈ నిల్వలను ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు 612.21 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలను తవ్వాలని నిర్ణయించింది. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి, ఇతర పారిక్షిశామిక అవసరాలకు ఉపయోగపడుతున్నది. ఈ బొగ్గు ప్రత్యక్షంగా లక్షలాది మందికి, పరోక్షంగా కొట్లాదిమందికి జీవనోపాధి ఇస్తున్నది.ఈ విధంగా మొదలైన గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు గనులు నేటికి దాదాపు 36అండర్ గ్రౌండ్, 16 ఓపెన్ కాస్ట్ గనులు గా సింగరేణి ఉత్పత్తిని కొనసాగిస్తున్నది.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ప్రభుత్వం అమలు చేయడానికంటే ముందు దాదాపు లక్షా30 వేల మంది కార్మికులు సింగరేణిలో ప్రత్యక్షంగా పనిచేయగా, 1993 నుంచి నూతన ఆర్థిక విధానాల ఫలితంగా కేవలం 65 వేల 430 మంది కార్మికులే సింగరేణిలో పనిచేస్తున్నారు. కారల్‌మార్క్స్ చెప్పినట్లు ‘యాంవూతీకరణ మొదలైతే కార్మికుడు డమ్మిగా తయారవుతాడ’న్నుట్టుగానే సింగరేణిలో రెండు దశాబ్దాల క్రితం మొదలైన యాంత్రీకరణ వలన నేడు కోల్‌కట్ట ర్, కోల్‌ఫిల్లర్‌లు యంత్రం మీద పనిచేసే బొమ్మలు గా మారిపోయారు.

కంపెనీ ఉత్పత్తికి, డిమాండ్‌కు దాదాపు 15 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యత్యాసము ఉందనే నెపంతో ప్రజల జీవితాలను నాశనం చేసే ఓపన్ కాస్ట్ గనుల ను ప్రారంభించేందుకు సింగరేణి నిర్ణయం తీసుకుని ఇప్పటికే దాదాపు 16 ఓపెన్‌కాస్ట్ గనులను నడుపుతున్నది. రాబోయే రోజుల్లో మరో 75 ఓపెన్‌కాస్ట్ గనులను ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. ఫలితంగా అండర్ గ్రౌండ్ గనులు రాబోయే రోజుల్లో కనుమరుగు కాబోతున్నాయి.

కోయగూడెం, సత్తుపల్లి, ఇందారం, కాసింపేట, బసవరాజుపల్లి, అక్కెనపల్లి గ్రామాల ప్రజలు ఈ ఓసీ గనులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. ప్రజల అభివూపాయాలకు విలువను ఇవ్వకుండా, పర్యావరణవేత్తల అభివూపాయాలను తుంగలో తొక్కి ఈ ఓపెన్‌కాస్ట్ గనులకు అనుమతిచ్చిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలే జీవవైవిధ్య సదస్సును హైదరాబాద్‌లో జరపడం ‘దొంగే దొంగ దొంగ’ అని అరిచిన చందంగా ఉన్నది. ఈ ఓపెన్‌కాస్ట్‌గని ఒక్కొక్కటి దాదాపు 10చ.కి.మీ. వెడల్పు లో, 200 నుండి 250మీటర్ల లోతులోని మట్టిని తీసి పక్కకు గుట్టలుగా పోస్తున్నది. దీంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ఉత్తర తెలంగాణలోని వేలాది గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో పంట పొలాలు బూడిదతో నిండిపోతున్నాయి. దీంతో కనీస పంటరాబడి రావడంలేదు. వ్యవసాయయోగ్యమైన భూమి రోజురోజుకు తగ్గిపోతున్నది. తెలంగాణ ప్రజలకు తలాపునే గోదావరి దాని ఉపనదులు ఉన్నా గుక్కెడు మంచినీరు, ఎకరం పొలం తడిపారడం లేదని ప్రజలు వాపోతున్నా రు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా బొంబాయి, దుబాయి, బెంగళూరు, గుజరాత్, సూరత్, భీవండి ప్రాంతాలకు వలసలు పోయి దుర్భర జీవితం గడుపుతున్నారు.

ఒకవైపు పోలవరం వల్ల వందలాదిగ్రామాలు కనుమరుగు కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులతో దాదాపు 600 గ్రామాల ప్రజలు నిర్వాసితులు కానున్నారు. అంతేగాక ఓపెన్‌కాస్ట్ మట్టిదిబ్బలు, బొగ్గు గుట్టల నుంచి వస్తున్న దుమ్మూ ధూళీ, బూడిదతో పరిసర గ్రామాల ప్రజలకు తీవ్రమైన శ్వాస సంబంధమైన రోగాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో లక్షలాది హెక్టార్ల అటవీ, వ్యవసాయ భూమి, వందల కొద్ది గ్రామాలు బెల్లంపల్లి, ఇల్లందు లాంటి పట్టణాలు కూడా ఈ ఓపెన్ కాస్ట్ గనులకు బలవుతున్నాయి.

ఇప్పటికే అండర్‌గ్రౌండ్ గనిలో రోజుకు 1,500 నుంచి 2,000 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, ఓపెన్ కాస్ట్‌ల్లో 8వేల నుంచి 10వేల మెట్రి క్ టన్నుల బొగ్గు తీస్తున్నారు. రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్ గనులకు స్వస్తి చెప్పి మొత్తం ఓపెన్‌కాస్ట్ గనులనే ప్రతిపాదించడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పథకం వేస్తున్నాయి. ఇలాంటి విధానాలతో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వాలే భంగం కలిగిస్తున్నాయి.

2010-11లో 51.30 మిలియన్ టన్నుల ఉత్పత్తిని తీసిన కంపెనీ, 2012-13లో 55 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో అతి పెద్ద ఓపెన్‌కాస్ట్‌తో వరంగల్ జిల్లాలోని ములుగు ఘన్‌పూర్, భూపాలపల్లి వెంకటాపూర్ మండలంలోని 1ఱగామాలను పూర్తిగా ధ్వంసం చేసి లాంగోవాల్ టెక్నాలజీని ఉపయోగించి బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. వందేళ్లలో అండర్ గ్రౌండ్ గనుల ద్వారా కొనసాగించాల్సిన తవ్వకాలను కేవలం 15ఏళ్లలో ఈ ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా తెలంగాణను బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. భవిష్యత్తులో ప్రారంభించబోయే 75 ఓపెన్ కాస్ట్ గనులతో పచ్చని పంట పొలాలు, శత్రుదుర్భేధ్యమైన అడవి, చారివూతక కట్టడాలైన రామప్ప, లక్నవరం లాంటి ప్రాంతాలు కూడా ఈ ఓపెన్‌కాస్ట్ గనులకు బలికావచ్చు. సింగరేణి చేస్తున్న ఈ ప్రయత్నాలకు సీమాంధ్ర విద్యుత్ కంపెనీలు, సిమెంట్ కంపనీల యాజమానులు, గుత్త పెట్టుబడిదారుల లాభాపేక్షతోపాటు కేంద్ర ప్రభుత్వ కుట్ర కూడా దాగి ఉన్నది.

చంద్రబాబు, రాజశేఖర్‌డ్డిల విధానాలనే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కొనసాగిస్తుండటం తో తెలంగాణలో సింగరేణి కంపెనీ భయంకర భూతం గా మారింది. గోదావరి నీళ్ళు అందక పంట పొలాలు ఏడారిగా మారుతున్నాయి. మరోవైపు పొలవరం పేరు తో లక్షలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. ఇంకొ వైపు ఈ ఓపెన్‌కాస్ట్ గనులతో ఈ ప్రాంతమంతా బొందల గడ్డగా మారుతున్నది. ఫలితంగా ఉత్తర తెలంగాణలోని దాదాపు రెండు కోట్ల మంది జీవితం సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా మహత్తరమైన ఉద్యమం సాగాల్సి ఉన్నది. ఇప్పటికీ కొన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, ట్రేడ్ యూనియన్‌లు మాత్రమే ఈ ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నా ఇవి ఆగడం లేదు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో వనరుల రక్షణ అంశం ప్రధానంగా లేకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడుతున్నది. లాల్‌గఢ్ ఉద్యమం కారణంగానే జిందాల్ కంపెనీ ఆ ప్రాంతంలో అడుగు పెట్టడం లేదు. సింగూర్‌లో జరిగిన మహత్తర రైతాంగ పోరాటం వల్ల సలీం అండ్ కంపెనీ, టాటా కంపెనీలు అక్కడి నుంచి పరారయ్యాయి. కళింగనగర్‌లో ఆదివాసీల మడమ తిప్పని పోరాటంతో టాటా అక్కడ తన కంపెనీని నిర్మించలేకపోయాడు. ఇక మన రాష్ర్టంలోని సోంపేట, కాకరాపల్లి లాంటి విస్తృ త ప్రజా ఉద్యమాలతో భీలా భూములను నాశనం చేసే విద్యుత్ ప్రాజెక్టులు ఆగిపోయాయి. అటువంటి ఉద్యమాలతోనే అటు పోలవరం కానీ, ఇటు ఓపెన్‌కాస్ట్ గనులు కానీ ఆగిపోతాయి.

తెలంగాణలోని తూర్పు ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టును ఆపడానికి, పశ్చి మ ప్రాంతంలో బొందలగడ్డగా మార్చుతున్న ఓపెన్‌కాస్ట్ గనులను ఆపడానికి ఉద్యమించాల్సి ఉన్నది. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, నడుంకట్టి ముందుకు కదిలితే తప్ప, తెలంగాణను ఈ బహుళజాతి సంస్థల కబంధ హస్తాల నుంచి కాపాడుకోలేం. తెలంగాణగడ్డ మీద సమక్క సారక్కల వారసత్వం నుంచి రాంజీగోండు, దొడ్డి కొమరయ్యల పోరాట వారసత్వం పీడనను ఎదిరిస్తూనే ఉన్నది. ఆ స్ఫూర్తితోనే ఓపెన్‌కాస్ట్ గనులను అడ్డుకుందాం. తెలంగాణను కాపాడుకుందాం.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles