తెలంగాణ మల్లెమొగ్గకు వందనం


Tue,March 27, 2012 07:51 PM

పట్టుమని పదారేళ్లులేని ఆ పిల్ల తెలంగాణ మల్లెమొగ్గ. ఎన్నికలకు ముందే చంద్రబాబును ఓడించిన ఆ పిల్లపేరు కృష్ణవేణి. నాగర్‌కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి ఊరు. ఇంటర్ చదువుకున్న ఆ అమ్మాయి కృష్ణమ్మలా గా తెలంగాణ త్యాగాల పట్ల, అమరవీరుల ఆకాంక్షలపట్ల నిండు మనసు ప్రదర్శించింది. చంద్రబాబు పార్టీ ఆశ చూపిన డబ్బును ఎడమకాలుతో తన్ని తెలంగాణ తెగువ చూపింది. ఇదీ తెలంగాణ. చంద్రబాబుల కు ఈ నేల మీద స్థానంలేదు. చంద్రబాబు డబ్బుకూ ఈ నేల బానిస కాబోదు. తెలంగాణ ఇంకా గుండె ల్లో రగులుతున్న పచ్చి గాయం. అదింకా మనుషులను ఒక ఆశయం కోసం నిలబెడుతూనే ఉన్నది. అది బహుశా ఉప ఎన్నికల్లో ప్రతిఫలించబోతున్నది.

డబ్బుల సంగతులు తమ్ముడు హజారేలా మాట్లాడే చంద్రబాబు ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి, ఎలక్షనీరింగ్‌లో ప్రలోభాలకు పెట్టింది పేరు. సుజనా చౌదరి లు, నామా నాగేశ్వరరావులు, సీఎం రమేశ్‌లు ఇంజనీరింగ్ చేస్తే రాజకీయ చక్రా లు తిప్పగలిగినవాడు. కానీ తెలంగాణలో అయిదువేల మంది పోలీసులతో, చంద్రదండుతో తిరిగినా ఆయన మీదకు ఒక బూటు విసిరిన వాడొక తెలంగాణవాది. బహుశా ఈ ఎన్నికల్లో ఆయన నిజస్వభావం ఏమిటో? అది తెలంగాణకు ఎంత అసహనంగా ఉన్నదో? తెలియబోతున్నది.
చంద్రబాబు పుట్టెడు అబద్ధాలు ఆడతాడు. పాతదే. అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి, ఛానలైజ్ చేసి పదిమందితో ప్రచారంలో పెట్టించి.. అబద్ధాన్ని కూడా నిజమని భ్రమించేలా మానసిక ఆవరణాన్ని సృష్టిస్తాడు. పాతదే. ఇదంతా రాజకీయాల్లో ఒక మానసిక క్రీడగా అభివృద్ధి పరచడం ఒక కళగా ఆచరించడంలో కూడా ఆయన ఆరితేరాడు. నిజమే. గోబెల్స్‌కు ఆయన పెద్దన్న. కానీ చంద్రబా బు గోబెల్స్ ప్రచార సూత్రాలు చదవనట్టు ఉన్నది. గోబెల్స్ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వద్ద 1933లోనే ప్రచారమంవూతిగా పనిచేశాడు. జర్మన్ రేడియో, పత్రికలు, సినిమా, రంగ స్థలం అన్నీ గోబెల్స్ గుప్పెట్లో ఉండేవి. హిట్లర్ అధికారంలోకి రావడానికి గోబెల్స్ ప్రచారం ఉపయోగపడింది. కానీ చిట్టచివరకు సోవియట్లు బెర్లిన్‌ను ఆక్రమించుకున్నాక గోబెల్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమస్యల్లో మానసిక అధ్యయనం, మాటలు చెప్పి, ప్రచారం చేసి సామాజిక సమూహాలను ఎట్లా గెలవచ్చో చెప్పిన గోబెల్స్ చంద్రబాబుకు ఆదర్శమే కావొచ్చు కానీ..గోబెల్స్ ప్రచార సూత్రాల్లో చెప్పిన కీలాకాంశం ప్రచారాస్త్రాలు బూమెరాంగ్ కాకుండా కట్టుదిట్టంగా ఉండాలని..దాన్ని చంద్రబాబు మరిచిపోయాడు.

తెలంగాణ ఉప ఎన్నికల సందర్భంగా, అంతకు ముందునుంచీ చంద్రబాబు తెలంగాణ ప్రవేశానికి ఒక సాకు.. ఒక అవకాశం వెదుకుతున్నాడు. పచ్చి అవకాశవాదిగా, నీతి, రీతి, నియమం, ఏ విలువా, ఏ ప్రమాణమూ లేని నాయకునిగా చంద్రబాబు తెలంగాణ అసలైన విలన్ అయ్యారు. డిసెంబర్ ఏడు, తొమ్మి ది, పది రెండువేల తొమ్మిదవ సంవత్సరం ఆయన నిజస్వరూపాన్ని, తెలంగాణ పట్ల కరడుగట్టిన, నిబిడీకృతమై, ఆయన మనసులో భాగమైపోయిన వ్యతిరేకతను ఆ తేదీలు ప్రతిబింబించాయి. తెలంగాణ వచ్చేదా? పోయేదా? వచ్చినప్పుడు చూద్దామనుకొని ఏడవతేదీ అఖిలపక్షంలో ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, తీరా తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించేసరికి, అసలు తన కోరలు చాచి ఆంధ్ర బుద్ధి ప్రదర్శించి తెలంగాణ ప్రజల పాలిట అతిపెద్ద ప్రతినాయకుడయ్యారు. నిలు గోబెల్స్ లాంటి విష ప్రచా రం వ్యూహాలు నింపుకున్న చంద్రబాబు ఆ తర్వాత ఎట్లాగూ పాదం మోపానని విర్రవీగి అనుంగు ప్రచార బృందం ‘డోల్‌బజా’ బ్యాచితో తెలంగాణ నాయకత్వం మీద దాడిని ఎక్కుపెట్టాడు. ఆయన లక్ష్యం ఒక్కటే. తెలంగాణ నాయకత్వాన్ని ధ్వంసం చేసి, బదనామ్ చేసి, బట్టకాల్చి మీదేసి, మళ్లీ తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్‌ను ఏలడం. తెలంగాణ ఆకాంక్షలకు శాశ్వతంగా సమాధి కట్టడం
కాంట్రాక్టర్ల పెట్టుబడులతో పార్టీని నడిపించే చంద్రబాబు, కాంట్రాక్టర్లు, రాజకీయ దళారీలు నిండా నిండి ఉన్న పార్టీ అధ్యక్షుడిగా, రాజకీయాల్లోకి డబ్బు ప్రవాహాన్ని, ఎన్నికల్లోకి మేనేజిమెంట్ స్కిల్స్‌నూ విచ్చలవిడి వ్యయాన్ని తెచ్చిన చంద్రబాబు, కేసీఆర్ మీద దాడి ప్రారంభించాడు. పోలవరం కాంట్రాక్టులతో ప్రారంభమైన దాడి అదే పాటను పదిమందితో పాడించాడు. కానీ ఇప్పుడు పోలవరం టెండర్ రద్దయింది.

అసలు ఖరారేకాని ఒక కాంట్రాక్టు టెండర్‌లో, అదిం కా పరిశీలన స్థాయిలో ఉండగానే డబ్బులు ఎలా ఇస్తారు? ఎలా పుచ్చుకుంటా రు? సరే.. ఇప్పుడు పూర్తిగా రద్దయింది. రద్దయిన టెండర్‌కు డబ్బులు ఎలా అందుతాయి. ఈ తర్కం అక్కరలేదు. గోబెల్స్‌ను తలదన్నే ప్రచారంలో చివరికి అసహ్యం పుట్టించే స్థాయికి ఆ ప్రచారాన్ని తీసుకెళ్లారు. నిరూపిస్తే ఉరికి సిద్ధం అనే టీఆర్‌ఎస్ సవాల్ తర్వాత దొంగకు తేలుకుట్టినట్టు.. వ్యవహారం.. కానీ అన్నింటికన్నా ప్రమాదం ఏమిటంటే చంద్రబాబు తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే అని చెప్పడం. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరిట ఎన్టీఆర్ ఆంధ్ర వలస ఆధిపత్యం స్థాపన చేసుకుని, దాన్ని స్థిరీకృతం చేసుకున్నారు. హైదరాబాద్‌ను ఆక్రమించుకోవడం, రియల్ ఎస్టేట్‌గా మార్చడం, భూములు అమ్ముకోవడం, సంస్కృతిని విచ్ఛిన్నం చేసి, తెలంగాణ చరివూతను, వైభవాన్ని, ప్రాశస్థ్యాన్ని కనుమరుగుచేసి ఎన్టీఆర్ ఒక మహాత్మునిగా, ఆ తర్వాత చంద్రబాబు ఒక మహానాయకునిగా మీడియా సహకారంతో పాతుకుపోయారు. తెలంగాణను విధ్వంసం చేసిన చంద్రబాబు అభివృద్ధి చేసింది నేనే అనడం అతి ప్రమాదకర ధోరణి.

కేసీఆర్ కుటుంబ రాజకీయాలు నడుపుతున్నాడన్నది చంద్రబాబు మరో ఆరో పణ. నిజమే కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ లో కీలకంగా ఉన్నారు. ఇది కుటుంబ రాజకీయాలు చెయ్యని మరెవరైనా అంటే విలువగల విమర్శ అవుతుందేమో కానీ.. ఎన్టీఆర్ అల్లుడిగా తెలుగు దేశంలో ప్రవేశించి, ఆయన మామగారి మరో అల్లుడు దగ్గుబాటితో కూడా రాజకీయాలు నడిపి తమ్ముడు నారా రామ్మూర్తినాయుడును ఎమ్మెల్యేను చేసి ఆయన మామగిరి కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణలలో తెలుగుదేశం ప్రచారాలు చేయించి పదవులిచ్చి చివరకు ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్‌నూ ప్రచారంలో వాడుకొని, కొడుకు లోకేష్ బ్యాక్‌డోర్ మేనేజర్‌గా పార్టీలో కీలక వ్యక్తి అయినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం అంటేనే ఎన్టీఆర్ కుటుంబ పార్టీగా, దాన్ని వెన్నుపోటుతో చేజిక్కించుకుని ఎన్టీఆర్ కుటుంబంలో కొందరిని గుప్పిట్లో పెట్టుకొని అచ్చమైన కుటుంబ రాజకీయాలు నడుపుతూ చంద్రబాబు కేసీఆర్‌ను అనడం ఏమిటన్నదే సమస్య. అందుకే గోబెల్స్ మరో సూత్రం ఇక్కడ చంద్రబాబుకు గుర్తు చేయాల్సి ఉన్నది. శత్రువు పై ఏ ప్రచారం చేసినా, విశ్వసనీయత గల వ్యక్తులతో చేయించాలి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తులతో చేయించాలి అంటాడు గోబెల్స్. తెలంగాణలో చంద్రబాబు విశ్వసనీయత సున్నా కింద, ఆయన ప్రేరేపిత ‘డోల్‌బాజా’ బృందం విశ్వసనీయత కూడా జీరోగా ఇక గౌరవ ప్రతిష్టలు బూటు విసిరేంత గొప్పగా ఉన్నాయి.

ఒక్క ప్రచారానికి మాత్రమే చంద్రబాబు పరిమితం కాలేదు. అడ్డం వస్తే తొక్కుకుంటూపోతామని, జాగీరా అని మాట్లాడటమే అసలు సమస్య. చిత్తూ రు నుంచి హైదరాబాద్ వచ్చి తెలంగాణలో తొక్కుతా అని ఎవరిని అంటున్న ట్టు? అవును ఇది తెలంగాణ బిడ్డల జాగీరు కాక ఎవరిదౌతుంది? నిస్సహాయతలోంచి, పచ్చి అసహనంతో చంద్రబాబు సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడడం ఎందుకు? అన్నది అసలు ప్రశ్న.
తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ తెగువ, ఉద్యమం ఆయనను అంగుష్టమావూతుణ్ని చేశాయి. అదీ అసలు బాధ. అందుకే ఎదురు దాడి ద్వారా తెలంగా ణ నాయకత్వంమీద దాడిచేసి, అడ్డగోలుగా మాట్లాడి, ఇనుప పాదం మోపి అయి నా తెలంగాణలో నాలుగు ఓట్లు రాల్చుకుని, 2014 ఎన్నికల నాటికి మళ్లీ ఎట్లా గో అట్లా పాతుకుపోవాలన్న ప్రణాళిక చంద్రబాబుది. ఆయన చుట్టూ ఉన్న వాళ్లు బానిసల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల సమయాన చంద్రబాబు అసలు స్వరూపం, ఆయన ఎంత మోరుదోపు తనంతో ముందుకు వస్తున్నాడో? గ్రహించాల్సిన అవసరం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. తొక్కుతా అన డం, జాగీరు అనడం ఏ ఒక్కరికో సంబంధించిన సమస్య ఎంత మాత్రం కాదు. అది తెలంగాణ అందరి సమస్య. అస్తిత్వ ఉద్యమం నేపథ్యంలో ఒక ఆంధ్రనేత తెలంగాణను ఎంత చులకన చేసి మట్లాడాడన్నదే సమస్య. ఇది అందరిది.

ఉప ఎన్నికలతో తెలంగాణ వస్తుందా? రాదా? బహిష్కరిస్తే వస్తుందా? రాదా? ఉద్యమిస్తే వస్తుందా? అది కూడా వేరే సమస్య కానీ, తెలంగాణ కోసం రాజీనామాలు చెయ్యమంటే చేసిన వారిని ఉద్యమం కానీ, పార్టీలు కానీ విడిచి పెట్టడం న్యాయం అనిపించుకోదు. వాళ్ల త్యాగానికి వాళ్లు ప్రతిఫలం కోరుకుంటున్నారు. అది అందించాల్సి ఉన్నది. ప్రజల మీద ఆ బాధ్యత ఉన్నది. ఉప ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాదనడం మాటు అటుంచి, ఒక్కమాట ఒక్క టి ఓడినా, మార్జిన్లు తగ్గినా అసలు తెలంగాణ ఉద్యమానికే ఎసరు పెట్టే గోబెల్స్ రెడీగా ఉన్నారు. పాతరేసేందుకు, శాశ్వతంగా తెలంగాణ ఆకాంక్షలకు సమాధి కట్టేందుకు కాచుకొని ఉన్న సీమాంధ్ర,నేతలు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాల్సింది ఒక అగత్యమే కాదు. ఇప్పటి అవసరం. అవశ్యం. స్వీయ రాజకీయ అస్తిత్వం నిజంగానే ఇవ్వాల్టి తెలంగాణ నినాదం. త్యాగం ప్రతిఫలం కోరుకుంటున్నది. ఆంధ్రాబాబుల ఆట కట్టించే శక్తి ఓటుకు ఉన్నప్పుడు ఓటు కూడా ఒక ఆయుధమే. మహబూబ్‌నగర్ కృష్ణవేణి దారి చూపింది. ప్రలోభాలు వద్దు. అమరుల త్యాగాలు గుండెల్లో పచ్చి గాయాలుగా సలుపుతున్నాయి మరవొద్దు.

-అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles