తల్లివేరు తత్వం


Sun,December 25, 2011 12:14 AM

ముందు ప్రపంచం. ఆ తర్వాత దేశం. ఆనక రాష్ట్రం. ఈ రాష్ట్రమం సరిపడలేదు కనుక నేను తెలంగాణవాన్ని. మనిషి ఉనికి అంతటితో సరిపోలదు. అస్తిత్వం వెల్లడవదు. నాది కరీంనగర్. అంతేనా..కాదు. మా ఊరు మంథని... మరీ సూక్ష్మంలోకి నన్ను నేను వెతుక్కోవాలంటే పెదాల కింద నిప్పుల ఉప్పెనలా దాక్కున్న ఒక చిన్నపల్లె గాజులపల్లె. కరీంనగర్ అనంగానే ఒక సంక్షుభిత, కల్లోలాలను కన్న ప్రాంతంగా అందరిలోకి ఉరికే ఉత్తేజం ఆవహించినట్టు అదొక జ్వలితజలనమైన పేరు. కరీంనగర్ జిల్లా అనుభవించిన సంక్షోభాన్ని, ఉద్వేగాన్ని, విప్లవాన్ని, చలనాన్ని మంథని కూడా అనుభవించింది. ఒక ఊరుగా మంథని ఎగువ గోదావరి ఒడ్డు అగ్రహారం. మంత్రకూటపురం.

మట్టిమిద్దెలు, అంగవస్త్రాలు ధరించిన వేదపండితులు, పూజారులు, విద్య నేర్చుకుని ప్రపంచాన్ని ఒక గోళికాయ చేసుకొని ఆడి అమెరికన్ వాసనలు తెచ్చి న యువతరపు ప్రతినిధులు, ఉత్త మట్టికాళ్లతో అగ్రహారం లాంటి మంథనిలో అడుగు నిలిపి, కొంత స్థానాన్ని సంపాదించుకున్న బ్రాహ్మణేతర కులాలు ఐదు దశాబ్దాల మంథని ఇప్పుడొక కలెగలుపు కూడలి. ఒకప్పు డు తీవ్రంగా వ్యతిరేకించుకున్న మంథని వాస్తవ్యులు బ్రాహ్మణులు, చుట్టుపక్కల పల్లెల నుంచి ఎదిగి వచ్చిన బ్రాహ్మణేతర శూద్రులు ఇప్పు డు కలిసిమెలిసి కలెగలిసిపోయింది మంత్రకూటపురం. భాష ప్రత్యేకం. సుద్దరాళ్ల భాష వేరు. మంథని టిపికల్ బ్రాహ్మణుల భాష, నాగపూర్ లాంటి ప్రాంతాల సంపర్కం వల్ల ‘వాండ్లు’, ‘పిన్నాడు’, ‘వచ్చాడు’, ‘వెళ్లాడు’... మరోవేపు మంథని. నివాసులు కాని పల్లెటూళ్ల నుంచి వచ్చిన బ్రాహ్మణేతరుల భాష కలగాపులగమయి కలిసిపోయిన వాతావరణం మంథని.

‘నేనొక సుద్దరాళ్ల పిన్నాణ్ని’... ఒక పత్రికకు సంపాదకుడు కావడం.. ఇదే మంథనిలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లక్ష్మీరాజం అదే పత్రిక ‘నమస్తే తెలంగాణ’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కావడం యాధృచ్ఛికమేనా? కాదేమొ. నిజానికి ఒకప్పుడు సంపాదకులుగా కనీసం ఊహించలేని ఒకానొక సుద్దరాళ్ల ప్రతినిధి. నలభై ఇళ్లు మాత్రమే ఉన్న గాజులపల్లి లాంటి చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక పిల్లవాడు అలాగే మంథని ఒకప్పటి పిల్లవాడు, చిల్లప్పగారి గోదమ్మగారి కొడుకు ఒక పత్రిక స్థాపించే పెట్టుబడిదారు కావడం మంథని వైవిధ్యంగా చూడవలసిన ఒక విశేషమే. బహుశా పాత్రలు పాక్షికంగా తారుమారు కావడమే ఇది. నేనెట్లాగూ పెట్టుబడివారుని వర్గాన్ని కాను.

అట్లని బ్రాహ్మణులూ కారు. మన దగ్గర అరు దే. కానీ చిల్లప్పగారి లక్ష్మీరాజం పెట్టుబడి వర్గం ప్రతినిధీ కాడు. విద్యా బుద్ధుల ప్రతినిధిగా సంపాదకుడు కాగలరు. కానీ నేను సంపాదకుణ్ని కావడం మంథని సమాజం అయిదు దశాబ్దాల్లో మారిన స్థితి. ఎల్. రాజం పత్రికాధిపతి కావడం మంథని సమాజ చలన స్థితి. అదేమైనా కావొచ్చు. అనుకూలం, వ్యతిరేకంగా ఎట్లానైనా అనుకోవచ్చు. చిత్రమే. మంథని నుంచి మావోయిస్టు పార్టీలో ఇప్పుడొక కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిడ్డి ఉన్నారు. మంథని నుంచి వరహాల భూమయ్య విద్యను అభివృద్ధి చేసిన హైస్కూలు స్థాపనలో కృషి చేసిన మహనీయుడు. ఇంజనీర్ల కు నిలయంగా ఉన్న మంథని, లెక్కల్లో నెంబర్‌వన్ అనిపించుకున్న మంథని నుంచి ఈఈలు, చివరికి ఎస్‌ఈలు, ఇంజనీరింగ్ డిపార్టుమెంటుల్లో ఉన్నతస్థాయికి చేరినవారు చాలా మంది ఉన్నారు.

తెలుగు విప్లవ కథా సాహిత్యానికి మకుటమైన అల్లం రాజయ్య ఉన్నారు. అద్భుతమైన పాటలు రాసి న అల్లం వీరయ్య ఉన్నారు. మా క్లాస్‌మేట్లు సత్యనారాయణ, సురేశ్, ఎల్ మల్లయ్య, డాక్టర్ ఉదయచందర్ ఇంకా చాలా మందిలానే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన బయ్యపు దేవేందర్‌డ్డి, రమణాడ్డి ఉన్నా రు. నాగపూర్‌లో హక్కుల పతాకం ఎగరేసిన విప్లవాన్ని మంథనికి తెచ్చిన చందుపట్ల క్రిష్ణాడ్డి ఉన్నారు. విజిగీషువుగా వినుతికెక్కిన గీట్ల జనార్దన్‌డ్డి, సంచనాలు సృష్టించిన మాదాడి భాస్కర్‌డ్డి ఇట్లా పేర్లెన్నో.. విదేశా ల్లో డాక్టర్‌గా ప్రసిద్ధుడైన రాజేంవూదవూపసాద్, చీఫ్ ఇంజనీరింగ్ జనరల్ సువ ర్ణ ప్రభాకర్‌రావు, ఆర్థికశాఖ కార్యదర్శి పనకంటి రామకృష్ణ, ఐఎఎస్ హనుమంతరావు, జి.జనార్ధన్‌రావు, జెగ్గం పురుషోత్తం, సీఈ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్, బాకేగారి శేఖర్, చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ బెల్లంకొండ మల్లాడ్డి, జాతీయ విద్యుత్‌శక్తి బోర్డు చీఫ్ ఇంజనీర్ పల్లి రాజేందర్, ఆర్టీసీ అధికారి గజేంద ర్, చీఫ్ ఇంజీనర్ తులసీదాస్, నేషనల్ హైవే ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ వి. రాంకిషన్, ఇరిగేషన్ సీఈ కొంతం కృష్ణమూ ర్తి, ఏఎస్‌పీ సువర్ణ విశ్వనాథం, జాయింట్ కలెక్టర్ శ్రీరాండ్డి, డీఎఫ్‌వో సువర్ణ మహదేవ్ ... ఇట్లా లెక్కలకు మిక్కుటంగా ఎన్నిపేరె్లైనా చెప్పవచ్చు.

మన్ను దిన్న పాములాగా, ఒక చలనం లేని జఢ పదార్థంలా ఉండే ఊరు మంథని. ఆ మిద్దెలు, పాత ఇళ్లు, కూలిపోవడానికి సిద్ధంగా ఉండే ప్రహరీ గోడలు, ఇప్పుడిపుపడే వెలుస్తున్న ఒంటి స్తంభం మేడలు, చిల్లర వ్యాపారాలు, పాతబడిపోయిన కచ్చీర్లు, ఒక ఎంతకూ కదలని తనంతో ఉండేది మంథని. బాతాలు కొట్టే యువతరం ఏం జరుగుతుందో తెలిసేలోపునే ఎక్కడో ఒకచోట తేలడం ప్రత్యేకత. అల్లరిచిల్లరగా తిరిగిన వాళ్లే ఉన్నట్టుండి చదివీ చెడి ఏదో ఒక మంచి ఉద్యోగంలోనో అమెరికాలోనో తేలడం ప్రత్యేకత. మంథనికి వరహాల భీమయ్య తొలి హైస్కూల్ తెచ్చారు కావొచ్చు కానీ. ఈ మంథని బ్రాహ్మణులకు నిలయమైన ఈ ఊరు ఒక ముసల్మాను ఉపాధ్యాయునికి సలామ్ చెయ్యవలసిందే. ఆయన పేరు ఖాదర్. హెడ్‌మాస్టర్ అంటే అట్లా ఉండాలి. ఉపాధ్యాయుడు అంటే అట్లా ఉండాలి.

క్రమశిక్షణను, విద్యాశిక్షణను నేర్పించినవాడు ఖాదర్. సాదాసీదాగా, గప్పాలు కొట్టుకుంటూ వాలీబాల్ ఆడుకుంటూ, అయ్యన్న హోట ల్లో పూరీలు తింటూ, చాటుమాటకు సిగట్టు తాగుతూ, బతికే యువతను ఖాదర్ మార్చేశాడు. స్వయంగా విద్యార్థుల ఇళ్లల్లోకి తిరిగి, ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ పిల్లలు చదువుతున్నారా లేదా? అని పర్యవేక్షించేవాడు. ఊరంతా విద్యార్థులలో రాత్రుళ్లూ ఒక అలర్ట్‌ను ప్రవేశపెట్టాడు. హైస్కూల్ గ్రౌండ్ ఇప్పుడు మళ్లీ పెద్దమ్మకుంట పక్కన తుమ్మలు మెలిచినవి. కానీ మైదానాన్ని శుభ్రం చేయించి మొత్తం పిల్లలు సాయంత్రం ఆటలాడేలా తీర్చిదిద్దారు. అటు చదువు. ఇటు ఆటలు. మా చిన్నప్పుడు మా సీనియర్లు దాసు, విశ్వనాథం, మహదేవ్, భాస్కర్‌డ్డి లాంటి వారి వాలీబాల్ ఆట చూడడానికి మేము వెళ్లేవాళ్లం.

అట్లా ఉండేది వాతావరణం. ఆ తర్వాత కాలంలో కరీంనగర్ జిల్లాను ఆవహించిన నక్సల్బరీ విప్లవం మంథనినీ ఆవహించింది. విద్యార్థి ఘర్షణలు, ఊరేగింపులు, మంథని హఠాత్తుగా వార్తల్లో ఊరు అయింది. రామయ్యపల్లె పోరాట ప్రయోగశాల అయింది. విద్యలో ఎదిగి వచ్చిన మంథని విద్యార్థుల తరం, గుల్కోట్ శ్రీరాములు లాంటి వాళ్ల, అప్పటికే మహదేవ్‌పూర్ అడవుల్లో మరణించిన పెద్దన్న ప్రేరణగా ఎదిగిన విప్లవ తరం... ఖాదర్ ప్రభావంతో చదువే ప్రాణమని భావించిన తరం ఇట్లా మంథనిని స్వాభావిక స్వభావం నుంచి వేరు చేసి ఇవ్వాల్టి సంచలన, సంక్షుభిత కాలంలో ప్రతినిధి పట్నం గా మార్చింది. పీవీ నరసింహారావు, శ్రీపాదరావు, కాంపెల్లి రాజిడ్డి, కాంపెల్లి రాంరెడ్డి, సీఎన్‌డ్డి, పనకంటి కిషన్‌రావు, శ్రీనివాసరావు ఇట్లా ప్రధాన స్రవంతి రాజకీయాల ప్రముఖులు ఇక్కడి వారు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖులయ్యారు. ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులయ్యా రు. అమరులయ్యారు.

అందుకు మంథని అయిదు దశాబ్దాల అంతరంగం ఒక మేళవింపు సంస్కృతి. అదిప్పుడు తనను తాను పలకరించుకొని, ముచ్చట్లు, నవ్వులు, కలతలు, కన్నీళ్లు పంచుకోవడానికి నేడు సమావేశమవుతున్నది. తెలంగాణ జిందాబాద్ కరీంనగర్ జిందాబాద్... మా మంథని జిందాబాద్. ప్రపంచమే కుగ్రామమయినా సరే.. ఊరు ప్రేమ మా అమ్మ ప్రేమ లాంటిదే.

- అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...