వెంటాడే తెలంగాణ


Thu,July 28, 2011 03:20 PM

మీట్ ది ప్రెస్ ప్రారంభమయినాక ఒకరి తర్వాత ఒకరుగా తెలంగాణ న్యాయవాదులు వస్తుంటే మనసేదో శంకించింది. అప్పటికీ సైగలతో అడుగుతూనే ఉన్న. ఏందీ? ఇక్కడ జమైతున్నరు? అని. బేఫికర్ గుండన్నా.. అంటూ వాళ్లు ప్రతిసైగలు చేస్తూనే ఉన్నా.. లోప ల గుబులైతే అట్లాగే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల తర్వాత మిలిటెంట్ చరిత్ర న్యాయవాదులదే. ఎందుకోగానీ వాళ్లు ముందునుంచీ మెరుపు, సమరశీల సంఘటనల్లో ఆరితేరారు. ఇది సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల ఫోరం పెట్టిన కేకే మీట్‌ది ప్రెస్ సంగతి. ఆశ్చర్యం. మాట్లాడడం అయిపోయింతర్వాత తెలంగాణ వకీళ్ల చేతుల్లో పూల గుచ్ఛాలతో వచ్చి కేకేను అభినందించారు. జై తెలంగాణ నినాదాలు మిన్నుముట్టాయి. మిలియన్‌మార్చ్ గుర్తొచ్చింది. బహుశా ఆనాడు మధుయాష్కీని, కేకేను హేళన చేసి, అవమానం చేసి పంపినోళ్లలో తప్పనిసరిగా ఇదే వకీళ్లు ఉండే ఉంటారు. అనుమానమే అక్కరలేదు. పూలు-రాళ్లు. తెలంగాణ కోసం రైళ్లకు ఎదురుగా ఉరికేవాళ్లు, తెలంగాణ కోసం నిప్పుల్లో దుమికే వాళ్లు, మంటల్లో కాలిపోయేవాళ్లు. అడ్డంగా ఉన్నవాళ్లను ఎంత పెద్దవాళ్లయినా రాళ్లతో కొట్టేవాళ్లు, కోడిగుడ్లు విసిరేవాళ్లు, చెప్పులతో సత్కరించేవాళ్లు. అదీ తెలంగాణ. తెలంగాణ రాదు అనడాన్ని ఇక భరించలేని స్థితికి చేరుకున్నది. గులాంనబీ ఆజాద్ తెలుస్తుందా? నీకు అర్థమవుతున్నదా? సోనియాగాంధీకి సరే! తెలియకపోవచ్చు. శాంతికోసం, ఒక్క సంఘటన జరగకుండా ఉండడం కోసం ఉద్య మం నిరంతరాయంగా నడవడం కోసం, కంటికి రెప్పలా, దీపానికి చేతులడ్డుపెట్టుకొని కాపాడుకున్నట్టు తెలంగాణ తన ఉద్యమాన్ని తాను కాపాడుకుంటూ వచ్చింది. తనను తాను హింసించుకున్నది తెలంగాణ. తనను తాను చంపుకున్నది తెలంగాణ. ఆత్మవేదన. దుఃఖం.. ఒడవని తీరని శోకం. తెలుస్తుందా? ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానానికి. ఆ మాటకొస్తే కేకే అదే అన్నడు. ‘ఐయామ్ కిల్లింగ్ మై సెల్ఫ్’ ఇక గత్యంతరం లేక, నన్ను నేను చంపుకుంటున్నాను. రాజీనామాలతో తెలంగాణ వస్తదా? రాదా? తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. ఎనిమిదేళ్లుగా అనేక వాగ్దానాలు, హామీలు, సీఎంపీలలో, రాష్ట్రపతి ప్రసంగంలో ప్రకటనలు, సోనియా నోటి ముత్యాలు రాలినప్పుడు విన్నది తెలంగాణ. ప్రజలే కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా వీటికి ప్రత్యక్ష సాక్షు లు. ‘ఎంత నెత్తురు ఇచట ఏరులైపారిందో? వారికి తెలుసు.’ అందుకే సకల కాంగ్రెస్ తెలంగాణ మనస్తత్వంతో ‘మమ్మల్ని మేము చంపుకునే’ పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టారన్నాడాయన. గదిలో పిల్లిని పెట్టి కొడితే ఏమవుతుంది? ఒక మూల కు నెట్టేస్తే ఏమవుతుంది? ఆడిన మాట తప్పితే ఏమవుతుంది? బహుశా కాంగ్రెస్ నాయకులకు నిజంగానే ఇంత మధనమూ ఉందా? వలసాధిపత్యం ఏదైనా ముందుగా పరాధీనలను చేస్తుంది. బలహీనులను చేస్తుంది. తామే నిర్వాహకులం, తామే సమర్థులం, తామే ఇతరులకు ఇచ్చే వాళ్లంగా విజేతల మదాంధకారంలో అల్పుల జాతిని సృష్టిస్తుంది. కొన్ని బొక్కలు పారేసి ఏరుకోమంటుంది. భాషను, భావన ను, సంస్కృతినీ ధ్వంసం చేసి, మనుషులను ఉత్తడొల్లలుగా మార్చి, స్వాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని చంపేస్తుంది. వలసాధిపత్యాన్ని ప్రశ్నించే గొంతు ఒకటి ఎప్పుడూ ఉంటుం ది. అది తిరుగుబాటు. అది ఉవ్వెత్తున ఎగసే జ్వాల లాంటి ఒక తెలంగాణ సగటు మనిషి. అతనెప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. కానీ, వలసాధిపత్యంలో బానిసలైన వాళ్లు కోలుకోవడం కష్టం. వాళ్ల స్వాభిమానం అంతరించిపోతుంది. బహుశా నాలుగో తారీఖున మేమూ రాజీనామాలు చేస్తాం. ఆరువందల మంది బలిదానాలు జరిగినాయి. ఆ ఆరువందల మంది ప్రాణత్యాగాల ముందర మా పదవులు ఒక లెక్కకాదు. విసిరేస్తాం కాగితాలను స్పీకర్ ముఖం మీద అని అన్నారంటే.. ఇన్నాళ్లూ ఆత్మల కింద అట్టడుగున పొరల్లో దాగున్నదేదో పైకి తేలినట్టే కదా! తెట్టులో ఒక దుఃఖమో, వివశమో, కండ్లముందరి సాహసమో, త్యాగమో కలుక్కున మనసును కుదిపేసి ఉంటుంది. ఎక్కడో పేగు కదిలి ఉంటుంది. ఉంటుందా? అది రాజకీయాల్లో ఆరితేరి, అవకాశవాదులై, పదవులకు బానిసలై, వలస పెత్తందార్ల అడుగులకు మడుగులొత్తి బానిసకొక బానిసకొక బానిసలై వాళ్లు..తినగా మిగిలిందాన్ని కతకడానికి అలవాటు పడ్డవాళ్లు.., తోలు మందం ఉన్నవాళ్లకు ఆత్మలో కదలిక సాధ్యం అయ్యే పనేనా? మరి దారేలేదు. ఆత్మలోకంలో దివాళా తీసిన వాళ్లసంగతి వేరు. ఏ ముఖేష్‌గౌడో, ఏ జగ్గాడ్డో వేరు. కానీ..కానీ.. కళ్లముందర ఒక తెలంగాణ ప్రశ్నల కొడవళ్లు ఎత్తుతున్నది. గౌరవించిన ప్రజావూపతినిధులను అది అ గౌరవపరచి నిలదీస్తున్నది. తెలంగాణ మూసుకుపోయిన తలుపులను తెరిచే మార్గం. మరిచిపోయిన ఆత్మగౌరవాన్ని చేతికి అందించే పోరాట కెరటం. ఎన్నా ళ్లు దాక్కుంటారు స్వార్థపు గుహల్లో.., స్వార్థపు శిరస్సులను గండ్రగొడ్డలితో నరక గలిగిన హీరోలను కన్నది తెలంగాణ .అందువల్ల నైనా.. భవిష్యత్‌లో మరి పుట్టగతులుండవనైనా.. కాంగ్రెస్ వాళ్లు దారికి వచ్చి ఉండవచ్చు. కన్నతల్లిని, నేలనూ మరోసారి మననం చేసుకుంటూ ఉండవచ్చు. అయినా.. సరే! మెడలు వంచింది ఎవరు? ఒక రాయి విసిరిన వాడు. కదుల్తున్న వాహనంపై కోడిగుడ్డు బద్దలు కొట్టినవాడు. ఎక్కడికి వెళితే అక్కడ అడ్డం తిరిగి.. తెలంగాణ కోసం ఏమైనా చేస్తారా? చేయరా? అని నిలదీసి అడిగి కడిగినవాడు. వాడు ఇవాళ్టి విజేత. లాఠీలను, తూటాలను, ఇనుప కంచెలను, సెక్యూరిటీ దిగ్బంధాలను దాటుకొని మంత్రి కాన్వాయ్ మీద రాయి విసిరిన వాడే నేటి హీరో! అందుకు గదా! కేకే అయి నా, సర్వ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకైనా మరి దారిలేదు. ఇది తెలంగాణ పరాజయాల నుంచి లేచి నిలబడే తెలంగాణ. బూడిదలోంచి లేచొచ్చే జవజీవన ఫీనిక్స్. ఎక్కడికి పోతారు. ప్రజావూపతినిధులు. బానిసలకు విముక్తి అరుదుగా లభిస్తుంది. తెలంగాణ మీ సర్వ మాలిన్యాలను కడిగేస్తున్నది. పునీతులు అవుతారా? పందుల్లా అదే బురదలో, అదే ఊబిలో, అదే పరాయి పంచలో హీనంగా, దీనంగా అడుక్కుతినే వాళ్లుగా ఉండిపోతారా?అని ప్రశ్నిస్తున్నది తెలంగాణ. శాంతికోసం, తెలంగాణను తుదికంటా కొనసాగించడం కోసం..ఆత్మహననం. యస్‌మీరు మీరు కూడా.. కిల్ యువర్ సెల్ఫ్ తప్పేమీ లేదు. పదవి గడ్డిపోచలాంటిది. త్యాగం హిమాలయం లాంటిది. ఇంతకీ.. రాజకీయ నాయకులారా.. తెలంగాణలో పుట్టిన కాంగ్రెస్ , తెలుగుదేశం , సీపీ ఐ, బీజేపీ అన్ని పార్టీల ప్రతినిధులారా..! మాటకు కట్టుబడి ఉంటారా?..మాట తప్పుతారా..? బోనం ఎత్తుకున్నది తెలంగాణ. బోనం ఎత్తేస్తారా! పాపాత్ములౌతారా?తుదకంటా తెలంగాణ వీరుల వెంట , తెలంగాణ ఉద్యమం వెంట , తెలంగాణ స్వాభిమానం వెంట, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాల వెంట నడుస్తారా? తేలేది ఒక్కరోజులోనే కానీ.. ఒక్కటి గుర్తుంచుకోండి. రాజీనామాలు చేస్తానన్నారు. మీ ముందరి దారులు మరిలేవు మూసుకుపోయాయి. ఇక వెనకదారి లేదు. రాజీనామాలు చెయ్యండి.. పోరాడే తెలంగాణ మీ వెంట ఉంటుంది. . మాట తప్పి వెనక్కెళ్తారా.. తెలంగాణ మీ వెంట పడ్తుంది. ఒక దావానలమై చుట్టుముడ్తుంది. తస్మాత్ జాగ్రత్త... జై తెలంగాణ.. నమస్తే తెలంగాణ.

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...