ఆ పదకొండు రోజులు..


Sun,June 1, 2014 02:25 AM

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున్న విషయాలే. పూర్తిగా తెలిసిన విషయాలే. కానీ ప్రవాహవేగం పుస్తకాన్ని ఏకబిగిన చదివిస్తున్నది. ఇదింతకి కల్పన కాదు. చరిత్రే. మరీ పాత చరిత్ర కూడా కాదు. ఇటీవలిదే. నాలుగేళ్లు నిండని చరిత్ర. కానీ ఈ చరిత్ర వర్తమానంలోనూ ప్రతిఫలిస్తున్నందువల్ల కావొచ్చు. వర్తమానం చరిత్రకెక్కుతున్నందువల్లా కావొచ్చు. ఇప్పటికీ తెలంగాణ కల సాకారం కానందువల్లా కావొచ్చు. తెలంగాణ కోసం ఇప్పటికీ కోట్లాది ఆత్మలు తండ్లాడుతున్నందువల్లా కావొచ్చు. ప్రవాహంలాగా అక్షరాల కదలిక వెంట కనుచూపుమేరా ఉద్వేగ బంధంతో పుస్తకం చదివిన తర్వాత గటిక విజయ్‌కుమార్ చరిత్రను నమోదు చేసినందుకు మనసు లోపలి నుంచి ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నా.

narayanaనిజానికి ఈ పుస్తకానికి పేరు లేకుండానే విజయ్ నాకు పంపించి ముందుమాట అడిగీ చాలా కాలమయింది. ఒత్తిళ్ల మధ్య పుస్తకం తెరవక చాలారోజులు నానబెట్టి ఇక గొంతు మీదికొచ్చిన తర్వాత పరీక్షకు చదివే వన్ డే లేబర్ నమూనాలో మొదలుపెట్టానీ పుస్తకాన్ని. ముందు యధాలాపంగా.. కానీ తర్వాత ఇక ఒకసారి మొదలుపెట్టినాక ఒక్కొక్కటిగా తెలంగాణ సమాజంలోని నువ్వూ నేనూ అందరమూ అనుభవించిన క్లేశము, దుఃఖము, ఉద్వేగమూ, ఉక్రోశమూ, ఆక్రోశమూ, నెత్తురులో మరిగి వికసించిన వజ్ర పుష్పం లాంటి త్యాగము, విలాపన, ఆర్సిపెట్టిన కేక లాంటి నినాదమూ అన్నీ కలగలిసిపోయి చివరి పేజీ దాకా విరామమెరుగకుండా చదివాను. బహుశా ఈ పుస్తకంలోని విషయం విలువ ఒక్కటే ఇందుకు కారణం కాదు. దీన్ని గటిక విజయ్‌కుమార్ నడిపించిన తీరు కూడా కారణం కావొచ్చు. ఇంతకీ ఈ పుస్తకం ఒక కల్పనా? కాదు. అవును కూడానూ. కేవలం చరిత్ర ను నమోదు చేయడమా? అవును. ఇదొక జర్నలిస్టు వార్తాకథనమా! అవును. కదిపి కుదిపి ఇబ్బందిపెట్టి ఊపేసిన ఆ 11 రోజులదీ పుస్తకం. గటిక విజయ్‌కు కేసీఆర్ అంటే ప్రేమ. అది అప్రకటితమేమీ కాదు. పుస్తకం చదివాక ఈ పుస్తకం కల్పన కాని, వాస్తావాంశాల, చరిత్ర నమోదుగా అర్థం చేసుకుని... ఒక జర్నలి స్టు అనుభవించి పలవరించిన ఉద్వేగభరితమైన జర్నలిస్టు క్రానాలజీ అని కూడా అనుకున్నా. కేసీఆర్‌తో పూర్తిగా ముడివడిన ఆ 11 రోజులను విజయ్ మొత్తం ఉద్యమ అనుసంధానంగా ముఖచిత్రంగా నడిపిన తీరు ప్రశంసనీయం.

విజయ్ రాసిన ఆ 11 రోజుల ఉద్వేగభరిత నివేదికయే ఈ పుస్తక సారాంశం. డిసెంబర్ 9 గురించి ఎవ రి అభిప్రాయాలు ఎట్లా ఉన్నా.. నాకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి అది ఒక గుణాత్మక గెలుపే. అమలు అయిందా? డిసెంబర్ 9 ప్రకటన వెనకకిపోయిందా? అన్న దానితో నిమిత్తం లేకుండా ఆ ప్రకటన దానికదే ఒక విజయం. తర్వాతి అపజయాలన్నీ అంతిమంగా డిసెంబర్ 9 విజయం కొనసాగింపు అయివుండవచ్చు. కానీ డిసెంబర్ 9 లేకుండా వచ్చే అంతిమ విజయం సాధ్యం అయ్యేది కాదు.

kcr44ఆ పదకొండు రోజుల్లో కోలుకు మొట్టమొదలు కేసీఆర్ నిరాహారదీక్ష నవంబర్ 29న ప్రారంభమయినప్పుడు ఈ పుస్తకం ప్రారంభం అవుతుంది. విజయ్ ఈ 11 రోజులకూ ప్రత్యక్ష సాక్షి. స్వయంగా ఈ ఉద్వేగంలో భాగం. కన్నీళ్లూ, కోపమూ ఉద్యమంతో పాటు సమానంగా అనుభవించిన సాక్షి. ఒకరకంగా వీలైన చోట, అందరు జర్నలిస్టులలాగే ఉద్యమాన్ని పరిరక్షించుకున్న వాడు కూడా. కానీ ఇంత అద్భుతమైన ఈ 11 రోజులను తెలంగాణ మొత్తం కదలబారిన ఈ దినాలకు అతడు కేవలం పొడిపొడి నివేదికగా రూపొందించలేదు. తారీఖులు, దస్తావేజులతో నిండిన చరిత్రలాగా కూడా రాయలేదు. ఈ చరిత్ర వాస్తవాంశాలకు పూర్తిగా, సత్య ప్రమాణంగా నమోదు చేస్తూనే ఒక కుటుంబం, అదీ ఒక పోలీసు కుటుంబం కళ్లనుంచి ఈ 11 రోజులను చిత్రించాడు. పదకొండు రోజుల్లో ఒక సామాన్యమైన పోలీసు కుటుంబం పడిన వేదన, సంఘర్షణ, ఉద్వేగభారం నుంచి చెబుతూనే, తాను స్వయంగా పాత్రయై చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. ఆ రకంగా ఇదొక మేలుకొలుపు పుస్తకంగా తయారయింది. ఈ పుస్తకం చదవడం ప్రారంభించినప్పుడు కూడా నాకు పుస్తక రూపం మీద అంత ఆసక్తి కలగలేదు. కానీ ఒకసారి చదవడం ప్రారంభించి ముగించిన తర్వాత పుస్తకం రూప విశేషం తెలిసింది

కేసీఆర్ 2001లో తెలుగుదేశం పార్టీని, డిప్యూటీ స్పీకర్ పదవిని విడిచిపెట్టి తెలంగాణ రణక్షేత్రంలోకి దూకడం, జయశంకర్ సార్ ఈ రాజకీయ ప్రయత్నానికి తోడయ్యారు. అప్పటి నుంచీ తెలంగాణ రాజకీయాలు ఒక భిన్నమైన మలుపు తీసుకున్నాయి. ఉద్యమానికి కొత్త రూపు వచ్చింది. అదే రాజకీయ నిర్మాణ రూపు. గతం అనుభవాలు, ఇప్పటి వరకు మలి ఉద్యమంలో ఒక రాజకీయ నిర్మాణం ఆవశ్యకతను కేసీఆర్ సరిగ్గానే గుర్తించారు. కేంద్రంలో రాజకీయ ప్రక్రియతో పార్లమెంటులో బిల్లుపెట్టడం ద్వారా వచ్చే రాజ్యాంగబద్ధ డిమాండ్ కనుక తెలంగాణ ఉద్యమం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుతంగా, రాజకీయ స్వీయ అస్తిత్వాన్ని నిర్మించుకుంటూ సాగాలన్నదే కేసీఆర్ అసలైన ఎత్తుగడ. అప్పటికి రాష్ట్రంలో రాజ్యహింస విశ్వరూపంలో ఉన్నది. ఆట పాట మాట బందయ్యి, మనుషులు మాయమవుతున్నరు. ఇలాంటప్పు డు ఉద్యమం ఏ మాత్రం తీవ్రరూపం తీసుకున్నా అణచివేస్తారనే పూర్తి స్పహ తో, ఒక రాజకీయ నిర్మాణం, ఎన్నికల్లో తక్షణమే ఫలితాల సాధన లాంటివి, అప్పటికే భావజాల పరంగా ఏర్పడిన కార్యక్షేత్రాన్ని మలుపుతిప్పాయి. ఆ రకంగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తన స్వంత శైలిని, ముద్రను, ఎత్తుగడలను అనుసరించారు. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ అనే భావనల కన్నా ముందు తెలంగాణ సాధన లక్ష్యంగా ఢిల్లీలో లాబీయింగ్, రాజకీయశక్తిగా ఎదిగి శాసించి తెలంగాణ సాధించుకోవడం, ఈ ప్రయత్నంలో జరిగే పోరాటమంతా ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరగడం కేసీఆర్ ఎత్తుగడల్లో ముఖ్యాంశాలు. ఆ మేరకే ఆయన తెలంగాణను ఢిల్లీ పురవీధుల్లోకి, అధికార సౌధాల్లోకి వ్యాపింపజేయడంలో తెలంగాణకు అనుకూలంగా రాజకీయ సమీకరణలను, మద్దతును ఢిల్లీ స్థాయిలో కూడగట్టడంలో కేంద్రీకరించి పని చేశారు. విజయం సాధించారు.

nippukaniakaఉద్యమశక్తులు పేరుకే ఐక్యత ప్రకటించినా వాటి ఎజెండాలు వేరువేరుగా ఉండడం, ఐక్యత సాధించలేకపోవడం, చీలిపోయి ఉండడం వెనక స్వంత రాజకీయ ఎజెండాలుండడం వల్ల ప్రత్యామ్నాయ బలమైన శక్తిగా ఎదగలేదు. ఇది కేసీఆర్‌కు కలిసి వచ్చిన అంశం. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి లక్ష విమర్శలు, లక్ష నిందలు, లక్ష ఆటంకాలు ఎదురైనా కేసీఆర్ నిలబడగలిగారు. అందుకే ఆయనకు కలిసి వచ్చిన ముఖ్యమైన అంశం అప్పటికీ ఇప్పటికీ ఆయనది ఒకే ఒక్క ఎజెండా. అది తెలంగాణ సాధన. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, పాల్గొంటున్న మిత, అతి, తటస్థవాద శక్తులన్నింటికీ తెలంగాణ ఎజెండాతో పాటు ఇతర ఎజెండాలుండడం, వాటి పరిధిలో అవి పనిచేయడం వాటిని కేసీఆర్‌లా ఒకేఒక ప్రత్యామ్నాయంగా నిలబెట్టలేకపోయాయి. ఇప్పటికీ కేసీఆర్‌తో అనేక రకాలుగా విభేదించినా, ఆయన ఎత్తుగడలు, పద్ధతులు, స్వభావంతో అనేక పేచీలు పడినా, పోరాడినా తెలంగాణ అంశం వచ్చే సరికి ఆయనే నాయకుడు అనే పరిస్థితి ఏర్పడడం అందుకే.

ప్రభుత్వం సరిగ్గానే అంచనా వేసింది. కేసీఆర్ నిరాహారదీక్ష జరిగితే ఏమవుతుందో? తెలుసు. తెలంగాణ అంతటా అగ్గి రాజుకుని ఉన్నది. క్షేత్రం సిద్ధంగా ఉన్నది. ఇక పోరాటమే తరువాయి. అందుకే రాత్రికి రాత్రి కుట్రలు జరిగాయి. ఇక అక్కడి నుంచి తెలంగాణ పోరాట చరిత్రలో పదకొండు రోజులు రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఊపిరి సలపనివ్వని ఉద్వేగాల మధ్య ఆ పదకొండు రోజులు తెలంగాణ ప్రజలు మరే విషయాన్నీ ఆలోచించే పరిస్థితే లేదు. కేసీఆర్ కేంద్రమంత్రిగా పనిచేశారు. దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న నాయకుడు. కానీ ఆయన దీక్ష భగ్నం చేసిన తీరు, ఆయనను అరెస్టు చేసిన తీరు తెలంగాణ ఉద్యమాన్ని మండించింది. అంతకుమించి కేసీఆర్‌ను ఖమ్మం జైలులో ఉంచడం, ఆయన వెంట నక్సలైట్ల వేటకోసం వాడే గ్రేహౌండ్స్ పోలీసులు ఉండడం, అమానవీయ ప్రవర్తన, జైలులో అనాగరిక, క్రూర ప్రవర్తన లాంటివి తెలంగాణను మండించాయి. మరుసటి రోజే వివాదాస్పదంగా కేసీఆర్ దీక్ష విరమణ జరిగిందని ఒక పద్ధతి ప్రకారంగా కుట్ర జరిగి అది బయట కేసీఆర్‌కు వ్యతిరేకంగా మారడం, ఇది కేసీఆర్ పట్టుదలను మరింత పెంచడం లాంటి పరిణామాలు జరిగాయి. ఈ మొత్తం క్రమాన్ని ఉద్వేగంగా, ఒక రన్నింగ్ కామెంటరీలాగా పోలీసు కుటుం బం కళ్లల్లో నుంచి, తెలంగాణ జనం స్పందనల నుంచి, తెలంగాణలో ఆ రోజులు మొత్తం చెలరేగిన ఉద్యమం గురించి ఉద్వేగంగా విజయ్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుచేయవలసి ఉన్నది. విజయ్‌ను నేను మొదటిసారి సమ్మక్క సారక్క జాతర లైవ్ కవరేజీలో బహుశా ఎన్‌టీవీలో ఉండగా చూశాను. ఆశ్చర్యపోయాను. సమ్మక్క సారక్క జాతరను, అక్కడి జన సందోహాన్ని, సమ్మక్క సారక్కలు గద్దెకెక్కిన సన్నివేశాన్ని, చిలుకల గుట్టకు చేపలు ఎదురెక్కినట్టు జనం ఎదురెక్కిన వైనాన్ని కళ్లకు కట్టినట్టు మాటల్లో చెప్తున్నప్పుడే విజయ్ వాక్శుద్ధి తెలిసింది. టెన్ డేస్... దట్ షుక్స్ ది వరల్డ్ కూడా జర్నలిస్టు అనుభవాలే. అక్టోబర్ విప్లవ సంరంభం కళ్లకు కట్టిన ఆ పదిరోజులు నిజానికి జర్నలిజం ఉచ్ఛస్థితికి ఒక నమూనా. బహుశా ఆ పుస్తకంతోను ఆ అక్టోబర్ రెవల్యూషన్‌లోనూ వీటిని పోల్చడం సరికాదు కానీ, తెలంగాణ కీలక పదకొండు రోజులను గుక్కతిప్పుకోకుండా మాట్లాడినట్టు రాసినవాడు విజయ్.

నిజానికి కేసీఆర్ పట్టుదల, పదకొండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నింటిపై ఆయన రాజకీయ అంచనాలు.. అయితే జైత్రయాత్ర కాదంటే శవయాత్ర లాంటి మొండితనం, మధ్యలో రోశయ్య ప్రభుత్వం కుట్రలు అన్నీ ఈ పుస్తకం ద్వారా బహిర్గతం అయ్యాయి. కోస్తాంధ్ర పెత్తందారీ వర్గం ఎట్లా ఉంటుందో? ఈ వర్గమే అధికారాన్ని ఆక్రమించుకుని, అధిష్ఠానానికి అడ్డంపడి కూడా ఎట్లా తెలంగాణకు వ్యతిరేకంగా ఒక యంత్రాంగం లాగా పనిచేసిందో? ఏ పార్టీలు ఏ విధమైన ద్వంద్వ స్వభావాలు ప్రకటించి, ఆచరించాయో? తెలుగుదేశం పార్టీ స్వభావం ఏమిటో? అప్పుడున్న పార్టీలన్నీ తెలంగాణ పట్ల ఎట్లా రకరకాలుగా వ్యవహరించాయో అవన్నీ నమోదయ్యాయి. ఈ అన్నింటికన్నా ముఖ్యంగా, కేసీఆర్ అక్రమ అరెస్టుతో భగ్గుమన్న తెలంగాణ ఆ పదకొండు రోజుల్లో చేసిన ఉద్యమం, కేవలం చైతన్యం గల తెలంగాణవాదుల ఉద్యమం, పూర్తిగా ప్రజల పరం అయ్యి ఎట్లా మమేకం అయ్యారో? అవ న్నీ రికార్డు అయ్యాయి.

పోలీసు కుటుంబం మెల్లమెల్లగా ఉద్యమంలోకి రావడం దాన్నే సూచిస్తున్నది. ఖమ్మంలో ఉన్నప్పుడు అక్కడ ఉద్యమం బలం గా లేనందువల్ల జర్నలిస్టులందరూ తమ తెలంగాణ చైతన్యం ప్రదర్శించి ఒకరకంగా కేసీఆర్‌కు భద్రతగా చూసుకున్నతీరు, ఒక దశలో రచయితకు కేసీఆర్ ఫోన్ చేసినప్పుడు ఆయన ఏడవడం, రచయిత కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఏకమయిన స్థితికి దర్పణం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 1969 ఉద్యమంలో లేని విధంగా భంగపాటు వల్ల, కేసీఆర్ పట్ల ప్రభుత్వం అనుసరించిన అమానవీయ అణచివేత వల్ల తెలంగాణ యువకులు, విద్యార్థులు, కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవడం నమోదయింది. ఇది ముఖ్యమైనది. ప్రభుత్వాలు ఎట్లా ఆత్మహత్యలకు కారణమో తేటతెల్లం చేసేవి. ఒక శాంతియుత, రాజ్యాంగస్ఫూర్తితో జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాన్ని క్రూరంగా అణచివేస్తే జరిగే విపరిణామాలుగా ఆత్మహత్యలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఈ పుస్తకంలో ఆధారాలున్నాయి.

చివరకు కేసీఆర్ గెలిచారు. ఆయన పట్టుదల గెలిచింది. నిత్య విమర్శకులుగా ఉన్న ప్రజాసంఘాల వారు కూడా కేసీఆర్ ప్రాణం కోసం తల్లడిల్లారు. అన్ని సంఘాలూ అప్పీల్ చేశాయి. రెండోరోజు విమర్శలు కేసీఆర్ పదకొండోరోజు విజయం తర్వాత పూలవానలయ్యాయి. కేసీఆర్ వ్యక్తిత్వంలో ఉన్న మరోకోణం మానవీయమైనదిగా, ఒక కారణం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడేవాడుగా ఆయన తెలంగాణకు తిరుగులేని నాయకుడుగా మారారు. ముఖ్యంగా పదవరోజు, పదకొండవరోజు ఢిల్లీలో పరిణామాలు, ఇక్కడ ఆస్పత్రిలో మంతనాలు, పూర్తిగా క్షీణించిన ఆరోగ్యం, సమాజం అంతా ఆయన దీక్ష విరమణకు చేసిన విజ్ఞప్తులు ఆయన రాజకీయ అంచనాల మేరకు, శక్తి ఉడిగినా ఒక్క అడుగూ దిగిరాలేదు కేసీఆర్. ఆ చరిత్రంతా ఇప్పుడు అవసరమైనదే. అందుకే ఈ పుస్తకం ఒక చరిత్రను రికార్డు చేసింది. తెలంగాణ ఇటీవలి చరిత్రలే నమోదుకావడం లేదు. అమరవీరుల లెక్కలే అందడం లేదు. ఇక చరిత్రను, వైభవాన్ని తుడిచేసే ప్రయత్నాలు జరిగాయి. ఒక్కొక్క దాన్నీ వెలికి తీసి, తవ్వే ప్రయత్నాలు అవసరం అవుతున్నాయి. అట్లాంటి తరుణంలో ఒక చరిత్రను రికార్డు చేసి, ప్రాణం పోసి మనకు అందిస్తున్న విజయ్‌కు మరోసారి ప్రత్యేక అభినందనలు.
జై తెలంగాణ..జైజై తెలంగాణ

"తెలంగాణ ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష తర్వాత పరిణామాలపై గటిక విజయ్ రాసిన నిప్పు కణిక తెలంగాణను కుదిపేసిన 11 రోజులు పుస్తకానికి అల్లం నారాయణ రాసిన ముందుమాటలోని కొన్ని భాగాలు"



801

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...