జంపన్న వారసత్వం...


Sun,February 9, 2014 12:32 AM

జంపన్నా వాగుల్ల అబ్బియా!
జాలారి బండల్ల అబ్బియా!
నాది దయ్యాల మడుగే అబ్బియా!
దండొక్కపొద్దే అబ్బియా

జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు పూనకాలుగా స్వీకరించకపోతే మనిషి కట్టెసరుసుకపోయి తడిలేని యంత్ర మానవుడవుతాడు. జంపన్న వాగును చూసినప్పుడల్లా ఆ వాగు నీళ్లల్లో ఒంటిగా ప్రతాపరువూదు ని సేనలతో పోరాడుతున్న జంపన్న రూపుకట్టకపోతే, గాయపడిన కొలిమిలాంటి ఒక వీరయోధుని చరివూతను ఆవాహన చేసుకోకపోతే, తెలంగాణ లేదు. పడిలేచిన కెరటమై సాగిన తెలంగాణ సర్వావస్థల సకల పోరాటాలు, ధిక్కారాలు లేవు. సమ్మక్క సారలక్కల దగ్గరికి వెళ్తున్నప్పుడూ, వస్తున్నప్పుడూ పురా ఆత్మలు తిరుగాడినట్టే, ఆ నేల మీద మమకారమూ, మమేకమూ కలెగలుపులుగా ఒక ఉద్దీపన అనుభవంలోకి వస్తుంది.

ఇది ప్రతిసారీ అనుభవమే. ఏదో మేల్కాంచినట్టు, ఏదో మతికొచ్చినట్టు, ఏదో కోల్పోయిన పటిమలు మనసులో దూరి మళ్లీ జీవం పోసుకుంటున్నట్టు..ఆ అనుభవంలో ఉప్పొంగిన అడవులను ఆవాహన చేసుకున్నట్టు... శతాబ్దాల క్రిందట ఆ జంపన్న వాగులో శత్రుమూకల వెన్నుపోటుకు ఒరిగిన గాయపడిన వీరయోధుని వారసత్వం అడవుల నిండా పరివ్యాపించినట్టు... ఇదంతా శివసత్తులు పూనకం వంటిదేమీ కాదు. అడవి మీద ఆశ. అడవుల్లో వెలిగే దీపాల మీద ఆశ. ఈ దేశపు మూలవాసులు, ఆదివాసుల మీద ఆశ. ఒక కొమురం భీం దాకా, ‘జల్ జంగిల్ జమీన్’ల కోసం పోరాడిన వాళ్ల అచ్చ పోరాటాల వారసత్వం మీద ఆశ. నిజానికది సంపెంగ వాగు. బయ్యక్కపేట దగ్గర దయ్యాల వాగు. లక్నవరం పునాదుల్లో సర్దిమడుగు. పారినంత మేరా అది ఒక వారసత్వాన్ని మోసుకొచ్చే ఒక జల తరంగిణి. ఆశ్వాసాల మోత. ఇంతకీ జంపన్న మనిషా? మనిషే అయితే తెలంగాణ నేల మీద ఒక వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీక. జంపన్న నీరేనా? నీరే అయితే అదొక ప్రాణధార. ఈ రెండింటి అపురూప వారసత్వ ప్రకృతి పరాక్షికమ రూపమే సమ్మక్క సారక్కల జన జాతర. చిలుకలగుట్టలో దాగున్న రహస్యం. సమ్మక్క సారక్కల, వీరయోధుడు జంపన్న వారసత్వాన్ని స్వీకరించింది తెలంగాణ అస్తిత్వ పోరాటం.

బహుశా ఆ అడవి తల్లుల జాతరక్కడ పున్నమి వెలుగుల్లో కోటిమంది మోకరిల్లి అడవిని ఆవాహన చేసుకుని, శివసత్తులు ఎగురుతున్న వేళ, జంపన్న వాగుల జలాలు ఉప్పొంగుతుండగానే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశిస్తుంది కావొచ్చు. ఆ బిల్లులో ఇదే అడవి బిడ్డల ఉనికిని మింగే, ఇదే అడవి బిడ్డలను నిండు నీళ్లల్లో ముంచే సవరణ ఒకటి ఉన్నది. అదీ సమస్య. మేడా రం నుంచి ఏటూరునాగారం దిగువ నుంచి ప్రవహించే గోదావరి పోలవరం వద్ద ఇదే అడవి బిడ్డల ఊళ్లను ముంచబొయ్యే ప్రణాళికకు బిల్లులో ఆమోద రాజముద్ర పడుతుంది. ఒకవేపు ఏ వారసత్వాన్ని స్వీకరించి, ఏ అడవి బిడ్డలు రాజును ఎదిరించిన చరివూతను స్వీకరించి పోరాడి సాధించుకున్న తెలంగాణ బిల్లుకు ఇదే మూలవాసుల, ఇదే ఆదివాసుల, ఇదే ఉత్పత్తి కులాల నెత్తురంటుకొని ఉన్నది. అదొక త్యాగాల నెత్తుటి మరకలు, కన్నీళ్లూ అంటిన బిల్లు. కానీ ఆ బిల్లులో అనేక చిల్లులున్నవి. అదీ సమస్య.

తెలంగాణ తీర్మానం వచ్చినప్పటి నుంచీ మీడియా ఏకపక్షంగా ఉన్నది. సీమాంధ్ర పెత్తందార్ల ప్రయోజనాల కోసం అది తన సహజ స్వభావాన్ని, మౌలిక విలువలను, నిష్పాక్షికతను వదులుకున్నది. తెలంగాణ బిల్లును అడ్డంకొట్టడానికి అనునిత్యం అది పెత్తందార్లతో, కనిపించని కుట్రలు చేసే కార్పొరేట్లతోని, సంపన్న నయా రాజకీయ నాయకత్వంతో కుమ్మక్కై ప్రతీఘాత సమైక్యాంధ్ర ఉద్యమాలకు బలవంతంగా ప్రాణం పోసేందుకు ప్రయత్నించి విఫలమయింది. వదంతులు వ్యాపింపజేసింది. నిలు అబద్ధాలను అచ్చో సి ఆరబోసింది. కలర్ టీవీల నిండా సంకుచిత విష సర్పాలను నింపింది.

తెలంగాణ వాడు బతకకుండా, చావకుండా, ఓ వేపు తెలంగాణ వస్తుందన్న సంబురం లేకుండా, వస్తున్న తెలంగాణను అడ్డంకొడ్తున్నట్టుగా గందరగోళా న్ని వ్యాపింపజేసింది. అసలు బిల్లే రాదు, రానివ్వం అన్నట్టుగా సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం కలిసి అనుమాన పెనుభూతా ల్ని సృష్టించారు. అసలు తెలంగాణ వస్తుందా? రాదా? అన్న ఒక సందిగ్ధ వాతావరణాన్ని, నిరాశను, నిస్పృహను, భంగపాటును తీర్చిదిద్దింది మీడి యా. మళ్లీ ఆత్మహత్యల్లోకి నెట్టిన ఒక వాతావరణం ఏర్పాటయిన ఈ క్షణాలన్నీ మీడియా పుణ్యమే. నిజానికి ఈ మీడియా రాతలు ఒక్కటీ నిజం కాలే దు. బిల్లు పార్లమెంటుకు చేరుతున్న ఈ తరుణం కూడా ఒక అనుమానం వెంటాడేంత ప్రజల మానసిక ప్రపంచాలని అతలాకుతలం చేసిన ఏకపక్ష, సంక్షుభిత మీడియా రెండు ప్రయోజనాలను ఆశించి ఈ పని చేసింది. అది సీమాంధ్ర ప్రజలతోను లేదు. ప్రజలను ముంచే కార్పొరేట్ల కోస్తా కారిడార్‌ల తో జతకట్టింది.

చివరి క్షణాల్లో సవరణ రూపంలో తెలంగాణపై పూర్తిస్థాయి వివక్ష ప్రదర్శిస్తూ, తెలంగాణ వచ్చినా స్వేచ్ఛలేని, స్వాతంవూత్యంలేని, స్వయం నిర్ణయాధికారంలేని పరోక్ష పెత్తనాలను, పరోక్ష ఆధిపత్యాలను మరో అర్థంలో అదే వలసాధిపత్యం ఇంకో పద్ధతిలో కొనసాగేలా బిల్లులో సవరణలున్నాయి. తెలంగాణ వస్తే విప్లవం రాదని తెలుసు. తెలంగాణ వస్తే నూతన ప్రజాస్వామ్య రాజ్యాలు, సామాజిక రాజ్యాలు రావని తెలుసు. కానీ నాలుగు వేపులా సరిహద్దులు గల ఉత్త భౌగోళిక తెలంగాణ నిజంగానే దేనికి. సమ్మక్క, సారలక్క ల మేడారం జాతరకు మన రాష్ట్ర ఆదివాసులే కాదు ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి వేనవేలుగా వస్తారు. కానీ పోలవరం అటు వారినీ, ఇటు ఖమ్మం జిల్లా ఆదివాసులను నిర్వాసితులను చేసి, అడవికి దూరం చేసి, సహజాతమైన వారి బతుకులను ఛిద్రం చేసే ముంచే ప్రాజెక్టు. దీన్ని వ్యతిరేకించకుండా తెలంగాణ వారసత్వం ఏ రూపంలోనూ నిలబడదనేదే సత్యం.

గవర్నర్‌గిరీలతో హైదరాబాద్‌ను ఆక్రమించుకున్న సీమాంవూధుల భూము లు, ఆక్రమించుకున్న గుట్టలు, జూబ్లీ కొండలు, కార్పొరేట్ శక్తులుగా అవతారమెత్తిన ఆంధ్ర సంపన్న వర్గాలు కంపెనీల పేరిట ఆక్రమించుకున్న ఆస్తులు, ఆ కంపెనీలలో కొలువుదీరిన వేలాది ఉద్యోగులు. అంతా ఓకే. గవర్నర్ ఒక్క డే. బహుశా నరసింహన్ కొనసాగితే ఆయనకు ఛత్తీస్‌గఢ్ చరిత్ర కూడా కలుపుకుంటే అణచివేతకు, ఆధిపత్యానికి, ఊరేగుతున్న అహంకారానికి చట్టబద్ధ త. ఇక అవ్వల్ హైదరాబాదీ హక్కులు, తెలంగాణ అంతర్భాగమని విర్రవీగినంత మాత్రాన చెల్లవు. స్వయంపాలన, స్వయం నిర్ణయాధికారాలు ఉత్త మాటే. ఉమ్మడి రాజధానిగా విలసిల్లే హైదరాబాద్‌లో ఆక్రమిత ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన తెలంగాణ గోడు భవిష్యత్తు అరణ్యరోదనే. బిల్లు వస్తుందం ఇంత యాగీ చేసే మీడియా, సీమాంధ్ర పెత్తందార్లు తీరా తెలంగాణ వచ్చినాక బతకనిస్తారా? చావనిస్తారా? ఒక శేష ప్రశ్న.

తెలంగాణ పోరాటతత్వాన్ని నీరుగార్చి, సంపూర్ణ తెలంగాణ డిమాండ్‌పై పోరాటాలు రాకుండా నిలువరించడం సీమాంధ్ర మీడియా ప్రయోజనాల్లో ఒకటైతే... ఈ నిశ్శబ్ద సంధి వాతావరణంలో చివరికి సీమాంవూధకే అన్యాయం జరిగినట్టు ‘ఉల్టాచోర్’ ప్రచారాలు మరో ప్రయోజనం. వెరసి సీమాంధ్ర మీడి యా సంకుచితత్వం ఎంత ద్రోహానికి ఒడిగట్టిందో? తెలంగాణ ప్రజలు తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వస్తున్నప్పటికీ ఎంత గరళాన్ని పత్రికల రూపంలో మింగుతున్నారో? ఎన్ని దృశ్యాలను పీడ కలలు కంటున్నారో అర్థం చేసుకోవాల్సిన అసలు స్థితి. మరి దారి లేదు.

ఒకవేపు తెలంగాణ సమాజా న్ని బిల్లు రాదన్న గందరగోళంలో ఉంచి, ఏదో ఒకటి తెలంగాణ బిల్లై తే ముందురానివ్వు అన్న నీరసంలోకి నెట్టేసి, మరోవేపు బిల్లులో తెలంగాణ బతుకులకు చిల్లులు పెట్టే సంస్కరణలు ఆమోదింపజేసుకోవడమే ఇప్పటి కపట నాటకాల సారం. కామన్ ఎంట్రెన్స్, ఎక్కడి ఉద్యోగులు అక్కడే, గవర్నర్‌గిరీ, పోలవరం, పదేండ్ల ఉమ్మడి రాజధాని తెలంగాణ వచ్చినట్టు కాదు. లాబీయింగులు, రాజకీయా లు చేస్తున్న నాయకత్వం, పోరాటానికి నాయకత్వం వహించిన జేఏసీలు, ఉద్యమ సంస్థలు బహుపరాక్. మనల్నే కొట్టి, వాళ్లు గాయపడినట్టు నటిస్తున్న ఈ సందర్భం అర్థం కావాల్సే ఉన్నది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల మీదకు వస్తున్నది. జంపన్న వాగుకు ఒక వారసత్వం ఉన్నది. ఆదివాసుల తరఫున జంపన్న వారసత్వంతో నిలబడాల్సే ఉన్నది. జనం ఉప్పొంగిన ఒక కల, ఒక మెలకువ ప్రదర్శించాల్సి ఉన్నది. అడవులు మనవే. పోరాడే వీరయోధుల వారసత్వమూ మనదే. అప్పుడే తెలంగాణ పోరాటానికి ఒక అర్థం ఉన్నది. సవరణలను తిప్పికొట్టాలి. సంపూర్ణ తెలంగాణ సాధించాలి.
narayana.allam@gmail.com

293

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

అమ్మో.. ఆ ముగ్గురు బాబులు

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, దోపిడీ ఇవన్నీ ఎన్ని సమస్యలున్నా సరే... భరించవచ్చునేమొ కానీ ఇలాంటి ముగ్గురు బాబుల నాయకత్వాన్ని భరించే శక్తి ఇకలేదు. వీళ్లను తప్పించుకోవడం కోసమన్నా మా తెలంగాణ మాగ్గావాలె... అమ్మో.. ఆ ముగ్గురు.... పాపం సీమాంధ్ర ప్రజలక...

విభజన: మేడ్ డిఫికల్ట్

సరిగ్గా రెండు నెలలు. జూలై 30 ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ ఎక్కడున్నది. అక్కడే. నిజాం కాలేజీ మైదానంలో సకల జనభేరి జరగబోతున్నది. లక్ష్యం, సభ లక్షణం సుస్పష్టమే. తెలంగాణ పోరాడుతూనే ఉంటుంది. వచ్చేదాకా. ఈ రెండు నెలల కాలంలో జరిగిన మాటల యుద్ధాలు కాంగ్రెస్ పార...

అమ్మా మీకు దండం.. కలిసుండలేం..

అమ్మా మీరు పెద్దలు. పూజ్యులు. గొప్పవాళ్లు.. సరిగ్గా మీరక్కడ రాష్ట్రపతి భవనం ముందర ‘ఫ్యాషన్ పరేడ్’లాగా పట్టువస్త్రాలు, వజ్రవైఢూర్యాలు ధరించి తిరుగాడుతున్నప్పుడే.. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మందకృష్ణ మాదిగ యుద్ధభేరి జరుగుతున్నది. అతను నల్లవస్త్రం ధర...

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!

లేలే.. మీరుసాబు... లేవవయ్య మీరుసాబు. అలయ్‌ల దుంకి పీరీల గుండంలకెల్లి లేచి రావాలె కులీకుతుబ్‌షాలు, తానీషాలు. నౌబత్ పహాడ్ మీదికెల్లి ఇట్ల చూస్తె అట్ల కనవడే బాగేఆమ్ పక్కపొంటి పొందిచ్చిన టౌన్‌హాల్ (అసెంబ్లీ)ల కూచుని చేస్తున్న కుట్రల మందలు హైదరాబాద్ మాది ...

దండయాత్ర.. దాడి.. గుండెగాయం

‘కమాండర్ షుడ్ నాట్ బీ ఎ కానిస్పిరేటర్’ అన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. దళాధిపతి కుట్రదారు అయితే ఎట్లా ఉంటుందో? రుచి చూసింది ఇవ్వాళ హైదరాబాద్. తెలంగాణ మరోసా రి గాయపడింది. దుఃఖపడింది. నిస్సహాయతలోంచే పెనుకేకలు పెట్టింది. శాంతిని, ప్రజాస్...

అవును..హైదరాబాద్ తెలంగాణ సొత్తే

కాచిగూడ స్టేషన్‌రోడ్డు. బూర్గుల రామకృష్ణారావు వారి వారసుల ఇల్లొకటి చాపల్‌బజార్‌కు మళ్లే చౌరస్తా మూలమీద పాతబడిపోయి ఉన్నది. జిగేల్‌మనే సైబరాబాద్ నిర్మాణమైన తర్వాత అస్‌లీ హైదరాబాద్ ప్రాంతాలన్నీ ఇట్లా శిథిలమయ్యాయి. ఒకప్పటి కోఠీకి, ఒకప్పటి ఆబిడ్స్‌కూ, ఒకప...

చచ్చిన శవం కోసం....

తిరుపతిలో... పుణ్యక్షేవూతంలో..కేవలం విద్వేషంతో,కొంచెం ముదిరిన ఉన్మాదంతో వీ.హనుమంతరావు (హన్మన్న) మీద దాడి చేస్తే సమైక్యాంధ్ర సాధ్యమేమో కానీ, తెలంగాణతో కూడిన సమైక్యాంవూధవూపదేశ్ సాధ్యమేనా? ఇది ఒకరకంగా మీడియా ప్రేరేపిత దాడిలాగా విజువల్స్ చూస్తే కొంచెం ...

కాలం చెల్లిన సమైక్యాంధ్ర

మా డానీ నాకు మూడు దశాబ్దాల మిత్రుడు. తత్వశాస్త్రంలో వేళ్లూ కాళ్లూ పెట్టీ ‘నెగేషన్ ఆఫ్ నెగేషన్’నే నెగేట్ చేస్తూ బీఎస్ రాములూ, డానీ, ఖాదర్ మొహియొద్దీన్, ఎన్. వేణు, జగన్, త్రిశ్రీ, చారి, అఫ్సర్, వసంత, యువక, దాసు, ఈశ్వరి, కరుణక్క, చుక్కు, చిన్ని, అరుణ ...

సందేహమూ... సంబురమూ..

డిసెంబర్ 9. తెలంగాణకు చారిత్రక దినం. ఆ ప్రకటనకు ముందు ఉరుములు మెరుపులు ఉద్యమానివి. ఒకవంక కేసీఆర్ దీక్ష. క్షీణించిన ఆరోగ్యం. మరోవంక పదకొండవ తేదీ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి. కేసీఆర్ దీక్షతో తెలంగాణ అంతటా ఆవరించిన చెలరేగిన ఉద్యమ వాతావరణం. నిప్పుల కొలి...

మనం విడిపోయే వున్నాం...

ఇన్ని చరిత్ర పేజీల మీదుగా గడచి వచ్చిన తర్వాత నడచి వచ్చిన తర్వాత ఇన్ని మరణాలనూ మనసు పొరల్లో నింపుకుని మ్రాన్పడి మౌన సంతాపాలూ ప్రకటించుకున్న తర్వాతా ఇన్ని సంస్కృతులను సానబెట్టుకున్న తర్వాత కూడా నువ్వు నువ్వుగా నేనునేనుగానే ఉన్నాము హద్దులు గీసుకున్న మ...

కోర్‌కమిటీ అసంబద్ధ నాటకం..

ఒకే అసంబద్ధ నాటకం మరోసారి మీ కోసం * కేతిగాడు మరోసారి తెరతీశాడు నగరం నడిబొడ్డులోని ప్రేత సౌధం వేదికగా పాత్రధారులు గళవిన్యాసం ప్రదర్శించారు మేకప్ మడతనలగని చీరలతో ఒకరిద్దరు నటీమణులు కాస్త గ్లామరద్దారు ప్రజలకు పట్టకపోయినా నాటకం రసవత్తరంగా సాగిందని...

ఆ హత్య ప్రజాస్వామ్యానికి హెచ్చరిక

పోరాటమే నా ఊపిరి. పోరు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది’ అని గంటి ప్రసాదం వేరే అర్థంలో మాట్లాడి ఉండవచ్చు కానీ, పోరులేని ప్రాంతంలో వేట కొడవళ్లకు, తపంచా తూటాలకు ఆయన ఊపిరి ఆగిపోయింది. ‘ఉద్యమం కోసం నన్ను బతికించండి. నేను బతికేటట్టున్నా’ అని కూడా ప్రసాదం వైద...

అబ్బర పులీ....తోక బారెడు

‘అబ్బర పులీ అంటె తోకబాడు’...‘తె’ అంటే తెలంగాణ ఇచ్చినట్టే. తెలంగా ణ అనుభవాల సారం ఏమిటంటే పులి ఉండదు. తోక బారెడూ ఉండదు. తీరా పులి వచ్చేసరికి రక్షించేవాడూ ఉండడు. డిసెంబర్‌కు జూన్‌కు మధ్య కేవలం ఏడు నెలల కాలమే. ‘పోయిన కాంగిరేసు ప్రతిష్ట’ తిరిగొచ్చుటానికి ...

ఆత్మీయరథం..స్వేచ్ఛ..సమానత్వం

స్వేచ్ఛ ఒక దుకాణం కాదు ఒక అయ్య మూయడానికి ఒక అయ్య తెరవడానికి... ఇది సచ్చిదానందన్ కవితా పాదం. నాకు ఇష్టమైన కవిత. స్వేచ్ఛ కూడా పరమ సత్యం కానట్టే సాపేక్షిక విలువగా తయారుకావడం, స్వేచ్ఛకు ముఖ్యంగా భావవూపకటనా స్వేచ్ఛకు సంబంధించిన పరిమితులు, విశృంఖలతల ...

ఈ గోడ బీటలు వారింది...

పొద్దున్నే కల. అసెంబ్లీ చుట్టూ గోడ మొలిచినట్టు. అదీ పాత ముషీరాబా ద్ జైలు గోడ కన్నా ఎత్తుగున్నట్టు. పైన అచ్చం జైలు లాగానే కరెంటు తీగలు చుట్టినట్టు. అయితే ఆకంటు తీగలు అచ్చంగా తెలంగాణ ఉద్యమం మీద అణచివేత తీవ్రమైనప్పటి నుంచీ ప్రతి మూల మలుపులో, చివరికి అమర...

డెడ్‌లైన్లు.. డెత్‌లైన్లు.. ప్రజాస్వామ్యం

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్లు పెట్టే సాహసం చెయ్యవద్దన్నడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి. ఇది పలుకుబట్టిన కిరణ్ సాహసోపేతమైన ప్రకటన. ఒక్క రూపాయి ఇవ్వను ఏమి చేసుకుంటావో చేస్కో, బయ్యా రం ఉక్కు జీవో రద్దు చేయనుగాను చేయను. అనంతరం కిరణ్‌కుమార్‌...

పరకాల వచ్చె మొదలాడె...

పరకాల ప్రభాకరొచ్చె మొదలాడె.. అంటే ఇదే. రామాయణమంత విని రామునికి సీత ఏమవుతుంది? అని అడగటమంటే కూడా ఇదే. చాలా ఆలస్యంగా మేల్కాంచిన పరకాల ప్రభాకర్ అనే ఒక పెద్ద మనిషి, రెండు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు మాట్లాడిన తన మాటలను తానే మింగి కొత్త మాటలు మాట్లాడడ...

కొండపల్లి కొన్ని జ్ఞాపకాలు

మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక ప్రత్యేకమైన మనిషి కోసం ఎదురుచూస్తున్నాం. అంతా ఇరవై మందిమి. హైదరాబాద్ రాంనగర్ గుండు ప్రాంతం అనుకుంటా. మాకు ఏ మాత్రం తెలియని ప్రాంతం. భార్యాభర్త లు నెల్లూరు పద్మ, యుగంధర్‌లు మాకు ఆతిథ్యం ఇచ్చే జంట. డెన్‌కీపర్లు. మధ్య...

భ్రమలు.. మైమరపులు

ఉనికిలో లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించడం ఒక భ్రాంతి. మయ సభ తీరు. కానీ ఉన్నదాన్ని లేదనుకోవడం, దాని ఉనికే లేనట్టుగా భ్రమపడి జనాలను భ్రమింపజేయడానికి సాముగరిడీలు చేయ డం ఎలాంటి స్థితి? కపట నాటకం. ప్రజల మతిమరుపు మీద అతి విశ్వా సంతో మైమరపింపచేసే కళ అది. రాజక...

మొద్దుబారిపోయినాము...

సూడ సక్కంగుండేది నా బిడ్డ. కొచ్చెటి ముక్కు. సదువు అయిదో తరగతే కానీ కొంచెం పెద్ద పిల్లే. వంకీల జుట్టు. నాబిడ్డ సక్కంగుండాలని ముక్కుకు ముక్కుపుల్ల చేయించిన. పట్టగొలుసులు కొనిచ్చిన. మాది రంగాడ్డి జిల్ల గంగేరు మండలం జూలపెల్లి. భిక్షాటన చేసి ఆరుమంది బిడ...

వీరులారా వందనం...

పోయిన వారం. ఒక పాఠకుడు ఒక ప్రశ్న వేశాడు. ‘ఒక తెలంగాణ భూమి పుత్రుడుగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజున మీరెలా ఫీలయ్యారు’ అన్నది ప్రశ్న. ‘‘నేలకు జానెడెత్తున ఉన్నట్టు... కలా! నిజమా! అన్నట్టు.. గాయి గాయి.. ఆగమాగం. ఉద్వేగం. కొంచెం దుక్కం. అనంత సంబురం. పోటెత్తి...

చరిత్ర చెప్పిన కొన్ని పాఠాలు

ఉద్యమాలు ప్రజాస్వామ్య సంస్కృతిని పాదుకొల్పుతాయి. నిలబెడతా యి. ప్రజల విస్తృత ఆకాంక్షల వెల్లడి ప్రజాస్వామ్య సూత్రాలను విస్తృ తం చేస్తాయి. మనిషిని సామూహికం చేస్తాయి. కానీ ఉద్యమాలు నిలవనీరులా కొయ్యగుర్రం మీద కదమ్‌తాల్ చేస్తే.... ఒకే అంశం మీద సుదీర్ఘంగా క...

పాటే ఆయుధం.. ఛలో ధూమ్‌ధామ్

బెంగటిల్లినట్టున్నది. పరిస్థితులేం బాగాలేవు. ఎవరి గొంతు వారే పలుకుతున్న ధ్వని. గొంతు దాటని శబ్ద తరంగాలు. విచ్ఛిన్నమవుతున్న మాటలు. బయట ఉక్కపోత. శీతాకాలంలోనూ చెమటలు పట్టిస్తున్న గర్మి. లోపలేదో ఉడుకుతున్నది. చంద్రబాబు కరీంనగర్‌లో అటు ఇటుగాని మనసుతో సం...

డిసెంబర్ 9, ఒక నిజం

ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక గాయపడిన చెట్టుంది! ఆ చెట్టుకు వందనం. సంతోష్ శవం వేలాడిన చెట్టు. జీవంతో తొణికిసలాడుతూ ఉన్న సంతోష్‌తో చివరి తెలంగాణ ముచ్చట్లు పంచుకున్న చెట్టు. సంతోష్ చివరి కోరికా, ఏమాత్రం మార్మికం కాని బహిరంగ ఆలాపనా ఆ చెట్టుకు తెలుసు. పచ్చదన...

చంద్రబాబుతో జర జాగ్రత్త!

మంథని నుంచి మహదేవ్‌పూర్ వెళ్లే రోడ్డులో కాటారం ఒక జంక్షన్ లాంటిది. కాటారం నుంచి భూపాల్‌పల్లి దాకా చూడ నిజంగానే చక్కని రోడ్డొకటి ఉంటుంది. ఆ రోడ్డులో ఉండేదా కాలనీ. ఆంధ్రా కాలనీ. అట్లాంటిదే మంథని దగ్గర వెగ్లాస్‌పూర్‌లోనూ ఒక కాలనీ ఉండేది. కారంచేడు నుంచి ...

హంతకుల భాష.. మోసం

కడుపు దేవినట్టున్నది. వడ్లల్ల పెరుగు కలిపినట్టుగున్నది. ఆగమాగంగున్నది. దుమాల్లం లేసినట్టున్నది. చంద్రబాబు తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ప్రాణం కొట్టుకులాడుతున్నది. బలిదానాల గురించి మాట్లాడు తుంటే అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామంటే పెయ్యంతా దూల్‌ద...

మైమరుపు.. మతిమరుపు

జనాలలో పరివ్యాపించి ఉన్న కొంత మైమరపు వల్లనూ మరికొంత మతిమరుపు వల్లనూ చాలామంది ఇంకా, ఇప్పటికీ చెలామణి అవుతుంటారు. అడుగుపెట్టే అర్హత కూడా లేచిచోట పాదయావూతలతో జనం మధ్య అగ్గిపుట్టిచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా సౌలభ్యం వల్ల. వెసులుబాటు వల్ల కూడా. అన్నీ ...

రాజిరెడ్డీ.. ఎక్కడికెళ్లినవ్..

‘రెడ్డీ ఎక్కడికెళ్లినవ్’ అని ఏడుస్తున్నది సరస్వతి. ఆమె రాజిడ్డి ప్రేమించి పెళ్లాడిన సహచరి. బెంగటిల్లిన చిన్నపిల్లలు. చిన్నకొడుకుదీ అదే ప్రశ్న ‘డాడీ ఎక్కడికెళ్లినవ్’ వాళ్ల ముందర రాజిడ్డి పార్థివ దేహం. వచ్చేవాళ్లు వస్తున్నారు. క్రమానుగతంగా వలసల ఉధృతి ప...

జై బోలో తెలంగాణ...శంకర్

ప్రాణహితకు ‘జైబోలో తెలంగాణ’కు పేగు సంబంధం వుంది. ఎందుకంటే శంకర్ ప్రాణహిత ప్రేమికుడు. ప్రేరణ నాకదే అని చెప్పినవాడు. కాలమ్ సంగతి పక్కనబెట్టినా శంకర్ ఆ కాని రంగుల ప్రపంచంలో కూడా తెలంగాణ నదులను, ప్రాణహితలను, పువ్వులను, పల్లెలను, బతుకమ్మలను, బోనాలను ప్ర...

మార్చ్ మా జన్మహక్కు

ఛలో హైదరాబాద్. బస్సో, రైలో, కారో, సైకిలో, స్కూటరో, కాలినడకో.. ఉసిళ్లపుట్ట పగిలినట్టు పక్షుల గుంపు సాయంకాలం కిలకిల ఆకాశంలో ఎగిరినట్టు, మత్తడి దుంకినట్టు, సమ్మక్క సారక్క జాతరకు చేపలు ఎదుక్కినట్టు.. పుట్లుపుట్లుగా జట్లు జట్లుగా రండి. మనం ఒంటరి వాళ్లం కా...

తెలంగాణ నిలువెత్తు సంతకం

కోతపెట్టే శీతాకాలపు ఢిల్లీ చలి ఇంకా వణికిస్తూ ఉండగానే... జంతర్‌మంతర్‌లోని ఆ ముసలివాళ్ల శిబిరం బిలబిలా నిండిపోయింది. బాపూ జీ కరస్పర్శ శీతలంగానే ఉన్నది. జీవం లేనట్టుగా ప్రారంభమైన ఆ శిబిరం కాసేపటికి మాటల మంటలతో వెలిగింది. తొంభై ఆరేళ్ల వయసులో కొండా లక్ష్...

తెలంగాణపై కాలకూట విషం..

పటాన్‌చెరు దాటగానే మీ వాహనాలను అడ్డుకునే ఆటంకం ఒకటి ఉంటుంది. అద్దాల గదులతో నిర్మితమై కాలడ్డం పెట్టినట్టు కట్టె అడ్డంపెట్టే ఆ టోల్‌గేట్ మీ మీ తోలు వలిచి పైసలు వసూలు చేసి మీకు దారి ఇస్తుంది. మీ ఊర్లో మీరు, మీ ప్రాంతంలో మీరు స్వేచ్ఛగా తిరగలేమా? అనుకునే ...

ఇంతకీ కనిస్టీబు మారతాడా?

సారాజ్జెమొస్తే మన ఊరి కనిస్టీబు మారతాడా?’ కన్యాశుల్కంలో సామాన్యుడి అనుమానం ఇవ్వాళ్ల తెలంగాణ అశేష ప్రజానీకానికి రావాల్సి ఉన్నది. అవునూ... తెలంగాణ వస్తే మన కనిస్టీబు (రాజ్య ప్రతినిధి) మారతాడా? విస్తృతార్థంలో ఇది రాజ్యాంగ యంత్రం ఏమై నా మారుతుందా? అన్న ...

కాలమ్ కత్తి మీద సాము

‘కాలమ్’ ఒక కత్తిమీద సాము. వారం వారం పలవరింత. కలవరింత. ప్రాణహిత నది మున్నూటా అరవై ఐదు రోజులు సజీవంగా పారే నది. ఆ నది మీద భ్రమ. ఆ పేరు మీద పావురం. గోదావరి, శబరి, ప్రాణహిత ఇవి పేరుకే నదులు కావు. ఉత్తర తెలంగాణ జీవన సంగమాలు. అద్దరి, ఇద్దరి ఒరుసుకొని పారే...

అవునూ...ఇస్తరా! చస్తరా!

డేట్‌లైన్... రవీంద్రభారతి మిట్ట మధ్యాహ్నం కిక్కిర్సి ఉన్నది. ఇక్కడేదో దారి దొరుకుతున్నది. బహుశా ఇది తెలంగాణకు దగ్గరి దారి భవిష్యత్ దారి ‘తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు.అందుకే ఏడువందల మంది ...

జీవించే స్వేచ్ఛ.. బాసగూడ ఆభాస

హప్కా చోటుకు పన్నెండేళ్లు. కాక సంధ్యకు కూడా పన్నెండేళ్లే. మడకం నగేష్‌కు 13 సంవత్సరాలు. మడకం రాం విలాస్‌కు కూడా అంతే వయసు. కోశ్యా బిచ్చెం, కాక రమేష్, మడకం దేవ, హప్కా మిధు, కాక రాహుల్‌ల వయస్సు పదిహేనేళ్లు. పదోతరగతి పిల్లలు. సర్కె రాముల, కాక పార్వతి, ఇర...

రాజకీయ బానిసల జాతి

బానిసత్వం కొంచెం సుఖంగా ఉంటుంది. నిశ్చల ప్రపంచంలో నిశ్చలంగా ఉండవచ్చు. కనీసం నిలవ నీళ్లలాగా, యధాతథ స్థితిలో భారం కోల్పోయి గాలిలో తేలియాడుతూ ఉండవచ్చు. ఈక్విలివూబియమ్ స్టేటస్. ఎందుకురా బతుకులు చెడ. ‘న్యాయ విరుద్ధంగా నీళ్లు మళ్లించుకుంటున్నవాడు నీతులు ...

నిర్బంధం.. ఉదాసీనత.. ఐక్యత

శత్రువు నిన్నెట్లా చూస్తున్నాడన్నదే నీ నిబద్ధతకు, ఆచరణకు గీటురాయి అనేది పాత సూత్రం. ఎంచుకొని నిర్బంధాన్ని ప్రయోగించడం, ఆ నిర్బంధం కొందరి పట్ల తీవ్రాతి తీవ్రంగా ఉండడం అందువల్లనే. మొత్తంగా తెలంగాణ ఉద్యమం విస్తృతమయింది. అది అన్ని రాజకీయ అభివూపాయాల, సిద్...

పరకాల పాఠం

పరకాల ప్రమాదం తప్పింది. అదిప్పుడు పోరు పతాకై నిన్నూ నన్ను నిలబెట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత వరంగల్ జర్నలిస్టు మిత్రుల ఫోన్ ‘సార్! కొండా మురళి ఒక్కడే మొగోడు. రెండు రోజుల్ల ఆగమాగం చేసిండు. పోలింగ్ బూత్‌లల్ల గులాబీ గుండెలు కనబడనేలేదు. పత్తకు లేరు. గె...

అమ్మా! జగనన్న రాజ్యం మాకొద్దు

మీరు భర్తను పోగొట్టుకుని దుక్కంతో వచ్చారు. నిజమే.. కొడుకు జైలు పాలయ్యాడు. మనసుపడి కట్టించుకున్న లంకంత క్యాంపు కార్యాలయంలో ఇప్పుడు మీ శత్రువులున్నారు. వేట సాగుతున్నది. సీబీఐ, ఈడీ ఒకదాని వెంట ఒకటి. జైలుకూ, కస్టడీకి మధ్య ఊగులాడుతున్న భవిష్యత్ సందేహాల్ల...

పదేళ్ల ప్రస్థానం

మే, 31, 2002, ఒకానొక మిట్ట మధ్యాహ్నం. మేం పుట్టాం... అప్పుడు గుప్పెడు మందిమి. ఇప్పుడు గంపెడు మందిమి.నిజమే మేము కవులవలెనే కలాలని భుజాన తుపాకుల్లాగా మోశాం. మా కల తెలంగాణ కోసం కలెబడడానికీ సిద్ధపడ్డాం. చరిత్ర మొదటి చిత్తువూపతి జర్నలిజమే అయితే, ఆ చరిత్ర...

జర్నలిస్టులు జిందాబాద్..

వైఎస్‌లేనిలోటు రానివ్వొద్దన్నడు వాయలార్ రవి. ఉప ఎన్నికల్లో వైఎస్ లేనిలోటు కొట్టొచ్చినట్టు కనపడ్తుదన్నది ఈ మాట సారాంశం. రవి ఢిల్లీ దూత. వైఎస్ రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్‌మోహన్‌డ్డి మీడి యా సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు జీవో జారీ చేశారు కిరణ్‌కుమార్‌డ్డ...

ఏమి నేరము చేసెరా! తెలగాణ

ఒక తండ్లాడే జీవితంలో, జీవన విధానంలో జరిగే పరిణామాలన్నీ తెలంగాణ అనుభవించింది. అది సంక్షుభితమయింది. రాటు తేలింది. అది పోరాడింది. ఓడింది. తన గాయాలను తాను తడుముకున్న ది. కానీ.. ఎన్నడూ అది దేన్నీ పూర్తిగా వదులుకోలేదు. లొంగుబాటును ప్రదర్శించలేదు. ఒక పతనం న...

తెలంగాణకు ఇదే అదను...

తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీకి, సంకీర్ణ భాగస్వాములతో కూడిన యూపీఏ-2 కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు మించిన సావకాశం మరి దొరకదు. ఇదే అదను. డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంవూతిగా ఉన్న చిదంబరం చేసిన ప్రకటన, మరుసటిరోజే పార్లమెంటు ఉ...

తెలంగాణ అస్తిత్వం-సమస్యలు

తెలంగాణ భావనకు ఒక చారివూతక పునాది ఉన్నది. ప్రాంతీయ చైత న్యం, ఉమ్మడి అస్తిత్వం, ఉమ్మడి గతం, ఉనికి, సంస్కృతీ విశిష్ట త, వర్తమానం, పరాయీకరణ పొందడం, వలసాధిపత్యం వల్ల అసమ సమాజంగా విస్తరించడం తెలంగాణ ఇప్పటి మౌలికాంశాలు. తెలంగాణవాదం కానీ, ఆ వాదంపై రూపుదిద్ద...

అడవి ఉప్పొంగే రాత్రి...

వందేళ్ల కింద పొందిచ్చిన ఢిల్లీ ఎర్రకోటలకు ఆత్మలేదు. నెనరు కానరాదు. యమునై పారుతున్న సామాన్యుడి దుక్కపు సవ్వడిని అది పట్టించుకోదు. తరాలుగా రాతిగోడల మధ్య బందీ అయిన అధికారం, ఆధిపత్య చిహ్నంగా అదొక స్వయం పరాధీన. రాజ్‌పథ్.. జనపథ్‌ల మధ్య అగాథాన్ని నిర్మించుక...

ఉసురు తగిలేరోజు..

కౌరవ ప్రపంంలో కదలిక రాదు. సోనియా గుండె స్థానంలో బండకరగదు. అశాంతిని రెచ్చగొట్టే గ్రీన్‌హంట్ సూత్రదారుల పెదాలమీద శాంతిజపం. తెలంగాణ ఇవ్వరు. గుంజుకోవాలి. మనుషుల మాంసం రుచిమరిగిన పులి రాజ్యం. నీ కోసం కన్నీరు కార్చే ఒక కన్ను. తెలంగాణ మాత్రమే.. గాయాల్ని గేయ...

తెలంగాణ మల్లెమొగ్గకు వందనం

పట్టుమని పదారేళ్లులేని ఆ పిల్ల తెలంగాణ మల్లెమొగ్గ. ఎన్నికలకు ముందే చంద్రబాబును ఓడించిన ఆ పిల్లపేరు కృష్ణవేణి. నాగర్‌కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి ఊరు. ఇంటర్ చదువుకున్న ఆ అమ్మాయి కృష్ణమ్మలా గా తెలంగాణ త్యాగాల పట్ల, అమరవీరుల ఆకాంక్షలపట్ల నిండు మనసు ప్...

ఒకే ఒక్క తెలంగాణ...

నిజమే. మేం మందలాంటి వాళ్లం. సంతలాంటి వాళ్లం కూడా. నిజమే తెలంగాణే మాకు అతి పెద్ద సమస్య. జీవన్మరణ సమస్య. బలవన్మరణాలు మాట్లాడుతున్నప్పుడు. మేం పలవరిస్తుంటాం. కలవరిస్తుంటాం. మంటలంటుకున్న వాడి జై తెలంగాణ నినాదాన్ని ఆవాహన చేసుకుంటూ ఉంటాం. మనుషులం మేము. ఉత్...

బానిసల పగటి రంగుల కలలు

తెలంగాణ రాకపోతే ఏమవుతుంది? మోత్కుపల్లి నరసింహులుకుఏమీ కాదు. ఆ మాటకొస్తే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా ఏమీకాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కూడా ఫరక్ పడేదేమీలేదు. తెలంగాణ రాకున్నా వాళ్లకు చంద్రబాబు టిక్కెట్లిస్తడు. ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తడు. ...

మారనివారు మార్క్సి స్టులు

సుందరయ్య మా నడిగడ్డ బొడ్రాయైండు/మా రావి తావేదీ గాని ఊర్లల్ల / గాని ఉద్దెమాల్ల మన్నుబడ/ గానికీ గీ మన్నుకూ సమ్మందమేంది? శింగం కిష్టయ్య అనేకవి మార్క్సిస్టుపార్టీ అగ్రనాయకుడు ఏచూరి సీతారామ్ శుక్రవారం నాడు తెలంగాణ పైన ప్రవచించిన భుజమూ- తుపాకి సిద్ధాంతం వి...

మట్టిపాదాల కదలిక

వాసనొకటి హాలు నిండుకున్నది. ఆ వాసన మర్యాదస్తులది కాదు. మధ్యతరగతి మందహాసాలదీ కాదు. తెల్లచొక్కాలదీ కాదు. ఒక గుంపు వాసన. మట్టివాసన. చెమటచుక్క వాసన. అప్పుడే వీధులను ఊడ్చే సి పరిశువూభమైన శ్రామిక జన పరిమళం. చీపురుకట్టలు లేవు. పొరకల కట్ట లూ లేవు. వాళ్లు గుం...

తల్లివేరు తత్వం

ముందు ప్రపంచం. ఆ తర్వాత దేశం. ఆనక రాష్ట్రం. ఈ రాష్ట్రమం సరిపడలేదు కనుక నేను తెలంగాణవాన్ని. మనిషి ఉనికి అంతటితో సరిపోలదు. అస్తిత్వం వెల్లడవదు. నాది కరీంనగర్. అంతేనా..కాదు. మా ఊరు మంథని... మరీ సూక్ష్మంలోకి నన్ను నేను వెతుక్కోవాలంటే పెదాల కింద నిప్పుల ఉ...

దూద్‌కా దూద్..పానీకా పానీ

చంద్రబాబు మాంఛి ఊపుమీద ఉన్నడు. ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో ఆయన వాహనం మీద పడిన కోడిగుడ్లను ఆయన తూడ్చేసుకుని ఉంటడు. ముఖం మీద పడనందుకు సంతోషించి కూడా ఉంటడు. జక్రాన్‌పల్లిలో స్టేజీ మీదకు దూసుకొచ్చిన చెప్పు కూడా దగ్గరి దాకా రానందుకు ఆయన దాన్ని పట్టించుకొన...

‘గూగీ గుడియా’ మాట్లాడు...

సోనియాగాంధీకి మాటలు రావా? రెండేళ్ల క్రింద తెలంగాణ ప్రజలకు పుట్టినరోజు కానుక ఇచ్చారామె. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమౌతుందని.. సోనియాగాంధీ పుట్టినరోజే ఆ ప్రకటన రావడంతో సామాన్యులు కొందరైనా ఆమె దేవత అనడానికి ఇష్టపడి ఉంటారు. కానీ రెండే ళ్లు తిరిగే సరికి తెలం...

మన కాలం వీరుడు...

శవం కోసం కాదు. ఒక మనిషి కోసం ఎదురు చూసినట్టుగా ఉన్నది. పోలీసులు కూడా అతనొక బతికున్న మనిషిలాగే భావించినట్టున్నది. శంషాబాద్ నుంచి పెద్దపల్లికి ఎవరికీ కనబడకుండా తరలించారు. పెద్దపల్లిలో జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఆయన శవాన్ని కూడా పెట్టకుండా ప్రభు త్వం టె...

చలో పోలవరం... సలామ్

‘పోలవరం మాకొద్దు’ గిరిజన జీవితాలను అల్లకల్లోలం చేసే, ఉనికి ధ్వంసం చేసే పోలవరం ప్రాజెక్టుపై ముంపు ప్రాంతాల ఏకవాక్య తీర్మానం ఇది. ఏకవాక్య నిరసన కూడా. బహుశా ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకు, న్యాయవాదుల కు, వైద్యులకు ఈ పిలుపు అంది ఉంటుంది. వాళ్లిప్పుడు పోల...

కొంత చరిత్ర.. కొంత దుఃఖము

జనరల్ డయ్యర్ కుక్కలా మొరిగాడు అచ్చంగా. వేట కుక్కలా. నేనొక సిపాయిని. మీకు యుద్ధం కావాలా? శాంతి కావాలా? ఒక వేళ మీరు యుద్ధాన్నే కోరుకుంటే ప్రభుత్వం తయారుగా ఉంది. మీరు శాంతి కావాలనుకుంటే నా ఆదేశాలు పాటించండి. మరో దారే లేదు. దుకాణాలు తెరవండి. లేదా కాల...

సంప్రదింపులకగ్గిదలగ...

పండగపూట మనం పస్తులుంటున్నప్పుడు.. పండుగపూట మనం పీడకలలు కంటున్నప్పుడు.. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా.., ఇంత ఏక పక్షంగా వ్యవహరిస్తున్న పెత్తందారీ కాంగ్రెస్‌కు సమాధి కట్టడమే ఇక దారి. ఇక్కడి దాకా వచ్చాం. ఇన్ని త్యాగాలనూ, బలిదానాలనూ చవిచూశాం. ఇంక...

సింగరేణికి జై..

చరిత్ర నిండుగా సింగరేణి నిలబడింది. కావొచ్చు మేము అర్థ రైతులం. అర్థ కార్మికులం.. కానీ.. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించే ఒక నిప్పురవ్వ మా వద్ద ఉంది. అది నల్ల బంగారం సెమ్మాసు మర్రేసినం.. జాగ్రత్త.. ఇక తెలంగాణ ఇస్తరా.. చీకట్ల ఛస్తరా! తేల్చుకోవాల్సింది మీరు.....

నండూరికి నివాళి

రెండో తరం ప్రథమశ్రేణి సంపాదకుడాయన. బుద్ధిజీవులు, సాహిత్యకారు లు ఆమోదించి అభిమానించిన సంపాదకుడు. జర్నలిస్టుకు సకల పరిజ్ఞానం ఉండాలని, అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన లేకున్నా కనీసం తెలిసి ఉండాలని బోధించేవాడాయన. అందువల్లనే విషయ పట్టింపు, భాషా పట్టింపు, ప...

బానిసకొక బానిసకొక బానిస

-అల్లం నారాయణ ‘పీనుగుల మీద పేలాలు ఏరుకునే జాతి ఏదన్నా ఉన్నదంటే అది మన మంత్రుల జాతే’ ఇటీవల నాకొచ్చిన మెసేజ్ సారాంశం ఇది. ‘అంత‘హార్ష్’గ అంటే ఎట్లా’... నా సమాధానం కాని ప్రశ్న. దానికి అవతలి వ్యక్తి ‘మీరు కూడా అట్లంటే ఎట్ల సార్! అన్నీ తెలిసి. ఇవ...

హంతకుడి జాడ....!

-అల్లం నారాయణ మిస్టర్ చిదంబరం.. హంతకుపూవరో?తెలంగాణ పోల్చుకున్నది. ఇంకేం చేస్తుంది తెలంగాణ చావో.. రేవో.. చచ్చి సాధించలేం. బతుకాలె. బతుకాలె... బతుకాలె. బలిదానాలు కాదు. తెలంగాణ బలికోరే రోజులచ్చినప్పుడు మీ మహా సౌధాలు ముక్కలయ్యే ప్రమాదం పొంచి వుంది...

ప్రేమనగరం

-అల్లం నారాయణ మనం తెలుగు వారమే. కానీ పెట్టుబడికి, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ పెట్టుబడికి ప్రాంతం లేదు. అది ఒక ప్రాంతం ఆకాంక్షలను కబళిస్తున్నది. ఒక ప్రాంతంపై పరాధీనతను చేసి పెత్తనం చేస్తున్నది.సారాంశంలో తెలంగాణ సామ్రాజ్యవాద విస్తరణకాంక్షకు బలైంది. ఒక ...

ఆకాంక్షల ఆర్తరావం

మీ సున్నితమైన మాటల వెనుక వెక్కిరిస్తున్నది మీ వలస పెత్తనం. మీ సీమాంధ్ర బుద్ధి. మీ నెత్తుటి జాడ. మీ నాయనా అంతే.. తెలంగాణకు మేమెప్పుడూ వ్యతిరేకం కాదని, నడిగడ్డ దాటి నంద్యాలకెళ్ళి ఎంత దుర్మార్గంగా మాట్లాడారో?ఎంత క్రౌర్యంగా తెలంగాణను బెదిరించారో? య...

వెంటాడే తెలంగాణ

మీట్ ది ప్రెస్ ప్రారంభమయినాక ఒకరి తర్వాత ఒకరుగా తెలంగాణ న్యాయవాదులు వస్తుంటే మనసేదో శంకించింది. అప్పటికీ సైగలతో అడుగుతూనే ఉన్న. ఏందీ? ఇక్కడ జమైతున్నరు? అని. బేఫికర్ గుండన్నా.. అంటూ వాళ్లు ప్రతిసైగలు చేస్తూనే ఉన్నా.. లోప ల గుబులైతే అట్లాగే ఉన్నది. ఎంద...

విధ్వంస సార్వభౌముడు

అల్లం నారాయణ ఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం చూసేదాకా ‘ఇబు రాముడు’ అని తెలంగాణవూపజలు ఇబ్రహీమ్ కుతుబ్‌షాను పిలుచుకునే వారని కూడా తెలియదు. తెలంగాణలో ఆయన తెలుగు భాషను ...

లగడపాటి బడాయి

-అల్లం నారాయణ జగోపాల్ అంటే ఎవరు? అంటారు? లగడపాటి అనంగానే పూర్తిగా అర్థమయినట్టే ఠక్కున ఓహో జగడపాటి అంటారు. ఎవరు? చిన్నపిల్లలు. తెలంగాణల పుట్టిన బడిపిల్లలు. తెలంగాణ సభలల్లో ఆ మధ్య ప్రసంగాలు చేసేవాళ్లు ఒక ప్రశ్న వేసేవారు. నిరాహార దీక్షలు, నిమ్స్, ...

Featured Articles