చచ్చిన శవం కోసం....


Sun,August 18, 2013 01:11 AM


తిరుపతిలో... పుణ్యక్షేవూతంలో..కేవలం విద్వేషంతో,కొంచెం ముదిరిన ఉన్మాదంతో వీ.హనుమంతరావు (హన్మన్న) మీద దాడి చేస్తే సమైక్యాంధ్ర సాధ్యమేమో కానీ, తెలంగాణతో కూడిన సమైక్యాంవూధవూపదేశ్ సాధ్యమేనా? ఇది ఒకరకంగా మీడియా ప్రేరేపిత దాడిలాగా విజువల్స్ చూస్తే కొంచెం బుద్ధి ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. తెలుగు ప్రజలను మీడియా ఏమి చేయదలుచుకున్నది. సమైక్యాంధ్ర అనే ఉత్తభావన కేవలం పదమూడు జిల్లాలకే పరిమితమై విద్వేషం పెరిగిన ఉన్మాదస్థాయికి పోవడం దేనికి సూచన. ఎందుకిట్లా జరుగుతున్నది. ఎవరు కారణం. నిజానికి విభజన అనివార్యం అనే స్థితి తెలిసిన తర్వాత కూడా ప్రజల ఉద్యమం, తక్షణ ప్రతిస్పందనగా వచ్చిన ఉద్యమం, ఇది మాత్రం ప్రజాస్వామ్య ఉద్యమం కాదా? అని అడుగుతున్న వాళ్లకు ఒక సూటి ప్రశ్న. చచ్చిపోయిన ఒక కళేబరాన్ని, పుచ్చిపోయిన ఒక పురాభావనను, విఫలమై, కుళ్లి గవులు కంపుకొడ్తున్న శిథిలమైన ఈ భావనని ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరు వీధుల్లోకి లాక్కువస్తున్నారు. కనీసమైన మానవ సహజమైన ప్రతిస్పందనలు కొరవడిన సీమాంధ్ర సమాజం ఇంత అమానవీయంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల త్యాగాలు, దశాబ్దాల పోరాట ఆరాటాలు, కన్నీళ్లు, కదనాలు, నెత్తురు పారించుకుని ఒక ప్రాంతం సాధించుకున్న విజయాన్ని, కాజేసేందుకు ఉన్మాద మూకల్లా వ్యవహరిస్తూ ఎందుకిట్లా వికృతంగా మారుతున్నారు. రాజకీయ వ్యవస్థల మోసం, సామాజిక ఉద్యమాల వైఫల్యం, పతనమైన పౌరసమాజం బాధ్యతలు, బుద్ధిజీవుల పతన సంస్కృతి, అసలు ఏ సంస్కృతీలేని యాంత్రికతలోకి సీమాంధ్ర సమాజం ఎట్లా మారింది. ఇవన్నీ ప్రశ్న లే. మొత్తంగా సమాజాన్ని అనలేము కానీ, సామాన్యుణ్ణి అసలే అనలేము కానీ ఈ నాటకానికి, ఈ తోలుబొమ్మలాటలకి సూత్రధారులు, పాత్రధారులు, ప్రజలను రెండు ప్రాంతాల్లో మభ్యపెట్టి, కేవలం స్వార్థ రాజకీయం తప్ప తెలుగువూపజల కనీస క్షేమాన్ని పట్టించుకోని రాజకీయ నేతల కపట నాటకాలు కారణం. రెండు నాల్కలు చాచి అబద్ధాలాడడం కారణం.తెలుగు ప్రజల కన్నా, రాజకీయ సోపానాలు, ఆర్థిక ప్రయోజనాలు, మనుషులకన్నా, వారి మనసుల కన్నా, హైదరాబాద్‌ను ప్లాట్లుగా విభజించుకున్న లాభాపేక్ష, దురాశ, ప్రజాస్వామ్య వ్యతిరేకత, ఆధిపత్య అహంకారం, వలసలో పెత్తనం సాగిం చే క్రూరత్వం, అణచివేత సాగించి, నెత్తురు బలిగోరే నియంతృత్వం ఇవ్వాల్టి ఈ దుర్దశకు అసలు కారణం. అన్ని వ్యవస్థలూ విఫలమైన చోట, ఇప్పుడు సీమాంవూధ లో ఒక అరాచకం నడుస్తున్నది. ఈ అరాచకం మూలం ఏదైనా దీని పరిష్కారం దారుణంగా ఉండబోతున్నది. ఎందుకోతెలుగుజాతి భవిష్యత్ పట్ల పుట్టెడు దిగులు కలుగుతున్నది.అతను ప్రొఫెసరై ఉంటాడు. బలవంతంగా ఒక ప్రాంతాన్ని అది కూడా స్వేచ్ఛ పొందిన సమాజాన్ని కలిపి ఉంచడం సాధ్యం కాదన్న ప్రాకృతిక నియమమూ అతనికి తెలియదు. మీడియా ఒక సామాజిక బాధ్యత పోషించాల్సిన సమయాల్లో, తెలంగాణ ఉద్యమానికి సాక్షులుగా ఉండి కూడా, దాని స్వరూప స్వభావాలేమిటి? అని కూడా కనీసం తెలియకుండా, తెలిసీ ఒక విద్వేష విషాన్ని చిమ్మడం దేనికి సంకేతం? ఏ పతనాలకు మన పయనం.

తెలంగాణపై నిర్ణయం రాత్రికి రాత్రి ప్రకటించింది కాదు. దానికొక క్రమం ఉన్న ది. దానికొక చరిత్ర ఉన్నది. పదిహేడు సంవత్సరాల క్రిందట బుద్ధిజీవులు మలి తెలంగాణ ఉద్యమానికి భావజాలాన్ని సమకూర్చారు. ఆ తర్వాతి పరిణామాల్లో రాష్ట్రంలోని ఒక్క సీపీఎం పార్టీ తప్ప (ఎంఐఎం పార్టీ ముందు వ్యతిరేకించినా ఇప్పుడు తెలంగాణ ప్రకటన తర్వాత స్వాగతం పలికింది) అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భంలో కారణం ఏదైనా కావొచ్చు తెలంగాణ అనుకూలతను ప్రకటించాయి. కొన్ని సందర్భాల్లో రాజకీయ అనివార్యతల వల్ల, వారి ఓట్ల ప్రయోజనాల కోసం కావొచ్చు. సీట్ల లెక్కకోసం కావొచ్చు. అధికారంలోకి రావడం కోసం కావొచ్చు. తెలంగాణ కోసం మాత్రమే ఏర్పడిన పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఒకసారి, తెలుగుదేశం పార్టీ ఒకసారి పొత్తుపెట్టుకున్నాయి. సీమాంధ్ర ప్రజలూ ఈ టీఆర్‌ఎస్‌తో కూడిన ప్రత్యేక తెలంగాణ నినాదంతో సహా కూటములకు ఓట్లు వేశారు. ఆ మాటకు వస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాల మడి కట్టుకున్న సీపీఎం కూడా ఆ కూటమిలో భాగం అయ్యింది. సీపీఐ, భారతీయ జనతాపార్టీ ఉద్యమంలో భాగం కూడా అయ్యాయి. సీమాంధ్రకు అప్పుడు ఈ సోయి ఏమైంది? అప్పుడు లేని సోయి హఠాత్తుగా తీరా తెలంగాణ ప్రకటించినాక ఎందుకు వచ్చింది?తెలంగాణ ప్రజలంటే మోసం చెయ్యవచ్చు. ఎట్లా అంటే అట్లా తిప్పుకోవచ్చునని అటు రాజకీయ పార్టీలు, సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యవాదులు అనుకున్నట్టుగానే సీమాంధ్ర ఇప్పటి ఉద్యమకారులు అనుకున్నారా? అదొకవేళ నిజంగానే ప్రజా ఉద్యమం అనుకుంటే అప్పుడీ ప్రజలు ప్రత్యేకంగా రెండు సందర్భాల్లో ఒకసారి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్ష కూటమికి, మరోసారి టీఆర్‌ఎస్, తెలుగుదేశం, వామపక్షకూటమికి తెలిసి తెలిసీ ఎందుకు ఓట్లువేస్తారు. అప్పుడు తెలంగాణ వచ్చి నా ఫర్వాలేదనుకున్న వాళ్లు ఇప్పుడు తీరా తెలంగాణ వచ్చినాక ఎందుకు ప్రజలు కూడా గంపగుత్తగా ‘యూటర్న్’ తీసుకున్నారు. ఇక్కడే ఉంది మతలబు?

ప్రేమించని అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసి అయినా సరే ప్రేమ పొందాలనుకునే, ఒక విచిత్ర ఉన్మాదంలోకి సీమాంధ్ర సమాజం జారడానికి ప్రధాన వైఫ ల్యం రాజకీయ పార్టీలది. వైఫల్యం అనేకన్నా ప్రధాన మోసం రాజకీయ పార్టీలది. ఏ ఒక్క పార్టీ ఇందుకు మినహాయింపు లేదు. నిజానికి తెలంగాణ వచ్చేది కాదు. పొయ్యేది కాదు, అని రెండు సందర్భాల్లోనూ, తమ అధికార పబ్బం గడుపుకోవడానికి ఆయా పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. కానీ తీరా డిసెంబర్9 ప్రకటన వచ్చినాక అవి ‘యూటర్న్’ తీసుకొని అప్రజాస్వామిక ధోరణులకు ఆలవాలమయ్యాయి. అధికార ప్రతిపక్షాలు దారుణమైన మోసానికి పాల్పడి, ఢిల్లీ సుల్తాన్‌లు తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడడం తెలంగాణ సమాజాన్ని భంగపాటుకు గురిచేసింది. వెయ్యిమంది ఆత్మబలిదానాలు జరిగాయి. గుండెపోట్లతో కాదు. కాల్చుకుని, రైళ్లకు ఎదురేగి, ఉరిపోసుకుని, తమను తాము హింసించుకుని బలయిపోయింది యువత. వాళ్లంతా తెలుగు జాతి వాళ్లే... కానీ ఈ పరిణామాల పట్ల మొద్దుబారిపోయిన సీమాంధ్ర రాజకీయ నాయకుల కన్నా, మానవీయత గలిగిన సమాజ సమూహాలు ఆలోచించాల్సిన స్థితి. కానీ ఆ ఆలోచన, చైతన్యాన్ని పెంచని స్థితిగతులు, వైఫల్యాలు ఈ అరాచకాలకు, ఉన్మాదాలకు మూలం. సరిగ్గా డిసెంబర్9ని ఆపినట్టే, ఇప్పటి సీడబ్యూసీ ప్రకటనను ఆపుతాం. సమైక్యాంధ్రే ఉంటుంది. ఈ సమైక్యాంధ్ర, తెలంగాణను మరింత పీల్చి పిప్పి చేస్తుందన్న హామీ అక్కడి ప్రజలకు పరోక్షంగా, కొన్ని సందర్భాల్లో, ఒక చేత బ్రహ్మాస్త్రం, మరోచేత రాజకీయ సన్యాసాస్త్రం చేబూనిన రాజకీయ నాయకుల ద్వారా ప్రత్యక్షంగానే అందుతూ ఉన్నది. అందుకే కదా!ఈ విరగబాటు.


నిజానికి వాస్తవాలిట్లా లేవు. ఇక ఆరునూరైనా విభజన అనివార్యమైన స్థితి. జూలై 30 తర్వాత ఈ అవసరాన్ని అధికార పీఠాల మీద ఉన్న ముఖ్యమంత్రి, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న పీసీసీ అధ్యక్షులు ఏక పక్షంగా మాట్లాడి అనివార్య త పెంచారు. ఇక కలిసి ఉండలేని స్థితి అందరికీ అనుభవంలోకి వస్తున్నది. సమైక్యాంధ్ర ఏకపక్షత, ధాష్టీకం, దౌర్జన్యాలు, విధ్వంసాలు గండిని మరింత పెంచాయి. ఒక వేళ కాంగ్రెస్ నిర్ణయాన్ని వెనక్కి మళ్లించినా ఇక తెలంగాణ మనసు సీమాంవూధ తో అతుకుపడే ఏ చిన్నపాటి అవకాశమూ లేదు. సమైక్యం పేరిట ఈ గండిని పెంచి న రాజకీయ మహానుభావులు, ఏపీ ఎన్జీవో ప్రతినిధులు, రాజకీయాల్లో పూర్తిగా విఫలమైన చాలా మంది దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మొత్తంగా ఒక సమాజాన్ని ఉన్మాదం వేపు నడిపిస్తున్న, ఒక తప్పుడు కారణం కోసం ఒక తప్పుడు భావనకోసం, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, మానవత్వానికే వ్యతిరేకమైన దానివేపు మీడియా నిలబడడం తెలుగు ప్రజల విషాదం. ఇట్లా ఎప్పుడూ లేదు. తెరలమీద నాగుపాములు బుసలు కొడ్తున్నవి. అవి కోరల్లాంటి తమ చేతులను ఊపుతూ సీమాంధ్ర ప్రపంచాన్ని రెచ్చగొడ్తున్నవి. ఈ పాములు రక్త పిపాసులైనవి. కనీస బాధ్యత మరిచి, పూర్తి సంకుచిత, ప్రాంతీయ అహంకారాన్ని ఆధునికాంతర యుగంలో ప్రతిఫలిస్తున్నవి. అదీ విషాదం. నిజమే విభజన ప్రాతిపదికలు కానీ, సమస్యల పరిష్కారాలు కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒకే నిర్ణయం ప్రకటించి అమలు చేయాల్సిన కాంగ్రె స్ ద్వంద్వాలకు తెర తీసింది. ఒక చేత్తో తెలంగాణ ఇచ్చి, మరో చేత్తో సీమాంవూధ లో రాజకీయాలను ఎగదోస్తున్నది. కాంగ్రెస్ వెయ్యి కాళ్ల ఆక్టోపస్. స్వయంగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతినిధిగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాధిపతి సుదీర్ఘ మౌన ము, తెలంగాణ వ్యతిరేకత ప్రదర్శించడం ద్వారా అసాధ్యమైన సమైక్యాంధ్ర సాధ్యమేనని ఆశలు కల్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేని మార్మికంలో తలకిందులుగా వేలాడుతున్నాడు. బాధ్యత వహించాల్సిన వాళ్లే, తెలుగు ప్రజలను రక్షించి ఉండాల్సిన వారే కృత్రిమ ఉద్యమానికి ఊపిర్లూదారు. కానీ విభజన అనివార్యం. ఈ సారి కాంగ్రెస్ ఇవ్వక వెనక్కి మళ్లితే ఏమవుతుంది? తమకు తాము హింసించుకుని మరణించిన వారి ప్రాతినిధ్య ప్రపంచం తెలంగాణ ఆతర్వాత హింసకు దిగితే ఏమి జరుగుతుంది? ఎవరు బాధ్యులు?

కాంగ్రెస్ ప్రకటించనప్పటికీ.. నిజమే. రాష్ట్ర విభజనలో ఏఏ సమస్యలున్నాయో? ఆ సమస్యలకు పరిష్కారాలున్నాయి. నిజమే నీళ్లు నిప్పులయ్యే కాలం. కానీ తెలుగు వాళ్లమే పంచుకోగలం. నిధుల లెక్కలు తేల్చుకోగలం. రాజధానులు నిర్మించుకోగలం. ఉద్యోగుల పంపకాలూ చేసుకోగలం. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడిగా పంచుకోగలం. ఇది రాజ్యాంగ హక్కు. రాజ్యాంగంలో విభజన సూత్రాలున్నాయి. నియమాలున్నాయి. విభజన అనివార్యమైనప్పుడు జరగాల్సిన నిర్మాణా లు, పునర్‌వ్యవస్థీకరణల్లో రెండు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలి. అది కాద న్న వాళ్లు ప్రజాస్వామ్య వ్యతిరేకులే. హైదరాబాద్ గంగా జమునా తహజీబ్.. భయాల కన్నా ‘భయం’కర స్వార్థపూరిత కాంట్రాక్టుజాతి రాజకీయ వేత్తలు సృష్టించిన అపోహలు ఎక్కువ. విద్యకోసం, ఉపాధికోసం, వచ్చేవాళ్లను వద్దంటారని, పెద్ద గోడ పెడతారని, ఇక హైదరాబాద్ రానివ్వరని, ఇక్కడ ఉన్న వాళ్లని బతకనివ్వరని ఎన్ని అపోహలు. భారత దేశ పౌరులు అందరికీ దేశంలో అన్ని నగరాల మీద హక్కు ఉన్నట్టే హైదరాబాద్‌లో బతికే ప్రాథమిక హక్కు ఉన్పప్పుడు, యాభై ఆరు సంవత్సరాలు కలిసి జీవించిన ఆంధ్ర ప్రాంత ప్రజలను వెళ్లి పోమనేంత కుసంస్కారం కలది కాదు హైదరాబాద్. ఎందుకీ ఉన్మాదం? నిజమే. తెలంగాణ రాదనుకుందాం. అప్పుడు జరిగే విపరిణామాలకు ఎవరు బాధ్యత వహించగలరు. రాజకీయ పార్టీలు, మీడియా, ఏపీఎన్జీవోల సంఘం, కుహనా సమైక్యవాదులు రేపెడ్తున్న ఈ ఉన్మాదం వెనక ఒక రక్తపిపాస కనబడుతున్నది. అయ్యా! అన్ని రకాల పార్టీ నాయకులారా! అయ్యా అన్ని రకాల మీడియా ముఖ్యంగా ఉత్తమ సంపాదకులని అనలేను గానీ ఉత్తమ యజమానుల్లారా! అయ్యా కోస్తాంధ్ర కృత్రిమ సమైక్యాంధ్ర వాదులారా ఉన్మాదంతో కొట్టుకులాడ్తున్న మీరు తెలుగుజాతిని ఏమి చెయ్యదలుచుకున్నారు? ఏ రక్తపాతాల తీరాలకు, ఏ అంతర్యుద్ధపు అంచులకు నెడుతున్నారు. ప్రభువులారా! ఏలికలారా! పోలీసు బాసులారా! మీరు ఎందుకింత ప్రమాదకర క్రీడలాడుతున్నారు. సమైక్యమనే ఒక చచ్చిన శవం కోసం, బతికిఉన్న, సజీవంగా మిగిలి ఉన్న తెలుగు ప్రజలను ఎందుకు చంపదలుచుకున్నరు. ఒకసారి ఆలోచించండి. ఒకటి మాత్రం నిజం. తెలంగాణ ఈసారి భంగపడితే నిస్సహాయంగా ఆత్మహత్యలు మాత్రం చేసుకోదు. మరేదో జరుగుతుంది. తప్పదు యుద్ధము. బంధు నాశనం.

-అల్లం నారాయణ
[email protected]

275

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles