మొద్దుబారిపోయినాము...


Sun,March 3, 2013 12:01 AM


సూడ సక్కంగుండేది నా బిడ్డ. కొచ్చెటి ముక్కు. సదువు అయిదో తరగతే కానీ కొంచెం పెద్ద పిల్లే. వంకీల జుట్టు. నాబిడ్డ సక్కంగుండాలని ముక్కుకు ముక్కుపుల్ల చేయించిన. పట్టగొలుసులు కొనిచ్చిన. మాది రంగాడ్డి జిల్ల గంగేరు మండలం జూలపెల్లి. భిక్షాటన చేసి ఆరుమంది బిడ్డలను సాదిన. కని ఇగొ నాబిడ్డ. సూడసక్కదనాల బిడ్డ సదువు ఖరాబయిందని కిరోసిన్ పోసుకొని అంటుపెట్టుకున్నది. దవాఖానల తీస్కోని తీస్కోని సచ్చిపోయింది. అని చెప్తున్నప్పుడు తెల్లటి బవిరి గడ్డం గల్ల ఆ ముసలాయన గొంతు దుక్కంతోటి గుడగుడలాడింది. వేదన తీరే ఏదో ఆయన ముడుతల ముఖం మీద తారట్లాడింది. పేరు పొన్నకంటి హన్మంతు. కులం బుడగజంగం. బిడ్డను పోగొట్టుకున్న హన్మంతు కథ వింటుంటే వేదిక కూడా విషాదంతో వణికింది. జ్యూరీ మూగవోయింది. నిశ్శబ్దం. చావులాంటి మౌనమేదో కమ్ముకున్నది. ఆ సూడసక్కదనాల పిల్లపేరు రేణుక. అయిదో తరగతి. హాస్టళ్ల సదువుకునేది. ఒకరాత్రి పీడకల వచ్చింది. పిల్లలందరూ కాకిరి బీకిరి గోల చేస్తుంటే వీళ్ల హాస్టల్ బాధ్యులిద్దరికీ నిద్రా భంగమైంది. దిక్కులేని పిల్లలు కదా! కులం తక్కువ పిల్లలు కదా? ఈ దేశంలో సర్కారు హాస్టళ్లల్ల బతికే ధాతూ ఫిరాదు లేని బతుకులు కదా! రేణుకను గోడకేసి కొట్టిండ్రు టీచర్లు. ఆ పిల్ల స్పృహ తప్పింది. టీచర్లు అగ్రకులం వాళ్లు. ఇక అప్పటి నుంచీ ఎక్కువ కులాలకు చెందిన ఆ టీచర్లు, మొత్తం ఆ హాస్టల్ సిబ్బంది, స్కూల్ ప్రిన్సిపాల్ ఈ పిల్ల మీద ‘కువారం’ పట్టిండ్రు. ఆరోగ్యం బాగయినాక మళ్లీ స్కూల్‌కి రానివ్వలేదు. ఆ రంధితోని కిరోసిన్ పోసుకొని అంటించుకున్నదీ పిల్ల. ఇంతే కథ. కానీ కానీ..చదువుకోవడం కోసం. అదీ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల చదువుకోవడం కోసం, అగ్రకుల టీచర్ల దౌర్జన్యానికి, పంతానికి, పండంటి ఆ బిడ్డ బలయి పోయింది.ఈ దేశంలో.. స్వాతంత్య్రం వచ్చి అరవైయారేళ్లు అయిన సంక్షేమ, ప్రజాస్వామ్య, సామ్యవాద పీఠికలతో గల రాజ్యాంగాలు అమలులో ఉన్న దేశంలో ఒక చిన్నమ్మాయి. దళిత అమ్మాయి. తండ్రి భిక్షం అడిగి తీసుకొస్తే బతికే అమ్మాయి. చదువు కోసం తనను తాను కాల్చుకునే ఒక దుస్థితి గురించి కదా! ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది. చివరికీ దేశంలో దళితులు. అందునా స్త్రీలు ఎన్ని యాతనలు అనుభవిస్తున్నారో? తెలుసుకునే సందర్భాలు లేవని కాదు. కానీ ఆ వేదిక తల్లడిల్లింది. మనం చెప్పుకుంటున్న విషయాలకు, ప్రకటించుకుంటున్న విషయాలకు జరుగుతున్న దారుణాలకు మధ్య ఏమాత్రం పొంతన లేని ఒక దిగ్భ్రాంత స్థితి.

స్వప్న కథా అలాంటిదే. తండ్రి లేడు. తల్లి ఆ వేదనను పంచుకున్నది. కూతురు అత్యాచారానికి ఎట్లా బలయిపోయిందో చెప్తున్నప్పుడు అనేకసార్లు ఆమె శోకం పెట్టింది. రంగాడ్డి జిల్లా యాలాల్‌ల పది చదివింది స్వప్న. వై.ఎస్. (దివంగత ముఖ్యమంత్రి) తోటి మాట్లాడి డ్యూటీ (కొలువు) అడిగిన ధైర్యవంతురాలు. ఉప్పల్‌లో ఇంటర్ చదివి నర్సింగ్ చేసింది. కనుముక్కు తీరు బావుండే పిల్ల. నర్సింగ్ తర్వాత కొలువుకెక్కి, కూలీ చేసుకుని బతికే అమ్మకు ఆసరాగా ఉంటాననుకున్నది. దరూర్‌కు వెళ్లొస్తనని చెప్పి మల్లా రాలేదు. ఆమె తొవ్వ మూసుకుపోయింది. చర్చిల శవమై పడిపోయి ఉన్నది. ఖరాబుచేసి చంపిండ్రు. ఏ దేవుడూ కాపాడలేదు. తెలివైన బిడ్డ నా బిడ్డ. అందంగ ఉండె. అందరికీ మా అయ్య బానిస. మా అయ్యకు మా అమ్మ బానిస అనేది. ఈ పిల్ల బతుకూ అర్ధాంతరంగా ముగిసింది. దళిత స్త్రీశక్తి ఒక రౌండ్ సమావేశంలో కథలివన్నీ.. కాకిశోకపు కథలివన్నీ. యాసిడ్ దాడులు, అత్యాచారాలు, కులం పేరిట దాడులు, ప్రేమ పేరిట మోసాలు, కిడ్నాప్‌లు, హత్యలు ఆ రౌండ్ సమావేశం బరు వేదిక మీద ఆశీనులయిన ప్రభుత్వ ప్రతినిధులు, న్యాయవాదులు, సామాజికవేత్తలు, పాత్రికేయులు మూగబోయారు. బాధితులు ఒక్కొక్కరూ తమ మాటలు చెబుతుంటే వాతావరణంలో విషాదం తేలియాడింది. ఇదంతా ఈ కథల గురించి మాత్రమే కాదు. అంతకు మించింది. అది బాధ్యతల గురించి, బరువుల గురించి. స్పందనల గురించి. మనుషుల్లోనూ, బాధ్యత గలిగిన, బాధ్యత వహించవలసిన వ్యవస్థల్లోనూ పేరుకుంటున్న ఉదాశీనతకు సంబంధించింది.

అందుకే ఈ వాతావరణంలోనే, ఈ బరువులోనే నాభిలోంచి పెకిలించుకు వస్తున్న అంతమంది బాధామయ గాథలను విని తీర్పులు చెప్పాల్సిన జ్యూరీని దళిత స్త్రీశక్తి ఝాన్సీ ఒక చిన్న ప్రశ్న అడిగింది. అది ప్రశ్న కాదు. అది లోపలికి దూసుకెళ్లి కుదిపేసిన ఒక గాయం. గాయాల గురించి మాట్లాడాల్సిన వాళ్ల అంతరాత్మలకు అయిన గాయం. ‘మీడియాను నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చిన్న ప్రశ్న. మీరు నిర్భయ గురించి ఊరూవాడాఏకం చేశారు. దివారావూతులు ఛానళ్లు ప్రసారాలు చేశాయి. ప్రధానమంవూతులు, సోనియాగాంధీలు స్పందించారు. ఢిల్లీ కదల బారింది. కానీ కానీ.. ఇదే సమాజంలో ఉన్న నిర్భయలు అనేకం. నిచ్చెనమెట్ల వ్యవస్థలో కడుహీన జాతులు. ఆ జాతుల్లోనూ అందునా స్త్రీలు. వారి గురించి ఎందుకు స్పందించరు’ అని అడిగింది ఝాన్సీ.నిరుత్తలమయ్యాం కాసేపు. నిజమే మొద్దుబారిపోయాం మనం. నిజమే స్పందనలు కోల్పోయాం మనం. నిజమే సమాజం ఇట్లా ఉందని తెలుసు. చదువుకోవడానికి కిరోసిన్ పోసుకున్న చిన్నపిల్ల. చదువుకొని అత్యాచారానికి బలైన పిల్ల. చివరికి అమ్మా నాయిన నా చెయ్యి గుంజిండే అని చెప్పుకొని కూడా పాపాత్ముడైన తండ్రికి బలయి పోయిన అమ్మాయి. ఇవన్నీ ఏ పత్రికలోనూ పతాక శీర్షికలకు ఎక్కలేదు. కేవలం దళితులయినందువల్ల, కేవలం ఆదివాసీలయినందువల్ల, అన్ని యాతనలూ అనుభవించి కూడా పట్టని ప్రభుత్వ ప్రతినిధులు, పట్టని పోలీసులు, జరగని న్యాయం, ఏళ్లు గడిచినా దొరకని సాంత్వన. ఎందుకిట్లా ఉంటుంది.నిజమే. మీడియాకు కులం ఉంటుంది. నిజమే మీడియాకూ మగ దురహంకారం ఉంటుంది. నిజమే మీడియాకూ స్వీయ ఎజెండా ఉంటుంది. అది మార్కెట్‌లో చెలామణి అయితే, అది టీఆర్‌పీ రేటింగ్‌ను బారుగా పెంచేదయితే ఎంతకైనా తెగిస్తుంది మీడియా... కానీ కానీ.. ఏదిక్కూలేని వాళ్లు. ఎన్నడూ అక్షరాలను కొనుక్కొని రీడర్లు కాలేని వాళ్లను మీడియా ఎందుకు పట్టించుకోదు? కనీసం బాధ్యత.. ఎందుకు గుర్తెరగదు. ఈ ప్రశ్నలకు జవాబులు లేవు.

జ్యూరీ ఇప్పుడు దోషిగా నిలబడింది. ఈ ప్రశ్నలకు జవాబు లేదు. ఈ దేశం ఎవరిది? ఎవరి కోసం చట్టాలున్నాయి. భర్త యాసిడ్ పోసి ముఖాన్ని నాశనం చేశాడు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. కానీ అక్కడ పై ఉద్యోగి పనిచేయనివ్వలేదు. ‘ఈ దరివూదపు మొఖం అని మాల మాదిగోళ్లు అంటే పడుండాల్నని ముఖంమీదే ఉమ్మేస్తది’ కానీ ఏమీకాదు. కలెక్టర్‌కు తెలుసు. రాజకీయ నాయకులకు తెలుసు. నెల్లూరు జయమ్మదీ దీనగాథ. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ చట్టం ఉంది. కానీ అది అమలు కాదు. అత్యాచారం జరిగినా, దాడి జరిగినా, చంపినా, తిట్టినా కొట్టినా ‘బారా ఖూన్ మాఫఫ్’. మాల మాదిగలకు బతుకు అక్కరలేదు. అందరికీ తెలుసు. కేసులు పెట్టాలంటే ముందు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు. పోలీసుల సహకారం శూన్యం. అధికారాలుండవు. అధవా ఒకటో రెండో కేసుల్లో తీర్పు వచ్చినా అది అమలుకాదు. జయమ్మ కథ, జయమ్మ వ్యథ అందరికీ తెలుసు. కానీ ఆమెను వేధిస్తున్న అధికారిణికి ఏమీ కాదు. ఆమెకు ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఎందువల్ల?నిజమే నిర్భయపూందరో? కానీ మొద్దుబారిపొయ్యాం మనం. స్పందించే గుణాన్ని కోల్పోయాం. కళ్లముందు జరిగే నిర్భయ లాంటి ఏ దౌర్జన్యాలూ, దారుణాలూ మనకు కనపడవు. కన్వీనియెన్స్. స్పందించే గుణం కోల్పోయిన సమాజం బతికి బట్టకట్టదు. అది ముందట పడదు. దళిత స్త్రీశక్తి ఈ ప్రశ్నలకు జవాబుకావాలి. మీడియా స్వంతంగా దానికదిగా, స్వతంవూతంగా లేదు. సమాజంలో ఉన్న సర్వ రుగ్మతలూ ఉన్నాయి. దళితుల బాధలు పట్టించుకునేంత స్వేచ్ఛలేని వ్యవస్థ. నిజానికీ సమస్య మూలాలేమిటి? స్వప్న చెప్పినట్టు. అయ్యకు అమ్మ బానిస.. అమ్మ స్త్రీ. ఈ దేశంలో కులం, లైంగికత రెండూ నిస్సహాయతలే. ఆ నిస్సహాయతల మీద దాడి జరిగినప్పుడు ప్రపంచం దృష్టికి వచ్చినప్పుడు ఎందుకు స్పందనలుండవు.

మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటాం. మీడియాలో భాగమైన వాళ్లం కూడా కొన్ని భ్రమాజనిత ఊహల్లో ఉంటాం. భిన్నమైన వాళ్లం అనుకుంటాం. ఒకించుక లోకోద్ధరణ చేస్తున్నామనీ అనుకుంటాం. కానీ మీడియా స్వేచ్ఛ యజమాని స్వేచ్ఛ మాత్రమే అనే ఒక నిరూపిత సత్యం మళ్లీ మళ్లీ వెక్కిరిస్తుంది. యాజమాన్యాలకు విధివిధానాలుంటాయి. పెట్టుబడులుంటాయి. పెట్టుబడులకు మూలాలుంటాయి. పరమార్థాలుంటాయి. ఝాన్సీ ప్రశ్నకు జవాబులేదు. దళిత స్త్రీలు మగ దురహంకారం, పిత్రుస్వామిక ఆధిపత్యం, అగ్ర కుల దురహంకారం, వీటికి దన్నుగా ఉండే రాజ్యవ్యవస్థ. అన్నీ కుమ్మక్కయిన వ్యవస్థలను ఎదుర్కుంటున్నారు. వాళ్లు ఇంట్లో నాన్నలను, బయట మగవాళ్లను, అగ్రకులం అగ్గువగా భావించి జరిపే దాడులను ఎదుర్కుంటారు. చట్టాలు పనిచేయవు. యంత్రాంగాలు పనిచేయవు. అత్యాచారాలు అంతం లేకుండా సాగుతూ ఉంటాయి. వాళ్ల మానసిక ప్రపంచాలు కూలిపొయ్యాయి. శిథిలమయి పొయ్యాయి.నిజమే ఉద్యమాలు మీడియాను కూడా బాధ్యతల్లోకి, స్పందనల్లోకి ప్రవహింపజేస్తాయి. కానీ పరిమితులదే బాధ. ఆ సమావేశానికి వెళ్లక ముందు సాదాసీదాగా వెళ్లిన నాకు. ఆ వేదిక మీద విన్న బాధామయ గాథలు దోషిని చేశాయి. అది నా ప్రపంచాన్ని కూల్చింది. ఈ దేశంలో నిర్భయపూందరో? ఢిల్లీ కదిలినా, గల్లీ కదిలినా మారని సమస్యలకు మూలాలు పితృస్వామ్య అహంకారంలో ఉన్నాయి. రాజ్య స్వభావంలో ఉన్నాయి. మీడియా ఇందుకు మినహాయింపు కాదు.స్వేచ్ఛ అడుక్కునేది కాదు. అంగడి సరుకూ కాదు. స్వేచ్ఛ ఒక దుకాణం కాదు. ఒక ఆయన ఇవ్వడానికి, ఒక అమ్మ తీసుకోవడానికి స్వేచ్ఛ స్పందన. మొద్దుబారిన మనసులకు విముక్తి. మనుషులుగా స్పందిద్దాం. మూలాల్ని కదిలిద్దాం. అమ్మలారా! పోరాడుదాం. మేమూ మీవెంటే. ఎక్కడి దాకైనా... ఎంతదాకైనా.... కొంత పశ్చాత్తాపంతో... ముక్కలైన మనసుతో...

-అల్లం నారాయణ
narayana. [email protected] gmail.com

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles