రాజిరెడ్డీ.. ఎక్కడికెళ్లినవ్..


Sun,October 28, 2012 12:12 AM

‘రెడ్డీ ఎక్కడికెళ్లినవ్’ అని ఏడుస్తున్నది సరస్వతి. ఆమె రాజిడ్డి ప్రేమించి పెళ్లాడిన సహచరి. బెంగటిల్లిన చిన్నపిల్లలు. చిన్నకొడుకుదీ అదే ప్రశ్న ‘డాడీ ఎక్కడికెళ్లినవ్’ వాళ్ల ముందర రాజిడ్డి పార్థివ దేహం. వచ్చేవాళ్లు వస్తున్నారు. క్రమానుగతంగా వలసల ఉధృతి పెరిగిన తర్వాత ఫక్తు సీమాంధ్ర కాలనీగా రూపుదిద్దుకున్న కేపీహెచ్‌బీ ఫేజ్‌త్రీ కాలనీలో కిక్కిరిసిన ఎల్‌ఐజీ క్వార్టర్స్ ముందు చిన్న షామియానా. దానికింద తెలంగాణ కలలు కని, ఆ కల సాకారం కోసం పోరా డి, చివరగా మార్చ్‌చేసి, ఆ కవాతులో బాష్పవాయుగోళపు విష రసాయనాలకు బలైన రాజిడ్డి నిర్జీవ దేహం. రాజిడ్డి లేడు. అతని కల మాత్రం ఆ సీమాంధ్ర వాసనలు గల, ఇడ్లీ సాంబార్ కాలనీలో అట్లా గాలిలో నినాదమై వ్యాపిస్తూ ఉన్నది. జేపీ అక్కడ నిలబడడానికి ఆయన గెలవడానికి తగిన ఆవరణం గల కాలనీలో ఈ పక్కా తెలంగాణవాది ఆత్మ. రెడ్డీ ఎక్కడికెళ్లినవ్ అనే ప్రశ్న నాకెందుకో తెలంగాణ ఎక్కడికెళ్లినవ్’ అని వినిపించినట్టున్నది. భ్రమ కావొచ్చు. మనసులో మార్మోగుతున్న తీవ్ర పరితాపం కావొచ్చు. అవునూ తెలంగాణ కోసం మరణించిన వారిలో రాజిడ్డి ఎన్నోవాడు.

ఇది బలిదానం కాదు. నిస్సహాయతలో, అసహాయతలో, ప్రజాస్వామ్యం వుందని నమ్మి, రాజకీయాలు, సమీకరణలు, ఇప్పుడు సాగుతున్న ఉద్యమస్థాయి తెలంగాణను తెస్తుందని నమ్మి భంగపడి మంటల్లోమాడిపోయిన వాడి బలిదానం కాదు ఇది. ప్రజాస్వామ్యమూ, పార్లమెంటూ, కేంద్రంలో ఏలిక లు తెలంగాణ ఇస్తానని చెప్పి, స్వయంగా ప్రకటించి దరిదాపు మూడేళ్లుగా ఆడుతున్న రాజకీయ ఆటలకు, ఆటు మాటల హింసకు రోసిపోయి, ఇక ఈ ప్రపంచంలో ఏమీకాదు, ఏదీ రాదు, ఇక తెలంగాణ కూడా రాదని గుండె వేయి వ్రక్కలై రోసిపోయి దూలానికి తాడు వేసుకున్న వాడి ఆత్మబలిదానం కూడా కాదు. రాజిడ్డి మలి తెలంగాణ ఉద్యమంలో మొదటి వీరుడు. పోలీసు దౌష్ట్యానికి, వలస పెత్తందారీ ప్రభుత్వపు అణచివేతకు బలైన తొట్టతొలి వీరుడు రాజిడ్డి. కాలం చెల్లిన ప్రజాస్వామ్యం అసలు ముసుగు ఈ సంఘటనతో పూర్తిగా, నగ్నంగా బయటపడింది.

సీమాంధ్ర వలస పెత్తనం తెలంగాణను ఎంతగా ఆక్రమించిందో? ఆ ఆక్రమణ ఇక్కడి మనుషుల పట్ల ఎంత విద్వేషాన్ని పెంచుకున్నదో? ఈ సంఘటనతో అర్థమవుతున్నది. ఈ వలసను మనం కేవలం అంతర్గత వలసల్లో ఉండే పరిమిత అవలక్షణంగా చూస్తున్నాం. కానీ ఇది ముదిరి, స్థిరీకరణ పొంది, రాజ్య స్వభావాన్ని పూర్తిగా సంతరించుకుని, ఏ ప్రాంతంలో విలీనమయ్యారో ఆ ప్రాంతాన్ని కబళించి ఆధిపత్యం మాత్రమే కాదు, రాజ్య లక్షణమైన అణచివేత సాధనాలన్నింటినీ ప్రయోగిస్తున్నదని మనం అర్థం చేసుకోవడం లేదు. బహుశా ఈ తీవ్రత తెలంగాణ కోసం కొట్లాడుతున్న చిత్తశుద్ధి గల యోధులకు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది.

మనం మామూలుగా అర్థం చేసుకుని, ఊదుకు పీరిలేస్తదని, శాంతి మంత్రాలకు చింతకాయలు రాల్తాయని, ప్రజాస్వామ్యం నిజంగానే పని చేస్తుందని కూడా భావిస్తూ ఉండడం వల్ల కూడా కావొచ్చు. సీమాంధ్ర వలస పెత్తనం తీవ్రతను, దాని రాజ్య నిర్మాణాన్ని, స్వభావాన్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నాం. లేదా తెలిసినా మరోదారి పట్ల, పరిమితి గల ఉద్యమ స్వభావాల వల్ల నగ్న సత్యాలను చూడ నిరాకరిస్తున్నాం. బహుశా రాజిడ్డి మరణం ఇప్పుడు మనకు మళ్లీ ప్రశ్నలు వేస్తున్నది. రాజిడ్డి భార్య సరస్వతి లాగే ‘ఏడ ఉన్నాం మనం’ అన్నది ఒక కీలక ప్రశ్న.

ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్లం కాము. నిజమే. తెలంగాణ ఒక స్వతంత్ర రాజ్యంగా విరాజిల్లిందీ నిజమే. విలీనం కోసం సీమాంవూధులు కర్నూలు గుడారాలు చుట్టేసి హైదరాబాద్ వచ్చిందీ నిజమే. కానీ కానీ వేరువేరు ప్రాంతాలైనా భాష ఒక్కటే. కేవలం యాభై ఆరు సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం వలసగా మారిం ది. ఇది మినహాయింపులు లేని పూర్తి వలస ప్రాంతం. లేదంటే ఒక కవాతుకు అనుమతించిన తెలుగు సోదరులైన ఏలికలు, చుట్టూ బారికేడ్లు పెట్టి అణచివేసి ఉండరు. హైదరాబాద్‌ను కాపాడడం పేరుతో ఒక ఐమూలకు కవాతును నెట్టేసి, ఒక రోడ్డులోకి కవాతును నెట్టేసి, నిర్బంధం, అణచివేత కొనసాగించరు. ప్రజాస్వామ్యం అట్లా పక్కన బెట్టినా ఒకవేళ ఇది వలస ప్రాంతం కాకపోతే నూరూ నూటా యాభై మంది కూచున్న వేదిక మీదకు బాష్పవాయుగోళాలు ప్రయోగించరు.

ఈ బాష్పవాయువు గోళాలు కూడా చస్తే చావనివ్వు అని కాలం చెల్లిన, విష పూరితమైన బాష్పవాయువును అసలే ప్రయోగించరు. వలస ప్రాంతంలో మనం వాళ్ల కన్నా తక్కువస్థాయి పౌరులం కనుక, అణచివేతకు అర్హులం కనుక, చివరికి చావుకూ అర్హులం కనుక, అనుమతించిన కవాతుకు వెళ్లడానికి కూడా గొడ్లను కొట్టినట్టు కొట్టడానికీ అర్హులం కనుక అంతిమంగా మనం రెండవక్షిశేణి పౌరులం కనుకనే ఒక స్పృహతోనే, ఒక ఎరుకతోనే సీమాంధ్ర ప్రభుత్వం, తన కీలు బొమ్మలయిన గుప్పెడుమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో తెలంగాణను అణచివేస్తున్నది.బహుశా ఈ తీవ్రత తెలంగాణ ఉద్యమానికి అర్థం కావలసి ఉన్నది.

ఈ తీవ్రత అర్థమయితే తప్ప ఉద్యమ తీవ్రత స్వభావం అర్థమయ్యే పరిస్థితీ ఉండదు. అదీ సమస్య. బహుశా ఒక రాజిడ్డి మరణం చెప్పిన రహస్యం అదే. కానీ ఖాతరు చెయ్యడానికి, ఈ సత్యాలను గమనించడానికి, గమనించి ఉద్యమ పంథాలను మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? రాజిడ్డి మరణం ఒక యాధృచ్ఛిక సంఘటన కాదు. అది ఒక బద్దలైన రెండు ప్రపంచాల విభజన. మీడియా, కొందరు కీలుబొమ్మలుగా, బానిసలుగా మారిన రాజకీయ నేతలు, ఆధిపత్యాన్ని కాపాడే సీమాంధ్ర దళారీ ఆధిపత్యంలో కూడిన ఈ రాజ్య వ్యవస్థ మనం ఊహిస్తున్న దానికన్నా బలమైంది కదా? అన్నది ఇప్పటి సందర్భం వేస్తున్న ప్రశ్న.

ఊరేగింపు నడుస్తున్నది. కిక్కిరిసిన ఎల్‌ఐజీ క్వార్టర్ల ముందు ఆకాశంవేపు బారు గా అంతస్తులుగా లేచిన రెండు టవర్స్ కనబడ్తున్నాయి. మాల్స్ కావొచ్చు. సినిమా లు కావొచ్చు. హైదరాబాద్ ఇప్పుడు మనల్ని మనం వెతుక్కోవాల్సిన ఒక తప్పిపోయిన పట్నం. ఏదీ మనది కాని స్థితి ఉన్న ఊరిలో, పుట్టిన ఊరిలో పరాయిలు కావడం ఒక ఉత్పాతం. బహుశా రాజిడ్డికి ఆ స్పృహ ఉండి ఉండవచ్చు. అందుకే ఆయన తెలంగాణను కలవరించాడు. పుట్టిన రామగుండంలోని పెద్దంపేట రాజిడ్డికి పోరాట సంప్రదాయాన్నీ, సంస్కారాన్నీ ఇచ్చింది కనుకనే రాజిడ్డి కవాతు కోసం కదిలి అమాయకంగా (తెలంగాణ ఉద్యమంలాగే) ప్రజాస్వామ్యం కదా! అనుమతించిన కవాతులో బాష్పవాయుగోళం ఆయన ఊపిరితిత్తులను ఛిద్రం చేసి చంపుతుందని రాజిడ్డి ఊహించి ఉండడు.

1969లో ఇది గుర్రం ఇది మైదానం అని తెలుసు. ఘాస్‌మండీ నుంచి, చార్మినార్ నుంచీ, పత్తర్‌ఘట్టీ నుంచి పట్టగొలుసులతో ఉత్తకాళ్లతో, చేతిల జెండాతో నడిచి వచ్చిన మహిళలకు తెలుసు. సీమాంధ్ర నాయకుడు బ్రహ్మానందడ్డి క్రూరత్వం, ఛెప్పన్నారు రాష్ట్రాల బలగాల కవాతు ముందరికి, రాజ్ భవన్‌రోడ్‌లో ఊరేగింపుగా వెళ్లిన అలనాటి ఉద్యమకారుడికీ తెలుసు. అణచివేత సాధనాల అసలు అంతరంగం ఏమిటో? అయినా ఆనా డు వాళ్లు తేల్చుకున్నారు. హింసకు బలయ్యారు. ప్రతిహింసలేని ఉద్యమం ఆనాడు ఏకపక్షంగా అణగిపోయింది. ప్రతిఘటనలేని పోరాటం. మున్నూటాడ్బ్భైమంది త్యాగాల చాలు పోశాయి. ఆ త్యాగాల ఫలాల మునుంపట్టిన మలి ఉద్యమంలో అదే క్రూరత్వానికి, అదే హింసకు, అదే అణచివేత సాధనాలకు రాజిడ్డి బలయ్యాడు.

ప్రతిఘటనా రూపాల తీవ్రత అల్పస్థాయిలో ఉన్న ఒక ప్రాంతం కనపడని కుట్రలకు, ప్రతీకాత్మక మార్మిక హింసకు బలయింది. వెయ్యిమంది బలయ్యారు. వెయ్యిమంది తండ్లాడి, తండ్లాడి అంగలార్చి బలయ్యారు. అప్పటికన్నా ఎక్కువ హింస. అప్పటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య హననం. అప్పటికన్నా ఎక్కువ సంఖ్య. అయి నా తెలంగాణ ఉద్యమం కొన్ని వాస్తవాలను గుర్తించ నిరాకరిస్తున్నది. ప్రతిహింస మంత్రసానిత్వం, పరిమిత రాజకీయ ఉద్యమ ఎత్తుగడల్లో పతాలేని భావనయైంది.

చివరికి వాళ్లు మీడియాను విభజించారు. ఇదే ప్రాంతంలోని, ఇదే హైదరాబాద్‌లోని మూడు ఛానళ్లను, రెండు పత్రికలను నిషేధపు జాబితాలో పెట్టి వెలివేశారు. ఈ రాజ్యం మాది, ఈ రాజ్యంలో ఏ మీడియా ఎక్కడకు వెళ్లాలో, ఏ మీడియా ఏ మంత్రనగరి సరిహద్దుల్లో నిషేధమో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధాని సమావేశం నుంచి గెంటేసి చెప్పారు. వారి పెంపుడు జంతువులు మాట్లాడవు. మనమూ సర్దుకున్నాం. ఈ విభజనని మాట్లాడని వాళ్లు, ఈ మీడియా అణచివేత గురించి మౌనం పాటించేవాళ్లు రంగస్థలాల మీద పత్రికా స్వేచ్ఛ గురించి భాషణ్ ఇస్తారు. వింటాం.

సందులో సడేమియాలాగా రాంబాబు సినిమా తెరమీద విషం కక్కుతాడు. ఒక ప్రాంతం ఆకాంక్షల కోసం, రాజ్యాంగబద్ధమైన , ఆర్టికల్ 3 అమలు కోసం, స్వతం త్ర రాజ్యంగా కొనసాగిన ఈ ప్రాంతం కల కోసం ఆరాటపడిన వాడిని అమానుషంగా చంపినా ప్రజాస్వామ్య వ్యవస్థలు గొప్పగా బతికే ఉంటాయి. మాట్లాడని చిలుకలైన పత్రికలూ, ఛానళ్లూ మహారంజుగా తెలంగాణ మొత్తాన్ని ఏలుతుంటా యి. సినిమాలు ఆడుతుంటాయి సకల జనుల సమ్మెలో దూకుడు లాగా. జీవితం నిశ్చలంగా ఉంటుంది. కవాతూ జరుగుతూ ఉంటుంది. ఉద్యమ వేదికలూ కిక్కిరిసి పోయిన నాయకులతో పోటెత్తుతాయి. జీవన వైవిధ్యం తెలంగాణ. బానిసలు వాగ్దానాలు చేస్తుంటారు. అధికార, దురహంకార, ఆధిపత్య పెత్తందారులు రాజ్యం ఏలుతుంటారు. విడగొడుతుంటారు. ఆశలు చూపి కూడగడుతుంటారు. కానీ మనం మాట్లాడుతూ ఉంటాం.. ఏళ్ల తరబడి.. ఉపన్యసిస్తుంటాం సంవత్సరాల తరబడి. ఇంచు కదలడు ఆధిపత్య అహంకారి. బంగ్లాలు లేస్తుంటాయి.

ఫ్యాక్టరీలు మొలుస్తుంటాయి. కుంభకోణాలు పెరుగుతుంటాయి. ఒక నీచ గర్భంలో పాపాలు పెరుగుతుంటాయి. కానీ.. ఒక్క రాజిడ్డి మరణిస్తాడు.. ఊరేగింపు కదులుతుంటుంది.. కానీ కానీ.. ఒక వలసవాది, ఒక పెత్తందారీ, ఒక ట్యాంక్‌బండ్‌కు, ఒక నక్రేకల్ రహదారికి మాత్రమే భయపడతాడు. అతని వెన్ను పాములో పుట్టెడు భయం సృష్టించడమే ఇప్పటి సందర్భం. రాజిడ్డి తెలంగాణ మలి ఉద్యమ వీరుడు. జోహార్ రాజిడ్డి. తెలంగాణ ధిక్కార భూమి. అది భూకంపాలను పసిగట్ట గలదు. అగడ్తలు దాటగలదు. అడ్డంకులు ఛేదించగలదు. నిజ ప్రజాస్వామ్యా న్ని ప్రతిష్టాపన చేసి పతాక ఎగయ్యగలదు. నమస్తే సమస్త తెలంగాణ.

-అల్లం నారాయణ
[email protected]

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles