జై బోలో తెలంగాణ...శంకర్


Sun,October 14, 2012 12:30 AM


ప్రాణహితకు ‘జైబోలో తెలంగాణ’కు పేగు సంబంధం వుంది. ఎందుకంటే శంకర్ ప్రాణహిత ప్రేమికుడు. ప్రేరణ నాకదే అని చెప్పినవాడు. కాలమ్ సంగతి పక్కనబెట్టినా శంకర్ ఆ కాని రంగుల ప్రపంచంలో కూడా తెలంగాణ నదులను, ప్రాణహితలను, పువ్వులను, పల్లెలను, బతుకమ్మలను, బోనాలను ప్రేమించినవాడు. సినిమా మనం ఊహించిన దానికన్నా బలమైన ప్రసార సాధనం. తెలంగాణ తనను తాను మరచి ఆధిపత్య సంస్కృతినే తన సంస్కృతిగా, ఎన్టీఆర్‌నూ, ఏ ఎన్నార్‌ను, శోభన్‌బాబును తమ ఇంట్లో దేవుడిగా, కథానాయకుడిగా ప్రేమించింది ఈ ప్రసార సాధనం వల్లనే. కోస్తాంధ్ర పెత్తందారీ వలస, ఎక్కి తొక్కొచ్చిన పెట్టుబడులు ప్రజానాట్యమండలి వాహికగా అభ్యుదయమై ఊరేగుతూ ముందు మద్రాసుకు, ఆ తర్వాత విశాలాంధ్ర ‘ప్రగతిశీల’ భావనయై హైదరాబాద్‌కు చేరిన క్రమమంతా పెట్టుబడుల ప్రవాహ క్రమమే. ఆ పెట్టుబడుల పరిరక్షణ, వలస పెత్తందారీ ఆధిపత్యపు పరిరక్షణ, భావనల సమర్థన పాత్రను ముందు పోషించింది ఈ బలమైన ప్రసార సాధనయే. అందుకే కనపడవు గానీ, పెద్దగా పట్టించుకోము కానీ ఈ హైదరాబాద్‌ను అడ్డగోలుగా దోస్తున్నదీ, ప్రభావితం చేస్తున్నదీ ఇప్పటికీ సినిమాయే. అలాంటి సినిమా ప్రపంచంలో జైబోలో తెలంగాణ అంటూ ఏటికి ఎదురీదిన వాడుగా, ఒకే ఒక్కడుగా సినిమా ప్రసార సాధనాన్ని దారిమళ్లించి, తెలంగాణ మార్గం పట్టించడానికి తన దారి లో తాను పనిచేసినవాడుగా శంకర్ నిజంగా సంచలనమే. శంకర్‌లో ప్రవహించే తెలంగాణ పోటెత్తిన నెత్తురు ఆయనతో జైబోలో తెలంగాణ అని ఆర్సి కేకలు పెట్టించింది. ఆ విధంగా శంకర్ సినీరంగంలో ఒక మంకెన పువ్వు.

సకల జనుల సమ్మె జరుగుతుండంగ, అది తెలంగాణ జీవన్మరణ సమస్యగా సబ్బండవర్ణాలు, సకల జనులు తొక్కిడితొక్కిడిగా వీధుల వెంట నడుస్తుండగా ‘దూకుడు’ నైజామ్‌లో కలెక్షన్లు దూకించుకున్నది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని. పెద్దగా గమనించం కానీ ఇవ్వాళ్ల హైదరాబాద్‌లో కానీ, శివార్లలో కానీ రియల్ ఎస్టేట్ ప్లాట్లు ప్లాట్లు గా విస్తరించిన క్రమంలో రాజకీయవేత్తలు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ల కన్నా ఎక్కువ భూములను గుప్పిట్లో పెట్టుకున్నదీ ఈ సినీ మాయగాళ్లే. నాలుగు సామ్రాజ్యాల పడగ నీడన, నాలుగు కుటుంబాల పడగ నీడన హైదరాబాద్‌తో సహా మొత్తం సినిమా రంగమంతా ఒక వ్యవస్థీకృతమైన ఆధిపత్య భావజాల ప్రసారకర్త, సంధానకర్త పాత్ర పోషిస్తున్నది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, నరనరానా నిలు తెలంగాణ పట్ల వివక్షను, గుడ్డి వ్యతిరేకతను, అల్పభావనను నింపుకొని ప్రచారం చేసేదీ ఈ సినిమా రంగమే. పైగా సినిమాల సాధనానికున్న మంత్రముగ్ధ సానుకూలత వల్ల ఒక్క తెలంగాణ మైమరుపే కాదు, సినిమా ఇండస్ట్రీ చుట్టూ జరిగే వ్యాపారమంతా నాలుగు కుటుంబాలను కార్పొరేట్లకు దీటుగా కోట్లాది ఆస్తులకు పడగపూత్తించి గుత్త సామ్రాజ్యాలను తయారు చేసిందీ ఈ సినిమా రంగం. సినిమాలో దేవుళ్ల వేషాలు వేసి, స్టాలిన్ వేషాలు వేసి, ఉద్ధారకుల వేషాలు వేసి, చాపకింద నీరులా అటు ఎన్టీ రామారావు, ఇటు చిరంజీవి దాకా తెలుగుజాతి పేరిట ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో ఒక సమ్మతిని సాధించి తెలంగాణ భావనలను మరింత ధ్వంసం చేసిందీ వీళ్లే. 1969 వైఫల్యం అనంతరం తెలంగాణ కనీసం ఎనిమిదవ దశకంలో కానీ తొమ్మిదవ దశకంలో కానీ పూర్తి విధ్వంసం అయినా పల్లెత్తు మాట మాట్లాడని స్థితిని, మైకాన్ని కల్పించిందీ ఈ సినీ మాయామోహమే. ఆ సినీ మాయామోహమే ‘తెలుగు జాతి మనది’ గొప్ప జాతి ఒక్కటిగా ఉందాం. కలిసి ఉంటే కలదు సుఖం, తెలుగు జాతి ఆత్మగౌరవం లాంటి భావనలను ప్రచా రం చేసి తెలంగాణ ఆత్మగౌరవ భావనలను పాతాళంలోకి నెట్టిందీ ఈ సినిమా రంగమే. అదిగో అలాంటి సినిమారంగంలో శంకర్ భిన్నంగా నిలిచినవాడు. తను తెలంగాణ సినిమా తీస్తే ఆ రంగంలో నూకలు చెల్లినట్టే అని తెలుసు. అంతకు ముందు ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా! లాంటి సినిమాలు తీసి సక్సెస్ సాధించినా జైబోలో తెలంగాణ అంటే సినిమా రంగం ఎట్లా మెత్తని కత్తితో మెడ తెగటారుస్తుందో తెలుసు. అయినా ఈ నేల మీద ప్రేమ, ఈ నేల ఆయనకు నేర్పిన రాజకీయ, సామాజిక విశ్వాసాలు, బాల్యం, యవ్వనం ఆయనకు అందించిన అనుభవాలు, గద్దరన్న మీద ప్రేమ, తను గడిచివచ్చిన నల్లగొండ నేల మీద ప్రేమ, శంకర్‌ను నిటారుగా ఒక లక్ష్యం వేపు నిలబెట్టిన అంశాలు. అవును శంకర్ నిలబడ్డాడు. తన నేల కోసం

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తీరు, ఆ ఉద్యమం పట్ల అవగాహన, సినిమా రంగంలో ఉన్నప్పటికీ, చుట్టూ జిలుగు మాయామోహపు ప్రపంచం ఉన్నప్పటికీ, ఒక ఉన్మాద ఆవరణలో జీవిస్తున్నప్పటికీ శంకర్‌కు తను ఏమిటో? ఏ నేల మీద మొలకెత్తిన విత్తనమో తెలుసు. అందుకే అతను ఆత్మబలిదానాలకు కన్నీరు కార్చాడు. కావొచ్చు ఒక సినిమా దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణ’ ప్రఖ్యాతి పొందే, ఆదరణ ఉండే విషయమున్న స్పృహ ఉండి ఉండవచ్చు. కానీ ఒక శ్రీకాంత్‌చారి మర ణం ఆయనను కుంగదీసి ఉండవచ్చు. భద్రంగా ఉన్న ఈ సినిమా ప్రపచంలో ఒక బలిదానం ఆయన కన్నీటి నిండుగా నిండుకొని ఉండవచ్చు. అందుకే శంకర్ దిక్కులు పిక్కటిల్లేలా ‘జై బోలో తెలంగాణ’ అని నినదించాడు. చాలామందికి లాగే శంకర్‌కు నేనంటే ఎంత ప్రేమో అన్ని ఫిర్యాదులూ ఉన్నాయి. నా గురించి రాయలేదన్నా అనేవాడు. నారాయణమూర్తికీ అంతే. నేను తార్కోవ్‌స్కీ సినిమాలను ఇష్టపడిన వాణ్ని. రో మన్ పొలాన్ స్కీ ‘ది పియానిస్ట్’ను అకిరా కురసోవా ‘రోష్ మాన్’ను ఇట్లా పెద్దలిస్టే. సత్యజిత్‌రేను, మృణాల్‌సేన్‌ను, శ్యామ్‌బెనెగల్‌ను, గౌతమ్ ఘోష్‌ను, బుద్ధదేవ్ భట్టాచార్య ‘ఆంధీ గలీ’ని తెలిసిన వాణ్ని. తెలుగు సినిమాల్లో మా భూమి, ఒక ఊరికథ తప్ప మినహాయింపులు లేకుండా తరతమ భేదాలతో అస్సలే ఇష్టపడని వాణ్ని. ఆ రంగం జోలికి పోబుద్ధి కాదు. పైగా తెలంగాణ స్పృహ, మీడియా ప్రభావాల స్పృహ, నాకు తెలుగు సినిమాల మీద ఏవగింపు కలిగించి, ఇదొక సినిమా రంగం అని గుర్తించని వాణ్ని. అటు నారాయణమూర్తి, ఇటు శంకర్ నా నుంచి ఏమైనా రాస్తే బాగుంటుంది అన్నవాళ్లే. అనుకున్నవాళ్లే కానీ మనసొప్పదు. నారాయణమూర్తి భిన్నమైన వాడు ఒప్పుకుంటాం. ఆయన సినిమాల థీమ్‌లూ గొప్పవే. కానీ ఆ సినిమాలు తీసిన తీరు మీద అభ్యంతరం. అది ఆయనతో చెబితే మీకు మేధావిత్వం వల్ల సినిమా పల్స్ తెలియదని ఇద్దరం వాదులాడుకునేవాళ్లం. శంకర్‌తో అంతే. ప్రధాన స్రవంతి సినిమాల్లో రాయడానికి ‘మేకింగ్’లో తెలివితేటలు, కాపీ జ్ఞానం తప్ప ఏమీ వుండదన్నది నా నిశ్చితాభివూపాయం. అందుకే శంకర్ మీద నేనేమీ రాయలేదు.కానీ, అలాంటి నాతో శంకర్ కథచెప్పి కళ్లనీళ్లు పెట్టించాడు. జీవితంలో ఎన్నడూ ఊహించని తీరుగా ఒక్కరోజు షూటింగ్‌తో అయిపోతదన్నా అని చెప్పి మూడు నెలలు నన్ను జైబోలో తెలంగాణ చుట్టూ నటింపజేశాడు. జీవితంలో నటన తెలియదు. బహుశా ఆ సినిమాలో నేను నటించింది కూడా ఏమీలేదు. కానీ ఆ సినిమా అవసరం బాగా తెలిసివచ్చేలా చేశాడు శంకర్. షూటింగంతా బంజారాహిల్స్‌లో పాడుబడ్డ హోటల్‌లో వేసిన సెట్టింగ్‌లోనే ఒకరోజు. చారి కాలిపోయి ఆస్పవూతిలో ఉన్న సీన్. నిజంగా అంతా కృతకంగా ఉంటుంది. సినిమాయే ఒక కల్పన. ఆ కల్పనకున్న మాంత్రిక మార్మికత వల్ల ఆకర్షణ. ఆకృతకత్వంలో చారి పాత్రధారి బెడ్ మీద దూదిచుట్టి రక్తపురంగులద్ది బెడ్ మీద. చుట్టూ మల్లేపల్లి లక్ష్మయ్య, జూలూరు గౌరీశంకర్, దేశపతి శ్రీనివాస్, వేదకుమార్ ఇంకా అనేక మందిమి. ఏడుపు సీన్ అన్నా ఏడ్చినట్టుండాలె అంటడు శంకర్. నిజంగానే ఏడుపు నటించడం వచ్చా. ఆసీన్ తయారీలు, రిహార్సల్స్ ఆషామాషీగా తీసుకున్న మాకు.. అది దృశ్యమానమవుతున్న క్రమంలో ఏడుపు తన్నుకొని వచ్చింది. గ్లిసరిన్ అవసరం లేని కల్మషం లేని కంటినీరు.. ఆ సీన్ మమ్మల్ని ఏడిపించింది. నిజానికి అది కల్పన అని తెలుసు. అక్కడ నటిస్తున్నామనీ తెలుసు. కానీ మా మనసులో నూ శ్రీకాంతాచారి ఉన్నాడు. మా మనసులో అప్పటికే యాదయ్య ఉన్నాడు. అప్పటికే మా మనసులోనూ నిస్సహాయత ఉంది. బహుశా అట్లా ఏడుస్తామని మేమెవరం ఊహించలేదు. ఆ దృశ్యం అయిపోయినంక ఒక గంభీర వాతావరణం. ఎవది దుఃఖం లో వాళ్ళున్నంత నిశ్శబ్దం. బహుశా శంకర్ ఊహించిన విజయం అదే కావచ్చు.

దేవుళ్లకు వజ్ర వైడూర్యాలు పెట్టి, అల్లూరి సీతారామరాజు కూడగట్టిన గిరిజన యువతులకు పట్టురవికెలు తొడిగి, పురాణాల, చరివూతను అష్టకష్టాలు పడి భ్రష్టు పట్టించేంత కాల్పనిక జగత్తు సినిమా అందువల్ల నాకు ఆవగింజంత సదభివూపాయం లేదు. శంకర్ నా ప్రాణహిత చదువుతుంటే సినిమా ప్రారంభం అవుతుందని మొహమాటపెట్టి ఈ సినిమాలోకి లాగాడు. కానీ ఆతర్వాత శంకర్‌తో ఆ మూడు నెలలూ ఒక ఉద్యమంలాగా నడిచింది. ఒక బండమీద కాలుపెట్టి జగపతిబాబు వెనుక నిలుచోబెట్టి రోజంతా ఒకే దృశ్యాన్ని చిత్రీకరించినా, ఎర్రటెండలో ఒక్క సెకన్ సీన్ కోసం నల్లగొండలో వేలాదిమంది ముందు మమ్మల్ని నిమిత్తమావూతులను చేసి సినిమా తీసి నా, వరంగల్ ఖిల్లాలో అమరవీరుల స్తూపాల ముందు పత్రిజ్ఞలు చేయించినప్పుడు ఈ జగపతిబాబు ఏంది బాబూ అని అనిపించినా, చివరికి నిజంగానే ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, ఏంది సార్ మీరు ఇట్లా, అవసరమా? ఆ జగపతిబాబేంది. ఆయన వెనుక మీరు నిలుచుండుడేంది? అన్నప్పుడు పిచ్చినవ్వునవ్వి మొహమాటంతో మాట రాకుండా నిలబడినా శంకర్‌తో ఉన్న ప్రేమపూర్వక సంబంధమే. మనిషిగా శంకర్ మంచితనమే. ఎన్‌కౌంటర్ సినిమా తీస్తున్నప్పుడు అప్పుడే సినిమా కలలుకంటున్న శంకర్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, అన్నా! ఎన్‌కౌంటర్ డైలాగులు రాసి పెట్టమని ఎంత బతిమాలినా పైమనస్యం వల్ల ఆయనకు ఏదీ రాసివ్వలేదు. కానీ శంకర్ ఒక మానవ సంబంధాన్ని, అందునా తాను ఇష్టపడి, ప్రేమించే మానవ సంబంధాన్ని, ఎన్నడో యవ్వనంలో ఎత్తిన ఎర్రపతాక సంబంధాన్ని వదులుకోడు అనేది నా జై బోలో తెలంగాణ నటనా మొహమాటంలో రుజువయింది. శంకర్ ప్రేమించదగినవాడు.

పూర్తి ప్రతికూల రంగంలో, తాను అనుకున్నది సాధించిన శంకర్‌కు ఉత్తమ దర్శకు డు అవార్డు ఒక వన్నె. ఒక చరివూతను సినిమా తీయడం కష్టమేమీ కాదు. అది నిశ్చల చిత్రం. కానీ ఒక నడుస్తున్న చరివూతను, నడుస్తూ నడుస్తూ సినిమా తీయడం సాహసమే. జైబోలో తెలంగాణ ఒక నడుస్తున్న చరివూతను ఒడిసిపట్టిన సినిమా. జాతీయ సమక్షిగతా అవార్డు ‘జైబోలో తెలంగాణ’ లాంటి విభజనోద్యమ సినిమాకు ఇవ్వడం మిలీనియం జోక్ అని నాకు మెసేజ్‌లు పెట్టారు. ఆయన సినిమాకు ఉత్తమ సినిమా ఇవ్వాల్సి ఉండే. ఇదెందుకిచ్చారని, ఆ మెసేజ్‌లో కొనమెరుపులూ ఉన్నాయి. కానీ విడిపోయి కలిసుందాం. తెలుగు వాళ్లమే కనుక విద్వేషాలు వద్దు అని చెప్పినందుకు ఈ సినిమాకు ఆ తరహా అవార్డు ఇచ్చి ఉంటారు. ముగింపు తెలియని ఒక సినిమా తీసిన గొప్ప కళాకారుడు శంకర్. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నది. సినిమా నడుస్తున్నప్పుడే కృష్ణ కమిటీ వచ్చింది. నివేదిక వచ్చింది. ఏం జరుగుతుందో? తెలియదు. ఎలా ముగించాలో తెలియదు. ఇదంతా ఒక పకడ్బందీ ప్రణాళికతో నడిచేది కాదు. నడుస్తున్న చరిత్ర నడుస్తూ తీయాలి. అందుకే డైలాగ్‌ల నుంచి శుభం దాకా శంకర్ మా మీద కూడా అంతో ఇంతో ఆధారపడ్డాడు. కానీ.. మేం చెప్పింది విన్నట్టే ఉండేవాడు. తలూపేవాడు. సినిమా తీయడం మాత్రం ఎక్కడా రాజీపడేవాడు కాదు. సినిమాటిక్ కళకు, మేం చెప్పే విషయాలకు మధ్య ఉండే అంతరం అతనికి తెలుసు. అయి తే ఈ సినిమా గొప్పదా? గొప్ప మేకింగా? కళాఖండమా? తెలంగాణ సినిమాను ఇట్లాగేనా తీసేది? అంటే నా వద్ద సమాధానాలు లేవు కానీ.. ఒక ప్రతికూల వాతావరణంలో ఏటికి ఎదురీది, తెలంగాణ సినిమాను ఎడారిలో నీటి చెలిమెను పుట్టించినట్టు పుట్టించి విజయవంతమైన శంకర్‌కు నా హృదయపూర్వక నమస్తే.గద్దరన్న చాలాకాలం తర్వాత ఒక దృశ్యమానంగా మార్చింగ్ సాంగ్‌ను కలగన్నాడు. ఆ కల మార్మోగింది. అది మలి తెలంగాణ ఉద్యమ మకుటమయింది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమైన మా అన్న గద్దరన్నకు అవార్డు రావడం కొత్తగాదు. ఏ అవార్డూ గద్దర్ గళానికి సాటిరాదు. ఆ కంఠస్వరం ఒక అంతర్జాతీయ గీతిక. ఆ పాటకు వందనం. మిట్టపల్లి సురేందర్ గీతానికి వందనం. పోరు తెలంగాణ సినిమా తీసిన రసమయిబాలకిషన్‌కి ‘ఇంకెన్నాళ్లు’ సినిమాతో ఒక అవార్డు సాధించిన రఫీకి మొత్తంగా తెలంగాణ సినిమాకు అభినందనలు.హెచ్చరిక: అవార్డులిచ్చి సినీ మాయా రంగం తెలంగాణనూ తనలో కలిపేసుకుంటున్నదన్నదీ సత్యమే. అవార్డులిచ్చారు. స్వీకరణలు, వివాదాలు, వ్యక్తిగతాలే. ఈ ఉద్య మ పరిధి విస్తృతమైంది. ప్రజాస్వామ్యమయినది. ఎల్లలు లేనిది. లొంగిపోనిది అని విశ్వసిస్తూ... మైమరపు వద్దని హెచ్చరిస్తూ...

-అల్లం నారాయణ
allamnarayana@yahoo.co.in

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...