జీవించే స్వేచ్ఛ.. బాసగూడ ఆభాస


Sun,July 15, 2012 01:05 AM

హప్కా చోటుకు పన్నెండేళ్లు. కాక సంధ్యకు కూడా పన్నెండేళ్లే. మడకం నగేష్‌కు 13 సంవత్సరాలు. మడకం రాం విలాస్‌కు కూడా అంతే వయసు. కోశ్యా బిచ్చెం, కాక రమేష్, మడకం దేవ, హప్కా మిధు, కాక రాహుల్‌ల వయస్సు పదిహేనేళ్లు. పదోతరగతి పిల్లలు. సర్కె రాముల, కాక పార్వతి, ఇర్ప సురేష్‌లకు పదహారేళ్లు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా బాసగూడ సీఆర్‌పీఎఫ్ క్యాంపునకు మూడు కిలోమీటర్ల దూరంలో కొత్తగూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ‘మావోయిస్టుల’ వయసిది. పసిపిల్లలు పన్నెండుమందిని చంపిన చిదంబర రాజ్యం ఇప్పుడు కూడా వాళ్లను మావోయిస్టులనే అంటున్నది. మొత్తం చనిపోయింది ఇరవై రెండు మంది. దాంట్లో పన్నెండుమంది పసిపిల్లలు. భూమీ ఆకాశం ఏకం కాలేదు. పౌరులను కాల్చి చంపిన అధికారులకూ ఏమీ కాలేదు. ఆ అధికారులను వెనకేసుకొస్తున్న సీఆర్‌పీఎఫ్ సూపర్ బాస్ విజయకుమార్ అదే పదవిలో కొనసాగుతూ ఉన్నాడు. చిదంబరం సరేసరి ఆయనింకా పదునైన పదాల మధ్య ఎకసెక్కపు పదాలను కలెగలిపి పనికిమాలిన తెలివి ప్రదర్శిస్తూ, తన వాక్చాతుర్యానికి తానే అబ్బురపోతూ ఇప్పటికీ ఈ దేశపు హోంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు.

ఇదీ మన భారతదేశం. ఇదీ మన ప్రజాస్వామ్యం. ఇదీ మనం బతుకుతున్న తీరు. ఆటవిక న్యాయం మధ్యన ఆదివాసీల తలలు తెగిపడినా ఈ ప్రపంచం ఎప్పటిలా నడవడమే ఒక ఆశ్చర్యం. ప్రశ్నార్థకం కూడా.
ఆదివాసీల సంస్కృతి భిన్నమైంది. వాళ్లు అంత సులభంగా అబద్ధాలాడరు. మనుషులను మాయచేసి ప్రయోజనాల కోసం మాటలుమాట్లాడేంత ‘నాగరికత’ ఎదుగుదల వాళ్లకు లేదు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత వాళ్లు చెబుతున్న మాటలు అబద్ధాలు కాదు. బీజ్‌పాండమ్ (విత్తనాల పండగ) కోసం ఊరు ఒక గుంపయింది. ఆ గుంపు మీద సీఆర్‌పీఎఫ్, కోబ్రా, మావోయిస్టు వ్యతిరేక దళాలు విరుచుకుపడ్డాయి. విచ్చలవిడిగా కాల్పులు జరిపా యి. నిజంగానే ఛత్తీస్‌గఢ్‌లో మనుషుల ప్రాణాలకు, జంతువుల పాటి విలువ లేదు కనుక ఆకు పచ్చని వేటగాళ్లు ఊరు ఊరు మీద కాల్పులు జరిపారు. ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరిపారు. కనీసం శవాలు దక్కకుండా అప్పటికప్పుడు ఆపరేషన్ పూర్తిచేసి విజయ వికటాట్టహాసం చేశారు. కానీ ఈ నిజం మీద అబద్ధాల మీద బతికే చిదంబరం అబద్ధాలాడాడు. విజయ్‌కుమా ర్ అబద్ధాలాడాడు. పెదాల చివరి నుంచి ‘ఒకవేళ ఎన్‌కౌంటర్‌లో సామాన్యు లు మరణిస్తే ‘సారీ’ అని చెప్పారు. ఇదీ ఏలికల తీరు.

ఛత్తీస్‌గఢ్ ఒక ఖనిజాల గని. ఆ మాటకొస్తే జార్ఖండ్, ఒరిస్సా, జంగల్‌మహల్ ఈ దేశపు సహజ వనరులకు అడ్డాలు. ఇప్పుడా అడ్డాల మీద ఒక టైమ్ బాంబు ఉంది. ఆ టైమ్ బాంబ్ రాజ్యాన్ని భూతంలా వెంటాడుతున్నది. అవును అది కమ్యూనిస్టు భూతం. వందల సంవత్సరాల క్రితం పుట్టిన దోపిడీపై దండయాత్ర కొనసాగింపు. కన్నంలో దొంగలను కన్నంలో పట్టుకునే ఈ టైమ్ బాంబును ఏలికలు నిర్వీర్యం చేయవలసి ఉన్నది. లేదంటే అక్కడి నీళ్లలో సాగే తోలు తిత్తిలా జారిపోయే మెరిసే అభ్రకం దక్కదు. అభ్రకం దక్కకపోతే వేల కోట్ల రూపాయలతో కుదుర్చుకున్న అటవీ సంపద మీద రాబందుల్లా వాలిన కార్పొరేట్ల చల్లని కనుచూపులు దక్కవు. ఈ కనుచూపులు లేకుండా చిదంబరం లేడు. మన్‌మోహన్‌సింగ్ లేడు. మాంటెక్‌సింగ్ అహ్లువాలియా ఉండడు. వారిని తోలు బొమ్మల్లా ఆడించే పెద్దన్నయ్య మనుగడ లేదు. ఆయుధ బేపారంతో ప్రపంచాన్ని యుద్ధ భూమిగా మార్చిన అమెరికా, దాని తైనాతీల మందలు దిగ్గుమనేలా దిమ్మతిరిగే దెబ్బకొడ్తున్న ఏకైక టైంబాంబ్ మావోయిస్టు. ఇప్పుడా టైమ్‌బాంబ్‌ను నిర్వీర్యం చెయ్యాలి. జల్ జంగిల్ జమీన్ కోసం కొట్లాడుతున్న ఆదివాసీల మధ్య నీళ్లల్లో చేపల్లా మావోయిస్టులున్నారు.

నీళ్లను చేపలను వేరుచెయ్యడమే ఇప్పటి ఎన్‌కౌంటర్ అసలు సారాంశం. బహుశా అందుకే మారణకాండ జరిగిన తర్వాత మరిన్ని బాసగూడలు జరుగుతాయని సీఆర్‌పీఎఫ్ ప్రకటించింది. ఇదంతా వేటలో భాగ మే. రాజ్యం ఆదివాసీలంత అమాయకమైందీ కాదు. అది క్రూర జంతువు. చిదంబరం అంతే ఆయన ధవళ వస్త్రాలు ధరించిన వేటాడే ముసలి పులి. ఇప్పుడు సమస్య ఏమిటంటే అపారమైన ఖనిజాల మీద టైంబాంబై కూర్చు న్న ఆదివాసీల సైన్యానికి, రక్షణకు ఏకైక ప్రతినిధులయిన మావోయిస్టులను నిర్వీర్యం చెయ్యాలి. బహుశా ఇప్పటి ఎన్‌కౌంటర్ అందుకొరకే.

టైమ్స్ మ్యాగజీన్ భిన్న ముఖ చిత్రాలతో రెండు మూడునెలల కాలంలో దేశ ప్రజలకు ఒక సూచిక అందించింది. ముందు వాళ్లు మోడీని ముఖచివూతం గా వేశారు. బహుశా ఆయన భవిష్యత్ ప్రధాని. భవిష్యత్ కార్పొరేట్ల రాజ్య పాలకుడు. భవిష్యత్ అమెరికన్ తైనాతీల మొనగాడు. రెండో ముఖచిత్రం మన్‌మోహన్‌సింగ్. అతనింక చెల్లని కాసు. రెండు దశాబ్దాల క్రింద సంస్కరణలు ప్రారంభమయినప్పుడు, సరళీకరణ విధానాలు ప్రారంభమైనప్పుడు, గేట్లు బార్లా తెరిచి ఒళ్లంతా అమెరికన్ ‘గాట్’లు పెట్టుకున్నప్పుడు ఆయన ఛాంపియన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు, ప్రపంచబ్యాంకుకు రాజ్యం మోకరిల్లినప్పుడు మన్‌మోహన్‌సింగ్ చురుకైన సంస్కరణల ఛాంపియన్. పీవీ ఆదేశించాడు. మన్‌మోహన్ పాటించాడు. పీవీ అనుమతించిన పావు అయ్యాడు. మన్‌మోహన్ సంస్కరించాడు. కానీ, ఆ తాకిడికి సాంప్రదాయ మానవవనరుల భారతదేశం, సాంప్రదాయ వ్యవసాయక భారతదేశం తట్టుకోలేకపోయింది. అది కునారిల్లింది.

సబ్సిడీలు, ఎరువులు, ఇంధన పెరుగుదలలు, సర్వీసు ట్యాక్సులు, ఏకగవాక్షం గుండా పరుగెత్తుకొచ్చిన పెట్టుబడు ల ముందు భారత రైతాంగం సొమ్మసిల్లింది. అది కునారిల్లింది. ప్రపంచం అతలాకుతలమయింది. టోనీ బ్లెయర్ బ్రిటన్ నుంచి సంస్కరణల మానవీయ కోణం ప్రతిపాదించాడు. నడిచింది జమానా. కానీ ఇప్పుడు నడవడం లేదు. బహుశా రెండవ దశ సంస్కరణలు, మరింత కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు దోచిపెట్టే సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్నది ప్రపంచం. ‘టైమ్స్’ ముఖ చిత్రాలు ఒక సూచన. ఇప్పుడు బహుళ జాతి సామ్రాజ్యవాద కంపెనీలకు మోడీ కావాలి. సంస్కరణలను వ్యతిరేకించే శత్రువును పసిగట్టి ఊచకోత కోయగల సమర్థుడైన కొత్త పులి కావాలి. అందుకే మన్‌మోహన్ వైఫల్యాలు ఇప్పుడు కనబడ్తున్నాయి. ఇక సంస్కరణలకు కనీసం మానవీయ కోణమూ, ముఖమూ లేవు. వంద రూపాయలకు పెట్రోల్, డాలర్ ముందర రూపాయి సాగిలపడి మొక్కుతున్న జీడీపీ రేటు కోసం బలిపెట్టిన బతుకుల అగడ్తలు పూడ్చలేనంత. ఉన్నోడి ఉన్నతికి లేనోడిని కాటికి పంపే, కాకులను కొట్టి కాదు చంపైనా సరే గద్దలకు మాంసం వేసే కొత్త సంస్కరణలు కావాలి.

బహుశా సామ్రాజ్యవాదం యుద్ధాలను ఉచ్‌కాయిస్తున్నది. గ్రీన్‌హంట్‌ను, బాసగూడ మారణకాండను ఈ దృశ్యంలో చూడాలి. సహజ వనరుల దోపిడీని అడ్డుకునేవాడు, సహజ వనరుల మీద టైమ్‌బాంబులా కూచుని ఉన్నవాడు ఇప్పుడు అసలు శత్రువు. ఇప్పుడా శత్రువును ఎదుర్కోవడానికి, ఇప్పుడా శత్రువును ఏరివేయడానికి సర్వశక్తులూ ఒడ్డాలి భారత రాజ్యం. రాజ్యాంగం, హక్కులు, ఆదివాసీలు, గనులు, భూగర్భ ఖనిజాలు, రక్షణలు, పర్యావరణలు, చట్టాలు అన్నీ ట్రాష్. కోటానుకోట్ల రూపాయల విలువగల ఖనిజ సంపదను దోచుకోవడమే అంతిమ లక్ష్యం. అదే ఇప్పటి ఇజం. అందు కే పదిహేడు కాదు భవిష్యత్‌లో మరిన్ని బాసగూడలు సృష్టించి అమాయకులు, అబద్ధాలు ఆడనివారు, తమ బతుకేదో తాము ఆకులలములు తిని బతికే ఆదివాసీలు పదిహేడు వేలమంది చనిపోయినా చిదంబరం అట్లాగే మాట్లాడుతాడు. ‘ఒకవేళ ఆ ఎన్‌కౌంటర్‌లో పూర్తిగా అమాయకులే చనిపోతే సారీ’ అంటాడు. సీఆర్‌పీఎఫ్ చీఫ్ ‘అయినా రాత్రుళ్లు కాల్పులు జరిగినప్పు డు వాళ్లు సామాన్యులా? మావోయిస్టులా’ అని ఎలా తెలుస్తుంది? అని అంటాడు. అదీ సమస్య.

అమాయకులు చనిపోయినా సరే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? మరి మావోయిస్టుల మందుపాతర్లలో పోలీసులు చనిపోయినప్పుడు మీరు మాట్లాడరేమిటి? అనే ఒక ఉల్టా ప్రశ్న వేస్తారు. అప్పుడు నిజంగానే భారతదేశానికి నోరుంటే అబూజ్‌మఢ్‌కు, బస్తర్‌కు సీఆర్‌పీఎఫ్ బలగాలు ఎందుకు వెళ్లాయి? అని అడగాల్సి ఉంటుంది. వెళ్తే అవి మావోయిస్టుల నిర్మూలనకా? ఆదివాసీల రక్షణకా? ఆదివాసీల రక్షణకే అయితే, మరి ఈ ఆదివాసీల నిర్మూలన దేనికి? అని ప్రశ్నించాల్సి ఉంటుంది. మావోయిస్టులే అయినా ఈ దేశం లో కనిపిస్తే చంపేయొచ్చా? ప్రశ్నలు వేయగలమా? రాజ్యానికి ఇప్పుడు అర్జంటుగా ఖనిజాలు తవ్వి వేల కోట్ల సంపదను కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే కర్తవ్యం ఉన్నది. ఆ కర్తవ్యం కోసం అది వేటాడుతున్నది. కానీ రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ప్రాణహక్కు, జీవించేహక్కు ఇచ్చింది. అది అమలు కానిచోట రాజ్యాంగం ఉన్నట్టా? ఈ దేశ ఆదివాసులకు జీవించే హక్కు కూడా లేనప్పుడు ఇంత పెద్ద రాజ్యమూ, రాజ్యాంగాలూ అవసర మా? మరిన్ని బాసగూడలు కాకుండా ఉండాలంటే భారతదేశపు పౌర సమా జం కనీసం స్పందించాల్సి ఉన్నది. మరో దారిలేదు. పసిపాపలను వేటాడి చంపే క్రూర మృగం ఒకటి తిరగాడుతున్నది. ఆ క్రూర మృగం దేశం మీద పడి సామాన్య మానవజాతిని హరించక ముందే మేల్కొంటే మంచిది. అప్పుడు మనం మన ప్రజాస్వామాన్ని నమ్మొచ్చు. రాజ్యాంగాన్ని కూడా.

-అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...