లగడపాటి బడాయి


Thu,July 28, 2011 04:42 PM

-అల్లం నారాయణజగోపాల్ అంటే ఎవరు? అంటారు? లగడపాటి అనంగానే పూర్తిగా అర్థమయినట్టే ఠక్కున ఓహో జగడపాటి అంటారు. ఎవరు? చిన్నపిల్లలు. తెలంగాణల పుట్టిన బడిపిల్లలు. తెలంగాణ సభలల్లో ఆ మధ్య ప్రసంగాలు చేసేవాళ్లు ఒక ప్రశ్న వేసేవారు. నిరాహార దీక్షలు, నిమ్స్, దొంగలాగా దవాఖానలో తెల్లటి దుప్పటి కింద విషపు కోరల నాగుంబాములా లగడపాటి దూరి పడుకున్న దృశ్యాలను ప్రసంగంలో చెబుతూ, ఆయన ఎట్లున్నడు అంటే సభికులందరూ ముక్త కంఠంతో అరిచేవారు ‘కసబ్’..కసబ్ లెక్కన ఉన్నడని. అప్పుడు కసబ్ యాంటీహీరో. తాజ్‌మహల్ హోటల్ మీద జరిగిన దాడి, ముంబై దాడులలో కసబ్ ప్రఖ్యాతి వహిస్తే, తెలంగాణలో లగడపాటి రాజగోపాల్ అడ్డగోలుగా మాట్లాడి, పార్లమెంటు సభ్యుడయినా ఆంబోతులా అందరి మీదకు గిట్టలు దువ్వి ప్రసిద్ధుడయిండు. బెజవాడలో కేసీఆర్ దీక్షను అవహేళన చేస్తూ పరుపులు, కూలర్లు, ప్రసంగాలు వచ్చిపొయ్యేవాళ్లు, ముద్దులిచ్చేవాళ్లు ఓహో! అట్టహాసం చేసి అంతిమంగా ఘనత వహించిన సీమాంధ్ర ప్రభు త్వం పోలీసుల సహకారంతో నిమ్స్‌కు దొంగలా వచ్చి, ఆయన కసబ్ బిరుదు ఉచితంగా కొట్టేశారు.

తెలంగాణ ప్రజలు ఆయనను ముద్దుగా జగడపాటి, కసబ్ అని పిలుచుకోవడం పరిపాటే. లగడపాటి చేష్టలకు, చేతలకు మాటలకు హైదరాబాద్ నడిబొడ్డున సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ మధ్య చిన్నపాటి సన్మానం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక్కడ పన్నెత్తి మాట్లాడలేదు. బహుశా బెజవాడ రక్షిత ప్రాంతం అనుకున్నారేమొ.. ఏ రౌడీ మాటలయినా చెల్లుతాయని అనుకున్నాడేమొ అక్కడ అడ్డం పొడుగూ మాట్లాడి మళ్లీ తన బిరుదులకు తానే వన్నె తెచ్చుకున్నడు. తెలంగాణల ఇంకొక సంప్రదాయం ఉంది. తలా తోక లేకుండా మాట్లాడేవాళ్లను, అడ్డం పొడుగూ మాట్లాడేవాళ్లను, ఎడ్డెమంటే తెడ్డెమనెటోళ్ల ను, ఎద్దుకొమ్మంటే, బర్రెకొమ్మని కోడి దమాఖ్‌తోని మాట్లాడేవాళ్లను ‘మిగుల బలిసి’ మాట్లాడ్తండు. అంటరు. మర్యాదస్తులం కనుక నాలాంటి వాళ్లం ఆ మాట అనలేము. బెజవాడలో లగడపాటి మాట్లాడిన మాటలు ఏ నాలుగున్న ర కోట్ల మంది ప్రజలను చులకన చేస్తూ మాట్లాడాడో? ఏ తెలంగాణ గురించి, తెలంగాణ కోసం నెత్తుటి యుద్ధం చేస్తున్న పోరాటం గురించి, ఉద్యమం గురిం చి అవహేళన చేస్తూ మాట్లాడాడో? ఆ తెలంగాణ ప్రజలు కోపం పట్టలేక మళ్ళీ ఒకసారి లోపల లోపల పండ్లు పటపట కొరికి, గాయి గాయి అయి, ఆగమాగమై , ఏం జెయ్యాలె ఈ కసబ్‌ను అనుకుంటే అది ఎవరి తప్పూ కాదు. నాలాంటి సామాన్య కాలమిస్టు తప్పు అసలే కాదు. కానీ, ఒకానొక సందర్భంలో తెలంగాణ ఉద్యమం గమ్యం, గమనం, ఉధృతి, ఊపు గురించి చర్చ వచ్చినప్పుడు ఒక రాజకీయ వేత్త అన్న మాటలు గుర్తొస్తున్నయి.

ఉద్యమం చల్లారితే లేపడానికి , ఉగ్రరూపం దాల్చడానికి అక్కడ కార్యకర్తలు ఉన్నరు కదా! అని.. బిత్తరపోయి అక్కడ అంటే సీమాంవూధల కార్యకర్తపూవరూ? అని అడిగితే ఇంకెవరు? లగడపాటి. అన్నది సమాధానం. నిజమే. కన్నూ మిన్నూ కానరాని ఈ నడమంవూతపు సిరి, నయా రాజకీయ దురంధరుల వల్ల ఒక విధంగా తెలంగాణ ఉద్యమానికి మేలు జరుగుతున్నది. అవునిప్పుడు స్పందించాల్సింది తెలంగాణ ప్రజలే కాదు. ఏ మాత్రం చీమూ నెత్తురు ఉన్నా, ఏ మాత్రం ఈ ప్రాంతం మీద స్పృహ ఉన్నా, ఏ మాత్రం తెలంగాణ తల్లి మీద ప్రేమ ఉన్నా, ఏ మాత్రం ఈ నేల నాది, ఇక్కడి ఉద్యమం నాది, ఈ తెలంగాణ నాది , హైదరాబాద్ నాది, ఇక్కడి సంపద నాది .. వాడెవ్వడు , వీడెవ్వడు మాట్లాడడానికి అనే రేశం ఉన్నా మాట్లాడాల్సింది తెలంగాణ ప్రజా ప్రతినిధులు. ఒకే ఒరలో రెండు కత్తుల్లా ఆధిష్ఠానం నీడన ఒదిగి ఒదిగి బాంచెల్లా బతుకుతున్న కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు మాట్లాడాల్సి ఉన్నది. లగడపాటి ఒక సవాల్ చేసినాడు. ఆధునిక అభివృద్ధి నమూనాలో, ప్రభుత్వాలు, దళారులు, అధికారుల మందతో కలిసి, ఉదారవాద విధానాల్లో తెగబలిసిన నయా కార్పొరేట్‌ల ప్రతినిధి లగడపాటి. ఆయనకు వచ్చిన అపార సంపదల వెనుక వక్ఫ్ భూములుంటాయ్. ల్యాంకో హిల్స్ వందల అంతస్తుల్లో భూములు కోల్పోయిన వారి కంకాళాలుంటాయి. ఆయనకు చేకూరిన మహా సామ్రాజ్యం కింద కరెంటు లేదని అర్ధ రాత్రుళ్ళూ, అపరావూతుళ్లూ , పొలాల కాడ ప్రాణాలు కడతేర్చుకున్న రైతుల మూలుగులుంటాయి.

రాష్ట్రంలో కరెంట్ లేదన్నా కనీసం కరుణ లేని బేపారి, ఎక్కడో విద్యుత్ అమ్ముకుని, తీగల ద్వారా లాభాల కొఠీర్లు నింపుకున్న దురహంకారం ఉంది. సహజమే. ప్రపంచం లగడపాటిది. శ్రీకృష్ణ ఆయనపాదం మీద మొలిసే పుండు. ఏమైనా మాట్లాడగలరు. ఏ చక్రమన్నా తిప్పగలడు. తెలంగాణఈ దుర్భేద్యమైన అజ్ఞానికి ఎలా అందుతుంది. ఒక త్యాగమా, ఒక వారసత్వమా. శతాబ్దపు గోస, పారిన నెత్తురు, కన్నీళ్ళు, చెమ ట, భంగపాటు ఏమర్థమవుతాయి. కళ్లను కమ్మిన పొరలు ఇక్కడ ఉద్యమం ఏముంది? అనిపిస్తాయి. నిజమే. శ్రీకృష్ణ ఎనిమిదో ఛాప్టర్‌లో సూచించినట్టుగానే ‘మీడియాను కట్టేస్తే ఉద్యమం ఏముంటుంది’ అని అంటారు. తప్పదు. మీడియాను కట్టెయ్యమని, మేనేజ్ చెయ్యమని శ్రీకృష్ణ రహస్య నివేదికలో రహస్యంగా చెప్పివున్నడు. నిజమే శ్రీకృష్ణ, లగడపాటి ఒక్కరే కావొచ్చు. వాళ్లిద్దరూ ఒకే రూపంలో ఉన్నవాళ్లూ కావొచ్చు. నిలువునా కాలిపోయిన వాళ్లు, కూలిపోయిన వాళ్లు, నిత్యం ఎక్కడో? అక్కడ, బారికేడ్లను, బంధూకులను బద్దలు కొట్టి తెలంగాణ వ్యతిరేకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నవాళ్లు, మానుకోట మహిమగల్ల రాళ్ల వారసత్వాన్ని హన్మకొండ, వరంగల్‌లో జెండా కట్టి ఎగరేసి లాఠీలకు, తూటాలకు ఎదురేగే వాళ్లు ఎట్లా కనడబడ్తారు? వీళ్లకు. ‘ఎ.పి.అసెంబ్లీలో తెలంగాణ వాళ్లు ఎట్లుంటరు?’ అంటడు లగడపాటి. అవు ను.. ఎట్లుంటరు? ఇదొక తారుమారు ప్రశ్న. తెలంగాణ అసెంబ్లీల, నిజాం కట్టిచ్చిన అసెంబ్లీల, తెలంగాణవాళ్లు రాజ్యమేలిన తెలంగాణ అసెంబ్లీల ఒంటె లా దూరి, కూకేటి పాములా దూరి, ఆ పాము వెరపులేని, జంకులేని గొంకులేని ఒక ప్రకటన చేస్తున్నది. మీ అసెంబ్లీల మేము సొచ్చినం. మీరెందుకింకా? అంటున్నది. ఇక సమాధానం చెప్పవలసింది తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ అసెంబ్లీల సొచ్చిన సీమాంధ్ర ప్రతినిధుల మాటలకు గాయపడవలసింది ఇప్పటికే తల్లడిల్లుతున్న, ఇప్పటికే నెత్తురోడుతున్న, ఇప్పటికే తల్లడం మల్లడం అవుతున్న సామాన్య ప్రజలు కాదు.

ఇక చెప్పండి పార్టీ ఏదైనా, జెండా ఏదైనా? నా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న 119 మంది ప్రజా ప్రతినిధులారా! ఇక తేల్చండి. ఎ.పి.అసెంబ్లీల మీరు ఎందుకున్నరో? చెప్పవలసింది మీరు. కిరాయిదారు ఆస్తి నాదే అంటున్నడు. ఇక్కడి భూముల మీద ఎదిగి, ఇక్కడి జాగల మీద ఎదిగి, కన్సార్షియాలు పెట్టి, అగ్గువ సగ్గువకు ప్రాజెక్టులు, ప్రాథమిక సౌకర్యాలు పొంది ఇక ఈ హైదరాబాద్ నాదే అంటున్నడు. లగడపాటి అలియాస్ జగడపాటి అలియాస్ కసబ్. ఇప్పుడు చెప్పు అసదుద్దీన్ ఒవైసీ, ఈ హైదరాబాద్ ఎవరిది? ఈ హైదరాబాద్‌ను నిర్మించిందెవరు? సొంతం చేసుకున్నది ఎవరు? ఎన్ని లక్షల కోట్లు పెడితే ఏంది? ఎవరిదీ హైదరాబాద్? ఆ లెక్కలొద్దు. పొన్నం.. లావులావు మాట్లాడ్తున్నవ్. తెలంగాణ తెస్తనంటున్నవ్. లగడపాటిలు, రాయపాటిలు, కావూరిలు ఏ మర్యాదలు అనుభవిస్తున్నరో? అమ్మ సోనియమ్మ దగ్గర మందకు మంద ఢిల్లీకి పోయినా, చేతులూపుకుంట శూన్య దృక్కులతో చేష్టలు దక్కి మీరెందుకు వచ్చిండ్రో, వచ్చిన తెల్లారే పుండు మీద లగడపాటి కారం ఎందుకు చల్లిండో చెప్పు పొన్నం. గిరాటెయ్, విసియ్ ఫోరం కన్వీనర్, ఎం.పి. పదవి, అధిష్టానం బానిసకొక బానిసకొస బానిసవోయ్ బానిసా! తెలంగాణకు ఒక ఇజ్జత్ ఉన్నది. ఆ ఇజ్జత్ ఏందో అనేకసార్లు చూపింది తెలంగాణ.

ఉప సమరంలో గెలిచి నిలిచిన పన్నెండు మందిని అడుగు! తెలంగాణ ఎటున్నదో తెలుస్తది. తెలంగాణ వస్తే భయానక వాతావరణం. తెలుసా! అంటడు లగడపాటి మహా అజ్ఞానీ.. నెహ్రూ అన్నడు హైదరాబాద్‌ను. భారతదేశం అంతా హైదరాబాద్‌లా ఉండాలని.. గంగా జమునా తహజీబ్ గురించి ఏ మూర్ఖులకు చెప్పాలి. లక్షల కోట్లు పెట్టినవో, వెయ్యి కోట్లు పెట్టినవో? అదికాదు లగడపాటి.. హైదరాబాద్ మీద హక్కు కోరి ఏ హక్కుతో మాట్లాడ్తున్నవ్ అని అడగాల్సింది. పుట్టు హైదరాబాదీల ప్రతినిధులు నాగేందర్, ముఖేష్, శ్రీనివాస్ యాదవ్ మాట్లాడండిప్పుడు. ఇజ్జత్ కా సవాల్. ఇంట్లకు రమ్మంటే, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అనే ఒక దురహంకారికి బుద్ధి చెప్పవలిసింది మీరే పహిల్వాన్‌లూ. ఎందుకా కండలు, బారెడు మీసా లు, గడ్డాలు... తేల్చుకోండి తెలంగాణ ప్రతినిధులారా! అయిలీ పయిలీ వం టావార్పు చేస్తారో? ఢిల్లీకి పొగబెడతారో? ఏమున్నది ఉద్యమం టీవీల్లో తప్ప అన్న లగడపాటికి ఏం సమాధానం చెబుతారో మీ ఇష్టం. తెలంగాణకు నాలుగున్నర కోట్ల కార్యకర్తలకు తోడు సీమాంవూధలో కరడుగట్టిన కార్యకర్తలున్నది నిజమే. లగడపాటి లాంటి కార్యకర్తలుంటే తెలంగాణ ఖాయం. అయినా సీమాంధ్ర ప్రజలారా! లగడపాటి మీకూ తెలంగాణకు ఒకేరకపు శత్రువు.. పారాషార్! ఒక పెద్దమనిషి ప్రజాస్వామ్యాన్ని ఔపోసన పట్టి అసెంబ్లీల కూసిన రాష్ట్రపతి పాలన కూతలకు సన్మానం పొందారు. లగడపాటి ప్రెస్‌క్లబ్‌లో సన్మానం పొందారు. అయినా దోచుకోనివ్వని ఉక్రోశం, ఇక వీలుకాదు. మా హైదరాబాద్ మాది అంటున్న తెలంగాణ పట్ల పట్టరాని ఆక్రోశం లగడపాటిలను సృష్టిస్తున్నది. తేల్చుకోవాల్సిందిక తెలంగాణ ప్రజా ప్రతినిధులే!

ఉపసంహారం: ప్రాణహిత వియోగం అక్షరాలా తొమ్మిదినెలల పైబడి. అక్షర వియోగం. అక్షరం ఒక వ్యసనం. ప్రాణహితకు మళ్లీ ప్రాణం పోసేప్పుడు అన్నీ మననం చేసుకుని, ఆంధ్రజ్యోతిలో ఆ కాలమ్ రాసే అవకాశమిచ్చిన ఎం.డీ రాధాకృష్ణ, సంపాదకులు కె. శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్లీ ప్రాణహిత పారిద్దామనుకుంటే ... మధ్యలో లగడపాటి అడ్డం వచ్చి.. ఇలా అయ్యింది. తప్పదు. అనిశ్చిత తెలంగాణలో.. నిశ్చిత ..నిశ్చల పరిస్థితు లు రావాలని.. మళ్లీ మీ ముందుకు.. వస్తున్నా.. ఇక వారం వారం.. సజీవనది ప్రాణహిత ముచ్చట్లతో.. నమస్తే తెలంగాణ.

39

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...