సాహు జ్ఞాపకం


Wed,March 14, 2012 12:40 AM

man
పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్తూనూ రొదలా వెంబడించే జోరీగల సంగీతంలో నిలు పెరిగిన గడ్డి నిండిన వనాలను సంచారిలా చుట్టినవాడు వెంకన్న. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మాణిక్యాపూర్ మాణిక్యం ఆయన. ప్రజల కోసం బతికిన మనిషి. ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆచరించిన మహామనిషి. నీరే కానరాని పటార్‌ల (ఆదిలాబాద్ అడవుల్లో కొండలు గుట్టల్లో, నివాసిత ప్రాంతం) మీద బతికే మనుషులు. నీటి కోసం గుడ్డేలుగులతో పోరేవాళ్లు. జంతువుల్లాగానే మనుషులతో పోరాడాలి. అప్పుడు రక్తం వరదలు కడ్తుందని నమ్మి ఆచరించిన వెంకన్న అకాల మరణానికి పందొమ్మిదేళ్లు. గోండు, కొలాముల లిపిలేని భాషకు లిపి నేర్పడమే కాదు. పాట కట్టినవాడు. పాట పాడినవాడు. (జమ్మికుంట ఆదర్శ కాలేజీలో ‘త్రీ మస్కిటీర్స్’ అనే నల్లా ఆదిరెడ్డి, చంద్ర ప్రభాకర్, వెంకన్నలకు ముద్దుపేరు)లో వెంకన్న కవి, గాయకుడు, విప్లవకారుడు, కొమురం భీము నవలాకారుడు, గోండు ల జీవితాల మీద కథకుడు కూడా.

వెంకన్న సహచరుల్లో నల్లా ఆదిడ్డి పీపుల్స్‌వార్ అగ్రనాయకునిగా ఎదిగి కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ప్రభాకర్ జన జీవితంలో ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలో తొలి విప్లవకారుల తరానికి చెందిన వెంకన్న హుజురాబాద్, మంథని ప్రాంతాల్లో పీపుల్స్ వార్ లో వృత్తి విప్లవకారునిగా, సెంట్రల్ ఆర్గనైజర్‌గా పనిచేసి అనంతర కాలంలో గోండు గూడాలకు తరలి అడవి వెన్నెలను వెలిగించిన తొలితరం విప్లవకారుడు గజ్జెల గంగారాం సహయోధుడు.పొదల పొదల గట్ల నడుమ పొడిసెనొ క్క సందమామ అంటూ జానపదుల జన జీవన రాగాలను విప్లవ గానాలుగా మలిచినవాడు. ‘నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ల పన్నీరాయె’ అంటూ అణగారిన బాల్యాన్ని కలవరించినవాడు. తిరుగుబాటు ఒక జీవన సూత్రంగా, విప్లవ ఆచరణలో ఉత్తర తెలంగా ణ పల్లెలు అనుభవించిన అన్ని సంక్లిష్టతలనూ అనుభవించిన వాడు సాహు. ఎనభైయవ దశకంలో కరీంనగర్ పల్లెలు కల్లోలమయినవి. కాళ్లకు కత్తులు మొలిచిన రైతాంగం దొరల ను ఎదిరించింది. జగిత్యాల, సిరిసిల్ల విప్లవ గానం అడవుల గుండా ఆదిలాబాద్‌కు ఎలుగ డై చేరింది. ఆ అడవులను వెలిగించిన ఇద్దరు మస్కిటీర్స్ నల్లా ఆదిడ్డి, శనిగరం వెంక ఎమ్జన్సీకి ముందే తాడిగిరి పోతరాజు, ఆవునూరి సమ్మయ్య, నరెడ్ల శ్రీనివాస్ ఇతర మిత్ర బృందాలతో కలిసి, పౌరహక్కుల సంఘాల సభలు, శ్రీశ్రీ రాక, పుస్తకాలు వేసిన చైతన్యం జమ్మికుంట ప్రాంతానిది. డెభ్బయవ దశ కం చివరి పాదంలో పీపుల్స్‌వార్ పార్టీకి ఎదిగివచ్చిన విద్యార్థి నాయకుడాయన.

ఎమ్జన్సీ నరకపు వాకిళ్లు, చిత్రహింసల లోగిళ్లుగా ఉన్న పోలీస్‌స్టేషన్లు, జైళ్లు ఆయన విప్లవ నిబద్ధతను తగ్గించలేకపోయినవి. పోలీసు లాకప్‌లు, చిత్ర హింసలు, జైలు జీవితం గడిచి ఎమ్జన్సీ ఎత్తివేసిన తర్వాత ఇదే విద్యార్థివీరులు గ్రామక్షిగామాన కాగడాలై వెలిగారు. విప్లవం అప్పటి యువతకు ఏకైక స్వప్నం. అక్కడి నుంచి ఆర్గనైజర్‌గా, వృత్తి విప్లవకారుడిగా మంథని ప్రాంతంలో పనిచేసినప్పుడు చందుపట్ల కృష్ణాడ్డి, మల్లా రాజిడ్డి, పోరెడ్డి వెంకట్‌డ్డి, నేను సహయోధులం. కవి గనుక, అప్పటికే పుస్తక ప్రపంచంతో మమేకమయినవాడు కనుక సాహు సహజంగానే అటు వీవీ కేంద్రం గా ఉన్న సృజన ప్రపంచంలోనూ, ఇటు మంచిర్యాల్‌లో అల్లం రాజయ్యతోనూ, కరీంనగర్‌లో భాగ్యనగరి విజయకుమార్, నారదాసు లక్ష్మణరావుతోనూ కలెగలిసి పనిచేశాడు. పార్టీ ఆదేశాలందుకొని కరీంనగర్ జిల్లా ఆర్గనైజేషన్ నుంచి ఆదిలాబాద్ గోండుల ప్రపంచంలోకి వెళ్లి, అక్కడి భాష నేర్చుకొని, పాటలు రాసి, గోండులకు, కొలామ్‌లకు భాష నేర్పి విప్లవ సృజనాత్మకతలో తొలిపొద్దుపొడుపయిన వాడు సాహు. ఇప్పుడు దండకారణ్యంలో సాహితీ వ్యవసాయం విప్లవం, ఏకే 47తో కలిసి నడుస్తున్నదంటే దానికి బీజం వేసిన వాడు సాహు.‘కన్నీటి కథ-నీటి కథ’, పెళ్లి కావాలి, కాయిదా, ఐదు రూపాయల కథ, భూమికొరకు, జెండా కథ, ఆకలి, నిర్ణయం, కి సింగార్ (అడివంటుకుంది), అమరుల రక్తం వృథాకాదు, నాడి, రక్తపింజెర, మరట్ తుడుంపాయానా (మనందరం తుడుంకొట్టాలె) ఒక తల్లి, పిల్లరక్కసులు లాంటి కథలన్నీ ఆయన ఆదిలాబాద్ జిల్లాలో తుడుం మోగించి ఉద్యమించిన స్వానుభవంలోంచి వచ్చిన కథలే. రేలారేలా పాటల్లోకి నాగరిక జనాన్ని ఆహ్వానిస్తూ రాసిన యుగయుగాలు కోల్పోయిన స్వేచ్ఛను మళ్లీ తెచ్చుకోవాలని ఇచ్చిన పిలుపు. గోండులు, ఆది వాసీలు, వారి జీవితాలు, సాహిత్యంలోకి వారి భాషను తెచ్చింది మొదట సాహు. ఇప్పటి దండకారణ్య సాహిత్య సృజన ఆయన వారసత్వమే.

అట్లాగే వెంకన్న రాసిన కవితలు, పాటలు. పాటల్లో పొదల పొదల గట్లనడుమ మంది నాల్కల మీద మంత్రమయిన కాలం ఒకటి ఉండేది. చివరి రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో అరెస్టు అయిన తర్వాత సాహు జనజీవనంలోకి వచ్చాడు. దేనికో ఆయన చిన్నబుచ్చుకుని విసిగిపోయి పార్టీని వదిలి, అడవిని వదిలి మాణిక్యాపూర్‌లో వ్యవసాయం చేస్తూ కూడా జనంలో కలిసి జీవించాడు. ఆ తర్వాత బహుజన రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలతో మమేకమై బీఎస్ రాములుతో కలిసి సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో పనిచేశాడు. అనేక ఇంటర్వ్యూలల్లో తాను బయటి జీవితంలో ఉన్నా సామాజిక జీవితంలోనే ఉన్నానని, ఇంకా అన్నార్తులు, అభాగ్యులు, అణగారిన వాళ్ల కోసం పెనుగులాడుతూనే ఉన్నానని చెప్పుకున్నాడు సాహు. ఒకప్పుడు హైదరాబాద్ రాంనగర్‌లో కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యం లో జరిగిన రాజకీయ తరగతుల్లో మేమందరం పాల్గొన్నప్పుడు కొండపల్లి కొమురంభీము ప్రస్తావన తెచ్చి చరిత్ర రాయాలని సూచించారు. ఆ చరివూతను నిజంగానే వెలికి తీసి, ఆదిలాబాద్ అడవుల్లో పనిచేసిన కాలంలోనే అల్లం రాజయ్యతో కలిసి ‘కొమురంభీము’ నవల రాసి ప్రపంచానికి భీము చరివూతను అందించి ధన్యమైనవాడు సాహు. ఆయన జీవనయా నం ఆగిపోయి పందొమ్మిదేళ్లు. సాహు మరి లేరు. ఆయన జ్ఞాపకం. ఆయన రచనల్లోనూ, అడవి పువ్వుల్లోనూ, పటార్‌ల మీది మారని జీవితాల్లోనూ, తుడుం మోతల్లోనూ సదా జీవించే ఉంటుంది. సాహుకు వర్ధంతి సందర్భంగా కన్నీటి నివాళి.

-అల్లం నారాయణ

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

Featured Articles