అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము


Sun,February 26, 2012 12:09 AM

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామందికి తెలియదు. నిన్నటికి నిన్న అసెంబ్లీ లైవ్ చూడడం వల్ల జ్ఞానంతో నా కళ్లు తెరుచుకున్నాయి. చంద్రబాబునాయుడు కొడుకు ఎంత గొప్పవాడో, కన్నా లక్ష్మీనారాయణ కొడుకు ఎందుకు గొప్పవాడో? ధర్మాన కొడుకుకు ఏమి ముట్టాయో? ముఖ్యమంత్రి ఇద్దరు సోదరులు ఏం చేస్తున్నారో? అసెంబ్లీ లేకపోతే తెలిసేది కాదు. ఇంత గొప్ప విషయాలు ‘ఫుల్’గా చర్చిస్తుంటే అసెంబ్లీ చూడడం మంచిది కాదని ఎలా అనుకోగలం. చంద్రబాబు కుమారుడు లోకేష్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారని, ఆ యూనివర్సిటీ చాలా గొప్పదని, ఎన్టీఆర్ మనుమడు కూడా అయిన లోకేష్ ప్రతిభాపాటవాలకి మెచ్చి ఆ యూనివర్సిటీ పిలిచి సీటిచ్చిందని, అయితే ఖర్చు మాత్రం కోటి దాటిందని తెలిసేదే కాదు. నిజమే ఆయనేమన్నా రెండెకరాల రైతు కొడుకా! కాదుగదా! తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి అలియాస్ సీఈవోగా పనిచేసిన చంద్రబాబు కొడుకాయె. దేశంలోకి సెల్‌ఫోన్లు తెచ్చిన మనిషాయె. అసలు కంప్యూటర్ అంటే అదేంది? అని అడిగే రాష్ట్రంలో మొత్తం కంప్యూటర్ డబ్బాలు నింపి, అందరినీ అర్జంటుగా ఫారెన్ పంపించిన రైతుబిడ్డాయె. ఇప్పుడంటే చంద్రబాబు అప్పుడప్పుడు రైతుల గురించి కూడా మాట్లాడుతున్నారు కానీ, జ్ఞానాన్ని వ్యాపారం చెయ్యొచ్చని కనిపెట్టిన అంతటి హై‘టెక్కు’ టమారాల ముఖ్యమంవూతిగా పనిచేసిన చంద్రబాబు కొడుకు చదువు ఖర్చంతా సత్యం రామలింగరాజు (చంచల్‌గూడ జైలులో కవిత్వం రాసిన భావుకుడు) భరించిందే. లోకేష్‌కు చదువురాదు కానీ, ఆయనను అమాంతం అమెరికా పంపించారని కోట్లకు కోట్లు ప్యాడింగ్ చేశారని గిట్టని వాళ్లు అనే మాట. చంద్రబాబు మద్యం చర్చ మధ్యలో తన ముద్దుల కొడుకు మీద పావురంతో, ఎదిగిన కొడుకు ఎంత ప్రయోజకుడో? చెప్పేదాకా తెలియదు కదా! అందువల్ల అసెంబ్లీ మరీ ఖరాబ్‌గ ఏమీలేదు.


అట్లాగే కన్నా లక్ష్మి నారాయణ కొడుకు సంగతి, ధర్మాన కొడుకు సంగతి మాత్రమే చర్చకొచ్చాయి. అది కొంత నా జ్ఞానానికి ఆటంకమైంది. పనిలోపని అసెంబ్లీలో కూచున్న ఎమ్మెల్యేలు, మంత్రుల కొడుకులు, వారి చదువు లు, ప్రయోజకత్వాలు, వాళ్లెంత గొప్పవారు, చిన్ననాడే వాళ్లెట్లా కోట్లతోనో ఉత్తగనో ఎంత ప్రయోజకులయినారో? చర్చకు వస్తే నా జ్ఞానతృష్ణ తీరేది. అంత గొప్పవారి కొడుకుల సంగతులు తెలుసుకుంటే ఎన్ని విషయాలని.. అయినా మద్యంమీద చర్చలో ఏం తేలి ఛస్తుంది. ‘పెప్’ ఉండాలి జిందగీ లో.. ఏదో ఒక పెప్.. చప్పచప్పగా మందుకొట్టని వాళ్లలాగా, అక్బరుద్దీన్ లాగా మద్యం చాలా హానికరం, పాల ధర ఇట్లా, మద్యం ధర అట్లా, మందు తో సమాజం మొత్తం సత్తెనాశ్నమైపోతంది అని మాట్లాడితే ఎవరు వింటరు. అసలు సిసలు అసెంబ్లీ ఇట్ల జరగాలె. లైవ్‌లు చూడాలన్నా.. టీఆర్‌పీ రేట్లు పెరగాలన్నా ఇట్లా కొడుకులు, వీలైతే కూతుళ్లు, వంశ చరివూతలు, వ్యక్తిగత మహోన్నత వ్యక్తిత్వాలు, ఒకరిని ఒకరు మర్యాదపూర్వకంగా అరుచుకోవడం లేకుండా అసెంబ్లీ నడిస్తే ఎవరికి లాభం.
కొట్టుకునే దాకా వస్తదేమొ అని కూడా అక్బరుద్దీన్ పాపం భయపడ్డడు. కానీ.. కొట్టుకుంటే తిట్టుకున్నంత మజా వస్తదా.. చంద్రబాబూ నీ తల్లి కడుపున ఎందుకు పుట్టానా? అనే డైలాగ్ వై.ఎస్. రాజశేఖర్‌డ్డి చనిపోయి ఇన్ని రోజులైనా ఆయన ఆసెంబ్లీలో నిలబడి నిమ్మళంగా మాట్లాడ్తున్నట్టు జ్ఞాపకం ఉందంటే తిట్టుకు ఉన్న పవర్ కొట్టుకు లేదని పాపం అక్బరుద్దీన్‌కు తెలువ ది.

అయినా చంద్రబాబుకు చెన్నాడ్డి నుంచి మంచి మంచి తిట్టు పసందు గా తిట్టిన వై.ఎస్ దాకా నచ్చారు కానీ ఎందుకో? ఈ నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి తిట్టడమే నచ్చనట్టున్నది. పాపం చంద్రబాబు తన అసంతృప్తి ప్రకటి స్తే కిరణ్‌కుమార్‌డ్డికి ఎవరన్నా ‘ట్రైనింగ్ ఇచ్చి, చంద్రబాబును పసందుగా తిట్టగలిగే నేర్పును ప్రసాదిస్తే బావుండు’ అని కూడా కొంత మనసు చివుక్కుమన్నది. నీచాతి నీచం అంటే అదే పెద్ద తిట్టా? చంద్రబాబూ నీ చరిత్ర నాకు తెలుసు. నీ చరిత్ర నాకు చెప్పకు మీ తెలుగుదేశం ఆఫీసుల చెప్పు అంటే అది చంద్రబాబుకు పెద్దగా ఆనలేదు. పెప్ లేదు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డి చాలా వీక్ అని చంద్రబాబు తీర్మానించేశారు కూడా..అసలు మద్యం మీద చర్చే ఎంత రంజుగా వుందో ఎవంత తిన్నారో? లెక్కలు చెబుతుంటే ప్రజలకు ఎంత జ్ఞానమో. ఆఖరికి ఏమి తేలుతుంది? అన్నది మాట్లాడే సందర్భమూ ఇది. మన రాష్ట్రంల సమస్యలు ఎప్పటికీ ఉండేటివే. ప్రజలు ఛస్తుంటరు. బతుకుతుంటరు. కరువులొస్తుంటయ్. వరదలొస్తుంటయ్. ప్రాజెక్టులు కావు. రావు. వస్తయి. ఎరువులు దొరకయి. నిరుద్యోగులు రోడ్ల మీద ఉంటరు. ధరలు పెరుగుతయి. రైతులు ఛస్తుంటరు. ఈ సమస్యలన్నింటినీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలలో తమ తమ కొడుకులను చదివించుకునే పెద్దపెద్దోళ్లు చర్చిస్తే దాంట్ల ఏమి ఉంటుంది. అందుకే మందు, అవినీతి, చంచల్‌గూడ, గనులు, ఎమ్మార్‌లు ఇట్లా తీసుకుంటే సభ మంచిగ నడుస్తది. ఎనిమిదిన్నర గంటలైనా మంచిగ సభల జోరుగ తిట్టుకుంటరు.

టీవీలల్ల మనమందరం మంచి ఫైటింగ్ సినిమా చూసినట్టు, నాట కం చూసినట్టు చూడవచ్చు. ఇంగ సమస్యలంటరా! అవి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడూ ఏడుపుగొట్టు మాటలే ఎందుకు? స్పీకర్‌ను చూస్తే అర్థం గాలేదా? ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నడో? భలే అనిపించింది. స్పీకర్ అసలే ఈ మధ్యలో చాలా సమస్యల్లో ఉండే. రాజీనామా చేసిన తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలు చెల్లవనాల్నాయె. జగన్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆపాల్నాయె. ఇష్టంలేని వాళ్ల రాజీనామాలు ఒప్పుకోవాల్నాయె. దీంట్ల స్పీకర్ కొంచెం బదనామ్ అయిండు. నిన్న అసెంబ్లీలో ఇటు చంద్రబాబు, అటు కిరణ్‌కుమార్ రెడ్డి అరుచుకుంటుంటే ఎంత ఖుషీగ కనిపించిం డో.. ఆయనెందుకు? ఎమ్మెల్యేలందరూ, మంత్రులూ టెన్షన్ తట్టుకోలేక అటు కొందరు, ఇటు కొందరు ఎట్ల మునిగాళ్ల మీద నిలబడి చూసిండ్రో.. అట్లుండాలె అసెంబ్లీ అంటే...
మరచిపోయిన. టీఆర్‌ఎస్ వాళ్లు పాపం ఈ ఎపిసోడంతా మిస్సయిం డ్రు. ఇంత గొప్ప గొప్ప విషయాలు మళ్లీ వినగలరా! అయినా క్రికెట్ రీప్లే లెక్క.. అన్ని ఛానళ్లల్ల ఇటు చంద్రబాబును.. అటు కిరణ్‌కుమార్‌డ్డినీ మార్చి మార్చి చూపిచ్చి ఛానళ్లు మస్తు చూపినయ్. గని..ఉప ఎన్నికల లొల్లిల పడి వాళ్లు చూసిండ్రో,చూడలేదో? ఏందో వాళ్లు తెలంగాణ అని తీర్మానం అని వాళ్లది మొండిపట్టు. తెలంగాణ సమస్య మీద అసెంబ్లీల చర్చ జరుగుతద ని వాళ్లకో నమ్మకం. ఎట్లయితది. ఇటు చంద్రబాబు ఉండె. ఆయనకు ముప్పయి మంది బానిసలు ఆయన మాట మీరరాయె. అటు కిరణ్‌కుమార్ రెడ్డి ఉండె ఆయన చుట్టూ చిన్నారి పొన్నారి లక్ష్మయ్య నుంచి పెద్ద పెద్ద గడ్డా లు మీసాలున్న పహిల్వాన్‌ల దాకా.. నైసు నైసుగ ఛాలెంజ్ చేసి ఒక్క ముక్క గుడుక అర్థం గాకుండా మాట్లాడేంత నైపుణ్యం గల్ల జానాడ్డిలాంటి తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగ వారికేం పని? తెలంగాణ బాధ ఆరేదా? తీరేదా? ఆర్సేదా? తీర్సేదా? ఇస్తనంటరు.

అంటే ఇస్తరా? తెస్తనం తెస్తరా? ఇవన్నీ నమ్మి ఎనిమిదివందల మంది చనిపోతే.. అంటే చనిపోతరు. తెలంగాణ ఒడువని తీరని శోకం కనుక అట్లనే చచ్చిపోతరు. కనుక అది కాదు అసలు చర్చ. దానిదేముంది? మాట్లాడుకోవచ్చు. దానిదేముంది ఆడుకోవచ్చు. దానిదేముంది మైమరపించవచ్చు. అందుకే గదా.. ఇట్లా మద్యం, గద్యం, తిట్ల పద్యం.. ఇది తెలంగాణ మాత్రమే చర్చ కావాలనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకీ అర్థం గాదు. వాళ్లట్లా బహిష్కరిస్తూనే ఉంటరు. కని, ఇట్లా చంద్రబాబు చరిత్రా, కిరణ్‌కుమార్‌డ్డి చరిత్రా ప్రజలకు ఎట్లా తెలువాలె. మళ్లీ ఇంత అందమైన భాషలో ఎట్లా తెలవాలె. అందుకే రెండు రోజు ల నుంచి పత్రికలకు పండుగ. అసలు సిసలు అసెంబ్లీ ఇప్పుడే మొదలయిం ది అని కూడా అవి రాస్తున్నవి.. అయినా కొలువాకుమ్మరియ్య ఇన్నెందుకు? తెలంగాణ మాట ఎత్తకూడదనే .. తెలంగాణ చర్చ రాకూడదనే.. తెలంగాణ తీర్మానం సభలో పెడితే బండారం బయటపడుతుందనే కదా ఇదంతా.. అర్థం చేసుకోరూ.. అసెంబ్లీ ఒక నాటకంలాగా నడవాలి. ఒక సినిమాలాగా నడవాలి. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి వారి వారి బానిసలు సల్లగుండా లి. బాబూ మీరు హాయిగుండాలి. తెలంగాణ మాత్రం బాంబులు కురిసిన నేల వలె బీడుపోవాలె. తెలంగాణ కోసం ఏడ్చేవారి కోసం ఏడ్చేవావరు? కామ్రేడ్ నారాయణ అంటే అన్నడు. అసెంబ్లీ బందెలదొడ్డి అని.. మరో కామ్రేడ్ అసెంబ్లీలు, పార్లమెంటులు బాతాఖానీ క్లబ్బులూ అని అంటడు. అంతకంటే ఎక్కువ ఆశించి వారి భంగపాటుకు ఎవరేం చేయగలరు. తెలంగాణ కూడా అసెంబ్లీ గడపమీద నిలబడి బానిసకొక బానిసలను న్యాయమడిగితే దొరుకుతదా? దొరుకది.. దేని తొవ్వ దానిదే.. అసెంబ్లీ.. సల్లగుండాలె.. వారి వారి తిట్లూ సల్లంగుండాలె.. ప్రజాస్వామ్యమూ ఇట్లాగే పరిఢవిల్లాలె. అయితే హెచ్చరిక. ఎనిమిదివందల మంది బలిదానాల నెత్తుటి చారికలు కనబడకుండా జాగ్రత్త పడాలె.

-అల్లం నారాయణ

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...