పాలకుర్తి పలవరింత


Sat,January 7, 2012 11:49 PM

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు అక్కరకు రాని, పనికిరాని విషయాలనీ భావించే వాళ్లుంటారు. కానీ సంస్కృతిని విధ్వంసం చేస్తేనే మరో సంస్కృతి పాదుకుంటుందని, ఆధిపత్యం సంస్కృతీ మూలాల ధ్వంసంలో ఉంటుందని చంద్రబాబు లాంటి వాళ్లకు బాగా తెలుసు. ఆయన సీమాంధ్ర ప్రతినిధి. పాలకుర్తిలో ఆయన ఆధిపత్య సంస్కృతీ పతాక ఎగరేసే ప్రయ త్నం చేశారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న కిరణ్‌కుమార్‌డ్డి, చిరంజీవి, బొత్స సత్యనారాయణలతో పాటు, ఇక్కడ పాతుకుపోయి ఆధిపత్యం చెలాయిస్తున్న ఛప్పన్నారు ఆంధ్రా కార్పొరేట్లు, ఉద్యోగాలు కాజేసి సచివాల యం నిండిన ఆంధ్ర అధికారగణం, సమైక్యాంవూధులందరికీ, తోడు మీడి యా తరఫున చంద్రబాబు పాలకుర్తిలో ఒక జెండా పాతడానికి ప్రయత్నిం చి భంగపడ్డారు. అందుకే ఆయన ఒక అధీకృత హింసకు ప్రతినిధిగా పాలకుర్తి వెళ్లారు. గుప్పెడు మంది పెట్టుబడిదారుల తరఫున, ‘తెలుగుదేశం పార్టీ పేరిట’ ప్రజాస్వామ్యయుతంగా, అయిదువేల మంది పోలీసులు, అయిదువేల మంది చంద్రదండు తో కూడిన వందల కార్ల కాన్వాయి వెంటరాగా ఆయన పాలకుర్తి అనే ఒక తెలంగాణ ప్రతీకను చెరిపివేసే ప్రయత్నం చేశారు. చెప్పులు చూపినా, బూట్లు విసిరినా,, రాళ్లు, కోడిగుడ్లు విసిరినా, తొక్కుకుంటూ, తోసుకుంటూ, కొట్టుకుంటూ చంద్రబాబు పాలకుర్తిలో పాదం మోపారు. అదీ సమస్య. చంద్రబాబు హెర్మాన్ గోరింగ్ వారసుడు. గోరింగ్ హిట్లర్ బంటు. ‘సంస్కృతి అనే పదం ఉచ్ఛరిస్తేనే నా చెయ్యి రివాల్వర్ మీదకు పోతుంది’ అని ప్రకటించుకున్నవాడు. గోరింగ్ సమయాల్లోనే పాలకుర్తి ఐలమ్మ తన పంటను కాపాడుకోవడానికి దొరల మీద తిరగబడింది. గడీల మీద యుద్ధం ప్రకటించింది. ఆమె ఇప్పటి తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ప్రతీక. ఆ ఉద్యమం లేదని ప్రకటించడానికే, తెలంగాణలో అంతా సజావుగా ఉంది ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చు, గవర్నర్ నరసింహన్ కేంద్రానికి ఈ క్లిప్పింగులూ, సమాచారం ప్రకటించి పంపించుకోవచ్చని చెప్పడానికే చంద్రబాబు పాలకుర్తి వెళ్లారు. ఆయనకు బమ్మెర పోతన తెలియదు. పోతన భారతం రాసిండా? భాగవతం రాసిండా? తెలిసే అవకాశం లేదు. చేతి లో ఒక కాగితం పట్టుకొని ఎవరో రాసిచ్చిన మూడుపేర్లు ఆయన చదివి ఉండవచ్చు. అయినా సంస్కృతికి, చరివూతకు, సమాజానికి సంబంధించిన ‘ఇజా’లు పనికి రావని, ఇజాలన్నింటికన్నా టూరిజం గొప్పదని ప్రకటించిన చంద్రబాబు చేత స్థానిక అంశాలను పలికించాలని భావించిన వారిది తప్పు. పాపం చంద్రబాబుకేమి తెలుసు మల్లెపూల సుగంధం.

ఆయన ఏ భావుకతలూ లేని పాత ఏలిక. అందువల్ల ఆయన ఒక గోరింగ్‌లాగా, ఒక విసునూరు దేశ్‌ముఖ్‌లాగా, ఒక ప్రపంచబ్యాంకు ప్రతినిధిలాగా ఉండగల డు. కానీ పోతన గురించి చెప్పితే... ఎట్లా? పోతన భారతం రాసిండన్న వారికి పాల్కురికి సోమనాథుని సంగతి చెబితే ఎట్లా? దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు ఒక సంస్కృతికి సంబంధించిన ఆధిపత్య భావనల ప్రతినిధిగా అధికారంలోకి వచ్చినవాడు. కనీసం ఆయన మామ ఎన్టీఆర్ ఆయన కడుపుకూ, కాలుకు రాని ఒక తెలుగుజాతి ఆత్మగౌరవం అనే అమూర్త భావనతో, రాజ్యాధికారానికి రాగలిగారు. కాంగ్రెస్ ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా తెలుగుజాతికి ఒక జనాకర్షక ఊహను, మీడియా సహకారంతో పెంచి పెద్దది చేసి రాజ్యాధికారానికి వచ్చినవాడు. కానీ ఆయన సంస్కృతంలో మాట్లాడి తెలుగుజాతి ఆత్మగౌరవం అనే సాంస్కృతిక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి అధికారంలోకి రాగలిగినవాడు. అందుకే ఆయన చనిపోగానే అర్జంటుగా దురదృష్టవశాత్తు కరీంనగర్‌కు కూడా దారి చూపే విగ్ర హం అయ్యాడు. అదీ ఆధిపత్యం సమస్య. వాళ్లు పాతుకుపోతారు. కానీ, సంస్కృతి అంటేనే సరిపడని చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి వైస్రాయ్ కుట్రలు జరిపి (అ)వూపజాస్వామ్యయుతంగా రాజ్యం చేజిక్కించుకున్నవాడు. అందువల్ల ఆ విషయంలో చంద్రబాబును పోతన కోసం క్షమించవచ్చు. కానీ ఒక చిత్తూరు చంద్రబాబునాయుడు, ఒక గుంటూరు కోడెల శివవూపసాదరావు, ఒక ఒంగోలు కరణం బలరామ్, వేలాది మంది అనంతపురం, విశాఖలాంటి సీమాంధ్ర ప్రాంతాల చంద్రదండుతో పాలకుర్తికి రావడమే ఇప్పుడు అసలు సమస్య. చంద్రబాబుకు విసునూరు దేశ్‌ముఖ్‌కున్న తెలివితేటలున్నాయి. విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ‘బందగి చిందిన రక్తం తెలంగాణ బరిగీసిన పోరాటం అయ్యింది. బందగి న్యాయస్థానంలో భూమిని గెలిచిండు. కానీ విసునూరు దేశ్‌ముఖ్ బందగీ మీదకు తన తొత్తు, బంటు, బానిస అబ్బసలీని ప్రయోగించిండు. చంద్రబాబు అంతే ఒక ప్రతీక లాంటి పాలకుర్తికి, ఆ దారి పొడవునా, తొవ్వ పువ్వుల తీరు ఉండే అమరుల జ్ఞాపకాలను మలినపరుస్తూ కడ దేవరుప్పల, సీతారాంపురం, లక్ష్మక్క పల్లె నుంచి పాలకుర్తి దాకా అడుగుపెట్ట గలిగిండు. ఇక్కడ ఆయన తెలంగాణ మీద, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రతీకల మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ కోసం ఆత్మార్పణలు చేసుకున్న ఏడువందల మంది బలిదానాల మీద, రాయి విసిరిన పోరాటకారుని మీద, బూటు విసిరిన తెలంగాణవాది మీద, తెలంగాణ ఆకాంక్షల మీద స్థానిక అబ్బసలీలను ప్రయోగించిండు. ఆ అబ్బసలీలు చిత్తూరు చంద్రబాబునాయుడు, ఒంగోలు కరణం బలరామ్, గుంటూరు కోడెల శివవూపసాద్‌ల బూట్ల మీద కూచొని తెలంగాణను చెరబట్టిన విద్రోహులయ్యారు. ఎవరా? అబ్బసలీలు. తెలంగాణ సమాజం గుర్తించలేదా?

బందగీ న్యాయస్థానంలో గెలవగలిగాడు. కానీ అబ్బసలీ దొంగదెబ్బ తీశా డు. అబ్బసలీ దేశ్‌ముఖ్ పావు. బాంచె. తెలంగాణ పార్లమెంటులో ప్రకటన చేయించుకున్నది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. చంద్రబాబునాయుడు ఆ ప్రకటన వచ్చీరాగానే సీమాంవూధను కూడగట్టి, ఒక్కరోజులో మాటమార్చి తెలంగాణకు అడ్డం పడ్డడు. ఇది పచ్చి నిజమే. తెలంగాణ ప్రకటన వచ్చేదాకా తెలంగాణ అన్న చంద్రబాబు, తీరా వచ్చినాక అడ్డం పడి ఆగంజేసిండు. ఆయన విసునూరు దేశ్‌ముఖ్‌లాగే నేరుగా తలపడడు. ద్వంద్వ యుద్ధం చెయ్యడు. ఆయనకూ అబ్బసలీలు ఉన్నరు. బంద గీ చిందిన నెత్తుటి ద్రోహం. ఏడువందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు. పాలకుర్తి దారిలో తెలంగాణవాదులు చిందించిన నెత్తురు. ఇక్కడి అబ్బసలీల ద్రోహం వల్లనే చరిత్ర పునరావృత్తమవుతుంది. ద్రోహంలాగా.. కానీ కనిపెట్టి ఉండే తెలంగాణ అబ్బసలీల మీదనే కాదు, అపర విసునూరు దేశ్‌ముఖ్ మీద కూడా బూటు విసురుతుంది. మొండ్రాయిల ముప్పయి ఎకరాల భూమి లంబాడీలది. అలనాడు కఠారు రామచంవూదరావు ఆ భూమిని ఆక్రమించుకున్నడు. ఆయన వెంట యాభై మంది పోలీసు బల గం. మొండ్రాయి భూస్వాములందరూ రైస్ మిల్లులో సమావేశమయ్యిం డ్రు. కానీ ప్రజ. మన్‌పాడు, గొల్లపల్లి, దేవరుప్పల, కడ సీతారామపురం, మడిపడగల నుంచి ఐదువేల మంది ప్రజలు.. యాభై మంది నిజాం పోలీసులు, 30 ఎకరాల భూమిని చుట్టుముట్టింది ప్రజ. లంబాడీ తండాల్ల లడాయి ఇది. ఐదువేల మంది పోలీసులు, వందలాది కార్లు, ముప్ఫైదికిపైబడి అబ్బసలీలు, బంట్లు, వేలమంది చంద్రదండుతో పాలకుర్తికి చంద్రబాబు దండయాత్ర. తెలంగాణ ఒక స్వప్నం. అది తీరని స్వప్నం కాదు. కానీ పాలకుర్తిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఒక సంస్కృతీహీన, ఆధిపత్యం వర్గపు ప్రతినిధి, ప్రపంచబ్యాంకు ఏజెంటు, తెలంగాణ విధ్వంసకుడు, పాదం మోపిన మన ప్రతీకను మనం కాపాడుకోవడానికి పాలకుర్తి ప్రక్షాళన కావాల్సి ఉన్నది. మొండ్రాయిలాగా.. తెలంగాణ వర్తమాన ఉద్యమంలో చేపలు ఎదుక్కినట్టుగా జనం పాలకుర్తికి ఎదుక్కాలని కలగంటున్నారు. మన ప్రతీకలను మనం కాపాడుకోవడానికి, మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి మన అభిజాత్యాన్ని మనం కాపాడుకోవడానికి మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడానికి చాకలి ఐలమ్మ స్మతిని కాపాడుకోవడానికి... లక్షల మంది పాలకుర్తికి వెళ్ళి, దండుకట్టిన అబ్బసలీల మీద దండోరా మోగించాలని ఒక కల కంటున్నా... పాలకుర్తిని పలవరిస్తూ.. పలవరిస్తూ.. ఆయన నమ్మిన బంట్లు అబ్బసలీలు పాలకుర్తిపై దండె త్తి ఒక ఆధిపత్య, అధీకృత హింస సంస్కృతిని ప్రవేశపెట్టారు. తెలంగాణ పోరాటం అంటేనే ఆధిపత్య, అధీకృత హింసకు వ్యతిరేక పోరాటం. కనుక తెలంగాణ పోరాటం కొనసాగాలి.. కొనసాగాలి.. కొత్త రజాకార్ల మీద ద్రోహులైన అబ్బసలీల మీద.

-అల్లం నారాయణ

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...