తెలంగాణ పోరు సాగుతుంది...


Sun,November 20, 2011 12:37 AM

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇస్తరు నుంచి ‘ఇంకెక్కడి తెలంగాణ’ దాకా ఇప్పుడు చర్చ నడుస్తున్నది. సామా న్య ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు ఈ ప్రశ్నలు అడిగితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఉద్యమానికి బాధ్యత వహిస్తున్న, నాయకులమని చెప్పుకుంటున్న వారు కొందరు, కరుడుగట్టిన తెలంగాణవాదులమని వాదులాడే కొందరు కూడా సరి గ్గా కొంచెం మెరుగైన భాషలో ఇవే ప్రశ్నలు వేయడం ఆశ్చర్యమే. ‘ఇంకెక్కడి తెలంగాణ’ అనేది ఒక రకంగా స్వీయ ఆకాంక్షలాంటిది. తెలంగాణ ఉద్యమ స్వరూప స్వభావాలు తెలియని వారు, అంతిమంగా ఇలాంటి ఉద్యమాలు విఫ లం అవుతాయన్న స్వీయ అంచనాలకు వచ్చినవారు అలాంటి అంచనాలతో ఇప్పుడు ఈ చర్చ చేస్తున్నారు. కానీ.. నిజంగానే తెలంగాణ ఉద్యమం చల్లబడిందా? వరిగడ్డి మంటలా ఎగయడం, చప్పున చల్లారడం మాత్రమే ఈ ఉద్య మ లక్షణమా? అనేది అసలు ప్రశ్న. ఉద్వేగాలకు అనుగుణంగా, రోజువారీ, లేదా సంఘటనల వారీ ఉద్యమాన్ని అంచనా వేసేవారిలో ఈ గాభరా ఎక్కువ. చల్లారిందని చప్పున చల్లారిపోయేవాళ్లు, వేడెక్కిందని విర్రవీగేవాళ్లు సమానమే. అవి ఉద్యమ దశలు. అది నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్య మం ఒక క్రమంలాగా మళ్లీ మళ్లీ మొలకెత్తిన ఉద్యమం. పడి లేచిన కెరటంలాగా మళ్లీ లేచినిలబడిన ఉద్యమం. ఆకాంక్ష చల్లారలేదు. అస్తిత్వ వేదనా చల్లారలేదు. అది 1952లో రాష్ట్రం ఏర్పడకముందే ‘గైర్ ముల్కీ’ నినాదంతో ప్రారంభమైంది. 1969లో మహా ఉద్యమం అయింది. కానీ ఆగిపోయింది. ద్రోహం కావొచ్చు. అప్పటి పరిస్థితులు కావొచ్చు. ఉద్యమం కొనసాగించడం ఎలాగో తెలియని రాజకీయ, ఉద్యమ నాయకత్వ వైఫల్యం కావొచ్చు. కానీ.. అప్పుడ ది.. అక్కడే ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నాలు జరిగాయి. పదహారేళ్ల క్రితం నుంచి అది ఒక భావజాల వ్యాప్తి రూపంగా తెలంగాణలో మళ్లీ వ్యాపించింది. 2001లో రాజకీయ పార్టీ రూపం కూడా తీసుకున్నది. అప్పటి నుంచి అది జాతీయస్థాయిలో తెలంగాణ ఎజెండాగా మారింది. ఇవ్వాళ్లటికది 2009లో ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందనే’ పార్లమెంటులో ప్రకటన దాకా ఎదిగింది. అప్పటి నుంచీ నిజంగా ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం, ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తూ, రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమన్న పూర్తి స్పృహతో శాంతియుతంగా, సృజనాత్మకరూపాల్లో చరిత్ర సృష్టిస్తూ నడిచింది. నిజానికి నడుస్తూనే ఉన్నది. అది గతం కాదు.

వర్తమానం కూడా. తెలంగాణ కోసమే ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికిప్పుడు ఎనిమిది జిల్లాల్లో భారీగా పాదయావూతలు జరుపుతున్నది. ఇవ్వాళే న్యాయవాదులు డీజీపీ ఆఫీసును ముట్టడించారు. ‘పీడీ’ కేసులను ఎత్తివేయాలని, చెరుకు సుధాకర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేశారు. గద్దర్ మండలస్థాయి లో సమావేశాలు పెడ్తూనే ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. విమలక్క ప్రయత్నంలో ఆమె ఉంది. నిన్న ప్రజాసంఘాల రౌండ్ జరిగింది. ప్రెస్‌క్లబ్‌లో విశాలంధ్రవాదుల విలేకరుల సభను ఇవ్వాళ్ల తెలంగాణ జర్నలిస్టుల ఫోరం బహిష్కరించింది. మరి ఎందుకని ఇంకెక్కడి తెలంగాణ అనిపిస్తున్నది. ఉద్యమం మహా ఉధృతంగా జరిగి, మళ్లీ పాదయావూతల దాకా వచ్చిందనా? ఇటె్లైతే ఎట్లా వస్తుందనా? అసలు సమస్య ఏమిటి? తెలంగాణ ఉద్యమ స్వభావంలోనే పరిమితులున్నాయి. అసలు తెలంగాణ సమస్యే కొన్ని పరిమితులతో కూడుకున్నది. నిజమే సాయుధ పోరాటం పిలు పో? తుపాకులు పట్టాలన్న పిలుపో ఇవ్వగలిగిన పోరాటం కాదిది. అనివార్యంగా ఒక రాజకీయ ప్రక్రియ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడం ద్వారా మాత్రమే తెలంగాణ సాధించుకోగలం. దానికి జరగాల్సింది ప్రజాస్వామ్యపద్ధతుల్లో, నిజంగానే శాంతియుత పోరాట రూపాల్లో తెలంగాణ ఉద్యమం జరగవలసి ఉన్నది. లేదంటే ఒక్కసారే ఎగిసి చప్పున చల్లారే స్థితి రావొచ్చు. సకల జనుల సమ్మెను ఒక వైఫల్యంగా చిత్రిస్తున్నవాళ్లూ ఉన్నారు. దాన్ని సర్వజనుల సమ్మెగా మార్చలేదనే వాళ్లూ ఉన్నారు. సకల జనుల సమ్మెను ఉధృ త రూపంలోకి తీసుకు హైదరాబాద్ ముట్టడి పెడితే తెలంగాణ వచ్చి తీరేది కదా! అన్నవాళ్లూ ఉన్నారు. ఇట్లాంటి విమర్శలకు మూలం ముందు తెలంగాణ ఉద్యమ స్వరూప స్వభావాల మీద ఎవరి అంచనాలు వాళ్లకు ఉండడమే కార ణం. ఈ అంచనాల మేరకు ఎవరికి వారు ప్రత్యేక తెలంగాణ కార్యాచరణలో ఉన్నారు. ప్రత్యామ్నాయం మాట్లాడేవాళ్లు తమ అంచనాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పోరాటాలు నిర్మించకపోవడం కూడా వైఫల్యమే.

అందుకు ఒకరి పంథాను మరొకరు విమర్శించుకోవడం తప్ప, ఎవరి పని వాళ్లు చెయ్యకపోవడం మరోకారణం. అట్లని ఐక్యత మాటల్లో భిన్న కార్యాచరణ చేతల్లో ఉండడం కూడా కారణం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతోనే ప్రజాస్వామ్య తెలంగాణ సిద్ధించాలని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతోనే సామాజిక తెలంగాణ ఆవిర్భవించాలని ఆకాంక్షించే వాళ్లూ ఉండనే ఉన్నారు. అస్తిత్వ ఉద్యమాల ప్రధాన లక్షణం, ప్రజలు ఈ ఉద్యమం వెంట నడవడానికి ప్రబలమైన కారణం ఉమ్మడి అస్తిత్వ భావన మాత్రమే. తెలంగాణ, ఆంధ్ర విలీనం కారణంగా ఏర్పడిన ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ ప్రాంతం అస్తిత్వం కోల్పోయి అంతర్గత వలస ఆధిపత్యంలో సహజంగానే వనరులు, సంస్కృతి, చరిత్ర కోల్పోవడం పరాధీనం కావడం అనేది ఇక్కడ అసలు సమస్య. ఒక ప్రాంతంగా తెలంగాణ వలసాధిపత్యంలో కోల్పోయిన వనరులను, రాజకీయ, సాంస్కృతిక , సామాజిక అస్తిత్వా న్ని తిరిగి పొందడం అనేదే అసలు సమస్య. దానికి తోడు ఆంధ్రవూపదేశ్ ఏర్పడినప్పటినుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతం మీద ఆధిపత్యం, దోపిడీ మరింత మరింత పెరిగిందే కానీ ఉపశమనం లేదు. చివరికి తెలంగాణ వాళ్లు తెలంగాణ ప్రాంతంలోనే రెండవ శ్రేణి పౌరులు కావడం దాకా అది ఎదిగింది. ఈ అసలు సమస్య పరిష్కారం కావడానికే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. లింగ,కుల, మత, సాంస్కృతిక, సామాజిక ఇతర అస్తిత్వాలన్నీ, ఒకే అస్తిత్వంగా రూపు దిద్దుకున్న ఉమ్మడి అస్తిత్వ భావనే తెలంగాణ. ప్రధాన సమస్య అదే అయినప్పుడు ఆ సమస్యకు అటు రాజకీయ ఉద్యమ లక్షణమైన ప్రజాస్వామ్య ఆకాంక్ష స్వరూపాన్ని, ఇటు సామాజిక న్యాయాన్ని జోడించడం వల్ల ఉద్యమ అసలు లక్షం గందరగోళంగా రూపుకడ్తున్నది. ఏ ప్రధాన సమస్యను పరిష్కరించడానికి ఉద్యమం ప్రారంభమైందో ఆసమస్య పరిష్కారం కాకుండానే ఈ ఉద్యమం స్వయంగా పరిష్కరించజాలని ఇతర అంశాల కోసం, అవి ప్రత్యేక పోరాటాలని గుర్తించ నిరాకరించడం వల్ల కొత్త సమస్యల్లోకి పోయి దానికదిగా ఒక ఉద్య మ సమస్యగా తయారయింది. ఇతర అస్తిత్వాల సమ్మెళనమే ఉమ్మడి అస్తిత్వ భావన విడివిడిగా ప్రపంచవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా అస్తిత్వ స్పృహ పెరిగిన కాలంలో జీవిస్తున్నాం. కానీ ఈ అస్తిత్వాలన్నింటి ప్రత్యేకత కాపాడుకుంటూనే ఉమ్మడి అస్తిత్వ భావనగా తెలంగాణను చూసినప్పుడు మాత్రమే ఉద్య మ స్వభావం అర్థమవుతుంది.


పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడం అనే ఒక రాజకీయ ప్రక్రియ ఇమిడి ఉన్నందున రాజకీయ పార్టీ అనివార్యమయింది. ఆ రాజకీయ పార్టీకి ఒక ప్రణాళిక ఉంది. దానికదిగా ఒక వ్యూహమూ, ఎత్తుగడలను ఎంచుకున్నది. కానీ, తెలంగాణ ఇప్పటి సమస్య ఏమిటంటే.. భిన్న అస్తిత్వాల ఆధారంగా , సైద్ధాంతిక లేదా ఆచరణాత్మక సమస్యల వల్ల బహుళ నాయకత్వం ఎదిగింది. ఈ బహుళ నాయకత్వం ఒక వేపు ఒక్క ఎజెండాగా తెలంగాణ అని ప్రతిపాదిస్తూ నే, భిన్న ఎజెండాలను, కార్యాచరణను ముందుకు తోస్తున్నది. నిజమే తెలంగాణ ఒక విస్తృతిగల సమస్య. కానీ ఆ విస్తృతి గల కార్యాచరణలో కూడా ఐక్యత అనేది సాధ్యం కావడం లేదు. ఐక్యత గురించి మాట్లాడే వాళ్లెవరైనా తమ నాయకత్వం కిందనో? తమ సంస్థల నాయకత్వం కిందనో ఐక్యత సాధ్యమని నమ్మగా, తమ కార్యాచరణమావూతమే అసలైనది, ఇతరుల కార్యాచరణ పనికిరానిదన్న విమర్శలు చెయ్యడం, సంఘర్షణ పడడం, ఇట్లాంటి కారణాల వల్ల భిన్న అస్తిత్వాల ఐక్యత అసాధ్యమవుతున్నది. ఆధునికానంతర యుగంలో ప్రజా ఉద్యమాలకు చెడుగులు, వ్యక్తి ప్రాబల్యం, ఉద్యమాలు తెచ్చే కీర్తి కండూ తి, కొండొకచో స్వల్ప అధికారలాలస ఇవన్నీ తెలంగాణ ఉద్యమానికి మినహాయింపులు కావు. దానికి తోడు ఉద్యమ ప్రస్థానంలో లోపాలు ఎంచడం తప్ప వైఫల్యాలు ఎంచడం తప్ప ప్రత్యామ్నాయ నిర్మాణాల ఓపిక ఎవరికీ లేదు. ‘సీమాంవూధుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి’ అని పిలుపైతే మొత్తం తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది. ఇస్తాం. కానీ ఎవరు దెబ్బకొట్టాలి? ఉద్యమాన్ని ఆ దిశగా నడిపించడం సాధ్యమేనా? ఉద్యమస్థితి అట్లా ఉందా? హైదరాబాద్ ముట్టడి గురించి మాట్లాడేవాళ్లు, ఈజిప్టును, ఇతర సహారా దేశాలను మనసులో నింపుకున్నవాళ్లు. కానీ.. ఒకసారి ఇట్లాంటి పరిస్థితుల్లో అది సాధ్య మే అయితే ఆ పిలుపు ఎవరైనా సరే ఒకరు ఇవ్వకున్నా ప్రత్యేకంగా విడివిడిగా పనిచేస్తూ ఇవ్వవచ్చు. అట్లాగే ఆర్థిక మూలాలను దెబ్బకొట్టవచ్చు. అది ల్యాంకోహిల్స్‌పై దాడి, జీఎమ్మార్‌పై దాడిగా పరిణమించవచ్చు. కానీ అట్లయితేనే ఉద్య మం సాగినట్టు అనుకోవడమే ఒక వైచిత్రి.

మొత్తంగా ఉద్యమం ఒకవేపు బహు ళ నాయకత్వ ధోరణులు ఇంకొకవేపు ఈ ఉద్యమానికి అన్యధోరణులు. అయినంత మాత్రాన ఉద్యమం ఆగినట్టా? మూల కారణం అయితే అట్లాగే ఉంది. వనరుల దోపిడీ మరింత పెరిగింది. వివక్ష మరింత పెరిగింది. ఇప్పటికీ స్వీయ రాజకీయ అస్తి త్వం ఏర్పడలేదు. ఏ సమస్యా పరిష్కారం కాలేదు. అయినా ఉద్యమం ఆగుతుందని అనుకోవడం దేనివల్ల. తెలంగాణ సమస్యకు ఈసారి పరిష్కారం రాష్ట్రం ఏర్పాటు మాత్రమే. దానికి మరో దారి లేదు. ఉద్యమంలో లోపాలు ఉండకపోవు. ఎత్తు పల్లాలు ఉండకపోవు. ఉత్థానపతనాలు ఉండకపోవు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత రూపాలలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి వెనుక దారిలేదు. పడినా, లేవడమే. లేచి నిలబడడమే. నిర్ణయాలు మన చేతుల్లో ఉండవనడం తప్పు. రాజకీయ ప్రక్రియే పరిష్కార మయినా ప్రక్రి య కోసం ఒత్తిడి తేవడమే లక్షంగా ఉద్యమం కొనసాగుతూనే ఉండవలసి ఉన్నది. తెలంగాణది ఆఖరి పోరాటం కాదు. అంతిమ పోరాటం కాదు. తెలంగాణ సాధించుకునేదాకా ఆగకుండా సాగే పోరాటం. సమస్య గర్భంలోనే పరిష్కారం దాగి ఉంది. కల్లోల సరస్సులో వికసించిన వజ్రం తెలంగాణ. కల్లోలం పరిష్కారం కావాలంటే తెలంగాణ రావడం ఒక్కటే మార్గం. అప్పటిదాకా ఉద్యమం సాగుతుంది.

-అల్లం నారాయణ

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఎవరూ వ్యక్తి కాదు. ఆయన చట్టసభల ప్రతినిధుల బందానికి, ముఖ్యంగా రాష్ర్టాన్ని ఏలే మంత్రివర...

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఏమంటారు! సోమవారంనాడే ఎపీఎన్జీవోల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసు అధికారులు ప్రకటించారు. నిషేధాజ్ఞలు...

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిలబడడానికి యత్నించాలె. తమ మైండ్ సెట్ మార్చుకోవాలే తప్ప బిల్లు ముసాయిదాలో లోపాలు ఉన్నాయనీ, తమకు అన్యాయం జరుగుతున్నదని మొత్...

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా ఇవాళ ఇస్రో అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్నదీ అంటే నంబి బృందం ఆనాడు వృద్ధి చేసిన వికాస్ ద్రవ ఇంధన ఇంజన్‌లే కారణ...

స్వయంకృతం

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బాబు నుంచి సభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను తప్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యూహం ఏమై ఉంటుంది? ఈ సందేహాల సంగతి ఎట్లా ఉన్నా ఒ...

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆపద్ధర్మ ప్రభుత్వాలే. ఈ మాత్రం మహద్భాగ్యానికి ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చవలసిన అవసరం ఉన్నదా! ఇటువంటి నిష్ఫ...

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్రా పాలకవర్గాల అవశేషాలు ఇంకా మిగిలే ఉంటాయి. అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటాయి. వీలైతే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా తెలంగాణ...

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానానికి లేదా చర్చకు సంప్రదాయమని నామకరణం చేసి ఇక్కడ అమలు పరచాలని కోరుతారట! సూటిగా చెప్పాలంటే- ఆ ఉత్తరాది నాటకాన్ని ఇక్కడ కొత్త...

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీరు మీ చీకటి మనస్తత్వాల వల్ల పరుచుకునియున్న వెలుగును గుర్తించ నిరాకరిస్తున్నారు. చివరకు మీరు బైబిలునూ ప్రేమించరు. నమ్మినా...

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలుసు. కానీ ఇంత నటనా ప్రతిభ ఉందని ‘తెల్వకండా’ పోయినందుకు చింతించవచ్చు. కిరణ్ ఇంత ద్విపావూతాభినయం చెయ్యగలడని కూడా ముఖ్యంగా స...

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధాన స్రవంతి రాజకీయవేత్తలు సాధారణంగా డొల్లగా మాట్లాడతారు. ఏదైతే ఉన్నదో, తెలియజేసుకుంటున్నాను, ఈ సభా ముఖంగా చెప్తూ ఉన్నాను ...

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వెంక వయసప్పుడు పదిహేనేళ్లు. చిన్న పిల్లవాడే. టెన్త్‌క్లాస్. ఇప్పుడు ఇంటర్. కానీ ఇప్పటికీ అతని మ...

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్తూనూ రొదలా వెంబడించే జోరీగల సంగీతంలో నిలు పెరిగిన గడ్డి నిండిన వనాలను సంచారిలా చుట్టినవాడు వెంకన్న. కరీంనగర్ జిల్లా హుజు...

విధ్వంసమూ.. వర్తమానమూ...

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా.. 17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో కవిత. కోటకు నలువైపులనే కాదు/వీలైన అన్ని చోట్లా డైనమెట్లు పేల్చి కూల్చనిదే/ దానిగుండె మన పిడికిట్లోకి రాదు -చెరబండరాజ...

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామందికి తెలియదు. నిన్నటికి నిన్న అసెంబ్లీ లైవ్ చూడడం వల్ల జ్ఞానంతో నా కళ్లు తెరుచుకున్నాయి. చంద్రబాబునాయుడు కొడుకు ఎంత గొప...

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు అక్కరకు రాని, పనికిరాని విషయాలనీ భావించే వాళ్లుంటారు. కానీ సంస్కృతిని విధ్వంసం చేస్తేనే మరో సంస్కృతి పాదుకుంటుందని, ఆధి...

పసిడి రెక్కలు విసిరి కాలం...

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్యాలను లాగడం కాదా! పురోగామి క్రియాశీల శక్తుల ప్రేరణా పదార్థం కదా! అన్నీ ఇట్లనే వుంటాయి. నిన్ను బద్దె పురుగులా కుదిపి, క...

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గదుల్లో పిల్లలతో సహవాసం చేసేవాడు. వాళ్లకు ప్రపంచం గురిం చి చెప్పేవాడు. వాటి ముందుగా ఊరేగుతున్నడిప్పుడు కోటి. అప్పటి పిల్ల...

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లకు ఊళ్లను ముంచి, గిరిజన ప్రాంతాలను విధ్వంసం చేసి, నిర్వాసితులను చేసి, బతుకుదెరువు నాశనం చేసే ఏ ప్రాజెక్టుకైనా నేను వ్యతిర...

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూనియన్ సమ్మె అంటే మరోటి కాదనే కష్టకాలాలను చూసినం. ఇప్పుడిక అందరిదీ ఒకే మాట. ఏమయితది సార్. సమ్మె జరుగుతది. తుపాకులు బొగ్గు...

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల కోసం సర్వ జేఏసీలు ప్రచారం చేస్తూ వీధులు, వాడవాడా పాటలు హోరెత్తుతున్న కాలం. బతుకమ్మకు ముందే కాలం బతుకమ్మలాడుతున్న సంద ర్భ...

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాటం. నూతన ప్రజాస్వామ్యం కలలు కనొద్దని కానీ, సామాజికన్యాయం కల వికసించవద్దని కానీ, మాదిగ రిజర్వేషన్లు, వర్గీకరణలు తక్షణమే వ...