అన్యాయం చక్కదిద్దరా!


Sat,March 8, 2014 01:02 AM

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలె. తమ ఎన్నికల మానిఫెస్టోలలో తెలంగాణ ప్రజలను క్షమాపణ వేడాలె. ఏ పార్టీ అధికారానికి వచ్చినా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో క్షమాపణ చెప్పాలె.

రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు అన్ని రంగాలలో అన్యాయం జరిగింది. దీనిని ఎంత తొందరగా చక్కదిద్దితే అంత మంచిది. ఇక విభజనకు ముందు- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలకైతే లెక్కే లేదు. సీమాంధ్ర పాలకుల దుర్మార్గ పాలన వల్ల, కేంద్ర పాలకులు వారికి మద్దతు ఇవ్వడం వల్ల తెలంగాణ సమాజం ఎంతో క్షోభను అనుభవించింది. దీనికి బాధ్యులైనవారు చెల్లించవలసిన మూల్యం ఏమిటి? దీనికి సమాధానం లభించడం అంత సులభం కాదు. చరిత్రలో ఏదైనా జాతికి ఇంతటి నష్టం జరిగినప్పుడు అందుకు బాధ్యులైన వారు చేసిందేమిటి అనేది పరిశీలిస్తే సీమాంధ్ర, కేంద్ర పాలకుల బాధ్యత ఏమిటో తెలిసివస్తుంది. ఏ జాతికైనా చరిత్రలో తీరని అన్యాయం జరిగినప్పుడు ఆ తరువాత కాలంలో వచ్చే పాలకులయినా తమ ముందు తరాల పాలకులు చేసిన తప్పిదాన్ని గుర్తించి పశ్చాత్తాపం చెందాలె. ఇది ప్రపంచమంతటా సాగుతున్నది. ఇది ఆధునిక సమాజం అలవరచుకున్న ఔన్నత్యం. జాతి జీవనాన్ని ఛిద్రం చేసే, అవమానపరిచే ఘటనలు చరిత్రలో చెరగని మరకలుగా మిగిలిపోతాయి. ఈ దౌష్ట్యానికి బలయిపోయిన వారికి పరిహారం చెల్లించడం సాధ్యం కాదు. ఎంత చెల్లించినా జరిగిన నష్టాన్ని తీర్చలేము. అందువల్ల పాలకులు చేయవలసింది- తాము పాల్పడిన దౌష్ట్యానికి విచారం వెలిబుచ్చడం, వినమ్రంగా క్షమాపణ వేడడం.

అమెరికాలో తెల్లజాతి దురహంకారులు నల్లజాతీయులను బానిసలుగా మార్చుకోవడం సభ్య ప్రపంచం సిగ్గుపడే విషయం. అమెరికా స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా, ప్రజాస్వామ్యవాదులమని చెప్పుకుంటున్న దశలో నల్లజాతీయులపై వివక్ష చూపడానికి జిమ్‌క్రో లాస్ పేర చట్టాలు చేసిన ఘనత తెల్లజాతి పాలకులది. ఇప్పుడా చట్టాలు లేవు, నల్లజాతి హదయాలపై ఆనాటి గాయాల మచ్చలు చెరిగి పోలేదు. అందువల్ల వారిని స్వాంతన పరచడానికి అమెరికా చట్టసభ క్షమాపణ వేడింది. నల్లజాతీయులకు ఉచితంగా చికిత్స చేస్తున్నామని నమ్మించి, వారికి చికిత్స చేయడానికి బదులు సుఖ వ్యాధులపై ప్రయోగాలు జరిగాయి. ఈ దారుణం జరిగి కొన్ని దశాబ్దాలు గడిచింది.అయినాసరే అమెరికా అధ్యక్షుడు ఆ దారుణానికి క్షమాపణ చెప్పాడు. అమెరికా పరిశోధకులు గ్వాటెమాలాలోని పౌరులకు సుఖవ్యాధులు అంటించి మరీ ప్రయోగాలు జరిపారు. ఈ దారుణానికి కూడా అమెరికా అధ్యక్షుడు ఆ తరువా త కాలంలో విచారం వెలిబుచ్చాడు. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన తెల్లజాతీయులు స్థానిక జాతుల వారి పిల్లలపై జరిపిన దౌర్జన్యం మానవతకే మచ్చ వంటి ది. నాగరికత నేర్పుతామనే ముసుగు కప్పుకుని దారుణాలకు పాల్పడ్డారు. స్థానిక జాతుల కుటుంబాలలోని పిల్లలను దౌర్జన్యంగా గుంజుకొచ్చి తెల్లజాతి కుటుంబాలకు అప్పగించారు.

తల్లి ఒడి వెచ్చదనాని కి దూరమైన ఆ చిన్నారులు తెల్లజాతి కుటుంబాలలో మగవారైతే వెట్టి పని చేయడానికి, ఆడవారైతే శరీర సౌఖ్యం తీర్చడానికి ఉపయోగపడ్డారు. ఈ దుష్కతానికి పరిహారం ఏమని ఇవ్వగలం! ఆస్ట్రేలియా ప్రధాని పార్లమెంటులో జరిగినదానికి క్షమాపణ చెప్పాడు. పందొమ్మిదవ శతాబ్దంలో ఐర్లండ్‌లో కరువు వచ్చి పది లక్ష ల మంది మరణించారు. అనేకమంది వలసపోయారు. సమా జం ఛిన్నాభిన్నమైపోయింది. ఇందుకు కారణం బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు. ఆనాడు ఈ తప్పుడు విధానాలు అవలంబించి ఐరిష్ సమాజానికి తీవ్ర నష్టం కావించినందుకు బ్రిటిష్ ప్రధాని ఇటీవలి కాలంలోనే క్షమాపణ చెప్పాడు.

సీమాంధ్ర వలస పాలనలో తెలంగాణ ఎంతో క్షోభ అనుభవించింది. నీళ్ళు, నిధులు, కొలువుల దోపిడీకి గురైంది. చెరువులు దెబ్బతిని వ్యవసాయం, ఇతర వత్తులు దెబ్బతిన్నాయి. శత్రుదేశాలు ఆక్రమించుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రీతిలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగింది. ఈ భీకర సంక్షోభంలో ఊళ్ళకు ఊళ్ళు పోలీసు క్యాంపులుగా మారాయి. వేలాది ఎన్‌కౌంటర్లు జరిగి అనేక మంది మాతమూర్తులు పుత్రశోకాన్ని అనుభవించారు. అనేక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అనేక మంది మత్యువును తప్పించుకోవడానికి బొంబాయి, దుబాయి వెళ్ళవలసి వచ్చింది. ఒక్కో కుటుంబానిదీ ఒక కన్నీటి గాథ. తెలంగాణ సమాజానికి జరిగిన నష్టాన్ని లెక్కల్లో తేల్చడం అసాధ్యం. తెలంగాణ సమాజం ఇందుకు పరిహా రం కోరడం లేదు. కానీ అన్యాయం జరిగిందనే వాస్తవాన్ని గుర్తించాలని కోరుకుంటున్నది.ఈ మారణహోమానికి సీమాంధ్ర పెత్తందారులే కాదు,వారి పాలనకు మద్ద తు ఇచ్చి సహకరించిన కేంద్ర పాలకులు కూడా బాధ్యత వహించాలె. సీమాంధ్ర పెత్తందారులు ఇప్పటికే క్షమాపణ చెప్పాల్సింది. కానీ వారికంత సంస్కారం లేకపోయింది.

కనీసం అసెంబ్లీలో విభజన తీర్మానం చేసి సౌహార్ద పూరితంగా విడిపోవాల నే మర్యాద కూడా వారు పాటించలేదు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంతకాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుం చి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాప ణ చెప్పాలె. తమ ఎన్నికల మానిఫెస్టోలలో తెలంగాణ ప్రజలను క్షమాపణ వేడాలె. ఏపార్టీ అధికారానికి వచ్చినా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో క్షమాపణ చెప్పాలె.

229

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

Featured Articles