తెలంగాణ వ్యతిరేకత!


Tue,March 4, 2014 04:10 AM

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్యాబినెట్ సమావేశమై- సీమాంధ్ర నాయకుల కోరిక మేరకు- తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమైన మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నది. కేంద్ర క్యాబినెట్ కాదు సీమాంధ్ర క్యాబినెట్ అనే రీతిలో వ్యవహరించింది. కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ సోమవారం వైజాగ్‌లో మాట్లాడుతూ తెలంగాణవారి కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, సీమాంధ్ర ప్రయోజనాలు ఏవీ దెబ్బతినకుండా కాపాడామని చెప్పాడు. ఇదే మాటను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే- తెలంగాణ కడుపు కొట్టే విధానాలన్నీ కొనసాగిస్తున్నామని చెప్పాడు.

కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలలో ఒకటి కేంద్రీయ విద్యుత్ సంస్థల నుంచి వచ్చే కరెంటు కోటాకు సంబంధించినది. ఆంధ్ర ప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ విద్యుత్‌ను గత ఐదేళ్ళలో తెలంగాణ, సీమాంధ్ర ఏ విధంగా వినియోగించుకున్నాయో అదే విధంగా ఇక ముందు కూడా పంచుకోవాలె. అంటే తెలంగాణకు కరెంటు కొరత ఉన్నది కనుక ఈ రాష్ట్రమే ఎక్కువగా వినియోగించుకుంటుంది. తెలంగాణకు నీటి రంగంలో జరిగిన అన్యాయం వల్లనే బోరుబావులకు కరెంటు అవసరమవుతున్నదనేది కూడా తెలిసిందే. ఈ విధంగా పార్లమెంటు ఆమోదించిన తరువాత, చట్టంగా మారిన తరువాత మళ్ళా క్యాబినెట్ ఈ కేటాయింపులను మార్చి సీమాంధ్రకు ఎక్కువ కరెంటు లభించే విధంగా జనాభా నిష్పత్తి సూత్రాన్ని వర్తింప చేయడం సహించలేని దారుణం. దీనివల్ల ఎక్కువ జనాభా ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయింపు పెరుగుతుంది. ఆ మేరకు తెలంగాణ రాష్ర్టానికి నష్టం కలుగుతుంది. విడిపోయినందుకు తెలంగాణ ఫలితం అనుభవించాలనే కసి ఈ నిర్ణయం తీసుకోవడంలో కనిపిస్తున్నది.

కేంద్ర క్యాబినెట్ సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించే నిర్ణయం కూడా తీసుకున్నది. మరి ఆ మాత్రం దయ తెలంగాణపై చూపలేదెందుకు? ఈ ప్రత్యేక హోదా వల్ల సీమాంధ్రకు కేంద్రం నుంచి లభించే నిధుల్లో తొంభై శాతం గ్రాంట్ రూపంలో, పది శాతం అప్పుగా వస్తాయి. అదే తెలంగాణకు మాత్రం డెబ్బయి శాతం నిధులు అప్పుగా, మిగతావి గ్రాంటుగా వస్తాయి. ఆరు దశాబ్దాలుగా నష్టపోయిన తెలంగాణకు మొండి చేయి చూపడం ఎట్లా సమర్థనీయం? సీమాంధ్రకు లబ్ధి చేకూరిస్తే అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ పట్ల వివక్ష చూపడమేమిటి?

పోలవరం ప్రాజెక్టు విషయమై తీసుకున్న నిర్ణయం కూడా అత్యంత దారుణమైంది. తెలంగాణకు నీటి పారుదల ప్రాజెక్టులలో భారీ అన్యాయం జరిగిందనేది తెలిసిందే. ఈ అన్యాయాన్ని చక్కదిద్దేందుకు ఏ హామీలు ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే పోలవరం బహుళార్థకసాధక ప్రాజెక్టు చేపట్టడాన్ని కేంద్రం తన బాధ్యతగా స్వీకరించింది. రాష్ట్ర విభజన చట్టం ఎట్లా తయారు చేశారంటే- ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రం ఈ జాతీయ ప్రాజెక్టుకు అంగీకరించినట్టుగా భావించాలట! రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ ప్రజలు మా నెత్తికొట్టినా ఫరవా లేదని ఆమోదించినట్టు లెక్క! పోలవరం ప్రాజెక్టులో మునిగే గ్రామాలను తెలంగాణ నుంచి సీమాంధ్రకు తరలించే విధంగా రాష్ట్ర విభజన చట్టం చేశారు.

రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి చట్టంగా మారగానే, మళ్ళీ పోలవరం ప్రాజెక్టులో మునగని ప్రాంతాలను కూడా సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర క్యాబినెట్ ఆదివారం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కొద్ది రోజుల ముందే ఆర్డినెన్స్ జారీ చేయడానికి సీమాంధ్ర పెద్దలు కేంద్రాన్ని ఒప్పించారట! అయితే బిల్లు చట్టంగా మారితేనే మళ్ళా దానిని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం సాధ్యమని న్యాయ నిపుణులు చెప్పడం వల్ల రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరే గడియ వరకు ఆగిపోయారట! పర్యావరణానికి హానికరమైన, ఆదివాసుల మనుగడను దెబ్బతీసే ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర అనుమతి లేకుండానే, స్థానిక ప్రజల ఆమోదం తీసుకోకుండానే అమలు చేస్తామంటూ చట్టాలు చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. రాష్ట్ర విభజన బిల్లు చట్టంగా మారింది కనుక, మళ్ళా దానిని సవరించాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆగాలె. తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమైన నిర్ణయాన్ని ఇంత హడావుడిగా తీసుకోవడం సమర్థనీయం కాదు. ఇంతకాలం సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడిన మేధావులు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నోరు మెదపక పోవడం ఆశ్చర్యకరం.

వలస పాలకుల నీతిని ఈ కాలంలో ఇంత నిర్దాక్షిణ్యంగా, అప్రజాస్వామికంగా అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక విధానానికి నిదర్శనం. రాష్ట్ర విభజన చట్టమే లోపభూయిష్టంగా ఉండి తెలంగాణ ప్రభుత్వానికి ఏ హక్కులూ లేకుండా చేసింది. ఈ నిర్వాకం చాలదన్నట్టు మళ్ళా క్యాబినెట్ తాజా నిర్ణయాలతో తెలంగాణ మరింత నష్టం తలపెట్టింది. సీమాంధ్ర నాయకులు ఒత్తిడి తేవడంలో ఆశ్చర్యం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞత ఉండాలె కదా! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా కేంద్రం కనుసన్నలలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ రాష్ర్టాన్ని పరోక్షంగా పాలిస్తూ, దోపిడీ చేస్తూనే ఉంటారా?

రాష్ట్ర విభజన చట్టమే లోపభూయిష్టంగా ఉండి తెలంగాణ ప్రభుత్వానికి ఏ హక్కులూ లేకుండా చేసింది.
ఈ నిర్వాకం చాలదన్నట్టు మళ్ళా క్యాబినెట్ తాజా నిర్ణయాలతో తెలంగాణ మరింత నష్టం తలపెట్టింది. సీమాంధ్ర నాయకులు ఒత్తిడి తేవడంలో ఆశ్చర్యం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞత ఉండాలె కదా!

328

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

Featured Articles