అచ్చమైన గణతంత్రం


Sat,March 1, 2014 12:30 AM

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా
విభజన ప్రక్రియను సులభతరం చేయాలె.

తెలంగాణ రాష్ట్ర అవతరణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కొత్త రాష్ర్టాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సూచనలు రావడం సంతోషం కలిగిస్తున్నది. బోడోలాండ్ విషయం పరిశీలించడానికి కేంద్రం ఒక కమిటీని వేసి తొమ్మిది నెలల గడువు విధించింది. తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ కొన్ని రాష్ర్టాల డిమాండ్లను వ్యక్తిగత స్థాయిలో సమర్థిస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర నుంచి విదర్భను వేరు చేయవచ్చునని, ఉత్తర ప్రదేశ్‌ను మూడు నాలుగు రాష్ర్టాలుగా విభజించవచ్చునని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశమంతా ఇటువంటి డిమాండ్లు వస్తాయని సీమాంధ్ర పెత్తందారులు అదొక పెద్ద ప్రమాదమైనట్టు ప్రచారం చేశారు. కాని ఇవాళ తెలంగాణ స్ఫూర్తితో విదర్భ, గోర్ఖాలాండ్, బోడో తదితర ప్రాంతాల ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఉద్యమించడం గర్వించదగిన విషయం.

దేశంలో ఎంత కాదన్నా మరో ఇరవై ప్రాంతాలు స్వీయ రాష్ట్ర ఆకాంక్షను కలిగి ఉన్నాయి. కొన్ని పెద్ద రాష్ర్టాలు విభజనకు నోచుకోక గిలగిలలాడుతున్నాయి. ఉదాహరణకు- ఉత్తరాఖండ్‌ను విడదీసిన తరువాత కూడా- ఉత్తర ప్రదేశ్ జనాభా ఇరవై కోట్లు! ఇందులో- బ్రజ భాష మాట్లాడే పశ్చిమ ప్రాంతాన్ని బ్రజ ప్రదేశ్ (హరిత ప్రదేశ్)గా, అవధి మాట్లాడే మధ్య ప్రాంతాన్ని అవధ్‌గా, భోజ్‌పురి మాట్లాడే ప్రాంతాన్ని పూర్వాంచల్‌గా విభజించాలనే డిమాండ్ ఉన్నది. బుందేల్ ఖండ్ ప్రాంతం కొంత ఉత్తర ప్రదేశ్‌లో ఉంటే మరికొంత మధ్యప్రదేశ్‌లో ఉన్నది. మరోవైపున బాగేల్ ఖండ్ డిమాండ్ ఉన్నది. బీహార్‌లోని మైథిలి మాట్లాడే భూభాగం పొరుగు ప్రాంతాలతో కలిసి మిథిల రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నది. ఇంకా వింధ్యాచల్ దరిదాపుల్లోనే ఉన్నది. దక్షిణాన తులునాడు, కొంగునాడు, పశ్చిమాన సౌరాష్ట్ర, మరు ప్రదేశ్ మొదలుకొని ఈశాన్యం వరకు ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి.

సొంత రాష్ట్రం అంటే దేశం నుంచి విడిపోవడం కాదు. ఈ ఆకాంక్ష దేశ ద్రోహమేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి కూడా- అంతర్గత వలసవాదం వల్ల- కొన్ని ప్రాంతాల ప్రజలు పరతంత్రంలో మగ్గవలసి వస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న ఈ ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నాయి. వీటికి సొంత భాష, సంస్కతితో పాటు ప్రత్యేక అస్తిత్వం ఉన్నది. ఈ ప్రాంతాలు కొన్ని ఒకప్పుడు స్వతంత్ర దేశాలుగా ధగధగలాడినవి. ఈ ప్రాంతాల ప్రజలు పెద్ద రాష్ట్రంలో మరో ప్రాంత ఆధిపత్యాన్ని భరించలేక, విడిపోయి తమను తాము పరిపాలించుకోవాలని కోరుకోవడంలో తప్పేమున్నది? తమ ప్రాంతంలో తామే రెండవ తరగతి పౌరులుగా బతకడమేమిటని వీళ్ళు వాపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వల్ల తమ ప్రాంతంలో తాము మైనారిటీలుగా మారిపోవడాన్ని భరించలేక ఉద్యమిస్తున్నారు. తమ వనరులపై తమకే హక్కు ఉండాలని దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నారు. ఇటువంటి న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తీర్చాల్సింది.

తెలంగాణ రాష్ర్టాన్ని ఆంధ్రతో విలీనం చేయడం వంటి తప్పిదాలను వెంటనే చక్కదిద్దాల్సింది. తెలంగాణ రాష్ర్టాన్ని కొన్ని దశాబ్దాల కిందనే పునరుద్ధరిస్తే ఈ పాటికి ఎంతో అభివద్ధి చెందేది. అన్ని ప్రాంతాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించ వలసిన కేంద్రం ఒక ప్రాంతంపై మరో ప్రాంతం ఆధిపత్యం చెలాయిస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ పరోక్ష మద్దతు ఇవ్వడం దారుణం. రాష్ర్టాల విభజనకు కేంద్రం అనుసరిస్తున్న విధానం కూడా సమంజసంగా లేదు. ఇటీవల జైరామ్ రమేశ్ మహారాష్ట్రలోని అన్ని పార్టీలు అంగీకరిస్తేనే విదర్భ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని చెప్పడం అభ్యంతరకరం. ఒక ప్రాంతం విముక్తి పొందాలంటే, ఆధిపత్య ప్రాంతం అందుకు అంగీకరించాలనే సామ్రాజ్యవాద దుర్నీతి ప్రజాస్వా మ్య వ్యతిరేకమైనది. ఆధిపత్యవాదులు విభజనకు అంగీకరించే క్రమంలో తమ దోపిడీని కొనసాగించడానికి- విముక్త జాతి ఆకాంక్షలను నిర్వీర్యంచేసే షరతులను విధిస్తారు.

దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా జాతుల ఘర్షణలు తలెత్తే ప్రమా దం పొంచి ఉంటుంది. కేంద్రం ఆధిపత్యశక్తులకు కొమ్ముకాస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను అణచివేయడంవల్ల సమస్యలు మరింత ముదిరిపోతున్నాయి. పాలకులు జాతుల సమస్యను సకాలంలో సామరస్యంగా పరిష్కరించక పోవడంవల్ల అనేక చిక్కుముళ్ళు బిగుసుక పోతున్నాయి. బోడో ప్రాంతంలో ఘర్షణలు చెలరేగి రక్తపాతం చోటుచేసుకోవడం ఇందుకు ఉదాహరణ. పాలకుల విధాన లోపం వల్ల అనేక మంది బలవుతున్నారు, అనేక సమాజాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా విభజన ప్రక్రియను సులభతరం చేయాలె. మనం ఒక కొత్త భారత దేశాన్ని కలగందాం. ఈ దేశంలో ఏ జాతీ మరో జాతి పదఘట్టనల కింద నలిగిపోకూడదు. ప్రతి జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ఆత్మగౌరవంతో బతకాలె. అటువంటి అందమైన అచ్చమైన గణతంత్రాన్ని నిర్మించుకుందాం.

255

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఎవరూ వ్యక్తి కాదు. ఆయన చట్టసభల ప్రతినిధుల బందానికి, ముఖ్యంగా రాష్ర్టాన్ని ఏలే మంత్రివర...

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఏమంటారు! సోమవారంనాడే ఎపీఎన్జీవోల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసు అధికారులు ప్రకటించారు. నిషేధాజ్ఞలు...

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిలబడడానికి యత్నించాలె. తమ మైండ్ సెట్ మార్చుకోవాలే తప్ప బిల్లు ముసాయిదాలో లోపాలు ఉన్నాయనీ, తమకు అన్యాయం జరుగుతున్నదని మొత్...

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా ఇవాళ ఇస్రో అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్నదీ అంటే నంబి బృందం ఆనాడు వృద్ధి చేసిన వికాస్ ద్రవ ఇంధన ఇంజన్‌లే కారణ...

స్వయంకృతం

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బాబు నుంచి సభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను తప్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యూహం ఏమై ఉంటుంది? ఈ సందేహాల సంగతి ఎట్లా ఉన్నా ఒ...

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆపద్ధర్మ ప్రభుత్వాలే. ఈ మాత్రం మహద్భాగ్యానికి ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చవలసిన అవసరం ఉన్నదా! ఇటువంటి నిష్ఫ...

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్రా పాలకవర్గాల అవశేషాలు ఇంకా మిగిలే ఉంటాయి. అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటాయి. వీలైతే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా తెలంగాణ...

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానానికి లేదా చర్చకు సంప్రదాయమని నామకరణం చేసి ఇక్కడ అమలు పరచాలని కోరుతారట! సూటిగా చెప్పాలంటే- ఆ ఉత్తరాది నాటకాన్ని ఇక్కడ కొత్త...

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీరు మీ చీకటి మనస్తత్వాల వల్ల పరుచుకునియున్న వెలుగును గుర్తించ నిరాకరిస్తున్నారు. చివరకు మీరు బైబిలునూ ప్రేమించరు. నమ్మినా...

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలుసు. కానీ ఇంత నటనా ప్రతిభ ఉందని ‘తెల్వకండా’ పోయినందుకు చింతించవచ్చు. కిరణ్ ఇంత ద్విపావూతాభినయం చెయ్యగలడని కూడా ముఖ్యంగా స...

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధాన స్రవంతి రాజకీయవేత్తలు సాధారణంగా డొల్లగా మాట్లాడతారు. ఏదైతే ఉన్నదో, తెలియజేసుకుంటున్నాను, ఈ సభా ముఖంగా చెప్తూ ఉన్నాను ...

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వెంక వయసప్పుడు పదిహేనేళ్లు. చిన్న పిల్లవాడే. టెన్త్‌క్లాస్. ఇప్పుడు ఇంటర్. కానీ ఇప్పటికీ అతని మ...

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్తూనూ రొదలా వెంబడించే జోరీగల సంగీతంలో నిలు పెరిగిన గడ్డి నిండిన వనాలను సంచారిలా చుట్టినవాడు వెంకన్న. కరీంనగర్ జిల్లా హుజు...

విధ్వంసమూ.. వర్తమానమూ...

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా.. 17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో కవిత. కోటకు నలువైపులనే కాదు/వీలైన అన్ని చోట్లా డైనమెట్లు పేల్చి కూల్చనిదే/ దానిగుండె మన పిడికిట్లోకి రాదు -చెరబండరాజ...

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామందికి తెలియదు. నిన్నటికి నిన్న అసెంబ్లీ లైవ్ చూడడం వల్ల జ్ఞానంతో నా కళ్లు తెరుచుకున్నాయి. చంద్రబాబునాయుడు కొడుకు ఎంత గొప...

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు అక్కరకు రాని, పనికిరాని విషయాలనీ భావించే వాళ్లుంటారు. కానీ సంస్కృతిని విధ్వంసం చేస్తేనే మరో సంస్కృతి పాదుకుంటుందని, ఆధి...

పసిడి రెక్కలు విసిరి కాలం...

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్యాలను లాగడం కాదా! పురోగామి క్రియాశీల శక్తుల ప్రేరణా పదార్థం కదా! అన్నీ ఇట్లనే వుంటాయి. నిన్ను బద్దె పురుగులా కుదిపి, క...

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గదుల్లో పిల్లలతో సహవాసం చేసేవాడు. వాళ్లకు ప్రపంచం గురిం చి చెప్పేవాడు. వాటి ముందుగా ఊరేగుతున్నడిప్పుడు కోటి. అప్పటి పిల్ల...

తెలంగాణ పోరు సాగుతుంది...

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇస్తరు నుంచి ‘ఇంకెక్కడి తెలంగాణ’ దాకా ఇప్పుడు చర్చ నడుస్తున్నది. సామా న్య ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు ఈ ప్రశ్నలు అడిగితే ...

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లకు ఊళ్లను ముంచి, గిరిజన ప్రాంతాలను విధ్వంసం చేసి, నిర్వాసితులను చేసి, బతుకుదెరువు నాశనం చేసే ఏ ప్రాజెక్టుకైనా నేను వ్యతిర...

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూనియన్ సమ్మె అంటే మరోటి కాదనే కష్టకాలాలను చూసినం. ఇప్పుడిక అందరిదీ ఒకే మాట. ఏమయితది సార్. సమ్మె జరుగుతది. తుపాకులు బొగ్గు...

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల కోసం సర్వ జేఏసీలు ప్రచారం చేస్తూ వీధులు, వాడవాడా పాటలు హోరెత్తుతున్న కాలం. బతుకమ్మకు ముందే కాలం బతుకమ్మలాడుతున్న సంద ర్భ...

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాటం. నూతన ప్రజాస్వామ్యం కలలు కనొద్దని కానీ, సామాజికన్యాయం కల వికసించవద్దని కానీ, మాదిగ రిజర్వేషన్లు, వర్గీకరణలు తక్షణమే వ...