నిరంతర పోరాటం


Tue,February 25, 2014 12:57 AM

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారులు వీటిని గ్రహించుకోగలరు. పోరాటంలో భాగస్వాములు కాగలరు. సంపూర్ణ తెలంగాణ సాధన దిశగా సాగే పోరాటానికి కూడా ప్రజలే మార్గదర్శకులు.

తెలంగాణ ఏర్పాటు ఖాయమైన తరువాత కూడా తెలంగాణ వాదులు నిశ్చింతగా ఉండలేని పరిస్థితి. చరిత్ర మిగిలించిన బరువు బాధ్యతలు అటువంటివి. ఇప్పుడు తెలంగాణవాదుల ముందున్నవి కొన్ని తక్షణ సమస్యలు అయితే, మిగతావి దీర్ఘకాలిక పోరాటం ద్వారా సాధించుకోవలసినవి. రెండు విధాలుగా పరిస్థితులను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్ధపడి ఉండాలె. సొంత రాష్ట్రం ఏర్పడుతున్నదనే సంతోషం ఉన్నప్పటికీ విభజన ప్రాతిపదికలు అనేకం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయి. విభజన ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా, పక్షపాతంతో సాగితే తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతుంది. విభజన దశలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. విభజన పూర్తయి రెండు రాష్ర్టాలు ఆవిర్భవించిన తరువాత కూడా అన్ని రంగాలలో సీమాంధ్ర ప్రయోజనాలే నెరవేరే విధంగా బిల్లును రూపొందించారు. అందువల్ల తెలంగాణ పోరాటం దీర్ఘకాలం కొనసాగించక తప్పదు.

ఉద్యోగుల విషయం తీసుకున్నా విభజన ప్రాతిపదికనే తెలంగాణకు అన్యాయం చేసేదిగా ఉన్నది. రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో ఫెయిర్ షేర్ అమలు చేయలేదనేది తెలిసిందే. పైగా సీమాంధ్ర పాలకులు స్థానికులకు ఇవ్వవలసిన అనేక రకాల ఉద్యోగాలను రాష్ట్రస్థాయివిగా ప్రకటించి ప్రాంతేతరులతో భర్తీ చేశారు. ఇప్పుడు స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజిస్తే కొంత వరకైనా తెలంగాణకు న్యాయం జరిగేది. కానీ జనాభా ప్రాతిపదిక తీసుకోవడం వల్ల భారీ ఎత్తున సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉండి పోతారు. మొత్తం ఉద్యోగులలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు విభజనే వర్తించదు. స్థానిక ఉద్యోగాలలో ఏదో విధంగా చొరబడిన వారిని గుర్తించి కదిలించే విధానమేదీ లేదు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో నలభై రెండు శాతం మందిని తెలంగాణలో కొనసాగిస్తారని తెలుస్తున్నది. 33, 052 మంది తెలంగాణలో ఉంటారని, 45,643 మందిని సీమాంధ్రకు కేటాయిస్తారని అంచనా. హైదరాబాద్‌లో ఉండడానికి ఆప్షన్స్ ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటే తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దళితులు, గిరిజనులు, పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు, స్థానికులు ఇట్లా అనేక విధాలుగా ప్రాధాన్యాలు నిర్ణయించినప్పుడు తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలె.

ముల్కీ నిబంధనలు, 610 జీవో సక్రమంగా అమలు చేయక పోవడం వల్ల, అనేక ప్రైవేటు ఉద్యోగాలలో కుట్ర పూరితంగా అక్కడి వారినే భర్తీ చేయడం వల్ల వారి పిల్లలు స్థానికులు అయిపోయారు. ఈ విధంగా విద్యా, ఉద్యోగావకాశాలలో మరింత నష్టం జరుగుతున్నది. భూమి పుత్రులనే స్థానికులుగా గుర్తించాలని జార్ఖండ్ ఉద్యమకారులు కోరడానికి కారణం ఇదే. విభజన చట్టం గెజెట్‌లో చేర్చినప్పుడు కమలనాథన్ ప్యానెల్ అనుసరించే విభజన మార్గదర్శకాలపై స్పష్టత వస్తుందని అంటున్నారు. పంపకాలకు సంబంధించిన ప్రతి రంగంలో తెలంగాణ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలె. తొండివేషాల్లో సీమాంధ్ర పాలకవర్గాలకు ఎవరూ సాటిరారు. ఇటీవల రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ సాగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సీమాంధ్ర నాయకుడు సీమాంధ్ర లోటును 6,935 కోట్ల రూపాయలకు బదులు పదిహేను వేల కోట్లుగా చెప్పి సభను తప్పుదారి పట్టించడం తెలంగాణవాదులను ఆశ్చర్యపరిచింది.

విభజన పూర్తయ్యే వరకు పంపకాలపై దష్టి సారిస్తూనే సంపూర్ణ తెలంగాణ కోసం దీర్ఘకాలిక పోరాటానికి సమాయత్తం కావాలె. హైదరాబాద్‌పై తెలంగాణ రాష్ర్టానికి పూర్తి హక్కు ఉండదు. గవర్నర్, న్యాయస్థానం, పబ్లిక్ కార్పొరేషన్లు, విద్యారంగంలో కోటాలు మొదలైనవన్నీ ఉమ్మడిగానే ఉంటాయి. నీటి పారుదల రంగంపై కూడా తెలంగాణకు హక్కు లేకుండా చేశారు. ఇన్ని ఆంక్షల తరువాత ఇంక తెలంగాణకున్న అధికారాలు ఏమిటి? జైలు నుంచి విడుదల చేసి కాళ్ళకు, చేతులకు, మెడకు సంకెళ్ళు వేసినట్టు ఉన్నది తెలంగాణ పరిస్థితి! పదేండ్ల కాల పరిమితి తరువాత వదులుతారా లేదా అనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐటి వంటి అనేక రంగాల ప్రైవేటు ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలు వేధింపులకు, వివక్షకు గురవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పెద్దలు పదేపదే రెండు ప్రాంతాల వారు సామరస్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ వారు మొదటి నుంచి సామరస్యంగానే ఉంటున్నారు. కానీ సీమాంధ్ర పాలకులు వివక్ష చూపడం, కేంద్రం మొదటి నుంచి ఆ వైపునే ఉండడం వల్ల తెలంగాణ జాతి మనుగడకే ముప్పు ఏర్పడింది.

తమ గడ్డపై తామే పరాయి వారయ్యారు. ఈ అన్యాయాలను తొలగించకుండా సామరస్యం గురించి నీతి బోధలు చేయడం వల్ల ఫలితం ఉండదు. ఇంత కాలం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాము. ఇందుకు అనువైన వ్యూహాన్ని అనుసరించాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారులు వీటిని గ్రహించుకోగలరు. పోరాటంలో భాగస్వాములు కాగలరు. సంపూర్ణ తెలంగాణ సాధన దిశగా సాగే పోరాటానికి కూడా ప్రజలే మార్గదర్శకులు.

271

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

country oven

Featured Articles