దొంగ దెబ్బ


Sat,February 22, 2014 01:24 AM

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలరేగడం ఖాయం.
తెలంగాణ ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కుయుక్తులలో ఆరితేరిన సీమాంధ్ర పెత్తందారులు దొంగ దెబ్బ తీయగలిగారు. తెలంగాణ ఇచ్చినట్టే ఇస్తూ నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు మొదలైన రంగాలలో తెలంగాణ నోరు కొట్టి తమ దోపిడీని కొనసాగించే కుట్రను పకడ్బందీగా అమలు పరచగలిగారు. ఈ రంగాలలో తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ వారు గ్రహించినా ఫలితం లేక పోయింది. రాజకీయ శక్తులను, మీడియాను కూడగట్టుకోగలిగే సీమాంధ్ర వర్గం తమకే అన్యాయం జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారం దేశ వ్యాప్తంగా చేసుకోగలిగింది.

తెలంగాణ వారు తమకు జరుగుతున్నదని ముందే గ్రహించి అప్రమత్తమయ్యారు. అయినా సరే ఈ అన్యాయాన్ని పార్లమెంటు దష్టికి తీసుకు వచ్చి న్యాయం పొందకుండా రక్షణ స్థితిలో పడేయడానికి సీమాంధ్ర శక్తులు పెద్ద కుట్రనే అమలు జరిపాయి. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకున్నందు వల్ల రాష్ట్ర విభజన జరపడం తప్పనిసరి అని సీమాంధ్ర పెత్తందారులకు, కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయింది. తెరవెనుక ఏమి జరిగిందో కానీ- తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర పెత్తందారులు అంగీకరించారు. అయితే తెలంగాణ నుంచి తాము పొందుతున్న ప్రయోజనాలు దెబ్బతినకుండానే రాష్ట్ర విభజన జరిగేలా సీమాంధ్ర పెత్తందారులు హామీలు పొందగలిగారని రాష్ట్ర విభజన బిల్లును చూస్తేనే తెలిసిపోతుంది. ఈ మేరకు సీమాంధ్ర పెత్తందారులను ఒప్పించిన తరువాతనే కేంద్రం విభజన ప్రక్రియను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏ దశలోనూ సీమాంధ్ర పెత్తందారులను నొప్పించకుండా వ్యవహరించడం విభజన ప్రక్రియ సాగినంత కాలం కండ్ల ముందు కనిపించింది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నది.

ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో భారీ దోపిడీ జరిగిందనేది తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంగా ఉంటే తన వంతు వాటా పొందేది. విలీనానికి ముందే తెలంగాణ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. వీటి అమలుకు అవసరమైన నిధులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు రద్దు కావడమే, ఆంధ్ర ప్రదేశ్ వాటాలో తెలంగాణకు సమన్యాయం జరగలేదు. ఇప్పుడు విభజన సందర్భంగా తెలంగాణకు న్యాయం జరపాలె. తమ వంతు ప్రాజెక్టులు కట్టుకోవడానికి తెలంగాణకు అధికారం ఉండాలె. సీమాంధ్రులు కనీసం అనుమతులు లేకుండా అక్రమ ప్రాజెక్టులు కట్టుకుని నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. అందువల్ల అనుమతులు లేని ప్రాజెక్టుల ఆధారంగా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేరు.

ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి హక్కులను హరించడానికి సీమాంధ్రులు కష్ణా, గోదావరి నదులపై కేంద్ర ఆజమాయిషీని తెచ్చి పెట్టగలిగారు. దీంతో తెలంగాణకు నీటిపై అధికారం లేకుండా మెడపై ట్రిబ్యునళ్ల కత్తులు వేలాడుతుంటాయి. టీడీపీ, కాంగ్రెస్ ఏది అధికారంలో ఉన్నా సీమాంధ్ర పాలకవర్గాలు లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి రాష్ట్రం నెత్తి మీద పెట్టారు. అయితే ఈ అప్పులను జనాభా ప్రాతిపదికన పంచి తెలంగాణ నెత్తిన భారం మోపారు. ఆ అప్పును ఏ ప్రాంతంలో ఖర్చు చేస్తే వారే భరించాలనే న్యాయబద్ధమైన డిమాండ్‌ను కేంద్రం అంగీకరించాల్సింది. విద్యారంగంలోనూ సీమాం ధ్ర వాదనే నెగ్గింది. ఇంకా పదేండ్ల పాటు యధాతథ పరిస్థితి కాపాడడం, ఉమ్మడి ఎంట్రన్స్‌లు పెట్టడం తెలంగాణ బిడ్డల కడుపు మీద దెబ్బ కొట్టడమే. అక్రమంగా తెలంగాణలో తిష్టవేసిన సీమాంధ్ర ఉద్యోగులను ఇక్కడే కొనసాగించడం, పదవీ విరమణ చెందిన సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం పింఛన్ ఇవ్వాల్సి రావడం తీవ్ర అన్యాయం. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యోగాలు, వనరులు కొల్లగొడుతూ ఇక్కడే తిష్టవేసిన వారిని వెళ్ళమనడం లేదు.

కానీ భద్రాచలాన్ని మినహాయించి ముంపు గ్రామాలను గుంజుకుంటామని, సీమాంధ్ర నీటి తరలింపునకు ముప్పు లేకుండా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వడం దారుణం. ఇవన్నిటికీ తోడు హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టడం. తెలంగాణ వారికి తమ రాజధానిపైనే అధికారం ఉండకూడదనడం ఎంత అవమానకరం. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలనలో తెలంగాణ సమాజం తీవ్ర స్థాయిలో పౌరహక్కుల ఉల్లంఘనకు, అణచివేతకు గురైంది. ఇంకా గవర్నర్ ద్వారా వేధిస్తామంటే తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తారు?

తెరవెనుక బిల్లును తమకు అనుకూలంగా రూపొందింపచేసుకున్న సీమాంధ్ర పెత్తందారులు బహిరంగంగా వ్యవహరించిన తీరు అందుకు విరుద్ధంగా ఉన్నది. అసలు విభజనకే అంగీకరించడం లేదంటూ నాటకాలు ఆడారు. తమకే అన్యాయం జరుగుతున్నట్టు ప్రచారం చేసుకున్నారు. కేంద్రం కూడా వాస్తవాలను బహిరంగంగా చెప్పడం లేదు. బలహీనమైన తెలంగాణ గొంతుక జాతీయ స్థాయిలో వినబడలేదు. విభజన బాధితులుగా సానుభూతి పొందిన సీమాంధ్రవర్గం తమ రాష్ర్టానికి రాయితీలు సాధించుకున్నది. ఇంతకాలం నష్టపోయిన, ఇక ముందు నష్టపోతున్న తెలంగాణకు సానుభూతి దక్కలేదు, రాయితీలు రాలేదు.

ఇప్పుడు తెలంగాణ వారు చేయవలసిందేమిటి? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తీరు మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నది. 29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులు న్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలరేగడం ఖాయం. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు. పోరాడి విజయం సాధించడమూ కొత్త కాదు.

579

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...