విముక్త జాతి!


Fri,February 21, 2014 01:09 AM

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం.

సార్వభౌమ సంస్థ అయిన పార్లమెంటు ఆమోదముద్ర పడడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర లాంఛనమే. తెలంగాణ ఇప్పుడు విముక్త జాతి! ఏ జాతికైనా స్వరాజ్యాన్ని మించినది మరొకటి లేదు. స్వాతంత్య్రానికి ప్రత్యామ్నాయం లేదు. దశాబ్దాల పాటు పరతంత్రంలో మగ్గిన జాతికి స్వాతంత్య్రం విలువ మరింత ఎక్కువగా తెలిసి వస్తుంది. తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతికే ఈ క్షణం కోసమే అనేక త్యాగాలు చేసింది. అనేక కష్టనష్టాలకు ఓర్చి పోరాడింది. ఈ విజయం వెనుక వేలాది మంది బిడ్డల బలిదానాలు ఉన్నాయి. ఉద్యమ కాలమంతా తెలంగాణ సమాజం అనేక పరీక్షలకు నిలబడ్డది. అనేక అపవాదులు మోసింది. అవహేళనలు భరించింది. దాష్టీకాలకు గురైంది. భౌతిక దాడులను భరించింది. మానసిక చిత్రవధను అనుభవించింది.

అయినా సహనం కోల్పోలేదు. సాధుత్వం వదలుకోలేదు. జూలైలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిన తరువాత- కాలం మరింత కఠిన పరీక్షనే పెట్టింది. ప్రతి రోజూ నరాలు తెగిపోయే ఉత్కంఠనే. క్యాబినెట్ సమావేశాలు, జీవోఎం భేటీలు, ఆంటోనీ కమిటీ, పార్లమెంటు షెడ్యూళ్ళు, క్యాబినెట్ నోట్ ఆమోదం, ముసాయిదా తయారీ, అసెంబ్లీలో రోజుకో గొడవ... ఇట్లా ప్రతి మలుపు తెలంగాణ బిడ్డల మనుసును ఉద్వేగ భరితం చేసింది. ప్రతి మెట్టు మెట్టుకు ఊపిరి ఉగ్గబట్టి చూసుడే. పార్లమెంటులోని ఉభయ సభల ఆమోదానికి బిల్లు వచ్చినప్పుడు ఈ చివరి రోజులు కూడా నెత్తురును ఉడుకెత్తించినయి. రాజ్యసభలో సాగిన గంటల కొద్ది చర్చను ఈ తరం తెలంగాణ బిడ్డలు మరిచిపోలేరు. ఈ ఉద్వేగ భరిత ఘట్టంలో- పరాయి చానెళ్ళు రెచ్చగొట్టుడు తక్కువేమీ కాదు. సీమాంధ్ర రాజకీయ, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉబుసుపోక చానెళ్ళ చుట్టూ తిరిగే అజ్ఞానుల వాగుడు ఎంత రెచ్చగొట్టేదిగా ఉన్నా తెలంగాణ బిడ్డలు చూపిన సహనానికి చేతులెత్తి మొక్కాలె! సాహసమే కాదు, సహనమూ మన జాతి లక్షణమే!

ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం వేలాది మంది బిడ్డలు బలిదానాలు చేశారు. కోట్లాది బిడ్డలు ఆకలిదప్పులు మరిచి పోరుబాటలో సాగారు. పాలిచ్చే తల్లులు, పాలుగారే పసికందులు ఉద్యమంలో పాల్గొనని వారెవ్వరు! ఒక బడిపిల్ల సాయంత్రం బయలెల్లి రాత్రంతా ఎక్కడో బహిరంగ సభలో ఉద్యమ పాటలు పడి తెల్లారే సరికి ఇంటికి చేరుకుని ఆ రోజటి పరీక్ష రాసింది! ఏమి త్యాగమది, ఏమి దీక్ష అది! ఎంత గొప్ప బిడ్డలో గదా! మలి దశ ఉద్యమ కాలమంతా తెలంగాణ జాతి యావత్తూ ఏకతాటిపై నిలిచి చేసిన పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే అద్భుత ఘట్టం. వాడవాడలో జేఏసీలు ఏర్పాటయ్యాయి. ఎవరి అస్తిత్వం వారిది. అయినా సమష్టి పోరాటం. ప్రతి మూడు బజార్ల కాడ ఉద్యమ జెండా ఎగిరింది. నిరాహారదీక్షల కోసం ప్రతి కులం, ప్రతి వత్తి సంఘం వరుసకట్టింది. ప్రజలే ఉద్యమ నాయకులు. దేశ దేశాలలోని బిడ్డలు పుట్టిన గడ్డ కోసం తపనపడ్డరు. ఎవరి పోరాట గాథ వారిది.

ఒక్కొక్కరు తరతరాలు పాడుకునే ఉద్యమ జ్ఞాపకాలను మూటకట్టుకున్నారు. పోరాట గాయాలను పదిల పరుచుకున్న రు. తెలంగాణ ఉద్యమం భౌగోళిక సరిహద్దులు దాటి సంఘీభావాన్ని సాధించింది. సీమాంధ్రలోని అట్టడుగు వర్గాలు కవులు, రచయితలు తెలంగాణ పోరాటానికి మద్దతు పలికారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు దేశ మంతా ఎంత సంఘీభావం వ్యక్తమైంది! మరాట్వాడా మొదలుకొని బోడోలాండ్ వరకు పోరాట వారసత్వం ఉన్న, మట్టివాసన పసిగట్టే ప్రతి జాతి తెలంగాణకు మద్దతు పలికింది. లాబీయింగ్‌కు లొంగే పెత్తందారీ పోకడలు సంతరించుకున్న రాజకీయ పార్టీలే తెలంగాణను వ్యతిరేకించాయి. తెలంగాణ ఈ సంఘీభావానికి సదా కతజ్ఞతతో ఉంటుంది. సీమాంధ్ర సమాజం కూడా ఒక జాతిగా ఆత్మగౌరవంతో వికాసం చెందాలని ఆకాంక్షిస్తున్నది. హైదరాబాద్ మొదలుకొని తెలంగాణ అంతటా పరచుకొని ఉన్న సీమాంధ్ర జనాన్ని తమలో భాగమై తమ భవిష్యత్తును పంచుకోవాలని పిలుపునిస్తున్నది.
తెలంగాణ పోరాటంలో ఎన్నో రాజకీయ శక్తులు, ఉద్యమ సంస్థలు కలిసి పని చేశాయి. ఎందరో తోడ్పాటు అందించారు. ఎవరి పాత్ర వారిది. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్నది. బీజేపీ మాటకు కట్టుబడి మద్దతు ఇచ్చింది. టీఆర్‌ఎస్ ముందు నిలిచి పోరాడింది.

అనేక ప్రజా సంఘాలు అలుపెరుగకుండా ఉద్యమించాయి. కవులు, రచయితలు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు, జర్నలిస్టులు, న్యాయ వాదులు జనంతో మమేకమై ఉద్యమించారు. జయశంకర్ ప్రతిపాదించినట్టు ఆర్‌ఎస్‌యు మొదలుకొని ఆరెస్సెస్ వరకు లెఫ్టు, రైటు తేడా లేకుండా అన్ని వాదాలు తెలంగాణ వాదమై పరవళ్ళు తొక్కాయి. ఎవరి ఆకాంక్ష వారిది. ఎవరి స్నప్నం వారిది. ఏ లక్ష్యం నెరవేరడానికైనా తెలంగాణ ఏర్పాటు కనీస ప్రాతిపదిక. అది సాధించాం. ఆచార్య జయశంకర్‌ను స్మరించుకుందాం. అమరవీరులకు నివాళులర్పిద్దాం. సామ్యవాద తెలంగాణ, సామాజిక తెలంగాణ... మిత్రులారా... ఇట్లా ఎవరి దారులు చెరిగి పోలేదు.

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసిం ది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం.

239

Allam Narayana

Published: Sun,April 6, 2014 12:21 AM

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గ

Published: Sat,March 8, 2014 01:02 AM

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బ

Published: Tue,March 4, 2014 04:10 AM

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడద

Published: Sat,March 1, 2014 12:30 AM

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రం

Published: Fri,February 28, 2014 12:31 AM

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వార

Published: Wed,February 26, 2014 03:03 AM

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట

Published: Tue,February 25, 2014 12:57 AM

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యల

Published: Sat,February 22, 2014 01:24 AM

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద

Published: Fri,February 21, 2014 01:10 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Sat,February 15, 2014 01:08 AM

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిర

Published: Fri,February 14, 2014 12:44 AM

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌స

Published: Tue,February 11, 2014 12:13 AM

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవ

Published: Sat,February 8, 2014 02:29 AM

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇ

Published: Fri,February 7, 2014 01:08 AM

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకా

Published: Fri,January 31, 2014 12:31 AM

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలం

Published: Thu,January 30, 2014 12:33 AM

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగ

Published: Wed,January 29, 2014 02:24 AM

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎ

Published: Tue,January 28, 2014 02:24 AM

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్

Published: Mon,January 27, 2014 12:43 AM

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్

Published: Sat,January 25, 2014 12:56 AM

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెల

Published: Fri,January 24, 2014 12:09 AM

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు.

Published: Wed,January 22, 2014 12:36 AM

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్

Published: Sat,January 11, 2014 02:36 AM

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిల

Published: Wed,January 8, 2014 12:47 AM

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా

Published: Fri,January 3, 2014 01:19 AM

స్వయంకృతం

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బా

Published: Thu,January 2, 2014 01:17 AM

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆప

Published: Wed,January 1, 2014 01:03 AM

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆం

Published: Sat,December 28, 2013 12:44 AM

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానాని

Published: Sun,October 6, 2013 01:58 AM

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీ

Published: Sun,August 11, 2013 12:20 AM

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలు

Published: Sun,May 12, 2013 12:08 AM

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధ

Published: Sun,May 27, 2012 12:11 AM

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్

Published: Wed,March 14, 2012 12:40 AM

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్

Published: Sun,March 4, 2012 12:15 AM

విధ్వంసమూ.. వర్తమానమూ...

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా.. 17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో

Published: Sun,February 26, 2012 12:09 AM

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామ

Published: Sat,January 7, 2012 11:49 PM

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు

Published: Sat,December 31, 2011 11:33 PM

పసిడి రెక్కలు విసిరి కాలం...

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్

Published: Sun,December 4, 2011 12:33 AM

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గ

Published: Sun,November 20, 2011 12:37 AM

తెలంగాణ పోరు సాగుతుంది...

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇ

Published: Sun,October 23, 2011 12:51 AM

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లక

Published: Sat,September 24, 2011 10:32 PM

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూని

Published: Sun,September 11, 2011 12:02 AM

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల

Published: Mon,July 25, 2011 12:10 PM

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాట